దన మదిఁగొండొకతడవు చింతించి వనభంగ మొనరించువాఁడునై పెరిగి
dana madim̐goṃḍokataḍavu ciṃtiṃci vanabhaṃga monariṃcuvām̐ḍunai perigi
సుందరకాండము · అశోకవన విధ్వంసము · సుందరకాండము · అశోకవన విధ్వంసము
suṃdarakāṃḍamu · aśōkavana vidhvaṃsamu
Sundara Kanda, section 18: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
24 passagesTelugu with transliteration
దన మదిఁగొండొకతడవు చింతించి వనభంగ మొనరించువాఁడునై పెరిగి
dana madim̐goṃḍokataḍavu ciṃtiṃci vanabhaṃga monariṃcuvām̐ḍunai perigi
తొడలందుఁబొడమువాతూలఘట్టనలఁ బడుగుఁబేకయుఁబోలెఁబడ మహీజమ్ము
toḍalaṃdum̐boḍamuvātūlaghaṭṭanalam̐ baḍugum̐bēkayum̐bōlem̐baḍa mahījammu
లా నిత్యకృతి యశోకారామభూమి మానైనహర్మ్యముల్ మహిఁగూలఁదన్ని
lā nityakr̥ti yaśōkārāmabhūmi mānainaharmyamul mahim̐gūlam̐danni
మొనసి కేళీ గృహంబులు నుగ్గు సేసి వనమహీరుహములు వడి నేలఁగలపి
monasi kēḷī gr̥haṃbulu nuggu sēsi vanamahīruhamulu vaḍi nēlam̐galapi
కొమ్మలు ఖండించి కుసుమముల్ రాల్చి కమ్మఁదేనెలు సల్లి కాలువల్ సెఱచి
kommalu khaṃḍiṃci kusumamul rālci kammam̐dēnelu salli kāluval seṟaci
పూవుఁదీగలు ద్రెంచి పొదరిండ్లు సదిపి బావులు గలఁచి దోర్బలకేళిఁదేలి
pūvum̐dīgalu dreṃci podariṃḍlu sadipi bāvulu galam̐ci dōrbalakēḷim̐dēli
కలకంఠ బకబిసకంఠికా క్రౌంచ కలహంసశుకశారికామయూరాది
kalakaṃṭha bakabisakaṃṭhikā krauṃca kalahaṃsaśukaśārikāmayūrādi
వనపక్షు లార్తరావములతోఁ బాఱ వనపాలకులు పరువడి మేలుకాంచి
vanapakṣu lārtarāvamulatōm̐ bāṟa vanapālakulu paruvaḍi mēlukāṃci
హనుమంతుచేఁతకు నగ్నులై మండి యనికి సన్నద్ధులై యతిశౌర్యమునను
hanumaṃtucēm̐taku nagnulai maṃḍi yaniki sannaddhulai yatiśauryamunanu
వినువీథి దిక్కులు వ్రీల నార్చుచును ననుపమ కరవాలహస్తులై కదియఁ
vinuvīthi dikkulu vrīla nārcucunu nanupama karavālahastulai kadiyam̐
దనపేరు తనరాక తన పరాక్రమము వినఁజెప్పి శ్రీరామవిభుకూర్మిబంటు
danapēru tanarāka tana parākramamu vinam̐jeppi śrīrāmavibhukūrmibaṃṭu
నొక్కొక్క రాక్షసు నుద్దండ వృత్తి నొక్కొక్క తరువున నొగిఁగూలనేసి
nokkokka rākṣasu nuddaṃḍa vr̥tti nokkokka taruvuna nogim̐gūlanēsi
ప్రథమసంగరకలాప్రారంభుఁడగుచుఁ బృథివిపైఁబీనుఁగుపెంటలు గాఁగ
prathamasaṃgarakalāprāraṃbhum̐ḍagucum̐ br̥thivipaim̐bīnum̐gupeṃṭalu gām̐ga
భూరిసత్త్వంబునఁబొలుపొందుఘోర వీరుల నెనిమిదివేల రాక్షసులఁ
bhūrisattvaṃbunam̐bolupoṃdughōra vīrula nenimidivēla rākṣasulam̐
బవమానతనయుఁ డప్రతిముఁడై పేర్చి యవలీలఁదెగటార్చి యార్చినబెదరి
bavamānatanayum̐ ḍapratimum̐ḍai pērci yavalīlam̐degaṭārci yārcinabedari
యేపఱి ధృతిదూలి యినవంశ్యుదేవిఁ గాపున్న రాక్షసకాంతలు పాఱి
yēpaṟi dhr̥tidūli yinavaṃśyudēvim̐ gāpunna rākṣasakāṃtalu pāṟi
రావణు లోకవిద్రావణుఁ గాంచి: “దేవ! నేఁడొకక్రోఁతి తెగువమై వచ్చి
rāvaṇu lōkavidrāvaṇum̐ gāṃci: “dēva! nēm̐ḍokakrōm̐ti teguvamai vacci
తొలిఁదొలి వైదేహితో మాటలాడి కలగొన వనమెల్ల గాసిగాఁబెఱికి
tolim̐doli vaidēhitō māṭalāḍi kalagona vanamella gāsigām̐beṟiki
వెనుదన్ని యెనిమిదివేల రాక్షసుల వనపాలకులఁ జంపి వాలుచున్నాఁడు.
venudanni yenimidivēla rākṣasula vanapālakulam̐ jaṃpi vālucunnām̐ḍu.
వాఁడు రాఘవుఁడంప వచ్చినవాఁడు గాఁడేని యా సీత గాపుగానున్న
vām̐ḍu rāghavum̐ḍaṃpa vaccinavām̐ḍu gām̐ḍēni yā sīta gāpugānunna
తరువొక్కటియుఁదక్కఁ దక్కినవనముఁ గరమల్గి పెఱుకఁగాఁగారణంబేమి?
taruvokkaṭiyum̐dakkam̐ dakkinavanamum̐ garamalgi peṟukam̐gām̐gāraṇaṃbēmi?
వాని తెఱంగెల్ల వైదేహి నడుగఁ దా నెఱుంగనటంచు దాఁచుచున్నదియుఁ.
vāni teṟaṃgella vaidēhi naḍugam̐ dā neṟuṃganaṭaṃcu dām̐cucunnadiyum̐.
గావున వాఁడు రాఘవుని దూతౌట యే విధంబున సిద్ధ; మిటమీఁద వాని
gāvuna vām̐ḍu rāghavuni dūtauṭa yē vidhaṃbuna siddha; miṭamīm̐da vāni
నెట్టనఁగడిమిమై నీలావు మెఱసి పట్టి శిక్షింపుము ప్రాభవంబొప్ప.”
neṭṭanam̐gaḍimimai nīlāvu meṟasi paṭṭi śikṣiṃpumu prābhavaṃboppa.”
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).