Skip to content

కిష్కింధాకాండము · వర్షాకాలవర్ణనము · కిష్కింధాకాండము · వర్షాకాలవర్ణనము

Kishkindha Kanda 13 · varṣākālavarṇanamu

kiṣkiṃdhākāṃḍamu · varṣākālavarṇanamu

Kishkindha Kanda, section 13: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

69 passagesTelugu with transliteration

An original emblem for Kishkindha Kanda, section 13.

ధరణిజ నెడఁబాసి తలఁకెడురాముఁ బొరిఁబొరి దుఃఖముల్‌ పొదువుచందమున

dharaṇija neḍam̐bāsi talam̐keḍurāmum̐ borim̐bori duḥkhamul poduvucaṃdamuna

Report an error

నఱిముఱి దివినుండి యంబుజమిత్రు మెఱయనీ కందంద మేఘముల్‌ వొదివె.

naṟimuṟi divinuṃḍi yaṃbujamitru meṟayanī kaṃdaṃda mēghamul vodive.

Report an error

రావణురాజ్యంబు రఘురాముచేత నీ విధిఁజలియించు నింక నన్‌ మాడ్కి

rāvaṇurājyaṃbu raghurāmucēta nī vidhim̐jaliyiṃcu niṃka nan māḍki

Report an error

నొలసియొండొండ విద్యున్నికాయములు జలదంబులందుండి చలియింపఁదొడఁగె.

nolasiyoṃḍoṃḍa vidyunnikāyamulu jaladaṃbulaṃduṃḍi caliyiṃpam̐doḍam̐ge.

Report an error

“గైకొని యింక నిక్ష్వాకువల్లభుఁడు నాకారిపై దండు నడచుచున్నాఁడు.”

“gaikoni yiṃka nikṣvākuvallabhum̐ḍu nākāripai daṃḍu naḍacucunnām̐ḍu.”

Report an error

అని సురలకుఁజెప్ప నరిగెనో ధాత్రి యన వాయువులతోడ నట ధూళి యెగసె.

ani suralakum̐jeppa narigenō dhātri yana vāyuvulatōḍa naṭa dhūḷi yegase.

Report an error

“నాలంబులో దైత్యునడఁగింపు.”మనుచుఁ గాలుండు దనచేతికాలపాశంబుఁ

“nālaṃbulō daityunaḍam̐giṃpu.”manucum̐ gāluṃḍu danacētikālapāśaṃbum̐

Report an error

బొనర రామునికయి పుత్తెంచె ననఁగఁ దనరార దివి నింద్రధను వొప్పెఁజూడ.

bonara rāmunikayi putteṃce nanam̐gam̐ danarāra divi niṃdradhanu voppem̐jūḍa.

Report an error

నమరులు రామునకయి దండునడవఁ గొమరార భేరులు ఘోషించుకరణి

namarulu rāmunakayi daṃḍunaḍavam̐ gomarāra bhērulu ghōṣiṃcukaraṇi

Report an error

నున్నతధ్వనులతో నొండొంటఁబర్వి మిన్నెల్ల భేదిల్ల మేఘంబు లుఱిమె.

nunnatadhvanulatō noṃḍoṃṭam̐barvi minnella bhēdilla mēghaṃbu luṟime.

Report an error

నలరి ప్రావృట్కాల మనుపురుషుండు లలిమీఱ నాకాశలక్ష్మితోఁగదియ

nalari prāvr̥ṭkāla manupuruṣuṃḍu lalimīṟa nākāśalakṣmitōm̐gadiya

Report an error

నొగి సరుల్‌దెగి రాలుచున్నముత్తెముల పగిదిఁదొల్‌ చినుకులు పడియె నందంద.

nogi saruldegi rālucunnamuttemula pagidim̐dol cinukulu paḍiye naṃdaṃda.

Report an error

యగపడి చెఱవోయె నని కూఁతుఁదలఁచి వగచి నిట్టూర్పులు వడిఁబుచ్చుచున్న

yagapaḍi ceṟavōye nani kūm̐tum̐dalam̐ci vagaci niṭṭūrpulu vaḍim̐buccucunna

Report an error

వెరవున నావులు వెడలె నందంద ధరణి నెల్లెడల నుదగ్రంబు లగుచుఁ.

veravuna nāvulu veḍale naṃdaṃda dharaṇi nelleḍala nudagraṃbu lagucum̐.

Report an error

జనుదెంచి రామలక్ష్మణపయోదములఁ గనుఁగొని సురచాతకము లుబ్బుకరణిఁ

janudeṃci rāmalakṣmaṇapayōdamulam̐ ganum̐goni suracātakamu lubbukaraṇim̐

Report an error

గనుకనిఁబర్వెడు ఘనపయోదములఁ గనుఁగొని దివిఁజాతకము లుబ్బఁదొడఁగె.

ganukanim̐barveḍu ghanapayōdamulam̐ ganum̐goni divim̐jātakamu lubbam̐doḍam̐ge.

Report an error

ధిమిధిమియనుచు మద్దెల మ్రోయఁబాట లమర నటీమణులాడుచందమున

dhimidhimiyanucu maddela mrōyam̐bāṭa lamara naṭīmaṇulāḍucaṃdamuna

Report an error

ఘుమఘుమయనుచు మేఘుండు గర్జిల్ల నమలకేకాస్ఫూర్తి నాడె నెమళ్లు.

ghumaghumayanucu mēghuṃḍu garjilla namalakēkāsphūrti nāḍe nemaḷlu.

Report an error

రాక్షసాంగములపై రాముబాణములు లక్షింపఁబడు నిట్టిలాగ యన్నట్లు

rākṣasāṃgamulapai rāmubāṇamulu lakṣiṃpam̐baḍu niṭṭilāga yannaṭlu

Report an error

పర్వతాగ్రములపై భయదఘోషములు పర్వ నిర్ఘాతముల్‌ పడియె నందంద.

parvatāgramulapai bhayadaghōṣamulu parva nirghātamul paḍiye naṃdaṃda.

Report an error

ప్రకటంబుగా దైత్యపతిమేని మాంస శకలంబు లిటు రణస్థలి నిండు ననిన

prakaṭaṃbugā daityapatimēni māṃsa śakalaṃbu liṭu raṇasthali niṃḍu nanina

Report an error

పరుసన నింద్రగోపము లంతకంత నరుణారుణంబులై యవనిపైఁబడియె.

parusana niṃdragōpamu laṃtakaṃta naruṇāruṇaṃbulai yavanipaim̐baḍiye.

Report an error

రావణుఁజంపుచో రఘురాముమీఁద దేవతల్‌ దీపించి దివ్యపుష్పమ్ము

rāvaṇum̐jaṃpucō raghurāmumīm̐da dēvatal dīpiṃci divyapuṣpammu

Report an error

లెడనెడ వర్షింతు రీ క్రియ ననిన వడుపున మహిరాలె వర్షోపలములు.

leḍaneḍa varṣiṃtu rī kriya nanina vaḍupuna mahirāle varṣōpalamulu.

Report an error

రావణుకీర్తిపరంపర లడఁగి పోవు నింకిట రామభూపాలుచేత

rāvaṇukīrtiparaṃpara laḍam̐gi pōvu niṃkiṭa rāmabhūpālucēta

Report an error

ననినచందమున రాయంచల పిండు చని క్రౌంచగిరి మీఁదఁజయ్యన నడచె

naninacaṃdamuna rāyaṃcala piṃḍu cani krauṃcagiri mīm̐dam̐jayyana naḍace

Report an error

ననిమొనఁదన పుత్త్రుఁడైన సుగ్రీవుఁ డనిమిషాధిపసూను నకట చంపించె;

nanimonam̐dana puttrum̐ḍaina sugrīvum̐ ḍanimiṣādhipasūnu nakaṭa caṃpiṃce;

Report an error

నలుగు నాపై నింద్రుఁడని సూర్యుఁడిడిన బలితంపుఁగోటనఁబరివేష మొప్పెఁ.

nalugu nāpai niṃdrum̐ḍani sūryum̐ḍiḍina balitaṃpum̐gōṭanam̐barivēṣa moppem̐.

Report an error

గుదియనికడఁకతోఁగోరి యాకాశ నది నాడఁబోయిన నాగకన్యకలు

gudiyanikaḍam̐katōm̐gōri yākāśa nadi nāḍam̐bōyina nāgakanyakalu

Report an error

చనిచని మగుడ రసాతలంబునకుఁ జనుదెంచుగతి వర్షజలధార లొప్పె.

canicani maguḍa rasātalaṃbunakum̐ janudeṃcugati varṣajaladhāra loppe.

Report an error

వాసిగాఁదమకు జీవనము లవ్వారి గా సమర్పించినఘనుని వేనోళ్లఁ

vāsigām̐damaku jīvanamu lavvāri gā samarpiṃcinaghanuni vēnōḷlam̐

Report an error

బొగడుచందమున నద్భుతవృత్తిభేద మగపడ భేకంబు లఱచె నందంద.

bogaḍucaṃdamuna nadbhutavr̥ttibhēda magapaḍa bhēkaṃbu laṟace naṃdaṃda.

Report an error

వెలయమేఘములు ప్రావృడ్వధూమణికిఁ గలయ మైఁబూసిన కస్తూరి యనఁగ

velayamēghamulu prāvr̥ḍvadhūmaṇikim̐ galaya maim̐būsina kastūri yanam̐ga

Report an error

ధరణి నెల్లెడలను దనర సొంపెక్కి పరగ నీలచ్ఛాయఁబంక మొప్పారె.

dharaṇi nelleḍalanu danara soṃpekki paraga nīlacchāyam̐baṃka moppāre.

Report an error

వారాశి నొడఁగూడి వలనేది రాము ఘోరబాణాగ్నిఁగ్రాఁగుట విచారించి

vārāśi noḍam̐gūḍi valanēdi rāmu ghōrabāṇāgnim̐grām̐guṭa vicāriṃci

Report an error

చఱచి పోవెఱచినచాడ్పున వరద లఱిముఱిఁజెఱువుల నందంద నిలిచె.

caṟaci pōveṟacinacāḍpuna varada laṟimuṟim̐jeṟuvula naṃdaṃda nilice.

Report an error

లోకకంటకుదైత్యులోఁబెట్టుకొంటిఁ; గాకుత్స్థుఁడిదె నన్నుఁగట్టించు ననుచు

lōkakaṃṭakudaityulōm̐beṭṭukoṃṭim̐; gākutsthum̐ḍide nannum̐gaṭṭiṃcu nanucu

Report an error

సుడివడి మొఱవెట్టుచును బాఱుకరణి వడి మ్రోయుచును జొచ్చె వార్ధిఁబెన్నదులు.

suḍivaḍi moṟaveṭṭucunu bāṟukaraṇi vaḍi mrōyucunu jocce vārdhim̐bennadulu.

Report an error

అంత వానలునిల్చె నవని నెల్లెడల; నంతంత దివినున్న యభ్రముల్‌ విరిసెఁ

aṃta vānalunilce navani nelleḍala; naṃtaṃta divinunna yabhramul virisem̐

Report an error

దెలివొంది కిరణముల్‌ దిశలెల్లనిండఁ జెలువొంది రవి ప్రకాశించె లోకముల;

delivoṃdi kiraṇamul diśalellaniṃḍam̐ jeluvoṃdi ravi prakāśiṃce lōkamula;

Report an error

ధరణి నిష్పంకమై తనరె నెంతయును; గరమొప్పఁగొలఁకులఁగమలంబు లలరెఁ

dharaṇi niṣpaṃkamai tanare neṃtayunu; garamoppam̐golam̐kulam̐gamalaṃbu lalarem̐

Report an error

గూలముల్‌ మదకరుల్‌ గ్రొచ్చి గోరాడె; రేలు నక్షత్రచంద్రికలఁబెంపారె;

gūlamul madakarul grocci gōrāḍe; rēlu nakṣatracaṃdrikalam̐beṃpāre;

Report an error

వచ్చె నంచలు సరోవనికిఁ గాపురము; మెచ్చెఁదామరతూండ్లు మెసఁగి యుల్లమునఁ

vacce naṃcalu sarōvanikim̐ gāpuramu; meccem̐dāmaratūṃḍlu mesam̐gi yullamunam̐

Report an error

జెఱకు రాజనములచేనుల పంట తఱచయ్యె; వృషభయూధము ఱంకెవైచెఁ

jeṟaku rājanamulacēnula paṃṭa taṟacayye; vr̥ṣabhayūdhamu ṟaṃkevaicem̐

Report an error

గలఁక యంతయుఁబాసి కనుపట్టెఁజలము; నిల దెరువరులకు నిచ్చె సౌఖ్యంబుఁ;

galam̐ka yaṃtayum̐bāsi kanupaṭṭem̐jalamu; nila deruvarulaku nicce saukhyaṃbum̐;

Report an error

జదలనిర్మలములై జలదంబు లొప్పె; నదులెల్ల డొంకి కాల్నడ లయ్యె. నంత

jadalanirmalamulai jaladaṃbu loppe; nadulella ḍoṃki kālnaḍa layye. naṃta

Report an error

నటమున్న హనుమంతుఁడర్కజుఁగదిసి “యిట శారదాగమంబేతెంచె; నింక

naṭamunna hanumaṃtum̐ḍarkajum̐gadisi “yiṭa śāradāgamaṃbēteṃce; niṃka

Report an error

శ్రీరాముకార్యంబు సేయంగ వలయు వారు వీ రన కెల్ల వానరాధిపుల

śrīrāmukāryaṃbu sēyaṃga valayu vāru vī rana kella vānarādhipula

Report an error

రప్పింపు.”మనవుడు రవిసూనుఁడలరి యప్పుడు పడవాలుఁడగునీలుఁబిలిచి:

rappiṃpu.”manavuḍu ravisūnum̐ḍalari yappuḍu paḍavālum̐ḍagunīlum̐bilici:

Report an error

“వివిధపర్వతనదీద్వీపాధిపతులఁ బ్లవగగోలాంగూలభల్లూకపతుల

“vividhaparvatanadīdvīpādhipatulam̐ blavagagōlāṃgūlabhallūkapatula

Report an error

రావింపు మొకఁడైన రాకున్న నాజ్ఞ గావింపు.”మని పంచెఁగడఁకమై.నిచటఁ

rāviṃpu mokam̐ḍaina rākunna nājña gāviṃpu.”mani paṃcem̐gaḍam̐kamai.nicaṭam̐

Report an error

దమ్ముఁడు చేయూఁత తనతాల్మికొసగఁ గ్రమ్మిన వగ వానకాలంబు గడపి

dammum̐ḍu cēyūm̐ta tanatālmikosagam̐ grammina vaga vānakālaṃbu gaḍapi

Report an error

రామభూవరుఁడు శరత్కాలమైనఁ గోమలిఁజింతించి కోర్కులఁబొదలి

rāmabhūvarum̐ḍu śaratkālamainam̐ gōmalim̐jiṃtiṃci kōrkulam̐bodali

Report an error

మదనాతురుండయి మదిఁజాల బ్రమసి యుదయాద్రిపయి నున్నయుడు రాజుఁ జూచి:

madanāturuṃḍayi madim̐jāla bramasi yudayādripayi nunnayuḍu rājum̐ jūci:

Report an error

“యిదియేమియుత్పాత? మిదియేమిచంద? మిదియేమి యీరాత్రి యినుఁడేలపొడిచె

“yidiyēmiyutpāta? midiyēmicaṃda? midiyēmi yīrātri yinum̐ḍēlapoḍice

Report an error

నా మేని తాపమిన్మడి గాఁగఁజొచ్చె; సౌమిత్రి! ననుఁదరుచ్ఛాయను జేర్పు.”

nā mēni tāpaminmaḍi gām̐gam̐jocce; saumitri! nanum̐darucchāyanu jērpu.”

Report an error

మనినఁ:“జంద్రుఁడుగాని యర్కుండు గాఁడు; జననాథ!హరిణలాంఛనమదెచూడు.”

maninam̐:“jaṃdrum̐ḍugāni yarkuṃḍu gām̐ḍu; jananātha!hariṇalāṃchanamadecūḍu.”

Report an error

మని లక్ష్మణుఁడు వల్క:“హరిణాక్షిపోయె.” నని సీతఁబేర్కొని యట మూర్ఛవోవ

mani lakṣmaṇum̐ḍu valka:“hariṇākṣipōye.” nani sītam̐bērkoni yaṭa mūrchavōva

Report an error

దశరథాత్మజునకుఁదమ్ముఁ డాలోన శిశిరోపచారముల్‌ సేసి తేర్చుటయు

daśarathātmajunakum̐dammum̐ ḍālōna śiśirōpacāramul sēsi tērcuṭayu

Report an error

మఱి వివేకముఁబూని మనుజవల్లభుఁడు: “తఱి లంకపై నింక దండెత్తవలయు.

maṟi vivēkamum̐būni manujavallabhum̐ḍu: “taṟi laṃkapai niṃka daṃḍettavalayu.

Report an error

సౌమిత్రి! చూచితే జలజాప్తసూనుఁ డేమని భాషించె? నేమని పోయె?

saumitri! cūcitē jalajāptasūnum̐ ḍēmani bhāṣiṃce? nēmani pōye?

Report an error

వానకాలముఁబుచ్చి వచ్చెద ననియె. వానకాలము వోయె; వచ్చుట లేద.

vānakālamum̐bucci vacceda naniye. vānakālamu vōye; vaccuṭa lēda.

Report an error

యొదవి నా సేసినయుపకారమెల్ల మదిలోన మఱచి యున్మత్తుఁడై వాఁడు

yodavi nā sēsinayupakāramella madilōna maṟaci yunmattum̐ḍai vām̐ḍu

Report an error

తారతో రతికేళిఁదగిలియున్నాఁడొ? యా రాజ్యమున మత్తుఁడైయున్నవాఁడొ

tāratō ratikēḷim̐dagiliyunnām̐ḍo? yā rājyamuna mattum̐ḍaiyunnavām̐ḍo

Report an error

కాకున్న మత్కార్యగతులు భావింపఁ; డీ కృతఘ్నత కోర్చి యేటికిఁదడయ?

kākunna matkāryagatulu bhāviṃpam̐; ḍī kr̥taghnata kōrci yēṭikim̐daḍaya?

Report an error

మతి నుపకారంబు మఱచినవాఁడు, ప్రతినదప్పినవాఁడు, పాడిమైఁదనదు

mati nupakāraṃbu maṟacinavām̐ḍu, pratinadappinavām̐ḍu, pāḍimaim̐danadu

Report an error

చెలికానికార్యంబు సేయనివాఁడు తలపోయ మానవాధముఁడండ్రు బుధులు

celikānikāryaṃbu sēyanivām̐ḍu talapōya mānavādhamum̐ḍaṃḍru budhulu

Report an error

అలవుమై నటువోయి యర్కజుఁబిలువు; పిలిచిన నిటురాక బిగు వాడెనేని?

alavumai naṭuvōyi yarkajum̐biluvu; pilicina niṭurāka bigu vāḍenēni?

Report an error

“నని వాలిఁజంపినయ మ్మెందువోయె? నని రమ్ముపొ.”మ్మన్న నన్నకు మ్రొక్కి

“nani vālim̐jaṃpinaya mmeṃduvōye? nani rammupo.”mmanna nannaku mrokki

Report an error

Illustration: Verse & Place (Project-owned).