Skip to content

బాలకాండము · అమృతమథన కథ · బాలకాండము · అమృతమథన కథ

Bala Kanda 18 · amr̥tamathana katha

bālakāṃḍamu · amr̥tamathana katha

Bala Kanda, section 18: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

30 passagesTelugu with transliteration

An original emblem for Bala Kanda, section 18.

“నే రాజు వాలించు నీ రాజధాని నా రాజునెఱిఁగింపు మనఘాత్మ! నాకు.”

“nē rāju vāliṃcu nī rājadhāni nā rājuneṟim̐giṃpu managhātma! nāku.”

Report an error

ననుడు విశ్వామిత్రుఁడా రాముఁజూచి: “వినుమింద్రు కడమున్ను విన్నాఁడ నేను:

nanuḍu viśvāmitrum̐ḍā rāmum̐jūci: “vinumiṃdru kaḍamunnu vinnām̐ḍa nēnu:

Report an error

ప్రథమయుగంబున బల్లిదుల్‌ దితికిఁ గథితోరువిక్రముల్‌ గలరు నందనులు;

prathamayugaṃbuna ballidul ditikim̐ gathitōruvikramul galaru naṃdanulu;

Report an error

అదితికి ధర్మాత్ములగుచున్న తనయు లుదయించి యమరత్వ మొందఁజింతించి

aditiki dharmātmulagucunna tanayu ludayiṃci yamaratva moṃdam̐jiṃtiṃci

Report an error

యోలి రసంబులు నోషధుల్‌ నించి పాలసముద్రంబు బలువిడిఁ ద్రచ్చి

yōli rasaṃbulu nōṣadhul niṃci pālasamudraṃbu baluviḍim̐ dracci

Report an error

యా పయోనిధిఁ బుట్టినట్టి సారములు రూపింప నమరత్వరుచిరకాంతులును

yā payōnidhim̐ buṭṭinaṭṭi sāramulu rūpiṃpa namaratvarucirakāṃtulunu

Report an error

కడునొప్ప నిమ్ములఁ గైకొందమనుచుఁ గడఁక మందరగిరిఁ గవ్వంబు సేసి

kaḍunoppa nimmulam̐ gaikoṃdamanucum̐ gaḍam̐ka maṃdaragirim̐ gavvaṃbu sēsi

Report an error

వాసుకిఁద్రాడుగా వడిఁ జుట్టి తరువ నా సమయంబున నా సముద్రమున

vāsukim̐drāḍugā vaḍim̐ juṭṭi taruva nā samayaṃbuna nā samudramuna

Report an error

వంచన మన్మథవార్ధి లోకముల ముంచియెత్తగఁజాలుమురిపంబులమరఁ

vaṃcana manmathavārdhi lōkamula muṃciyettagam̐jālumuripaṃbulamaram̐

Report an error

గాంచీఝణత్కార ఘననితంబములు నించుక నడుములు నిఱియుచన్గవలుఁ

gāṃcījhaṇatkāra ghananitaṃbamulu niṃcuka naḍumulu niṟiyucangavalum̐

Report an error

గోమల భ్రూలతా కోదండుఁడైన కామునివిలువిద్యగతిఁ జూడ నొప్పు

gōmala bhrūlatā kōdaṃḍum̐ḍaina kāmuniviluvidyagatim̐ jūḍa noppu

Report an error

కడకంటిచూపులుఁ గక్షదీధితులు వెడలించు భుజలతా విక్షేపణములు

kaḍakaṃṭicūpulum̐ gakṣadīdhitulu veḍaliṃcu bhujalatā vikṣēpaṇamulu

Report an error

నమర నూతనయౌవనాభిరామముల నమరు నర్వదికోట్లయప్సరస్‌ స్త్రీలు

namara nūtanayauvanābhirāmamula namaru narvadikōṭlayapsaras strīlu

Report an error

నొగిఁబుట్ట, మఱియు నయ్యుత్పలాక్షులకు నగవులు మురిపెంపునటనలు గలుగు

nogim̐buṭṭa, maṟiyu nayyutpalākṣulaku nagavulu muripeṃpunaṭanalu galugu

Report an error

పరిచారికలు నందె ప్రభవించి రెలమి నరుదార లెక్కింప నలవిగాకుండ;

paricārikalu naṃde prabhaviṃci relami narudāra lekkiṃpa nalavigākuṃḍa;

Report an error

లీల నయ్యచ్చర లేమలనెల్ల నోలి దేవతలు దైత్యులును గైకొనిరి;

līla nayyaccara lēmalanella nōli dēvatalu daityulunu gaikoniri;

Report an error

వారు సాధారణ వనితలై రపుడు; వారక మదిలోన వరుణతనూజ

vāru sādhāraṇa vanitalai rapuḍu; vāraka madilōna varuṇatanūja

Report an error

వరుని నపేక్షింప వారుణిఁజూచి వరియింపనొల్లనివారు గావునను

varuni napēkṣiṃpa vāruṇim̐jūci variyiṃpanollanivāru gāvunanu

Report an error

దితి సుతులసురాభిధేయులై; రదితి సుతులు వరించుట సురనాములైరి;

diti sutulasurābhidhēyulai; raditi sutulu variṃcuṭa suranāmulairi;

Report an error

అంత నుచ్చైశ్శ్రవ మనుతురంగమముఁ, గాంతిమించిన మణికౌస్తుభాఖ్యమును,

aṃta nuccaiśśrava manuturaṃgamamum̐, gāṃtimiṃcina maṇikaustubhākhyamunu,

Report an error

నమృతంబుఁబుట్టెను; నమృతంబువెనుక నమరుసుధాపూర్ణమగు కమండలము

namr̥taṃbum̐buṭṭenu; namr̥taṃbuvenuka namarusudhāpūrṇamagu kamaṃḍalamu

Report an error

వెలుఁగ ధన్వంతరి వేడ్కతోఁ బుట్టె; వెలయంగ మఱిపుట్టె విషముగ్రమగుచుఁ

velum̐ga dhanvaṃtari vēḍkatōm̐ buṭṭe; velayaṃga maṟipuṭṭe viṣamugramagucum̐

Report an error

బరుషరోషానల భావమై యున్న హరుఁడదియును మ్రింగె నద్భుతంబుగను.

baruṣarōṣānala bhāvamai yunna harum̐ḍadiyunu mriṃge nadbhutaṃbuganu.

Report an error

అంత సురాసురు లమృతంబు కొఱకు నెంతయుఁదమలోన నేచి దర్పమున

aṃta surāsuru lamr̥taṃbu koṟaku neṃtayum̐damalōna nēci darpamuna

Report an error

ననుపమస్థితిఁబోర, నసురుల సురలఁ గనుఁగొని సురలపైఁగరుణించి యపుడు

nanupamasthitim̐bōra, nasurula suralam̐ ganum̐goni suralapaim̐garuṇiṃci yapuḍu

Report an error

మానిని రూపమై మధుమర్దనుండు తా నమృతముఁబంచి తగనిచ్చె సురల;

mānini rūpamai madhumardanuṃḍu tā namr̥tamum̐baṃci taganicce surala;

Report an error

కరయ నా దితిసూనులడ్డమేతెంచి సురలచేఁజచ్చిరి; సురపతి యంత

karaya nā ditisūnulaḍḍamēteṃci suralacēm̐jacciri; surapati yaṃta

Report an error

నరినాశమొనరించి యధికతేజమున సరసిజాక్షుని కృప సంపదల్‌ గలిగి

narināśamonariṃci yadhikatējamuna sarasijākṣuni kr̥pa saṃpadal galigi

Report an error

సకలలోకంబులు సంతోషమంద సకలంకముగ రాజ్యమనుభవింపఁగను;

sakalalōkaṃbulu saṃtōṣamaṃda sakalaṃkamuga rājyamanubhaviṃpam̐ganu;

Report an error

సుతులీల్గుటయు దితి శోకంబు నొంది పతి కశ్యపునిఁజూచి పలికె దైన్యమున:

sutulīlguṭayu diti śōkaṃbu noṃdi pati kaśyapunim̐jūci palike dainyamuna:

Report an error

Illustration: Verse & Place (Project-owned).