బసిఁడి గోడలతోడ భాసిల్లు చున్న యసమానమైన యుద్యానంబుఁగాంచి
basim̐ḍi gōḍalatōḍa bhāsillu cunna yasamānamaina yudyānaṃbum̐gāṃci
సుందరకాండము · హనుమ రావణుని క్రీడారామముఁబ్రవేశించుట · సుందరకాండము · హనుమ రావణుని క్రీడారామముఁబ్రవేశించుట
suṃdarakāṃḍamu · hanuma rāvaṇuni krīḍārāmamum̐bravēśiṃcuṭa
Sundara Kanda, section 5: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
23 passagesTelugu with transliteration
బసిఁడి గోడలతోడ భాసిల్లు చున్న యసమానమైన యుద్యానంబుఁగాంచి
basim̐ḍi gōḍalatōḍa bhāsillu cunna yasamānamaina yudyānaṃbum̐gāṃci
మెల్లన నటపోయి మెలఁగ వీక్షించి యల్లనల్లనఁబ్రాఁకి యాగోడలెక్కి
mellana naṭapōyi melam̐ga vīkṣiṃci yallanallanam̐brām̐ki yāgōḍalekki
చందనపున్నాగ సహకారతరుల మందారఖర్జూర మాతులుంగములఁ
caṃdanapunnāga sahakāratarula maṃdārakharjūra mātuluṃgamulam̐
బనస పిప్పల నింబ పాటలీ వకుళ ఘనసార సౌవీరకర్ణికారముల
banasa pippala niṃba pāṭalī vakuḷa ghanasāra sauvīrakarṇikāramula
మల్లికామాలతీ మాధవీ లతల సల్లకీ కురవక జంబీర తరులఁ
mallikāmālatī mādhavī latala sallakī kuravaka jaṃbīra tarulam̐
దాల తమాల హింతాల సాలముల నాళికే రాశోక నాగవల్లరుల
dāla tamāla hiṃtāla sālamula nāḷikē rāśōka nāgavallarula
నేడాకుటనఁటుల నేలాలవంగ దాడిమీ నారంగ తక్కోలకములఁ
nēḍākuṭanam̐ṭula nēlālavaṃga dāḍimī nāraṃga takkōlakamulam̐
గదళికా కేతకీ క్రముక భూజములఁ బదనైనగోస్తనీ ఫలగుళుచ్ఛములఁ
gadaḷikā kētakī kramuka bhūjamulam̐ badanainagōstanī phalaguḷucchamulam̐
బరిపక్వ ఫలపుష్పపరిమళమిళిత భరితమౌ వాయుసంపదల నింపెక్కి
baripakva phalapuṣpaparimaḷamiḷita bharitamau vāyusaṃpadala niṃpekki
కలకంఠశుక నీలకంఠ శారికలఁ జెలువొంది యళులచేఁ జెలు వగ్గలించి
kalakaṃṭhaśuka nīlakaṃṭha śārikalam̐ jeluvoṃdi yaḷulacēm̐ jelu vaggaliṃci
కమలాకరమ్ములఁగరము శోభిల్లి కుముదసంఘములఁగొమరు దీపించి
kamalākarammulam̐garamu śōbhilli kumudasaṃghamulam̐gomaru dīpiṃci
శశికాంతవేదుల సన్నుతి కెక్కి విశదచంద్రికలచే వేడ్క సొంపెక్కి
śaśikāṃtavēdula sannuti kekki viśadacaṃdrikalacē vēḍka soṃpekki
సికతా తలంబులచేఁజెన్ను మీఱి సకలర్తువిహరణస్థానమై మిగుల
sikatā talaṃbulacēm̐jennu mīṟi sakalartuviharaṇasthānamai migula
రమణమై నది చైత్రరథమును మించి యమరేంద్రునందనోద్యానంబువోలె
ramaṇamai nadi caitrarathamunu miṃci yamarēṃdrunaṃdanōdyānaṃbuvōle
నలరు రావణువినోదారామభూమిఁ గలయంగఁగనుఁగొని కడుఁజోద్యమంది
nalaru rāvaṇuvinōdārāmabhūmim̐ galayaṃgam̐ganum̐goni kaḍum̐jōdyamaṃdi
యొప్పునా వనభూమి కొయ్యన డిగ్గి చప్పుడు గాకుండఁజరణంబు లిడుచుఁ
yoppunā vanabhūmi koyyana ḍiggi cappuḍu gākuṃḍam̐jaraṇaṃbu liḍucum̐
గొలఁకులయందును గూలంబులందుఁ బులినదేశములందుఁ బొదరిండ్లయందు
golam̐kulayaṃdunu gūlaṃbulaṃdum̐ bulinadēśamulaṃdum̐ bodariṃḍlayaṃdu
నుర్వీరుహములందు నోలంబులందు నుర్వీతనూభవ నుడుగక వెదకి
nurvīruhamulaṃdu nōlaṃbulaṃdu nurvītanūbhava nuḍugaka vedaki
యా వనమధ్యంబునందు రేవగలు గావలియుండు రాక్షసకోటి కెపుడుఁ
yā vanamadhyaṃbunaṃdu rēvagalu gāvaliyuṃḍu rākṣasakōṭi kepuḍum̐
దావలంబై మిన్ను తలదన్ను పొడవు చే వెలుంగుచు మేరుశిఖరాళిఁగేరు
dāvalaṃbai minnu taladannu poḍavu cē veluṃgucu mēruśikharāḷim̐gēru
పసిఁడికుంభములచేఁ బసమీఱి వెలయు పసిఁడికంబంబులఁబఱపు దీపించి
pasim̐ḍikuṃbhamulacēm̐ basamīṟi velayu pasim̐ḍikaṃbaṃbulam̐baṟapu dīpiṃci
వరరత్న తోరణావళుల శోభిల్లి యురుతరంబగుచున్న యొకమేడఁగాంచి
vararatna tōraṇāvaḷula śōbhilli yurutaraṃbagucunna yokamēḍam̐gāṃci
యా మేడలోపల నంతయు వెదకి భూమిజఁ గానక బుద్ధిలో వగచి:
yā mēḍalōpala naṃtayu vedaki bhūmijam̐ gānaka buddhilō vagaci:
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).