Skip to content

బాలకాండము · సంగ్రహరామాయణము · బాలకాండము · సంగ్రహరామాయణము

Bala Kanda 2 · saṃgraharāmāyaṇamu

bālakāṃḍamu · saṃgraharāmāyaṇamu

Bala Kanda, section 2: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

109 passagesTelugu with transliteration

An original emblem for Bala Kanda, section 2.

ఘనుఁదపస్స్వాధ్యాయకమనీయశీలు మునినాథు నారదముని లోకవంద్యు

ghanum̐dapassvādhyāyakamanīyaśīlu munināthu nāradamuni lōkavaṃdyu

Report an error

ననఘతపోనిధియైన వాల్మీకి గనుఁగొని యొకనాఁడు గరమర్థి నడిగె:

nanaghatapōnidhiyaina vālmīki ganum̐goni yokanām̐ḍu garamarthi naḍige:

Report an error

“నెవ్వఁడు శ్రీమంతుఁ, డెవ్వఁడు దాంతుఁ డెవ్వఁడు సువ్రతుం, డెవ్వఁడున్నతుఁడు;

“nevvam̐ḍu śrīmaṃtum̐, ḍevvam̐ḍu dāṃtum̐ ḍevvam̐ḍu suvratuṃ, ḍevvam̐ḍunnatum̐ḍu;

Report an error

ఎవ్వఁడు నీతిజ్ఞుఁ,డెవ్వఁడు ప్రాజ్ఞుఁ, డెవ్వఁడు దుర్దముం,డెవ్వఁడుత్తముఁడు;

evvam̐ḍu nītijñum̐,ḍevvam̐ḍu prājñum̐, ḍevvam̐ḍu durdamuṃ,ḍevvam̐ḍuttamum̐ḍu;

Report an error

ఎవ్వఁడు జితకోపుఁ, డెవ్వఁడజేయుఁ డెవ్వఁడు నిరసూయుఁ, డెవ్వఁ డాఢ్యుండు

evvam̐ḍu jitakōpum̐, ḍevvam̐ḍajēyum̐ ḍevvam̐ḍu nirasūyum̐, ḍevvam̐ ḍāḍhyuṃḍu

Report an error

ఎవ్వఁడు ఘనపుణ్యుఁ,డెవ్వఁడు దారుఁ డెవ్వఁడు సుచరిత్రుఁ, డెవ్వఁడు సముఁడు

evvam̐ḍu ghanapuṇyum̐,ḍevvam̐ḍu dārum̐ ḍevvam̐ḍu sucaritrum̐, ḍevvam̐ḍu samum̐ḍu

Report an error

ఎవ్వనికిన్కకు నింద్రాదిసురలు దవ్వుదవ్వులయందుఁ దలఁకుచుండుదురు

evvanikinkaku niṃdrādisuralu davvudavvulayaṃdum̐ dalam̐kucuṃḍuduru

Report an error

అట్టివాఁడిలఁబుట్టి యరిగెనో యిపుడు పుట్టెనో యిటమీఁదఁ బుట్టనున్నాఁడొ”

aṭṭivām̐ḍilam̐buṭṭi yarigenō yipuḍu puṭṭenō yiṭamīm̐dam̐ buṭṭanunnām̐ḍo”

Report an error

అనినఁ ద్రిలోకజ్ఞుఁడైన నారదుఁడు దన బుద్ధినెంతయుఁదలపోసి చూచి

aninam̐ drilōkajñum̐ḍaina nāradum̐ḍu dana buddhineṃtayum̐dalapōsi cūci

Report an error

“ఈ మహిపై విష్ణుఁడిపుడు జన్మించె రాముఁడై దశరథరాజున;కతఁడు

“ī mahipai viṣṇum̐ḍipuḍu janmiṃce rāmum̐ḍai daśaratharājuna;katam̐ḍu

Report an error

నియతాత్ముఁడతిశౌర్యనిధి, కృపాజలధి, జయశాలి, స్వజనరక్షణవిచక్షణుఁడు,

niyatātmum̐ḍatiśauryanidhi, kr̥pājaladhi, jayaśāli, svajanarakṣaṇavicakṣaṇum̐ḍu,

Report an error

కంబుకంధరుఁడు, సక్కనిమేనివాఁడు, బింబారుణోష్ఠుండు, పీనవక్షుండు,

kaṃbukaṃdharum̐ḍu, sakkanimēnivām̐ḍu, biṃbāruṇōṣṭhuṃḍu, pīnavakṣuṃḍu,

Report an error

వెడఁదకన్నులవాఁడు,విపులాంసతలుఁడు, నిడుదచేతులవాఁడు, నియతవర్తనుఁడు,

veḍam̐dakannulavām̐ḍu,vipulāṃsatalum̐ḍu, niḍudacētulavām̐ḍu, niyatavartanum̐ḍu,

Report an error

వేదవేదాంగకోవిదుఁడు, కోదండ వేదవిదుండు వివేక భూషణుఁడు

vēdavēdāṃgakōvidum̐ḍu, kōdaṃḍa vēdaviduṃḍu vivēka bhūṣaṇum̐ḍu

Report an error

కమలాప్తు తేజంబుఁ, గడలిగాంభీర్య మమరాద్రిధైర్యంబు, నవనిసైరణయు,

kamalāptu tējaṃbum̐, gaḍaligāṃbhīrya mamarādridhairyaṃbu, navanisairaṇayu,

Report an error

ధనదునిత్యాగంబుఁ దనయందు మిగుల ననువొందునిత్యకల్యాణవిగ్రహుఁడు

dhanadunityāgaṃbum̐ danayaṃdu migula nanuvoṃdunityakalyāṇavigrahum̐ḍu

Report an error

కౌసల్య కానందకరుఁడట్టి రాము నాసక్తి యౌవరాజ్యాభిషిక్తునిఁగఁ

kausalya kānaṃdakarum̐ḍaṭṭi rāmu nāsakti yauvarājyābhiṣiktunim̐gam̐

Report an error

బట్టంబుగట్ట భూపతి సమకట్టఁ గట్టిఁడి కైక సంగరమునఁ దొల్లి

baṭṭaṃbugaṭṭa bhūpati samakaṭṭam̐ gaṭṭim̐ḍi kaika saṃgaramunam̐ dolli

Report an error

రెండువరంబు లర్థించిన దౌటఁ జండించి కాననస్థలికి రాఘవునిఁ

reṃḍuvaraṃbu larthiṃcina dauṭam̐ jaṃḍiṃci kānanasthaliki rāghavunim̐

Report an error

బనిచిన జనకునిప్రతినకై పూని జనకజాలక్ష్మణసహితుఁడై వెడలి

banicina janakunipratinakai pūni janakajālakṣmaṇasahitum̐ḍai veḍali

Report an error

తేవనంబునను నెంతేవనంబునను బావనమునిచర్యఁబరగుసంయములఁ

tēvanaṃbunanu neṃtēvanaṃbunanu bāvanamunicaryam̐baragusaṃyamulam̐

Report an error

గరుణమైఁగాపాడి ఖరదూషణాది శిరములు శరములఁజెండుబెండాడి

garuṇamaim̐gāpāḍi kharadūṣaṇādi śiramulu śaramulam̐jeṃḍubeṃḍāḍi

Report an error

ఋశ్యమూకంబున నినజుఁజేపట్టి వశ్యత నొకకోల వాలిఁదూలించి

r̥śyamūkaṃbuna ninajum̐jēpaṭṭi vaśyata nokakōla vālim̐dūliṃci

Report an error

సీతకై చలపట్టి సేతువు గట్టి పాతకి దశకంఠుఁ బరిమార్చి యంత

sītakai calapaṭṭi sētuvu gaṭṭi pātaki daśakaṃṭhum̐ barimārci yaṃta

Report an error

సీతతోఁగూడి యాశ్రితలోకపారి జాతంబు వనచరజాతంబు గొలువ

sītatōm̐gūḍi yāśritalōkapāri jātaṃbu vanacarajātaṃbu goluva

Report an error

నింద్రాదివినుతుఁడై యేతెంచి రామ చంద్రుండు నిజపూజ్యసామ్రాజ్యలక్ష్మిఁ

niṃdrādivinutum̐ḍai yēteṃci rāma caṃdruṃḍu nijapūjyasāmrājyalakṣmim̐

Report an error

బాలించుచున్నాఁడు ప్రజలకు వేడ్కఁ గీలించుచును గృతకృత్యుఁడై” యనుచు

bāliṃcucunnām̐ḍu prajalaku vēḍkam̐ gīliṃcucunu gr̥takr̥tyum̐ḍai” yanucu

Report an error

నా రాముచరిత మాద్యంతంబుసెప్పి నారదముని వోయె నలినజుపురికి

nā rāmucarita mādyaṃtaṃbuseppi nāradamuni vōye nalinajupuriki

Report an error

మునిపతి వాల్మీకి ముదముతో నంతఁ దన శిష్యుఁడగు భరద్వాజుండుఁదానుఁ

munipati vālmīki mudamutō naṃtam̐ dana śiṣyum̐ḍagu bharadvājuṃḍum̐dānum̐

Report an error

బ్రకటింప సజ్జనభావంబపోలె నకలుషజీవనంబై కరంబలరు

brakaṭiṃpa sajjanabhāvaṃbapōle nakaluṣajīvanaṃbai karaṃbalaru

Report an error

తమసానదికిఁ బోయి తన్నదిఁదోఁగి తమయనుష్ఠానముల్‌దగఁ జేయుచుండి

tamasānadikim̐ bōyi tannadim̐dōm̐gi tamayanuṣṭhānamuldagam̐ jēyucuṃḍi

Report an error

యా యేటిదరిఁ గొంచలర్థిమై రెండు గాయజుకేళిమైఁగవయుచో నొకటి

yā yēṭidarim̐ goṃcalarthimai reṃḍu gāyajukēḷimaim̐gavayucō nokaṭi

Report an error

నొక బోయ సంపిన నున్నక్రౌంచంబు ప్రకటశోకంబునఁ బనవుట సూచి

noka bōya saṃpina nunnakrauṃcaṃbu prakaṭaśōkaṃbunam̐ banavuṭa sūci

Report an error

“యోరినిషాదుండ! యోరి పాపాత్మ! యోరి, నీ కెగ్గేమి యొనరించెఁదొల్లి?

“yōriniṣāduṃḍa! yōri pāpātma! yōri, nī keggēmi yonariṃcem̐dolli?

Report an error

కామించి క్రౌంచముల్‌ గవయుచో నొకటి నేమిటికై చంపి తిబ్భంగిఁగడఁగి?

kāmiṃci krauṃcamul gavayucō nokaṭi nēmiṭikai caṃpi tibbhaṃgim̐gaḍam̐gi?

Report an error

ఈ పాపమున నీ వనేక దుఃఖములు ప్రాపించి తిరుగుము బహువత్సరంబు”

ī pāpamuna nī vanēka duḥkhamulu prāpiṃci tirugumu bahuvatsaraṃbu”

Report an error

లని బోయ శపియించి యంత వాల్మీకి దన శిష్యుఁడగు భరద్వాజునిఁజూచి

lani bōya śapiyiṃci yaṃta vālmīki dana śiṣyum̐ḍagu bharadvājunim̐jūci

Report an error

“ఛందోనిబద్ధమై సమవర్ణపంక్తిఁ బొంది నాలుగుపాదముల హృద్యమగుచు

“chaṃdōnibaddhamai samavarṇapaṃktim̐ boṃdi nālugupādamula hr̥dyamagucu

Report an error

నిది చాలవిస్మయం బీ శాపవాక్య పదములు దమయంతఁ బద్యమై పొలిచె”

nidi cālavismayaṃ bī śāpavākya padamulu damayaṃtam̐ badyamai police”

Report an error

ననిన భరద్వాజుఁడాదిగా శిష్యు లనురక్తిఁబఠియించి రా పద్యమంత;

nanina bharadvājum̐ḍādigā śiṣyu lanuraktim̐baṭhiyiṃci rā padyamaṃta;

Report an error

ననఘుండు వాల్మీకి యాశ్రమంబునకుఁ జనియున్నచో బ్రహ్మసనుదెంచుటయును

nanaghuṃḍu vālmīki yāśramaṃbunakum̐ janiyunnacō brahmasanudeṃcuṭayunu

Report an error

నెదురేఁగి పదముల కెఱఁగి తోడ్తెచ్చి కుదురుగాఁ గుశపీఠిఁగూర్చుండఁబెట్టి

nedurēm̐gi padamula keṟam̐gi tōḍtecci kudurugām̐ guśapīṭhim̐gūrcuṃḍam̐beṭṭi

Report an error

కరమర్థిఁబూజించి కరములు మొగిచి పరగ శాపాక్షర పద్యంబుఁజదువ

karamarthim̐būjiṃci karamulu mogici paraga śāpākṣara padyaṃbum̐jaduva

Report an error

విని బ్రహ్మనగి “పద్యవిషయమై వాణి యనఘ! నీ ముఖమున నవతరించినది.

vini brahmanagi “padyaviṣayamai vāṇi yanagha! nī mukhamuna navatariṃcinadi.

Report an error

శ్రీరాముచరిత మశేషంబు నీకుఁ గోరి నారదుఁడు సంకోచించి చెప్పె

śrīrāmucarita maśēṣaṃbu nīkum̐ gōri nāradum̐ḍu saṃkōciṃci ceppe

Report an error

నది విస్తరించి నీ వర్థితోఁజెప్పు మది సర్వమును దోచు” నని చెప్పిచనియె

nadi vistariṃci nī varthitōm̐jeppu madi sarvamunu dōcu” nani ceppicaniye

Report an error

నీ రీతిఁగృపవరంబిచ్చి మన్నించి సారసగర్భుండు సనినపిమ్మటను

nī rītim̐gr̥pavaraṃbicci manniṃci sārasagarbhuṃḍu saninapimmaṭanu

Report an error

మఱి నిర్మలధ్యానమతిఁబూని మౌని దఱిగొని సకలంబుఁ దలపోసి పోసి

maṟi nirmaladhyānamatim̐būni mauni daṟigoni sakalaṃbum̐ dalapōsi pōsi

Report an error

రఘుచరిత్రము దశరథుచరిత్రంబు రఘురాముజన్మంబు రామువర్తనము

raghucaritramu daśarathucaritraṃbu raghurāmujanmaṃbu rāmuvartanamu

Report an error

తాటకవధయు నుద్దండరాక్షసుల యాటోపహరణంబు యజ్ఞరక్షణముఁ

tāṭakavadhayu nuddaṃḍarākṣasula yāṭōpaharaṇaṃbu yajñarakṣaṇamum̐

Report an error

దనరుగంగామహత్త్వమును గౌతముని వనితను శాపంబువలనఁ బాపుటయు

danarugaṃgāmahattvamunu gautamuni vanitanu śāpaṃbuvalanam̐ bāpuṭayu

Report an error

ధనువు ద్రుంచుటయు సీతావివాహంబుఁ జనుచోట జమదగ్నిజాతునాగ్రహము

dhanuvu druṃcuṭayu sītāvivāhaṃbum̐ janucōṭa jamadagnijātunāgrahamu

Report an error

రామాభిషేకసంరంభంబు దుష్ట కామిని కైకేయి కష్టభాషణము

rāmābhiṣēkasaṃraṃbhaṃbu duṣṭa kāmini kaikēyi kaṣṭabhāṣaṇamu

Report an error

నభిషేకవిఘ్నంబు నడవికి రామ విభుఁడు వోవుటయు భూవిభుఁడడలుటయుఁ

nabhiṣēkavighnaṃbu naḍaviki rāma vibhum̐ḍu vōvuṭayu bhūvibhum̐ḍaḍaluṭayum̐

Report an error

దశరథుమరణంబు దశరథరాముఁ గుశలసంభాషియై గుహుఁడు గాంచుటయు

daśarathumaraṇaṃbu daśaratharāmum̐ guśalasaṃbhāṣiyai guhum̐ḍu gāṃcuṭayu

Report an error

నురుపుణ్యులట గంగ నుత్తరించుటయు వరమునీశ్వరు భరద్వాజుఁగాంచుటయు

nurupuṇyulaṭa gaṃga nuttariṃcuṭayu varamunīśvaru bharadvājum̐gāṃcuṭayu

Report an error

నరిగి యా చిత్రకూటాద్రి నిల్చుటయు భరతుండు రఘురాముపజ్జ వచ్చుటయు

narigi yā citrakūṭādri nilcuṭayu bharatuṃḍu raghurāmupajja vaccuṭayu

Report an error

నన్నచేఁబాదుక లర్థిమైఁబడసి మన్ననలింపొంద మరలిపోవుటయు

nannacēm̐bāduka larthimaim̐baḍasi mannanaliṃpoṃda maralipōvuṭayu

Report an error

దండకా గమనంబుఁ దగిలి విరాధుఁ జండవిక్రమమున సంహరించుటయుఁ

daṃḍakā gamanaṃbum̐ dagili virādhum̐ jaṃḍavikramamuna saṃhariṃcuṭayum̐

Report an error

బరమపుణ్యుఁడు శరభంగుదర్శనముఁ బరువడి మునులకుఁ బ్రతిన లిచ్చుటయుఁ

baramapuṇyum̐ḍu śarabhaṃgudarśanamum̐ baruvaḍi munulakum̐ bratina liccuṭayum̐

Report an error

జని యా యగస్త్యునాశ్రమముఁజొచ్చుటయు మునిచేత దివ్యాస్త్రములు వడయుటయు

jani yā yagastyunāśramamum̐joccuṭayu municēta divyāstramulu vaḍayuṭayu

Report an error

స్రుక్కక రామానుజుండు శూర్పణఖ ముక్కును జెవులును మ్రోడుసేయుటయు

srukkaka rāmānujuṃḍu śūrpaṇakha mukkunu jevulunu mrōḍusēyuṭayu

Report an error

నది వోయి ఖరదూషణాదిరాక్షసుల కది సెప్ప వారంత నలిగి వచ్చుటయు

nadi vōyi kharadūṣaṇādirākṣasula kadi seppa vāraṃta naligi vaccuṭayu

Report an error

నురువడి రఘురాముఁడొక్కఁడే కడఁగి ఖరదూషణాదిరాక్షసులఁ జంపుటయు

nuruvaḍi raghurāmum̐ḍokkam̐ḍē kaḍam̐gi kharadūṣaṇādirākṣasulam̐ jaṃpuṭayu

Report an error

నట రావణునిబుద్ధి నలుక వుట్టుటయుఁ గుటిలమారీచుండు గ్రొవ్విసచ్చుటయు

naṭa rāvaṇunibuddhi naluka vuṭṭuṭayum̐ guṭilamārīcuṃḍu grovvisaccuṭayu

Report an error

నసురాధిపతి సీత నపహరించుటయు విసువక రాముండు విలపించుటయును

nasurādhipati sīta napahariṃcuṭayu visuvaka rāmuṃḍu vilapiṃcuṭayunu

Report an error

నని జటాయువుచావు నవలఁగబంధుఁ గనుటయు మఱి పంపకడకుఁబోవుటయుఁ

nani jaṭāyuvucāvu navalam̐gabaṃdhum̐ ganuṭayu maṟi paṃpakaḍakum̐bōvuṭayum̐

Report an error

గరమర్థి ఋశ్యమూకమున సుగ్రీవుఁ డరుదెంచి కనుటయు నతనిసఖ్యంబు

garamarthi r̥śyamūkamuna sugrīvum̐ ḍarudeṃci kanuṭayu natanisakhyaṃbu

Report an error

వాలిసుగ్రీవుల వైరంబు తెఱఁగు వాలి నొక్కమ్మున వధియించుటయును

vālisugrīvula vairaṃbu teṟam̐gu vāli nokkammuna vadhiyiṃcuṭayunu

Report an error

దారా విలాపంబు దశరథసూనుఁ డా రవిసూను రాజ్యమున నిల్పుటయు

dārā vilāpaṃbu daśarathasūnum̐ ḍā ravisūnu rājyamuna nilpuṭayu

Report an error

మానవపతి యంత మాల్యవంతమున వానకాలంబెల్ల వసియించుటయును

mānavapati yaṃta mālyavaṃtamuna vānakālaṃbella vasiyiṃcuṭayunu

Report an error

గాకుత్స్థుకోపంబుఁ గపిసమాగమము నేకతంబున ముద్రయిచ్చిపుచ్చుటయు

gākutsthukōpaṃbum̐ gapisamāgamamu nēkataṃbuna mudrayiccipuccuṭayu

Report an error

నలయక కపులు సీతాన్వేషణంబు సలుపుటయును బిలసందర్శనంబు

nalayaka kapulu sītānvēṣaṇaṃbu salupuṭayunu bilasaṃdarśanaṃbu

Report an error

నక్షతంబుగ మహేంద్రాద్రి యెక్కుటయుఁ బక్షీంద్రుఁడైన సంపాతిఁగాంచుటయు

nakṣataṃbuga mahēṃdrādri yekkuṭayum̐ bakṣīṃdrum̐ḍaina saṃpātim̐gāṃcuṭayu

Report an error

వనధిలంఘనమును వనధిమధ్యమునఁ జనుచోట మైనాక సందర్శనంబు

vanadhilaṃghanamunu vanadhimadhyamunam̐ janucōṭa maināka saṃdarśanaṃbu

Report an error

మదమెత్తి సింహిక మారుతసూనుఁ గదిసి చచ్చుటయు లంకాప్రవేశంబు

madametti siṃhika mārutasūnum̐ gadisi caccuṭayu laṃkāpravēśaṃbu

Report an error

నంతఃపురంబెల్ల నతఁడరయుటయు నంత నశోకవనావలోకనముఁ

naṃtaḥpuraṃbella natam̐ḍarayuṭayu naṃta naśōkavanāvalōkanamum̐

Report an error

దెఱఁగొప్ప నందు వైదేహిఁగాంచుటయు నెఱుకకు నానవాలిచ్చి తేర్చుటయుఁ

deṟam̐goppa naṃdu vaidēhim̐gāṃcuṭayu neṟukaku nānavālicci tērcuṭayum̐

Report an error

భూనాథుకుశల మింపుగఁ దెల్పుటయును మానినీమణి శిరోమణి యిచ్చుటయును

bhūnāthukuśala miṃpugam̐ delpuṭayunu māninīmaṇi śirōmaṇi yiccuṭayunu

Report an error

బెనఁచి యా వనమెల్లఁ బెఱికివైచుటయు హనుమంతుఁడత్తఱి నక్షుఁజంపుటయుఁ

benam̐ci yā vanamellam̐ beṟikivaicuṭayu hanumaṃtum̐ḍattaṟi nakṣum̐jaṃpuṭayum̐

Report an error

బవనజుఁడటు పట్టుపడిపోవుటయును గవిసి లంకాపురిఁ గలయఁ గాల్చుటయు

bavanajum̐ḍaṭu paṭṭupaḍipōvuṭayunu gavisi laṃkāpurim̐ galayam̐ gālcuṭayu

Report an error

మారుతాత్మజుఁడబ్ధి మరల దాఁటుటయు వారక కపులతో వచ్చి కూడుటయు

mārutātmajum̐ḍabdhi marala dām̐ṭuṭayu vāraka kapulatō vacci kūḍuṭayu

Report an error

మధువనహరణంబు మణి ప్రీతినొసగ నధిపతి మారుతి నగ్గలించుటయు

madhuvanaharaṇaṃbu maṇi prītinosaga nadhipati māruti naggaliṃcuṭayu

Report an error

నినకులాధిపుఁడు దండెత్తి పోవుటయు వననిధితటమున వచ్చి నిల్చుటయు

ninakulādhipum̐ḍu daṃḍetti pōvuṭayu vananidhitaṭamuna vacci nilcuṭayu

Report an error

నంత విభీషణుఁడధిపుఁగాంచుటయుఁ జింతించుటయు మఱి సేతుబంధనముఁ

naṃta vibhīṣaṇum̐ḍadhipum̐gāṃcuṭayum̐ jiṃtiṃcuṭayu maṟi sētubaṃdhanamum̐

Report an error

జడధి దాఁటుటయును జని లంకమీఁద విడిసి పేర్చుటయు దోర్వీర్యంబు మెఱసి

jaḍadhi dām̐ṭuṭayunu jani laṃkamīm̐da viḍisi pērcuṭayu dōrvīryaṃbu meṟasi

Report an error

కర ముగ్రులగు కుంభకర్ణాది వీర వరులఁజంపుటయు రావణునిఁ ద్రుంచుటయు

kara mugrulagu kuṃbhakarṇādi vīra varulam̐jaṃpuṭayu rāvaṇunim̐ druṃcuṭayu

Report an error

నా విభీషణుని లంకాధినాయకునిఁ గావించి పట్టంబు గరుణఁ గట్టుటయు

nā vibhīṣaṇuni laṃkādhināyakunim̐ gāviṃci paṭṭaṃbu garuṇam̐ gaṭṭuṭayu

Report an error

ననుపమ శుద్ధి బ్రహ్మాదులు మెచ్చ జనకజ రఘురామచంద్రుఁ జేరుటయు

nanupama śuddhi brahmādulu mecca janakaja raghurāmacaṃdrum̐ jēruṭayu

Report an error

నెలమిఁబుష్పకమెక్కి యెందును గీర్తు లలర నయోధ్యకు నరుగుదెంచుటయు

nelamim̐buṣpakamekki yeṃdunu gīrtu lalara nayōdhyaku narugudeṃcuṭayu

Report an error

భరతుఁగాంచుటయును బట్టాభిషేక మరుదార రఘురాముఁడవధరించుటయుఁ

bharatum̐gāṃcuṭayunu baṭṭābhiṣēka marudāra raghurāmum̐ḍavadhariṃcuṭayum̐

Report an error

గపి దైత్యపతుల నర్కజవిభీషణుల విపులసంపద లిచ్చి వీడుకొల్పుటయుఁ

gapi daityapatula narkajavibhīṣaṇula vipulasaṃpada licci vīḍukolpuṭayum̐

Report an error

బరికించి ప్రజల నాపదలొందకుండఁ గరుణఁబ్రోచుట యనుకథలెల్లఁ దెలిసి

barikiṃci prajala nāpadaloṃdakuṃḍam̐ garuṇam̐brōcuṭa yanukathalellam̐ delisi

Report an error

వెలయ నిర్వదినాల్గువేల శ్లోకములు గలిగి యేనూఱుసర్గల విస్తరిల్లి

velaya nirvadinālguvēla ślōkamulu galigi yēnūṟusargala vistarilli

Report an error

కాండంబు లాఱింటఁ గర మొప్పుమిగిలి యుండ రామాయణ మోలిఁగావించి

kāṃḍaṃbu lāṟiṃṭam̐ gara moppumigili yuṃḍa rāmāyaṇa mōlim̐gāviṃci

Report an error

యొనరఁ దక్కిన కథ లుత్తరకాండ మునఁ జెప్పి వాల్మీకి ముదముతో నంత

yonaram̐ dakkina katha luttarakāṃḍa munam̐ jeppi vālmīki mudamutō naṃta

Report an error

“నీ కథఁ బఠియింప నెవ్వరునేర్తు? రీ కథ జగముల నెబ్భంగిఁ బరగు?”

“nī katham̐ baṭhiyiṃpa nevvarunērtu? rī katha jagamula nebbhaṃgim̐ baragu?”

Report an error

ననుచుండఁ గుశలవు లనఘమానసులు మనసిజాకారులు మంజుభాషణులు

nanucuṃḍam̐ guśalavu lanaghamānasulu manasijākārulu maṃjubhāṣaṇulu

Report an error

జననుతుల్‌ సంగీతసాహిత్యనిధులు మునివేషధారు లిమ్ముల వచ్చి మ్రొక్కి

jananutul saṃgītasāhityanidhulu munivēṣadhāru limmula vacci mrokki

Report an error

“యనఘ! రామాయణ మర్థితోఁజదువఁ జనుదెంచితిమి మమ్ముఁజదివింపవలయు”

“yanagha! rāmāyaṇa marthitōm̐jaduvam̐ janudeṃcitimi mammum̐jadiviṃpavalayu”

Report an error

ననిన సంతోషించి యమ్మునీశ్వరుఁడు తన మనోరథమెల్లఁ దలకూడె ననుచు

nanina saṃtōṣiṃci yammunīśvarum̐ḍu tana manōrathamellam̐ dalakūḍe nanucu

Report an error

గేయమై పాఠ్యమై కేవల పుణ్య దాయకంబగు రఘూత్తముచరిత్రంబు

gēyamai pāṭhyamai kēvala puṇya dāyakaṃbagu raghūttamucaritraṃbu

Report an error

ననుపమ తంత్రీలయాన్విత ఫణితి మునిపతి సదివింప ముదమొప్పఁజదివి

nanupama taṃtrīlayānvita phaṇiti munipati sadiviṃpa mudamoppam̐jadivi

Report an error

రమణ శృంగారాది రసములుప్పొంగ సమవృత్తభేదముల్‌ సంధిసమాస

ramaṇa śr̥ṃgārādi rasamuluppoṃga samavr̥ttabhēdamul saṃdhisamāsa

Report an error

సమధికశబ్దార్థ సంగతులెఱిఁగి క్రమమొప్పఁ బాడుచుఁగవగూడి వారు

samadhikaśabdārtha saṃgatuleṟim̐gi kramamoppam̐ bāḍucum̐gavagūḍi vāru

Report an error

మునిజనసభల నిమ్ములఁబూజనములు గొని వినోదింపఁ గాకుత్స్థవల్లభుఁడు

munijanasabhala nimmulam̐būjanamulu goni vinōdiṃpam̐ gākutsthavallabhum̐ḍu

Report an error

వెలయఁదమ్ములుఁ దాను వేడ్కలింపొందఁ గొలు విచ్చి వారలఁగోరి రావించి

velayam̐dammulum̐ dānu vēḍkaliṃpoṃdam̐ golu vicci vāralam̐gōri rāviṃci

Report an error

వారి రూపంబులు వారి నిల్కడలు వారి నిర్మలతర స్వరవిశేషములుఁ

vāri rūpaṃbulu vāri nilkaḍalu vāri nirmalatara svaraviśēṣamulum̐

Report an error

దనకు నింపొదవింపఁ దత్కథాక్రమము వినుచుండె రాముఁడవ్విధ మెట్టిదనిన:

danaku niṃpodaviṃpam̐ datkathākramamu vinucuṃḍe rāmum̐ḍavvidha meṭṭidanina:

Report an error

Illustration: Verse & Place (Project-owned).