Skip to content

బాలకాండము · విశ్వామిత్రాశ్రమ గమనము · బాలకాండము · విశ్వామిత్రాశ్రమ గమనము

Bala Kanda 14 · viśvāmitrāśrama gamanamu

bālakāṃḍamu · viśvāmitrāśrama gamanamu

Bala Kanda, section 14: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

29 passagesTelugu with transliteration

An original emblem for Bala Kanda, section 14.

మును విష్ణుదేవుండు ముదమునఁదపము గొనకొని కావించుకొఱకునై యిచట

munu viṣṇudēvuṃḍu mudamunam̐dapamu gonakoni kāviṃcukoṟakunai yicaṭa

Report an error

యుగములనేకంబు లుండఁగా ననఘ! మగువామనాశ్రమమందురు దీని;

yugamulanēkaṃbu luṃḍam̐gā nanagha! maguvāmanāśramamaṃduru dīni;

Report an error

మఱియును సిద్ధాశ్రమంబును ననఁగ వఱలు నీ యాశ్రమవనము లోకముల.

maṟiyunu siddhāśramaṃbunu nanam̐ga vaṟalu nī yāśramavanamu lōkamula.

Report an error

జననాథ! బలి విరోచనతనూజుండు ఘనరాజ్యమదమున గర్వంబు మిగిలి

jananātha! bali virōcanatanūjuṃḍu ghanarājyamadamuna garvaṃbu migili

Report an error

యేచి మరుత్తుల నింద్రాదిసురుల వేచి కారింపంగ విబుధులు మునులు

yēci maruttula niṃdrādisurula vēci kāriṃpaṃga vibudhulu munulu

Report an error

నీ యాశ్రమంబున కేతెంచి మ్రొక్కి తోయజనాభునితో నిట్టులనిరి:

nī yāśramaṃbuna kēteṃci mrokki tōyajanābhunitō niṭṭulaniri:

Report an error

“శరణాగతప్రియ! సర్వలోకేశ! సరసిజోదర! నీవ శరణంబు మాకుఁ.

“śaraṇāgatapriya! sarvalōkēśa! sarasijōdara! nīva śaraṇaṃbu mākum̐.

Report an error

బన్నుగా మమ్మేఁచు బలి యనువాఁడు; చెన్నొంద జన్నంబు సేయుచున్నాఁడు;

bannugā mammēm̐cu bali yanuvām̐ḍu; cennoṃda jannaṃbu sēyucunnām̐ḍu;

Report an error

అవ్వారి దాన మయ్యజ్ఞవాటమున; నెవ్వరేమడిగిన నిచ్చుచున్నాఁడు.

avvāri dāna mayyajñavāṭamuna; nevvarēmaḍigina niccucunnām̐ḍu.

Report an error

క్రతువు దీఱకమున్నె కావింపు మాకు హిత.” మంచుఁబ్రార్థింప నెల్లదేవతలు;

kratuvu dīṟakamunne kāviṃpu māku hita.” maṃcum̐brārthiṃpa nelladēvatalu;

Report an error

నా సమయంబున నదితితోఁగూడ భాసురవ్రతనిష్ఠఁ బరగు కశ్యపుఁడు

nā samayaṃbuna nadititōm̐gūḍa bhāsuravrataniṣṭham̐ baragu kaśyapum̐ḍu

Report an error

ఇమ్ములఁదపము వెయ్యేఁడులు సేయ సమ్మదంబున విష్ణు సాక్షాత్కరించె.

immulam̐dapamu veyyēm̐ḍulu sēya sammadaṃbuna viṣṇu sākṣātkariṃce.

Report an error

నా వేళఁ గశ్యపుఁ డానందమంది వేవేగ నుతులు గావించి “సర్వేశ!

nā vēḷam̐ gaśyapum̐ ḍānaṃdamaṃdi vēvēga nutulu gāviṃci “sarvēśa!

Report an error

నీ మహాతనువున నిఖిలలోకములు సోమార్కలోచన! చూచుచున్నాఁడ;

nī mahātanuvuna nikhilalōkamulu sōmārkalōcana! cūcucunnām̐ḍa;

Report an error

నాద్యంతరహితుండవగు నిన్ను వేద వేద్యుని శరణంబు వేఁడెద.” ననినఁ

nādyaṃtarahituṃḍavagu ninnu vēda vēdyuni śaraṇaṃbu vēm̐ḍeda.” naninam̐

Report an error

గరుణ నా విష్ణుండు గశ్యపుఁజూచి: “వరము నీకిచ్చెద వాంఛితంబెద్ది?

garuṇa nā viṣṇuṃḍu gaśyapum̐jūci: “varamu nīkicceda vāṃchitaṃbeddi?

Report an error

యడుగుదుగా.” కన్న నలరి కశ్యపుడు కడుభక్తితోఁగరకమలముల్‌ మొగిచి;

yaḍugudugā.” kanna nalari kaśyapuḍu kaḍubhaktitōm̐garakamalamul mogici;

Report an error

“యతి బలోద్ధతి నాకు నదితికి నీవు సుతుఁడవై జన్మించి సురల రక్షింపు

“yati balōddhati nāku naditiki nīvu sutum̐ḍavai janmiṃci surala rakṣiṃpu

Report an error

మిది కోర్కి నాకును నీ దేవతలకు; మదిలోన మన్నింపు మమ్ము నందఱను.”

midi kōrki nākunu nī dēvatalaku; madilōna manniṃpu mammu naṃdaṟanu.”

Report an error

అనవుడు నా విష్ణువదితి గర్భమున ననుపమంబగు తేజ మడర జన్మించి

anavuḍu nā viṣṇuvaditi garbhamuna nanupamaṃbagu tēja maḍara janmiṃci

Report an error

వామనత్వముఁ దాల్చి వచ్చి యద్దనుజు భూమి మూఁడడుగులు పొసఁగంగ నడిగి

vāmanatvamum̐ dālci vacci yaddanuju bhūmi mūm̐ḍaḍugulu posam̐gaṃga naḍigi

Report an error

రెండడుగులనే ధరిత్రియు దివియు దండిమైఁగొలిచి యాదైత్యు బంధించి

reṃḍaḍugulanē dharitriyu diviyu daṃḍimaim̐golici yādaityu baṃdhiṃci

Report an error

“లోలత నీ మూఁడులోకముల్‌ వెలయ నేలుము నీ.”వంచు నింద్రున కిచ్చె.

“lōlata nī mūm̐ḍulōkamul velaya nēlumu nī.”vaṃcu niṃdruna kicce.

Report an error

నదిమొద లిది వామనాశ్రమంబయ్యె. నిది మదీయాశ్రమం; బీ పుణ్యభూమి

nadimoda lidi vāmanāśramaṃbayye. nidi madīyāśramaṃ; bī puṇyabhūmi

Report an error

సిద్ధించు నిటు తపస్సిద్ధులు గాన సిద్ధాశ్రమంబునాఁజెల్లు నెల్లెడల;

siddhiṃcu niṭu tapassiddhulu gāna siddhāśramaṃbunām̐jellu nelleḍala;

Report an error

నీవె వామనుఁడవై నెగడి త్రివిక్ర మావతారముఁదాల్చినట్టి విష్ణుఁడవు;

nīve vāmanum̐ḍavai negaḍi trivikra māvatāramum̐dālcinaṭṭi viṣṇum̐ḍavu;

Report an error

నాఁడును నిది నీ వనంబు శ్రీరామ; నేఁడును నా రీతి నీ వనంబయ్యె.”

nām̐ḍunu nidi nī vanaṃbu śrīrāma; nēm̐ḍunu nā rīti nī vanaṃbayye.”

Report an error

ననుచుఁగౌశికుఁడు నిజాశ్రమంబునకుఁ జని యందు రామలక్ష్మణులఁబూజించె.

nanucum̐gauśikum̐ḍu nijāśramaṃbunakum̐ jani yaṃdu rāmalakṣmaṇulam̐būjiṃce.

Report an error

నచ్చటి మునిజనంబంతయు మదిని ముచ్చట మీఱ రామునిఁ బూజసేసె.

naccaṭi munijanaṃbaṃtayu madini muccaṭa mīṟa rāmunim̐ būjasēse.

Report an error

Illustration: Verse & Place (Project-owned).