“జని వేగ వానరసైన్యంబు సొచ్చి యినసుతుతోఁబ్రియంబేర్పడఁబలికి
“jani vēga vānarasainyaṃbu socci yinasututōm̐briyaṃbērpaḍam̐baliki
యుద్ధకాండము · శుకసందేశము · యుద్ధకాండము · శుకసందేశము
yuddhakāṃḍamu · śukasaṃdēśamu
Yuddha Kanda, section 21: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
37 passagesTelugu with transliteration
“జని వేగ వానరసైన్యంబు సొచ్చి యినసుతుతోఁబ్రియంబేర్పడఁబలికి
“jani vēga vānarasainyaṃbu socci yinasututōm̐briyaṃbērpaḍam̐baliki
పగలేమిఁజెప్పి యా భానునందనుని మగుడించి రమ్ముక్రమ్మఱఁ;బొమ్ము; లెమ్ము.”
pagalēmim̐jeppi yā bhānunaṃdanuni maguḍiṃci rammukrammaṟam̐;bommu; lemmu.”
అన విని యతఁడేఁగి యర్కజుఁగాంచి యనియె రావణుచెప్పినంతయుఁదెలియ:
ana vini yatam̐ḍēm̐gi yarkajum̐gāṃci yaniye rāvaṇuceppinaṃtayum̐deliya:
“వైరంబు సేయ రావణుతోడ నీకుఁ గారణంబేమి యర్కజ! నాకుఁజెపుమ?
“vairaṃbu sēya rāvaṇutōḍa nīkum̐ gāraṇaṃbēmi yarkaja! nākum̐jepuma?
వాలి మీ యన్న నా వలవదు; వినుము వాలికి నీకును వైరంబు గలదు.
vāli mī yanna nā valavadu; vinumu vāliki nīkunu vairaṃbu galadu.
వాలి యా దానవేశ్వరుపగవాఁడు. చాల రావణుతోడ సంధి నీ కమరు.
vāli yā dānavēśvarupagavām̐ḍu. cāla rāvaṇutōḍa saṃdhi nī kamaru.
రావణుఁ డీ రాము రామఁదెచ్చుటకు నీ విట్లు రాఁదగునే? కపిరాజ!
rāvaṇum̐ ḍī rāmu rāmam̐deccuṭaku nī viṭlu rām̐dagunē? kapirāja!
యనిఁగుబేరుని నోర్చి యా పుష్పకంబుఁ గొనిన రావణు నెఱుంగుట లెస్సగాదె?
yanim̐gubēruni nōrci yā puṣpakaṃbum̐ gonina rāvaṇu neṟuṃguṭa lessagāde?
యట్టేల, హరుతోడ నయ్యద్రి నెత్తి నట్టిరావణుఁడల్పుఁడా కపిరాజ!
yaṭṭēla, harutōḍa nayyadri netti naṭṭirāvaṇum̐ḍalpum̐ḍā kapirāja!
దేవేంద్రుఁడాదిగా దివిజులనెల్ల నా విధంబున గెల్వఁడావానరేంద్ర!
dēvēṃdrum̐ḍādigā divijulanella nā vidhaṃbuna gelvam̐ḍāvānarēṃdra!
కొలఁది మీఱిన హోమకుండంబునందుఁ దలలు ఖండించియుద్ధతగతి వేల్చి
kolam̐di mīṟina hōmakuṃḍaṃbunaṃdum̐ dalalu khaṃḍiṃciyuddhatagati vēlci
జలరుహసంభవుఁజాల మెప్పించి వెలయంగఁద్రైలోక్యవిజయంబుఁగొనఁడె?
jalaruhasaṃbhavum̐jāla meppiṃci velayaṃgam̐drailōkyavijayaṃbum̐gonam̐ḍe?
హీనమానవునితో నేటిసఖ్యంబు? దానవేశ్వరుతోడఁదగఁజేయు సంధి.”
hīnamānavunitō nēṭisakhyaṃbu? dānavēśvarutōḍam̐dagam̐jēyu saṃdhi.”
ననవుడుఁగోపించి యగచరులెల్ల వినువీథి కెగయుచు వెస వానిఁబట్టి
nanavuḍum̐gōpiṃci yagacarulella vinuvīthi kegayucu vesa vānim̐baṭṭi
బెడిదంబుగాఁబెక్కుపిడికిళ్లఁబొడిచి కడుమాఱుమసఁగి ఱెక్కలుద్రుంచివైచి
beḍidaṃbugām̐bekkupiḍikiḷlam̐boḍici kaḍumāṟumasam̐gi ṟekkaludruṃcivaici
ముక్కును జెవులును మొగిఁగోసివైవ నొక్కటఁగడఁగిన నుదరి రాఘవుఁడు:
mukkunu jevulunu mogim̐gōsivaiva nokkaṭam̐gaḍam̐gina nudari rāghavum̐ḍu:
“దూత నేటికి నింత దొసఁగులఁబెట్ట బ్రాతిగా వీని నేఁపక పోవనిండు.”
“dūta nēṭiki niṃta dosam̐gulam̐beṭṭa brātigā vīni nēm̐paka pōvaniṃḍu.”
అనవుడు రఘురామునానతి కులికి వనచరులందఱు వానిఁ బోవిడువ
anavuḍu raghurāmunānati kuliki vanacarulaṃdaṟu vānim̐ bōviḍuva
వినువీథి కెగసి యా వినువీథి నుండి యినసూనునకు శుకుఁడేర్పడఁబలికె:
vinuvīthi kegasi yā vinuvīthi nuṃḍi yinasūnunaku śukum̐ḍērpaḍam̐balike:
“రావణుతోఁగపిరాజ! యేమందు?” నావుడుఁదారాధినాథుఁడు గినిసి:
“rāvaṇutōm̐gapirāja! yēmaṃdu?” nāvuḍum̐dārādhināthum̐ḍu ginisi:
“తా నెంచ ద్రోహి యీ ధరణీశ్వరునకుఁ గాన యా ద్రోహినిఁగని సైఁపననుము.
“tā neṃca drōhi yī dharaṇīśvarunakum̐ gāna yā drōhinim̐gani saim̐pananumu.
సురిగి యే లోకంబుఁజొచ్చిననైనఁ బొరిగొందుఁగాని యేఁబోవనీననుము.
surigi yē lōkaṃbum̐joccinanainam̐ borigoṃdum̐gāni yēm̐bōvanīnanumu.
పటుకార్ముకంబు యూపంబుగా నిలిపి చటులాస్త్రములు పరిస్తరణముల్ సేసి
paṭukārmukaṃbu yūpaṃbugā nilipi caṭulāstramulu paristaraṇamul sēsi
పరగఁగెంధూళులు ప్రభలు గావించి తరుచర స్రుక్ స్రువతతులు చేపట్టి
paragam̐geṃdhūḷulu prabhalu gāviṃci tarucara sruk sruvatatulu cēpaṭṭi
సమరభూవేదికాస్థలమున నుండి యమరులకెల్లఁబ్రియంబెక్కుచుండఁ
samarabhūvēdikāsthalamuna nuṃḍi yamarulakellam̐briyaṃbekkucuṃḍam̐
గరమొప్ప వీరాంగకంబులఁబెల్లు దొరుగుచునున్న నెత్తురు నేయి గాఁగ
garamoppa vīrāṃgakaṃbulam̐bellu dorugucununna netturu nēyi gām̐ga
మహితగుణధ్వనుల్ మంత్రముల్ గాఁగ బహురాక్షసశ్రేణి పశుకోటి గాఁగఁ
mahitaguṇadhvanul maṃtramul gām̐ga bahurākṣasaśrēṇi paśukōṭi gām̐gam̐
దనరెడు సింహనాదధ్వనుల్ పేర్చి యనిమిషావలికి నాహ్వానంబు గాఁగ
danareḍu siṃhanādadhvanul pērci yanimiṣāvaliki nāhvānaṃbu gām̐ga
విడువని కాహళవితతులమ్రోఁత కడునింపుగా సామగానంబు గాఁగ
viḍuvani kāhaḷavitatulamrōm̐ta kaḍuniṃpugā sāmagānaṃbu gām̐ga
ఘనమైనరామలక్ష్మణుల కోపములు మునుకొని నా కోపమును గూడఁబర్వి
ghanamainarāmalakṣmaṇula kōpamulu munukoni nā kōpamunu gūḍam̐barvi
యనుపమత్రేతాగ్నులై యుండ నందుఁ దనదుప్రాణంబు లత్తఱి నాహుతులుగ
yanupamatrētāgnulai yuṃḍa naṃdum̐ danaduprāṇaṃbu lattaṟi nāhutuluga
రణమునఁ దన వీరరసమడంచుటయె ప్రణుతింపఁగా సోమపానంబు గాఁగఁ
raṇamunam̐ dana vīrarasamaḍaṃcuṭaye praṇutiṃpam̐gā sōmapānaṃbu gām̐gam̐
బ్రకటరాక్షసవీరపశుపలలముల సకలభూతవ్రాతసంతృప్తి గాఁగ
brakaṭarākṣasavīrapaśupalalamula sakalabhūtavrātasaṃtr̥pti gām̐ga
విడువక సంగ్రామవిపులయజ్ఞంబుఁ గడు నొప్పఁజేయు రాఘవసోమయాజి.
viḍuvaka saṃgrāmavipulayajñaṃbum̐ gaḍu noppam̐jēyu rāghavasōmayāji.
యటు గాకమున్న సీతాంగనఁదెచ్చి యిటయిచ్చి బ్రదుకుట యిది బుద్ధియనుము.”
yaṭu gākamunna sītāṃganam̐decci yiṭayicci bradukuṭa yidi buddhiyanumu.”
అని పేర్చి సుగ్రీవుఁడాడు వాక్యములు విని శుకచారుండు వేగంబె పోయి
ani pērci sugrīvum̐ḍāḍu vākyamulu vini śukacāruṃḍu vēgaṃbe pōyi
యంత వృత్తాంతంబు నా రావణునకు మంతనంబునఁజెప్పె. మఱి రాముఁడిచట
yaṃta vr̥ttāṃtaṃbu nā rāvaṇunaku maṃtanaṃbunam̐jeppe. maṟi rāmum̐ḍicaṭa
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).