అరదంబు సూతుండు హరులు నంగదుని కరముక్త గిరిశృంగకఠినపాతమున
aradaṃbu sūtuṃḍu harulu naṃgaduni karamukta giriśr̥ṃgakaṭhinapātamuna
యుద్ధకాండము · ఇంద్రజిత్తు మాయాయుద్ధమొనర్చుట · యుద్ధకాండము · ఇంద్రజిత్తు మాయాయుద్ధమొనర్చుట
yuddhakāṃḍamu · iṃdrajittu māyāyuddhamonarcuṭa
Yuddha Kanda, section 45: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
87 passagesTelugu with transliteration
అరదంబు సూతుండు హరులు నంగదుని కరముక్త గిరిశృంగకఠినపాతమున
aradaṃbu sūtuṃḍu harulu naṃgaduni karamukta giriśr̥ṃgakaṭhinapātamuna
నవనిపైఁగూలిన నాజివంచించి సవనశాలకు వేగ చని యింద్రజిత్తు
navanipaim̐gūlina nājivaṃciṃci savanaśālaku vēga cani yiṃdrajittu
తగు హోమసాధనతతులు రాక్షసులు మొగిఁదేరఁగైకొని ముఖ్యమార్గమున
tagu hōmasādhanatatulu rākṣasulu mogim̐dēram̐gaikoni mukhyamārgamuna
వలనొప్పఁగా రక్తవర్ణంబులైన తలచుట్టు నుభయవస్త్రములు మాల్యములు
valanoppam̐gā raktavarṇaṃbulaina talacuṭṭu nubhayavastramulu mālyamulu
ధరియించి వహ్నికిఁదగఁబరిస్తరణ మురుతోమరంబులు నుగ్రశస్త్రములు
dhariyiṃci vahnikim̐dagam̐baristaraṇa murutōmaraṃbulu nugraśastramulu
గఱిలేనిశరములు గావించి నలుపు గఱిగొన్న ఘనమేషకంఠరక్తంబు
gaṟilēniśaramulu gāviṃci nalupu gaṟigonna ghanamēṣakaṃṭharaktaṃbu
నొగిఁదాడి సమిధలు హోమంబు సేయఁ బొగలేక మండుచుఁబొడవుగా నిక్కి
nogim̐dāḍi samidhalu hōmaṃbu sēyam̐ bogalēka maṃḍucum̐boḍavugā nikki
యెలమిమై విజయంబు నెఱిఁగింపఁజాల వలఁతియై దక్షిణవలమానశిఖల
yelamimai vijayaṃbu neṟim̐giṃpam̐jāla valam̐tiyai dakṣiṇavalamānaśikhala
నొప్పుచు ననలుఁడాహుతులు గైకొనియె. నప్పుడు నిష్ఠతో నా యింద్రజిత్తు
noppucu nanalum̐ḍāhutulu gaikoniye. nappuḍu niṣṭhatō nā yiṃdrajittu
యుక్తక్రమంబున హోమ మొప్పార భక్తితో నొనరించి పావకువలన
yuktakramaṃbuna hōma moppāra bhaktitō nonariṃci pāvakuvalana
నాలుగు హయములు నానాస్త్రశస్త్ర జాలంబుఁగలుగు కాంచనమయరథముఁ
nālugu hayamulu nānāstraśastra jālaṃbum̐galugu kāṃcanamayarathamum̐
బడసె. నా రథమెక్కి బ్రహ్మాండమగలఁ గడువడి నార్చి యుత్కటకోపుఁడగుచు
baḍase. nā rathamekki brahmāṃḍamagalam̐ gaḍuvaḍi nārci yutkaṭakōpum̐ḍagucu
నింద్రాది దేవతలెల్ల భీతిల్ల నింద్రజిత్తుఁడు మరి యేపు దీపించి
niṃdrādi dēvatalella bhītilla niṃdrajittum̐ḍu mari yēpu dīpiṃci
చెచ్చెర దానవసేనలతోడ వచ్చి యదృశ్యుఁడై వడి దివి నుండి
ceccera dānavasēnalatōḍa vacci yadr̥śyum̐ḍai vaḍi divi nuṃḍi
మసలక రామలక్ష్మణులపై నేసె నసదృశకాండంబు లందంద పెక్కు.
masalaka rāmalakṣmaṇulapai nēse nasadr̥śakāṃḍaṃbu laṃdaṃda pekku.
లా రామలక్ష్మణు లాకసంబునకు భూరిశరంబులు పోవ నేయుటయు
lā rāmalakṣmaṇu lākasaṃbunaku bhūriśaraṃbulu pōva nēyuṭayu
నందొక్కటైనను నా యింద్రజిత్తు నందుఁదాఁకమి మఱి యా దైత్యవరుఁడు
naṃdokkaṭainanu nā yiṃdrajittu naṃdum̐dām̐kami maṟi yā daityavarum̐ḍu
తనుఁగానరాకుండ దర్పంబుమెఱసి వినువీథిఁగడుఁబెక్కువిధములఁదిరిగి
tanum̐gānarākuṃḍa darpaṃbumeṟasi vinuvīthim̐gaḍum̐bekkuvidhamulam̐dirigi
కవిసి యంతటఁబోక ఘనులైనకపుల నవలీలఁదునుమాడియందంద పేర్చి
kavisi yaṃtaṭam̐bōka ghanulainakapula navalīlam̐dunumāḍiyaṃdaṃda pērci
నలుదెస నేయుచో నగచరులకును నలినాప్తకులులకు నలినాప్తకిరణ
naludesa nēyucō nagacarulakunu nalināptakululaku nalināptakiraṇa
నిభములై పఱతెంచు నిష్ఠురాస్త్రములు నభమునయందుఁగానఁగవచ్చుఁగాని
nibhamulai paṟateṃcu niṣṭhurāstramulu nabhamunayaṃdum̐gānam̐gavaccum̐gāni
యరదంబుమ్రోఁతయు నా ఘోటకముల ఖురములమ్రోతయు గుణముమ్రోఁతయును
yaradaṃbumrōm̐tayu nā ghōṭakamula khuramulamrōtayu guṇamumrōm̐tayunu
సారథిపలుకులు ఝంకారములును నా రథికునియార్పు నతనిమూర్తియును
sārathipalukulu jhaṃkāramulunu nā rathikuniyārpu natanimūrtiyunu
నా రథంబును దాని యధికధ్వజంబు లే రూపములయందు నెటు సూడఁబడవ.
nā rathaṃbunu dāni yadhikadhvajaṃbu lē rūpamulayaṃdu neṭu sūḍam̐baḍava.
యా విధ మాసేన కప్పుడు తోచె నా వాలిఁదునుమాడి యసమునఁబేర్చు
yā vidha māsēna kappuḍu tōce nā vālim̐dunumāḍi yasamunam̐bērcu
రామునిమీఁద సురప్రభుండలిగి రామణీయకమహోగ్రప్రకాండములు
rāmunimīm̐da suraprabhuṃḍaligi rāmaṇīyakamahōgraprakāṃḍamulu
నా తనూజునిఁజంపినాఁడంచుఁబేర్చి యీ తెఱంగున మించి యేసెనోయనఁగ.
nā tanūjunim̐jaṃpinām̐ḍaṃcum̐bērci yī teṟaṃguna miṃci yēsenōyanam̐ga.
నప్పుడు కపిసేనయంగంబులెల్లఁ జిప్పలుచిద్రుపలై చెదరంగఁజూచి
nappuḍu kapisēnayaṃgaṃbulellam̐ jippalucidrupalai cedaraṃgam̐jūci
జనలోకపతితోడ సౌమిత్రి వలికె: “వినువీథి డాఁగిన వీనిచే నిట్లు
janalōkapatitōḍa saumitri valike: “vinuvīthi ḍām̐gina vīnicē niṭlu
మనుజేంద్ర!చూచితే మర్కటోత్తములు మన కొఱకై వచ్చి మడియుచున్నారు.
manujēṃdra!cūcitē markaṭōttamulu mana koṟakai vacci maḍiyucunnāru.
విస్మయంబుగ నింక వీనివంశంబు భస్మంబు సేసెద బ్రహ్మాస్త్ర మేసి.”
vismayaṃbuga niṃka vīnivaṃśaṃbu bhasmaṃbu sēseda brahmāstra mēsi.”
యనవుడు నా రాముఁడనుజుతో ననియెఁ: “జనునె యొక్కరునికై చంపఁబల్వురను!
yanavuḍu nā rāmum̐ḍanujutō naniyem̐: “janune yokkarunikai caṃpam̐balvuranu!
నెఱుఁగవే రణధర్మ? మెందు రాజులకు వెఱచి డాఁగినవారి, వెన్నిచ్చువారి,
neṟum̐gavē raṇadharma? meṃdu rājulaku veṟaci ḍām̐ginavāri, venniccuvāri,
ముకుళితహస్తులై మ్రొక్కెడువారిఁ, జకితాత్ములై వచ్చి శరణన్నవారిఁ,
mukuḷitahastulai mrokkeḍuvārim̐, jakitātmulai vacci śaraṇannavārim̐,
గదనంబులోఁబూరిఁగఱచినవారిఁ, బిదప నాయుధములు ప్రిదిలినవారి,
gadanaṃbulōm̐būrim̐gaṟacinavārim̐, bidapa nāyudhamulu pridilinavāri,
నిద్రవోయెడువారి నిర్జింపఁదగునె? భద్రంబుఁగోరు నా పరమపుణ్యులకు?
nidravōyeḍuvāri nirjiṃpam̐dagune? bhadraṃbum̐gōru nā paramapuṇyulaku?
నధికమాయలఁబేర్చు నా యింద్రజిత్తు వధియింపనోపెడు వానరోత్తములఁ
nadhikamāyalam̐bērcu nā yiṃdrajittu vadhiyiṃpanōpeḍu vānarōttamulam̐
గామచారులఁబంపఁ గాలంబుగాని సౌమిత్రి! బ్రహ్మాస్త్రసమయంబు గాదు.”
gāmacārulam̐baṃpam̐ gālaṃbugāni saumitri! brahmāstrasamayaṃbu gādu.”
అని నీలు నంగదు ననిలనందనుని ఘనుని శతఘ్నుని గజుని గవాక్షు
ani nīlu naṃgadu nanilanaṃdanuni ghanuni śataghnuni gajuni gavākṣu
భరితవిక్రమధాముఁబనసుఁగేసరిని శరభుని ఋషభుని సన్నాథుఁగ్రథను
bharitavikramadhāmum̐banasum̐gēsarini śarabhuni r̥ṣabhuni sannāthum̐grathanu
మఱి గవయుని నలుమైందుని ద్వివిదు నఱిముఱిఁగోపించి యసురపైఁబనిచె.
maṟi gavayuni nalumaiṃduni dvividu naṟimuṟim̐gōpiṃci yasurapaim̐banice.
నటు రాఘవుఁడు పంప నగచరాధిపులు పటుగతి మిన్నులపై కపు డెగసి
naṭu rāghavum̐ḍu paṃpa nagacarādhipulu paṭugati minnulapai kapu ḍegasi
తరుశైలములు వైవ దర్పించిక్రూర శరపరంపరల రాక్షసరాజసుతుఁడు
taruśailamulu vaiva darpiṃcikrūra śaraparaṃparala rākṣasarājasutum̐ḍu
వారి నొప్పించిన వార లా దైత్యు నే రూపమునఁగానకెప్పటి మగుడి
vāri noppiṃcina vāra lā daityu nē rūpamunam̐gānakeppaṭi maguḍi
వచ్చిరిరామభూవరుఁడున్నయెడకు నచ్చెరువంది యింద్రాదులు సూడ.
vaccirirāmabhūvarum̐ḍunnayeḍaku nacceruvaṃdi yiṃdrādulu sūḍa.
విలయమేఘశ్యామవిపులగాత్రంబు నలుకతోఁగెంజాయ నడరునేత్రములుఁ
vilayamēghaśyāmavipulagātraṃbu nalukatōm̐geṃjāya naḍarunētramulum̐
గలఘోరరూపంబు గానరాకుండ మెలఁగుచుఁబలికె నమ్మేఘనాదుండు:
galaghōrarūpaṃbu gānarākuṃḍa melam̐gucum̐balike nammēghanāduṃḍu:
“నరనాథసుతులార! నన్నుఁగయ్యమున నరుదు లక్షింప సహస్రాక్షునకును;
“naranāthasutulāra! nannum̐gayyamuna narudu lakṣiṃpa sahasrākṣunakunu;
మీ రెంతవా!”రంచు మిన్నెల్ల నద్రువ ఘోరమ్ముగా ధనుర్గుణము మ్రోయించి
mī reṃtavā!”raṃcu minnella nadruva ghōrammugā dhanurguṇamu mrōyiṃci
యశనిసంకాశంబులగు సాయకములు దశరథాత్మజులపైఁదఱచుగాఁబఱపి
yaśanisaṃkāśaṃbulagu sāyakamulu daśarathātmajulapaim̐daṟacugām̐baṟapi
మఱియును నందంద మర్మంబులందు గఱులుచ్చిపోఁబెక్కుకాండంబు లేసి
maṟiyunu naṃdaṃda marmaṃbulaṃdu gaṟuluccipōm̐bekkukāṃḍaṃbu lēsi
యంతటఁబోవక యా యింద్రజిత్తుఁ డంతకాకారుఁడై యాగ్రహంబునను
yaṃtaṭam̐bōvaka yā yiṃdrajittum̐ ḍaṃtakākārum̐ḍai yāgrahaṃbunanu
బటుతర నిర్ఘాత పాతభీకరతఁ జటులతర క్రూరసర్పబాణముల
baṭutara nirghāta pātabhīkaratam̐ jaṭulatara krūrasarpabāṇamula
నినకులేశ్వరులపై నేయంగ వారు ఘనబాణముల వాని ఖండించి వైచి
ninakulēśvarulapai nēyaṃga vāru ghanabāṇamula vāni khaṃḍiṃci vaici
వానిమీఁదికి మఱి వరసాయకములు పో నేయ వానినిఁబొడిసేసి యసుర
vānimīm̐diki maṟi varasāyakamulu pō nēya vāninim̐boḍisēsi yasura
వెండియు నందంద వేగంబు మెఱసి దండిశస్త్రావళి తఱచుగాఁబఱప
veṃḍiyu naṃdaṃda vēgaṃbu meṟasi daṃḍiśastrāvaḷi taṟacugām̐baṟapa
“నదె వచ్చె బాణంబులందేయు.”మనుచు “నిదె వచ్చెబాణంబు లిందేయు.”మనుచు
“nade vacce bāṇaṃbulaṃdēyu.”manucu “nide vaccebāṇaṃbu liṃdēyu.”manucu
నే దెస బాణంబు లేతెంచుచుండు నా దెస ఁబ్రతిబాణ మందంద యేయ
nē desa bāṇaṃbu lēteṃcucuṃḍu nā desa m̐bratibāṇa maṃdaṃda yēya
“నురగసమేతులై యుండుట మీకుఁ గరమొప్పదొల్లియుఁగల;దటుగాన
“nuragasamētulai yuṃḍuṭa mīkum̐ garamoppadolliyum̐gala;daṭugāna
తరణివంశజులార! తప్పక యిపుడు నురగసమేతులై యుండుఁ.”డన్ కరణి
taraṇivaṃśajulāra! tappaka yipuḍu nuragasamētulai yuṃḍum̐.”ḍan karaṇi
బంధురంబుగ నబ్జబాంధవకులుల బంధించె వెస నాగపాశసంతతుల.
baṃdhuraṃbuga nabjabāṃdhavakulula baṃdhiṃce vesa nāgapāśasaṃtatula.
వారును నా బ్రహ్మవరము మన్నించి తారు రాక్షసునిచేఁదద్దయుఁదూలి
vārunu nā brahmavaramu manniṃci tāru rākṣasunicēm̐daddayum̐dūli
యాదినారాయణునంశజులైన మేదినీపతులు నిమ్మెయిఁగట్టువడిరి.
yādinārāyaṇunaṃśajulaina mēdinīpatulu nimmeyim̐gaṭṭuvaḍiri.
“నేఁడు రాముఁడు గాక నిక్క మూహింప నాఁడితఁడే వామనస్వరూపంబు
“nēm̐ḍu rāmum̐ḍu gāka nikka mūhiṃpa nām̐ḍitam̐ḍē vāmanasvarūpaṃbu
నటు తాల్చి భూదాన మడిగి యా బలినిఁ బటుకృతఘ్నతఁబట్టి బంధించె. నట్టి
naṭu tālci bhūdāna maḍigi yā balinim̐ baṭukr̥taghnatam̐baṭṭi baṃdhiṃce. naṭṭi
ఫలము రామునకిప్డు ప్రాప్తంబు గాక పొలియునే మనుజుఁడై పుట్టియుండఁగను”
phalamu rāmunakipḍu prāptaṃbu gāka poliyunē manujum̐ḍai puṭṭiyuṃḍam̐ganu”
నని లోకమునఁబుట్టు నపవాదమునకుఁ దను సృజించినమాయఁదాఁ గట్టువడియెఁ.
nani lōkamunam̐buṭṭu napavādamunakum̐ danu sr̥jiṃcinamāyam̐dām̐ gaṭṭuvaḍiyem̐.
బన్నుగా మాయావిబంధంబువలనఁ దన్నుఁదామఱచిన ధరణీశు నపుడు
bannugā māyāvibaṃdhaṃbuvalanam̐ dannum̐dāmaṟacina dharaṇīśu napuḍu
కనుఁగొని దివిజులు గడు విన్ననైరి; వనచరోత్తములెల్ల వడి ఖిన్నులైరి.
kanum̐goni divijulu gaḍu vinnanairi; vanacarōttamulella vaḍi khinnulairi.
ఖిన్నుఁడైయున్న సుగ్రీవునకపుడు సన్నుతమతి విభీషణుఁడిట్టులనియె:
khinnum̐ḍaiyunna sugrīvunakapuḍu sannutamati vibhīṣaṇum̐ḍiṭṭulaniye:
“నిది యేల చింతింప? నెట్టివారలకు నొదవదే యాపద లొక్కొక్కవేళ?
“nidi yēla ciṃtiṃpa? neṭṭivāralaku nodavadē yāpada lokkokkavēḷa?
నినకులేశ్వరులకు నేమయ్యె నిపుడు ఘననాగపాశముల్ గట్టినంతటనె.”
ninakulēśvarulaku nēmayye nipuḍu ghananāgapāśamul gaṭṭinaṃtaṭane.”
యని పల్కి యతఁడు మాయాదృష్టిఁజూచి కనియె రావణసుతు గగన మార్గమునఁ.
yani palki yatam̐ḍu māyādr̥ṣṭim̐jūci kaniye rāvaṇasutu gagana mārgamunam̐.
గని నీరు మంత్రించి కన్నులు దుడిచి వనజాప్తసుతునకు వలనొప్పఁజూపె.
gani nīru maṃtriṃci kannulu duḍici vanajāptasutunaku valanoppam̐jūpe.
నా రవిజుండును నా విభీషణుని చారుమహామంత్రశక్తిచేఁజేసి
nā ravijuṃḍunu nā vibhīṣaṇuni cārumahāmaṃtraśakticēm̐jēsi
యా యింద్రజిత్తుని నప్పుడు గాంచి యాయతోన్నతమగు నచలంబుఁబెఱికి
yā yiṃdrajittuni nappuḍu gāṃci yāyatōnnatamagu nacalaṃbum̐beṟiki
యెగసి వ్రేయఁగఁద్రుంచి యింద్రజిత్తుండు మొగ దిరిగించె నమ్ములవెల్లి పఱపి.
yegasi vrēyam̐gam̐druṃci yiṃdrajittuṃḍu moga dirigiṃce nammulavelli paṟapi.
యినజుండు తిరిగిన నినజునిడాకఁ గని మున్ను వెఱచు రాక్షసులు మోదింప
yinajuṃḍu tirigina ninajuniḍākam̐ gani munnu veṟacu rākṣasulu mōdiṃpa
నప్పుడు విజయుఁడై యా యింద్రజిత్తు ముప్పిరిగొనుముదంబునఁదన్నుఁగొలుచు
nappuḍu vijayum̐ḍai yā yiṃdrajittu muppirigonumudaṃbunam̐dannum̐golucu
వారును దానును వడి లంక కరిగి యా రావణునితోడ నప్పుడిట్లనియెఁ:
vārunu dānunu vaḍi laṃka karigi yā rāvaṇunitōḍa nappuḍiṭlaniyem̐:
“జంపితిఁగపులను సర్పబాణములఁ గంపింపఁజేసి తిక్ష్వాకువల్లభుల.”
“jaṃpitim̐gapulanu sarpabāṇamulam̐ gaṃpiṃpam̐jēsi tikṣvākuvallabhula.”
నని యొప్పఁజెప్పిన నంతరంగమునఁ దనయునిచేఁత కెంతయు సంతసించి
nani yoppam̐jeppina naṃtaraṃgamunam̐ danayunicēm̐ta keṃtayu saṃtasiṃci
రావణుఁడప్పుడు రయమునఁద్రిజట రావించి యనియె:“ధరాపుత్త్రి నన్ను
rāvaṇum̐ḍappuḍu rayamunam̐drijaṭa rāviṃci yaniye:“dharāputtri nannu
నొల్లదు, రాముని నొడఁగూడుకొనుట యుల్లంబులో నమ్మియుండుటఁజేసి.
nolladu, rāmuni noḍam̐gūḍukonuṭa yullaṃbulō nammiyuṃḍuṭam̐jēsi.
నేఁడింద్రజిత్తుచే నేలకువచ్చి పోఁడిమి చెడి రామభూపాలుఁడునికి
nēm̐ḍiṃdrajittucē nēlakuvacci pōm̐ḍimi ceḍi rāmabhūpālum̐ḍuniki
సీతఁదోడ్కొనిపోయి చెచ్చెరఁజూపు మీ తఱిఁబుష్పక మెక్కించి నీవు.
sītam̐dōḍkonipōyi cecceram̐jūpu mī taṟim̐buṣpaka mekkiṃci nīvu.
అంత రామునిమీఁద యాసలు దక్కి చింతింప కిట నన్నుఁజేకొను సీత.”
aṃta rāmunimīm̐da yāsalu dakki ciṃtiṃpa kiṭa nannum̐jēkonu sīta.”
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).