Skip to content

సుందరకాండము · హనుమ లంకనంతయు వెదకుట · సుందరకాండము · హనుమ లంకనంతయు వెదకుట

Sundara Kanda 3 · hanuma laṃkanaṃtayu vedakuṭa

suṃdarakāṃḍamu · hanuma laṃkanaṃtayu vedakuṭa

Sundara Kanda, section 3: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

33 passagesTelugu with transliteration

An original emblem for Sundara Kanda, section 3.

గడు సూక్ష్మరూపంబుఁగైకొని పోయి యడరి కోటలు వ్రాఁకి యట లంక సొచ్చి

gaḍu sūkṣmarūpaṃbum̐gaikoni pōyi yaḍari kōṭalu vrām̐ki yaṭa laṃka socci

Report an error

వడిఁగోట కావలివారుఁ దలార్లుఁ బొడగానకుండ నప్పుడు గూఢవృత్తి

vaḍim̐gōṭa kāvalivārum̐ dalārlum̐ boḍagānakuṃḍa nappuḍu gūḍhavr̥tti

Report an error

వీథులు వరికించి విపణిమార్గములు శోధించి రచ్చలు సొరిది నీక్షించి

vīthulu varikiṃci vipaṇimārgamulu śōdhiṃci raccalu soridi nīkṣiṃci

Report an error

ఘనగోపురములెక్కి గజశాల లరసి మునుమిడి వరహర్మ్యములు సంచరించి

ghanagōpuramulekki gajaśāla larasi munumiḍi varaharmyamulu saṃcariṃci

Report an error

దేవాలయంబులు దిరిగి యిల్లిల్లు భావించి గొందులు పరికించి చూచి

dēvālayaṃbulu dirigi yillillu bhāviṃci goṃdulu parikiṃci cūci

Report an error

యుప్పరిగలు గాంచి యోవరుల్‌ వెదకి చప్పరంబులు డాసి సౌధంబు లరసి

yupparigalu gāṃci yōvarul vedaki capparaṃbulu ḍāsi saudhaṃbu larasi

Report an error

చాలఁజెన్నగు రథశాలలు వాజి శాలలు శస్త్రాస్త్రశాలలుఁదడవి

cālam̐jennagu rathaśālalu vāji śālalu śastrāstraśālalum̐daḍavi

Report an error

మాడువుల్‌ వరికించి మణిమయమైన మేడలు వాడలు మిగులఁ జెన్నైన

māḍuvul varikiṃci maṇimayamaina mēḍalu vāḍalu migulam̐ jennaina

Report an error

యా విభీషణుగేహ మతికాయు గృహము దేవాంతకునియిల్లుఁ ద్రిశిరుమందిరము

yā vibhīṣaṇugēha matikāyu gr̥hamu dēvāṃtakuniyillum̐ driśirumaṃdiramu

Report an error

గంభీరమగు కుంభకర్ణుని నెలవుఁ గుంభునాలయము నికుంభుసద్మంబు

gaṃbhīramagu kuṃbhakarṇuni nelavum̐ guṃbhunālayamu nikuṃbhusadmaṃbu

Report an error

శ్రీమించు నయ్యింద్రజిత్తునినగరు నా మహోదరునిలయం బాదియైన

śrīmiṃcu nayyiṃdrajittuninagaru nā mahōdarunilayaṃ bādiyaina

Report an error

దనుజనాథుల నికేతనపంక్తులొకటఁ గనుఁగొంచు నద్భుతాక్రాంతుఁడై వారి

danujanāthula nikētanapaṃktulokaṭam̐ ganum̐goṃcu nadbhutākrāṃtum̐ḍai vāri

Report an error

యంతఃపురంబుల నంతయు వెదకి కాంతాజనంబులఁ గలయంగ నరసి

yaṃtaḥpuraṃbula naṃtayu vedaki kāṃtājanaṃbulam̐ galayaṃga narasi

Report an error

వెండియు దనుజులవేశ్మముల్‌ గలయ నొండొండ గనుఁగొంచు నొక్కొక్క చోట

veṃḍiyu danujulavēśmamul galaya noṃḍoṃḍa ganum̐goṃcu nokkokka cōṭa

Report an error

నొక కన్ను నొక చెవి యొక కేలుఁగలుగు వికృత వేషులఁజూచి వెఱఁగుఁబొందుచును

noka kannu noka cevi yoka kēlum̐galugu vikr̥ta vēṣulam̐jūci veṟam̐gum̐boṃducunu

Report an error

బహుపాద బహుభుజ బహుమస్తకోరు సహితులఁగొందఱ సారెఁగన్గొనుచు

bahupāda bahubhuja bahumastakōru sahitulam̐goṃdaṟa sārem̐gangonucu

Report an error

జపతపస్స్వాధ్యాయ సత్కర్మనిష్ఠఁ దపసులౌ దానవోత్తములఁజూచుచును

japatapassvādhyāya satkarmaniṣṭham̐ dapasulau dānavōttamulam̐jūcucunu

Report an error

మకరతోరణబద్ధమాల్యజాలములఁ బ్రకటితధూపసౌరభవిశేషముల

makaratōraṇabaddhamālyajālamulam̐ brakaṭitadhūpasaurabhaviśēṣamula

Report an error

రత్నముక్తాఫల రంగవల్లికల నూత్నేందుకాంత బంధుర వితర్దికల

ratnamuktāphala raṃgavallikala nūtnēṃdukāṃta baṃdhura vitardikala

Report an error

మణిగణహాటకమయ కవాటములఁ బ్రణుతింపఁదగుమంటపప్రదేశముల

maṇigaṇahāṭakamaya kavāṭamulam̐ braṇutiṃpam̐dagumaṃṭapapradēśamula

Report an error

మహనీయతర విద్రుమస్తంభతతుల బహుశిరోగృహముల భవనపాళికల

mahanīyatara vidrumastaṃbhatatula bahuśirōgr̥hamula bhavanapāḷikala

Report an error

నాయుధోజ్జ్వలహస్తులైన రాక్షసులుఁ బాయక యే ప్రొద్దు బలసియున్నట్టి

nāyudhōjjvalahastulaina rākṣasulum̐ bāyaka yē proddu balasiyunnaṭṭi

Report an error

రావణు నగరు చేరఁగఁబోయి యచటఁ గావలివారలఁగలయ శోధించి

rāvaṇu nagaru cēram̐gam̐bōyi yacaṭam̐ gāvalivāralam̐galaya śōdhiṃci

Report an error

పెక్కువాకిళ్లు నిర్భీతిమైఁగడచి యక్కొల్వుకూటంబులన్నియు వెదకి

pekkuvākiḷlu nirbhītimaim̐gaḍaci yakkolvukūṭaṃbulanniyu vedaki

Report an error

యంతఃపురముఁజేరనరుగునా లోనఁ గంతునిమామ సత్కళలకు సీమ

yaṃtaḥpuramum̐jēranarugunā lōnam̐ gaṃtunimāma satkaḷalaku sīma

Report an error

కలువలపైఁ బ్రేమ గల చందమామ కలితబింబ లలామగతి నుదయించి

kaluvalapaim̐ brēma gala caṃdamāma kalitabiṃba lalāmagati nudayiṃci

Report an error

జలరాశిఁదేలించి జలజషండములఁ గలవాసిఁదూలించి గబ్బిజక్కవల

jalarāśim̐dēliṃci jalajaṣaṃḍamulam̐ galavāsim̐dūliṃci gabbijakkavala

Report an error

విరహాగ్ని నలయించి వెడవింటివాని వరకీర్తి వెలయించి వాడిన కలువ

virahāgni nalayiṃci veḍaviṃṭivāni varakīrti velayiṃci vāḍina kaluva

Report an error

మొత్తంబు నలరించి ముగ్ధజారిణుల చిత్తంబు దలరించి చిమ్మఁజీకటుల

mottaṃbu nalariṃci mugdhajāriṇula cittaṃbu dalariṃci cimmam̐jīkaṭula

Report an error

పంతంబుదఱిఁగించి పదనైన చంద్ర కాంతంబు గరఁగించి ఘనచకోరముల

paṃtaṃbudaṟim̐giṃci padanaina caṃdra kāṃtaṃbu garam̐giṃci ghanacakōramula

Report an error

విందులఁదనియించి విటవిటీజనుల పొందుల నెనయించి పూర్ణచంద్రికల

viṃdulam̐daniyiṃci viṭaviṭījanula poṃdula nenayiṃci pūrṇacaṃdrikala

Report an error

దిక్కులకెల్లను తెలివి దెప్పించి చుక్కలగమికాఁడు చూపట్టె మింటఁ

dikkulakellanu telivi deppiṃci cukkalagamikām̐ḍu cūpaṭṭe miṃṭam̐

Report an error

బావని వీడెల్లఁబరికింపవలసి దేవతలెత్తిన దీపమో యనఁగ.

bāvani vīḍellam̐barikiṃpavalasi dēvatalettina dīpamō yanam̐ga.

Report an error

Illustration: Verse & Place (Project-owned).