Skip to content

యుద్ధకాండము · శుకసారణులు రాముసేనలఁజూచి వచ్చుట · యుద్ధకాండము · శుకసారణులు రాముసేనలఁజూచి వచ్చుట

Yuddha Kanda 31 · śukasāraṇulu rāmusēnalam̐jūci vaccuṭa

yuddhakāṃḍamu · śukasāraṇulu rāmusēnalam̐jūci vaccuṭa

Yuddha Kanda, section 31: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

49 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 31.

ఘనుఁడైనవాఁడెందుఁగలఁ? డిదిచిత్ర మనయంబు రాముఁడీ యంబుధిఁగట్టె

ghanum̐ḍainavām̐ḍeṃdum̐galam̐? ḍidicitra manayaṃbu rāmum̐ḍī yaṃbudhim̐gaṭṭe

Report an error

ననుచున్నవారు. మీ రాసేనఁజొచ్చి ఘనమతులై యెల్లక్రమము వీక్షించి

nanucunnavāru. mī rāsēnam̐jocci ghanamatulai yellakramamu vīkṣiṃci

Report an error

రం.”డని పనిచిన రయమున వారు దండివానరవేషధారులై వచ్చి

raṃ.”ḍani panicina rayamuna vāru daṃḍivānaravēṣadhārulai vacci

Report an error

వనములయం దుపవనములయందు ననుపమలీల మహాద్రులయందు

vanamulayaṃ dupavanamulayaṃdu nanupamalīla mahādrulayaṃdu

Report an error

వరసేతువందు నవ్వార్ధియవ్వలను గురుగుహాంతరములఁగొమరైన యెడలఁ

varasētuvaṃdu navvārdhiyavvalanu guruguhāṃtaramulam̐gomaraina yeḍalam̐

Report an error

గలయంగ విడిసిన కపిసేనఁ జూచి తలలూఁచి వెఱఁగంది తలఁకి యా చరులు

galayaṃga viḍisina kapisēnam̐ jūci talalūm̐ci veṟam̐gaṃdi talam̐ki yā carulu

Report an error

మేనులు గరుపార మెల్లన చొచ్చి వానరసేనలో వచ్చుట చూచి

mēnulu garupāra mellana cocci vānarasēnalō vaccuṭa cūci

Report an error

యెఱిఁగి విభీషణుండేచి పట్టించి యుఱక వారల రామునొద్దకుఁదెచ్చి:

yeṟim̐gi vibhīṣaṇuṃḍēci paṭṭiṃci yuṟaka vārala rāmunoddakum̐decci:

Report an error

“మనుజేశ! రావణుమంత్రులు వీరు; వనచరవేషులై వచ్చినవారు.

“manujēśa! rāvaṇumaṃtrulu vīru; vanacaravēṣulai vaccinavāru.

Report an error

శుకసారణులు; వీరు సొచ్చి యివ్వీట సకలంబుఁగనుఁగొని చనఁగలవార.”

śukasāraṇulu; vīru socci yivvīṭa sakalaṃbum̐ganum̐goni canam̐galavāra.”

Report an error

లనవుడు నా చారు లతిభీతిఁబొంది మునుకొని చేతులు మొగిచి మ్రొక్కుచును:

lanavuḍu nā cāru latibhītim̐boṃdi munukoni cētulu mogici mrokkucunu:

Report an error

“దేవ! రావణుఁడు వుత్తెంచినచరుల; మా విభీషణు చెప్పినంతయు నిజమ;

“dēva! rāvaṇum̐ḍu vutteṃcinacarula; mā vibhīṣaṇu ceppinaṃtayu nijama;

Report an error

యేచి యా రావణుం“డీ కపిసేన చూచిరం.”డనవుడుఁజూడవచ్చితిమి.”

yēci yā rāvaṇuṃ“ḍī kapisēna cūciraṃ.”ḍanavuḍum̐jūḍavaccitimi.”

Report an error

యనుటయు నవ్వుచు ననియె రాఘవుఁడు “వినుఁడు! రావణుమంత్రివిభులౌట‘ఁజేసి’

yanuṭayu navvucu naniye rāghavum̐ḍu “vinum̐ḍu! rāvaṇumaṃtrivibhulauṭa‘m̐jēsi’

Report an error

మిమ్ముఁజంపుట దగు; మిముఁజంపఁగాని మిమ్ముఁజంపిన వచ్చు మేలేమి మాకు?

mimmum̐jaṃpuṭa dagu; mimum̐jaṃpam̐gāni mimmum̐jaṃpina vaccu mēlēmi māku?

Report an error

నది సెప్పనేల? వీడంతయుఁజూడుఁ ‘డదిసూడ మిదిసూడ’మనక మీ రిప్పు

nadi seppanēla? vīḍaṃtayum̐jūḍum̐ ‘ḍadisūḍa midisūḍa’manaka mī rippu

Report an error

డిట తేరకొనఁగ వీడెంతయుఁజూచి యట పోయి వెసఁజెప్పుఁడా రావణునకు.

ḍiṭa tērakonam̐ga vīḍeṃtayum̐jūci yaṭa pōyi vesam̐jeppum̐ḍā rāvaṇunaku.

Report an error

నే లావునమ్మి తా నిట సీతఁదెచ్చె నా లావుఁజూప రమ్మనుఁ; డాజిలోన

nē lāvunammi tā niṭa sītam̐decce nā lāvum̐jūpa rammanum̐; ḍājilōna

Report an error

నెల్లి యీ లంకలో నెల్ల రాక్షసులఁ ద్రుళ్లెడి తన్నును దునుమాడు ననుఁడు;

nelli yī laṃkalō nella rākṣasulam̐ druḷleḍi tannunu dunumāḍu nanum̐ḍu;

Report an error

చనుఁ.”డని రావణుచారులఁబనిచె జననాథుడగు రామచంద్రుండు ప్రీతి.

canum̐.”ḍani rāvaṇucārulam̐banice jananāthuḍagu rāmacaṃdruṃḍu prīti.

Report an error

వారు విభీషణువలన నవ్వీడు వారక సకలంబు వడిఁజూచి పోయి

vāru vibhīṣaṇuvalana navvīḍu vāraka sakalaṃbu vaḍim̐jūci pōyi

Report an error

రావణుఁగాంచి యా రావణుతోడ: “దేవ! నీ పంచిన తెఱఁగునఁబోయి

rāvaṇum̐gāṃci yā rāvaṇutōḍa: “dēva! nī paṃcina teṟam̐gunam̐bōyi

Report an error

కపిసేన నెంతయుఁ గనుఁగొనుచుండ నెపమాత్రమున మమ్ము నీతమ్ముఁడెఱిఁగి

kapisēna neṃtayum̐ ganum̐gonucuṃḍa nepamātramuna mammu nītammum̐ḍeṟim̐gi

Report an error

పట్టించి కట్టించి భానుకులేశు కట్టెదిటికిఁదెచ్చి కలుషంబుతోడఁ

paṭṭiṃci kaṭṭiṃci bhānukulēśu kaṭṭediṭikim̐decci kaluṣaṃbutōḍam̐

Report an error

జంపింపఁదలఁచిన సదయుండు గాన చంపింపఁడయ్యె నిక్ష్వాకువల్లభుఁడు.

jaṃpiṃpam̐dalam̐cina sadayuṃḍu gāna caṃpiṃpam̐ḍayye nikṣvākuvallabhum̐ḍu.

Report an error

నీ లంకయును నిన్ను నిఖిలరాక్షసుల నాలంబులోపల నణఁగించుటకును

nī laṃkayunu ninnu nikhilarākṣasula nālaṃbulōpala naṇam̐giṃcuṭakunu

Report an error

రామభూపాలుశౌర్యముఁజెప్పనేల సౌమిత్రి యొక్కఁడే చాలు లంకేంద్ర!

rāmabhūpāluśauryamum̐jeppanēla saumitri yokkam̐ḍē cālu laṃkēṃdra!

Report an error

సురవైరి! సేతువుఁజూచితి మందు నెరసి వానరసేన నిండియున్నదియు.

suravairi! sētuvum̐jūciti maṃdu nerasi vānarasēna niṃḍiyunnadiyu.

Report an error

నది శతయోజనంబైనట్టి నిడుపు పదియోజనంబుల పఱపున నొప్పెఁ.

nadi śatayōjanaṃbainaṭṭi niḍupu padiyōjanaṃbula paṟapuna noppem̐.

Report an error

గపిసేన యింతని గణుతింపరాదు. కపులాడకాడకు ఘనగిరులందు

gapisēna yiṃtani gaṇutiṃparādu. kapulāḍakāḍaku ghanagirulaṃdu

Report an error

విడిసిన సేనయు విడియు సేనయును విడిదలపట్లకు వెదకుసేనయును

viḍisina sēnayu viḍiyu sēnayunu viḍidalapaṭlaku vedakusēnayunu

Report an error

నుదధికి నవ్వల నుండు సేనయును వదలక మఱియును వచ్చు సేనయును

nudadhiki navvala nuṃḍu sēnayunu vadalaka maṟiyunu vaccu sēnayunu

Report an error

నైయుంటకుఁబరాకు నాత్మలోవెఱఁగు పాయని వెఱపును బ్రభవించె దేవ!

naiyuṃṭakum̐barāku nātmalōveṟam̐gu pāyani veṟapunu brabhaviṃce dēva!

Report an error

యొక్కొక్క చోటున నున్న యా సేన లెక్కించి బ్రహ్మయు లిఖియింపలేఁడు.

yokkokka cōṭuna nunna yā sēna lekkiṃci brahmayu likhiyiṃpalēm̐ḍu.

Report an error

కాన యా రామునిఁగని సీత నిచ్చి దానవనాథ! మోదంబున నుండు.”

kāna yā rāmunim̐gani sīta nicci dānavanātha! mōdaṃbuna nuṃḍu.”

Report an error

మనవుడు రావణుండా మాటలెల్ల విన నింపుగాక క్రొవ్వినరోషమెత్తి

manavuḍu rāvaṇuṃḍā māṭalella vina niṃpugāka krovvinarōṣametti

Report an error

దేవగంధర్వులెత్తిన నైన సీత నే విడుతునె? యేల యీ పందతనము?

dēvagaṃdharvulettina naina sīta nē viḍutune? yēla yī paṃdatanamu?

Report an error

మిమ్ముఁగ్రోఁతులు వట్టిమెదిచిన నొచ్చి బమ్మెరవోవుచుఁబఱతెంచినారు.

mimmum̐grōm̐tulu vaṭṭimedicina nocci bammeravōvucum̐baṟateṃcināru.

Report an error

వలవ దోడకుఁడు; దుర్వారులై మిమ్ముఁ దలఁచి క్రోఁతులురారుధాటిమై వెనుక.”

valava dōḍakum̐ḍu; durvārulai mimmum̐ dalam̐ci krōm̐tulurārudhāṭimai venuka.”

Report an error

నని ధీరుఁడై పల్కి యా రావణుండు చని తనతో శుకసారణుల్‌ నడవ

nani dhīrum̐ḍai palki yā rāvaṇuṃḍu cani tanatō śukasāraṇul naḍava

Report an error

మిక్కిలి పొడవైన మేడపై నెక్కి యక్కపిబలముల నంతయు నపుడు

mikkili poḍavaina mēḍapai nekki yakkapibalamula naṃtayu napuḍu

Report an error

చూచి యద్భుతమంది శుకసారణులకు: “నీ చందమున నున్న యీ సేనలోన

cūci yadbhutamaṃdi śukasāraṇulaku: “nī caṃdamuna nunna yī sēnalōna

Report an error

నెవ్వఁడు ముంగల నేపారి నడచు? నెవ్వఁడెవ్వఁడు వెన్క నేమఱుకుండు?

nevvam̐ḍu muṃgala nēpāri naḍacu? nevvam̐ḍevvam̐ḍu venka nēmaṟukuṃḍu?

Report an error

నెవ్వఁడు శూరుఁ? డిందెవ్వఁడు వలఁతి? యెవ్వనిమాట లాయినసూతి సేయు?

nevvam̐ḍu śūrum̐? ḍiṃdevvam̐ḍu valam̐ti? yevvanimāṭa lāyinasūti sēyu?

Report an error

నెవ్వనితో రాముఁడిష్టంబు వలుకు? నెవ్వనిచే సేన యేపారి యుండు?

nevvanitō rāmum̐ḍiṣṭaṃbu valuku? nevvanicē sēna yēpāri yuṃḍu?

Report an error

నెవ్వరు రేవగ లీ సేనఁగాతు? రెవ్వరు సామంతు లీ సేనలోన?

nevvaru rēvaga lī sēnam̐gātu? revvaru sāmaṃtu lī sēnalōna?

Report an error

నెవ్వఁడు సుగ్రీవుఁ?డెవ్వఁడు రాముఁ. డెవ్వఁడు లక్ష్మణుం?డే మూర్తివాఁడు?

nevvam̐ḍu sugrīvum̐?ḍevvam̐ḍu rāmum̐. ḍevvam̐ḍu lakṣmaṇuṃ?ḍē mūrtivām̐ḍu?

Report an error

చూపుఁడా; యేర్పడఁజూపితిరేనిఁ గోపింప నే వారిగుణములు విన్న.”

cūpum̐ḍā; yērpaḍam̐jūpitirēnim̐ gōpiṃpa nē vāriguṇamulu vinna.”

Report an error

ననవిని సారణుండా రావణునకు వినిపింపఁదొడఁగెఁ బ్రవీణత మెఱసి:

nanavini sāraṇuṃḍā rāvaṇunaku vinipiṃpam̐doḍam̐gem̐ bravīṇata meṟasi:

Report an error

Illustration: Verse & Place (Project-owned).