నలుగడఁబాఱ నున్నతశక్తి వారి “వలవ దోహో” యని వారణ సేసి
nalugaḍam̐bāṟa nunnataśakti vāri “valava dōhō” yani vāraṇa sēsi
యుద్ధకాండము · అంగదుఁడు మహాకాయుని మడియించుట · యుద్ధకాండము · అంగదుఁడు మహాకాయుని మడియించుట
yuddhakāṃḍamu · aṃgadum̐ḍu mahākāyuni maḍiyiṃcuṭa
Yuddha Kanda, section 56: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
163 passagesTelugu with transliteration
నలుగడఁబాఱ నున్నతశక్తి వారి “వలవ దోహో” యని వారణ సేసి
nalugaḍam̐bāṟa nunnataśakti vāri “valava dōhō” yani vāraṇa sēsi
ఖ్యాతిమించిన మహాకాయుని మంత్రు లాతతమతి రుధిరాశనుండనఁగ
khyātimiṃcina mahākāyuni maṃtru lātatamati rudhirāśanuṃḍanam̐ga
వాలెడువాఁడును వజ్రనాభుండుఁ గాలదంష్ట్రుండును గాలకల్పుండు
vāleḍuvām̐ḍunu vajranābhuṃḍum̐ gāladaṃṣṭruṃḍunu gālakalpuṃḍu
మఱి వపాశుఁడు శతమాయుండు ధూమ్రు డఱిమురిదుర్ధరుండనువాఁడుఁ గడఁగి
maṟi vapāśum̐ḍu śatamāyuṃḍu dhūmru ḍaṟimuridurdharuṃḍanuvām̐ḍum̐ gaḍam̐gi
యట్టహాసము సేసి యగచరసేనఁ గిట్టి నొప్పింప వీక్షించి పృథుండుఁ
yaṭṭahāsamu sēsi yagacarasēnam̐ giṭṭi noppiṃpa vīkṣiṃci pr̥thuṃḍum̐
బనసుండు, మేఘపుష్పకుఁడు, గవాక్షుఁ డును ఋషభుఁడు,గజుఁడును,గ్రోధనుండు
banasuṃḍu, mēghapuṣpakum̐ḍu, gavākṣum̐ ḍunu r̥ṣabhum̐ḍu,gajum̐ḍunu,grōdhanuṃḍu
శతబలి, తారుండు సబలులై వారి నతులితగతిఁదాఁకి యని సేయునపుడు
śatabali, tāruṃḍu sabalulai vāri natulitagatim̐dām̐ki yani sēyunapuḍu
రుధిరాశనుండంత రోషంబుతోడ నధికబాణములు గవాక్షుపై నేయ
rudhirāśanuṃḍaṃta rōṣaṃbutōḍa nadhikabāṇamulu gavākṣupai nēya
వేగంబె పర్వతవృక్షంబు లెత్తి యా గవాక్షుఁడు రుధిరాశను వైచె.
vēgaṃbe parvatavr̥kṣaṃbu letti yā gavākṣum̐ḍu rudhirāśanu vaice.
వైచిన నడుమనె వాని నన్నిటిని నేచి చూర్ణంబుగా నేసి గవాక్షుఁ
vaicina naḍumane vāni nanniṭini nēci cūrṇaṃbugā nēsi gavākṣum̐
బడనేసె; మూర్ఛచేఁబడిన గవాక్షుఁ బొడగని తారుఁడప్పుడు కలుషించి
baḍanēse; mūrchacēm̐baḍina gavākṣum̐ boḍagani tārum̐ḍappuḍu kaluṣiṃci
ఘనమైన సాలవృక్షంబెత్తి వైచె ననువంద రుధిరాశునరదంబుమీఁద.
ghanamaina sālavr̥kṣaṃbetti vaice nanuvaṃda rudhirāśunaradaṃbumīm̐da.
నా రుధిరాశుండు నమ్మహీరుహము బోరన నడుమనె పొడిపొడి సేసి
nā rudhirāśuṃḍu nammahīruhamu bōrana naḍumane poḍipoḍi sēsi
పదిబాణములఁదారుబడనేసి మించి కదిసి చలంబునఁగపిసేనఁగిట్టి
padibāṇamulam̐dārubaḍanēsi miṃci kadisi calaṃbunam̐gapisēnam̐giṭṭi
కడు నుగ్రుఁడయి లయకాలంబునాఁడు మిడుక లోకములెల్ల మ్రింగునంతకుని
kaḍu nugrum̐ḍayi layakālaṃbunām̐ḍu miḍuka lōkamulella mriṃgunaṃtakuni
యాకృతిఁగైకొని యా సేనతోడ భీకరవృత్తితోఁబేర్చుచు నుండె.
yākr̥tim̐gaikoni yā sēnatōḍa bhīkaravr̥ttitōm̐bērcucu nuṃḍe.
నప్పుడొక్కింత గవాక్షతారులును దెప్పిరి కనువిచ్చి తెలియంగఁజూచి
nappuḍokkiṃta gavākṣatārulunu deppiri kanuvicci teliyaṃgam̐jūci
యంతలో గదగొని యడరి గవాక్షుఁ డంతకాకృతి రుధిరాశను తలయు
yaṃtalō gadagoni yaḍari gavākṣum̐ ḍaṃtakākr̥ti rudhirāśanu talayu
వ్రేసిన నసురయు వికృతాంగుఁడగుచు బాసెఁబ్రాణములకుఁ;బడియెఁదత్తనువు.
vrēsina nasurayu vikr̥tāṃgum̐ḍagucu bāsem̐brāṇamulakum̐;baḍiyem̐dattanuvu.
నని వజ్రనాభుఁడుదగ్రుఁడై పృథునిఁ గనుఁగొని పెల్లేసె ఘనసాయకములఁ;
nani vajranābhum̐ḍudagrum̐ḍai pr̥thunim̐ ganum̐goni pellēse ghanasāyakamulam̐;
బృథివీధరము వైచెఁ బృథుఁడప్పు;డతఁడు ప్రథితంబుగా నేసెఁ బది వ్రయ్యలుగను;
br̥thivīdharamu vaicem̐ br̥thum̐ḍappu;ḍatam̐ḍu prathitaṃbugā nēsem̐ badi vrayyaluganu;
బృథుఁడును రోషసంభృతుఁడునై వాని రథముపై కెంతయురయమున దాటి
br̥thum̐ḍunu rōṣasaṃbhr̥tum̐ḍunai vāni rathamupai keṃtayurayamuna dāṭi
విల్లు ఖండములు గావించి గుఱ్ఱముల డొల్లించి రథము బెట్టుగ నుగ్గుసేసి
villu khaṃḍamulu gāviṃci guṟṟamula ḍolliṃci rathamu beṭṭuga nuggusēsi
యనయంబుఁగోపించి యవ్వజ్రనాభు ఘనశక్తి వలకేలఁగడకాళ్లు వట్టి
yanayaṃbum̐gōpiṃci yavvajranābhu ghanaśakti valakēlam̐gaḍakāḷlu vaṭṭi
వెసఁద్రిప్పి నేలతో వ్రేసి రోషమున నసువులఁబెడఁబాపి యా పృథుఁడార్చె.
vesam̐drippi nēlatō vrēsi rōṣamuna nasuvulam̐beḍam̐bāpi yā pr̥thum̐ḍārce.
బరువడి ఋషభునిపైఁగాలదంష్ట్రుఁ డురుశక్తిఁగొలిపె మహోద్ధత దంతి.
baruvaḍi r̥ṣabhunipaim̐gāladaṃṣṭrum̐ ḍuruśaktim̐golipe mahōddhata daṃti.
నటు మీఁదఁ జనుదెంచునగ్గజంబునకు నిటునటు తొలఁగక ఋషభుండు నెగసి
naṭu mīm̐dam̐ janudeṃcunaggajaṃbunaku niṭunaṭu tolam̐gaka r̥ṣabhuṃḍu negasi
వేగంబ తన పదద్వితయ మొక్కటిగ లాగించి కుంభస్థలంబుఁదన్నుటయు
vēgaṃba tana padadvitaya mokkaṭiga lāgiṃci kuṃbhasthalaṃbum̐dannuṭayu
మదకరి ఘీంకృతి మానక నిగుడ నది యొక వింటిపట్టరిగె వెన్కకును.
madakari ghīṃkr̥ti mānaka niguḍa nadi yoka viṃṭipaṭṭarige venkakunu.
మఱియును ఋషభుండు మానక మీఁదఁ దఱిమి యయ్యేనుఁగుదంతంబు వెఱికి
maṟiyunu r̥ṣabhuṃḍu mānaka mīm̐dam̐ daṟimi yayyēnum̐gudaṃtaṃbu veṟiki
బాగొప్ప వ్రేసి యప్పటుకరిఁజంపి లాగును వేగంబు లావును మెఱసి
bāgoppa vrēsi yappaṭukarim̐jaṃpi lāgunu vēgaṃbu lāvunu meṟasi
కాలదంష్ట్రునిఁగిట్టి కా లొగిఁబట్టి కేలిమై ధర వ్రేసి గీటడఁగించె
kāladaṃṣṭrunim̐giṭṭi kā logim̐baṭṭi kēlimai dhara vrēsi gīṭaḍam̐giṃce
నసురసైన్యంబు హాహాకార మొంద; నసమునఁగపిసేన యార్చె నందంద.
nasurasainyaṃbu hāhākāra moṃda; nasamunam̐gapisēna yārce naṃdaṃda.
కాలకల్పుఁడు నగ్నికల్పబాణముల పాలు గావించె నప్పనసునిఁగిట్టి;
kālakalpum̐ḍu nagnikalpabāṇamula pālu gāviṃce nappanasunim̐giṭṭi;
పనసుండు నరదంబుపైకి లంఘించి మును బెట్టుగా నశ్వములఁజదియించి
panasuṃḍu naradaṃbupaiki laṃghiṃci munu beṭṭugā naśvamulam̐jadiyiṃci
సారథిఁబడఁదన్ని సత్త్వమేపార నా రథంబెల్ల నుగ్గయి రాలఁగొట్టి
sārathim̐baḍam̐danni sattvamēpāra nā rathaṃbella nuggayi rālam̐goṭṭi
పిడికిట గళసంధి బెట్టుగాఁగిట్టి పొడిచె నక్కాలకల్పుఁడు దన్నుకొనఁగఁ
piḍikiṭa gaḷasaṃdhi beṭṭugām̐giṭṭi poḍice nakkālakalpum̐ḍu dannukonam̐gam̐
బొడిచిన వాఁడు నప్పుడు పండ్లు డుల్లి దొడదొడనోర నెత్తురుఁగ్రక్కుకొనుచు
boḍicina vām̐ḍu nappuḍu paṃḍlu ḍulli doḍadoḍanōra netturum̐grakkukonucu
మిడుకుచు గ్రుడ్డులు మిడుకఁబ్రాణములు విడిచె రాక్షసులెల్ల విస్మయమంద.
miḍukucu gruḍḍulu miḍukam̐brāṇamulu viḍice rākṣasulella vismayamaṃda.
బలియుఁడై కపుల వపాశుండు గిట్టి చలముననేచి జర్జరితులఁజేయ
baliyum̐ḍai kapula vapāśuṃḍu giṭṭi calamunanēci jarjaritulam̐jēya
వానిపైఁబాషాణవర్షంబు గురిసె జానుగా గజుఁడాకసంబెల్ల నిండ.
vānipaim̐bāṣāṇavarṣaṃbu gurise jānugā gajum̐ḍākasaṃbella niṃḍa.
నా వపాశుఁడు వానినన్నింటి నడుమఁ గావించెఁదునియలుగా నంపగములఁ;
nā vapāśum̐ḍu vāninanniṃṭi naḍumam̐ gāviṃcem̐duniyalugā naṃpagamulam̐;
గావించి మఱియును గజు నురుమాడఁ బావకాభములైన బాణంబు లేడు.
gāviṃci maṟiyunu gaju nurumāḍam̐ bāvakābhamulaina bāṇaṃbu lēḍu.
నేసి వెండియుఁ గిట్టి యిరువదేనింట నేసి నూఱింట మే నేసెఁదూరంగ.
nēsi veṃḍiyum̐ giṭṭi yiruvadēniṃṭa nēsi nūṟiṃṭa mē nēsem̐dūraṃga.
గజుఁడు నయ్యమ్ములఁగడునొచ్చి వాని నిజరథంబంతయు నెళనెళ విఱుగ
gajum̐ḍu nayyammulam̐gaḍunocci vāni nijarathaṃbaṃtayu neḷaneḷa viṟuga
గరుడనివిధమునఁగడువేగ దాటి కరి గోపురాగ్ర ముగ్రతఁద్రోచుకరణి
garuḍanividhamunam̐gaḍuvēga dāṭi kari gōpurāgra mugratam̐drōcukaraṇi
నా వపాశుని తల యట్టకుఁబాసి పో వైచె నప్పుడు భూమిపైఁబడఁగ.
nā vapāśuni tala yaṭṭakum̐bāsi pō vaice nappuḍu bhūmipaim̐baḍam̐ga.
రోషించి యపుడు ధూమ్రుఁడుదుర్ధరుండు భీషణాస్త్రముల నొప్పించి వానరులఁ
rōṣiṃci yapuḍu dhūmrum̐ḍudurdharuṃḍu bhīṣaṇāstramula noppiṃci vānarulam̐
దఱిమినఁగినుకఁగ్రోధన మేఘపుష్పు లుఱక రథంబుల కుఱికి వారలను
daṟiminam̐ginukam̐grōdhana mēghapuṣpu luṟaka rathaṃbula kuṟiki vāralanu
గరతలంబుల మస్తకంబులఁజఱచి దురమునఁగెడపి రద్భుతశక్తి మెఱసి.
garatalaṃbula mastakaṃbulam̐jaṟaci duramunam̐geḍapi radbhutaśakti meṟasi.
యటు వారు హతులైన నసురు లందంద పటురయంబునఁజెడి పాఱిరి భీతి.
yaṭu vāru hatulaina nasuru laṃdaṃda paṭurayaṃbunam̐jeḍi pāṟiri bhīti.
నసురులు వాఱుట యప్పుడు చూచి మసలక వడి శతమాయుండు వేర్చి
nasurulu vāṟuṭa yappuḍu cūci masalaka vaḍi śatamāyuṃḍu vērci
కవిసినచోఁబరిఘ మ్ముద్ధరించి జవమొప్ప ఋషభుండు శతబలి పనసుఁ
kavisinacōm̐barigha mmuddhariṃci javamoppa r̥ṣabhuṃḍu śatabali panasum̐
డలుక గవాక్షనలాంగదుల్ గూడి చలమున నటుతాఁకి సంరంభ మెసగఁ
ḍaluka gavākṣanalāṃgadul gūḍi calamuna naṭutām̐ki saṃraṃbha mesagam̐
గడఁగి వృక్షంబుల ఘనశైలములను మడవక యా శతమాయుపై వైవ
gaḍam̐gi vr̥kṣaṃbula ghanaśailamulanu maḍavaka yā śatamāyupai vaiva
శర తోమర ప్రాస చక్ర గదాసి వరశస్త్రచయముల వర్షంబు గురిసి
śara tōmara prāsa cakra gadāsi varaśastracayamula varṣaṃbu gurisi
వడి శతమాయుండు వనచరేశ్వరుల బెడిదంబుగా నొంచి పేర్చి పెల్లార్చె.
vaḍi śatamāyuṃḍu vanacarēśvarula beḍidaṃbugā noṃci pērci pellārce.
వానిచే నటు నొచ్చి వానరాధిపులు మానక రోషసమగ్రులై కవిసి
vānicē naṭu nocci vānarādhipulu mānaka rōṣasamagrulai kavisi
యడరి గవాక్షుండు హయములఁజంపెఁ; గడఁగి ఖండించె నంగదుఁడు పతాకఁ;
yaḍari gavākṣuṃḍu hayamulam̐jaṃpem̐; gaḍam̐gi khaṃḍiṃce naṃgadum̐ḍu patākam̐;
బఱియలుగాఁద్రొక్కెఁబనసుండు రథము నుఱుముగా ఋషభుండు నొంచె సారథిని
baṟiyalugām̐drokkem̐banasuṃḍu rathamu nuṟumugā r̥ṣabhuṃḍu noṃce sārathini
నలనొప్ప నలుఁడు శస్త్రాస్త్రముల్ విఱిచె జలమునఁబిడికిట శతబలి వొడిచెఁ.
nalanoppa nalum̐ḍu śastrāstramul viṟice jalamunam̐biḍikiṭa śatabali voḍicem̐.
బిడికిటిపోటునఁబిమ్మిటిగొనక కడులఘుత్వంబున గరుడండువోలెఁ
biḍikiṭipōṭunam̐bimmiṭigonaka kaḍulaghutvaṃbuna garuḍaṃḍuvōlem̐
బటుసత్త్వమున వాలుఁబలకయుఁగొనుచుఁ జటుల వేగంబున శతమాయుఁడెగయ
baṭusattvamuna vālum̐balakayum̐gonucum̐ jaṭula vēgaṃbuna śatamāyum̐ḍegaya
బరవసంబున వాలుఁబడియున్న బ్రద్ద పరియును గొని శతబలియుఁదో నెగసె
baravasaṃbuna vālum̐baḍiyunna bradda pariyunu goni śatabaliyum̐dō negase
నెగసి భేరుండంబు లెడ రెండు గవిసి యొగిబోరు తెఱఁగున నురువడి మిగుల
negasi bhēruṃḍaṃbu leḍa reṃḍu gavisi yogibōru teṟam̐guna nuruvaḍi migula
వ్రేయుచుఁదిరుగుచు వెసఁదప్పికొనుచుఁ బాయుచు డాయుచుఁ బాటవంబొప్పఁ
vrēyucum̐dirugucu vesam̐dappikonucum̐ bāyucu ḍāyucum̐ bāṭavaṃboppam̐
గెరలుచుఁదెరలుచుఁగ్రిందుమీఁదగుచుఁ బొరిఁబొరి నాకసంబునఁబోరుతఱిని
geralucum̐deralucum̐griṃdumīm̐dagucum̐ borim̐bori nākasaṃbunam̐bōrutaṟini
శతమాయుఁ డడిదంబు జళిపించి పూన్చి శతబలి విపులవక్షము వ్రేయుటయును
śatamāyum̐ ḍaḍidaṃbu jaḷipiṃci pūnci śatabali vipulavakṣamu vrēyuṭayunu
సరభసుండై యప్డు శతబలి బ్రద్ద పరి దప్ప నొడ్డి కృపాణోగ్రధారఁ
sarabhasuṃḍai yapḍu śatabali bradda pari dappa noḍḍi kr̥pāṇōgradhāram̐
జలమునఁదెగవ్రేసె శతమాయుతొడలు తలక్రిందుగా వాఁడు ధరమీఁదఁబడఁగ
jalamunam̐degavrēse śatamāyutoḍalu talakriṃdugā vām̐ḍu dharamīm̐dam̐baḍam̐ga
నవిసె దైత్యుని తల యంతంతఁజెదరి యవనిపై గిరిశృంగ మవియుచందమున
navise daityuni tala yaṃtaṃtam̐jedari yavanipai giriśr̥ṃga maviyucaṃdamuna
శతమాయుఁడప్పుడు చచ్చినఁగపులు శతబలితోడ నచ్చట నార్చుటయును
śatamāyum̐ḍappuḍu caccinam̐gapulu śatabalitōḍa naccaṭa nārcuṭayunu
ధరణి మిన్నును గుణధ్వని బీటలెగయ నరద మత్యుగ్రరయంబునఁబఱపి
dharaṇi minnunu guṇadhvani bīṭalegaya narada matyugrarayaṃbunam̐baṟapi
యంగద నపుడు మహానాదుఁడార్చి యంగదుమేను మూఁడమ్ముల గ్రుచ్చి
yaṃgada napuḍu mahānādum̐ḍārci yaṃgadumēnu mūm̐ḍammula grucci
మఱియును వెసనేయ మర్కటేశ్వరుఁడు వఱలుకోపంబున వానిపైఁగిట్టి
maṟiyunu vesanēya markaṭēśvarum̐ḍu vaṟalukōpaṃbuna vānipaim̐giṭṭi
యోజనాయతగిరి యొకటి రథంబు పై జవంబున వైవఁబడకుండ వాఁడు
yōjanāyatagiri yokaṭi rathaṃbu pai javaṃbuna vaivam̐baḍakuṃḍa vām̐ḍu
నడుమనె గదవైచి నగమెల్లఁబొడిగ వడిఁద్రుంపఁగోపించి వాలినందనుఁడు
naḍumane gadavaici nagamellam̐boḍiga vaḍim̐druṃpam̐gōpiṃci vālinaṃdanum̐ḍu
నతనిరథంబున కవలీల దాటి చతురసత్త్వోన్నతిఁజాపంబుఁద్రుంచి
natanirathaṃbuna kavalīla dāṭi caturasattvōnnatim̐jāpaṃbum̐druṃci
పట్టి రథంబుపైఁబడవైచి రొమ్ము మెట్టి గ్రుడ్డులు వడి మిడికి రోఁజఁగను
paṭṭi rathaṃbupaim̐baḍavaici rommu meṭṭi gruḍḍulu vaḍi miḍiki rōm̐jam̐ganu
మెడ నుల్చి త్రెంచి క్రమ్మిననెత్తురొలుకఁ బుడమిపైవైచె నప్పుడు వాని శిరముఁ.
meḍa nulci treṃci kramminanetturolukam̐ buḍamipaivaice nappuḍu vāni śiramum̐.
దమ్ముఁడు సావ నుద్దండశోకమున నెమ్ములు వగులంగ నేచి యార్చుచును
dammum̐ḍu sāva nuddaṃḍaśōkamuna nemmulu vagulaṃga nēci yārcucunu
మఱియును గనలుచు మహనీయరథము మెఱయంగ నలుగడ మెఱుఁగులు వారఁ
maṟiyunu ganalucu mahanīyarathamu meṟayaṃga nalugaḍa meṟum̐gulu vāram̐
గదలించి యమ్మహాకాయుఁ డుద్వృత్తి మదమున సింహంబు మలయుచందమున
gadaliṃci yammahākāyum̐ ḍudvr̥tti madamuna siṃhaṃbu malayucaṃdamuna
గుదులు గ్రుచ్చినమాడ్కిఁగ్రూరబాణముల నెదిరి ధారుణిఁగూలనేసె వానరుల.
gudulu gruccinamāḍkim̐grūrabāṇamula nediri dhāruṇim̐gūlanēse vānarula.
వనచరవీరులు వానికిఁగాక హనుమంతు మఱుఁగున కందఱుఁజనిరి
vanacaravīrulu vānikim̐gāka hanumaṃtu maṟum̐guna kaṃdaṟum̐janiri
సారథిఁజూచి: “యీ చక్కటి మనల వారక మార్కొనువారలు లేరు;
sārathim̐jūci: “yī cakkaṭi manala vāraka mārkonuvāralu lēru;
బోరన రాముపైఁబోనిమ్ము తేరు నేరుపు వాటించి నీ.”వన్న వాఁడుఁ
bōrana rāmupaim̐bōnimmu tēru nērupu vāṭiṃci nī.”vanna vām̐ḍum̐
గడఁగియశ్వముల పగ్గములు వదల్చి వడినదల్పఁగను తీవ్రంబునఁగదల
gaḍam̐giyaśvamula paggamulu vadalci vaḍinadalpam̐ganu tīvraṃbunam̐gadala
నా క్రూరతకుఁగాక యగచరుల్ పఱవ: “నో క్రోఁతులార! మీ కులుక నేమిటికి?
nā krūratakum̐gāka yagacarul paṟava: “nō krōm̐tulāra! mī kuluka nēmiṭiki?
శివునిచాపముఁద్రుంచి సీతఁజేకొన్న యవనీశుపైఁగాని యాజి నే నలుగఁ.
śivunicāpamum̐druṃci sītam̐jēkonna yavanīśupaim̐gāni yāji nē nalugam̐.
బరశురాముని భంగపఱచినయట్టి నరనాయకుఁడుగాని నా యీడు గాఁడు.
baraśurāmuni bhaṃgapaṟacinayaṭṭi naranāyakum̐ḍugāni nā yīḍu gām̐ḍu.
ఆజిలో ఖరుని నుక్కడఁచినయట్టి రాజుమీఁదనె కాని రాదు నా యమ్ము.
ājilō kharuni nukkaḍam̐cinayaṭṭi rājumīm̐dane kāni rādu nā yammu.
ధృతి నమ్ముతుద కబ్ధిఁ దెచ్చినయట్టి పతితోడఁగాని యే బవరంబు సేయఁ.
dhr̥ti nammutuda kabdhim̐ deccinayaṭṭi patitōḍam̐gāni yē bavaraṃbu sēyam̐.
ద్రిజగంబులందును దీపించునట్టి రజతాద్రియెత్తిన రావణుసుతుఁడఁ;
drijagaṃbulaṃdunu dīpiṃcunaṭṭi rajatādriyettina rāvaṇusutum̐ḍam̐;
దుది నింక నింద్రజిత్తునకుఁదమ్ముండ; నిదె మహాకాయుండ నేతెంచినాఁడ.”
dudi niṃka niṃdrajittunakum̐dammuṃḍa; nide mahākāyuṃḍa nēteṃcinām̐ḍa.”
ననుచుఁజెప్పుచునుండ నంగదుండపుడు ఘనమైనకడిమితోఁగలుషించి పలికె:
nanucum̐jeppucunuṃḍa naṃgaduṃḍapuḍu ghanamainakaḍimitōm̐galuṣiṃci palike:
“నోరి! మహాకాయ! యుడుగక రజ్జు లీ రణస్థలమున నేల ప్రేలెదవు?
“nōri! mahākāya! yuḍugaka rajju lī raṇasthalamuna nēla prēledavu?
మీ తండ్రి గిరి యెత్తి మెఱసె; మా తండ్రి మీ తండ్రిఁదోఁక నిమ్మెయిఁగట్టి యెత్తె
mī taṃḍri giri yetti meṟase; mā taṃḍri mī taṃḍrim̐dōm̐ka nimmeyim̐gaṭṭi yette
నీకు నాకునుదగు నిష్ఠుర రణము; కాకుత్థ్స నిధియేల? కపివీరు లేల?”
nīku nākunudagu niṣṭhura raṇamu; kākutthsa nidhiyēla? kapivīru lēla?”
యని మ్రాఁకు గొనిమీఁద నడరింప నతని తనువు నిండఁగఁగప్పె దారుణాస్త్రముల
yani mrām̐ku gonimīm̐da naḍariṃpa natani tanuvu niṃḍam̐gam̐gappe dāruṇāstramula
గదిసి వెండియు మహాకాయుఁడంగదుని గదగొని వ్రేసె నుత్కటకోపుఁడగుచు.
gadisi veṃḍiyu mahākāyum̐ḍaṃgaduni gadagoni vrēse nutkaṭakōpum̐ḍagucu.
వ్రేసిన నెంతయు వివశుఁడై పడియె. నా సమయంబున నతఁడు మూర్ఛిల్లఁ
vrēsina neṃtayu vivaśum̐ḍai paḍiye. nā samayaṃbuna natam̐ḍu mūrchillam̐
గుతలంబు వగుల నెక్కొన దైత్యులార్చి రతఁడు మూర్ఛిల్లిన నగచరపతులు
gutalaṃbu vagula nekkona daityulārci ratam̐ḍu mūrchillina nagacarapatulu
కలసి యందఱు మహాకాయుపైఁగవిసి శిలలు భూరుహములుఁజెచ్చెఱ వైవ
kalasi yaṃdaṟu mahākāyupaim̐gavisi śilalu bhūruhamulum̐jecceṟa vaiva
నవి యెల్లఁదనదు బాణావలిచేత నవలీలఁదునిమి గవాక్షునిఁబదిటఁ
navi yellam̐danadu bāṇāvalicēta navalīlam̐dunimi gavākṣunim̐badiṭam̐
బృథుని నైదిటనూటఁబృథుసత్త్వు గజునిఁ బ్రథితంబుగా శతబలి ముప్పదింట
br̥thuni naidiṭanūṭam̐br̥thusattvu gajunim̐ brathitaṃbugā śatabali muppadiṃṭa
నెనుబది యమ్ముల ఋషభునిఁగినుకఁ బనసుని డెబ్బది పటుసాయకముల
nenubadi yammula r̥ṣabhunim̐ginukam̐ banasuni ḍebbadi paṭusāyakamula
మెఱసి క్రోధనుని నమ్మేఘపుష్పకుని నఱువదింటను నూట నదరంటనేసి
meṟasi krōdhanuni nammēghapuṣpakuni naṟuvadiṃṭanu nūṭa nadaraṃṭanēsi
యిటు వానరుల నతఁడే పడఁగింప; నట మూర్ఛనొందిన యంగదుఁడపుడు
yiṭu vānarula natam̐ḍē paḍam̐giṃpa; naṭa mūrchanoṃdina yaṃgadum̐ḍapuḍu
తెలిసి మోమునఁగ్రమ్ముదెంచురక్తంబుఁ బలుమాఱుఁగరములఁబాయఁద్రోయుచును
telisi mōmunam̐grammudeṃcuraktaṃbum̐ balumāṟum̐garamulam̐bāyam̐drōyucunu
నుదరుచు నప్పు డయోమయంబైన గదయెత్తుకొని మహాకాయుని రథము
nudarucu nappu ḍayōmayaṃbaina gadayettukoni mahākāyuni rathamu
పయికి లంఘించి యుద్భటశక్తితోడ జయశీలుఁడై వాని సారథిఁజంపి,
payiki laṃghiṃci yudbhaṭaśaktitōḍa jayaśīlum̐ḍai vāni sārathim̐jaṃpi,
వెస విల్లుఁబెళ్లన విఱుగంగఁగొట్టి, యసమున హయముల నన్నింటిఁజంపి
vesa villum̐beḷlana viṟugaṃgam̐goṭṭi, yasamuna hayamula nanniṃṭim̐jaṃpi
తలవ్రేసె; వ్రేసిన దైత్యపుంగవుని తలబొమిడిక మూడి ధరణిపైఁబడియె.
talavrēse; vrēsina daityapuṃgavuni talabomiḍika mūḍi dharaṇipaim̐baḍiye.
నా మహాకాయుండు నరదంబు డిగ్గి భీమగదాదండభీషణుండగుచు
nā mahākāyuṃḍu naradaṃbu ḍiggi bhīmagadādaṃḍabhīṣaṇuṃḍagucu
నంగదునంగంబు నదరంట నేసె; నంగదుండును వ్రేయ నతఁడు దప్పించి
naṃgadunaṃgaṃbu nadaraṃṭa nēse; naṃgaduṃḍunu vrēya natam̐ḍu dappiṃci
యంగదుమస్తకంబలుకతో మఱియుఁ బొంగి గదాదండమున డాసి వ్రేసె.
yaṃgadumastakaṃbalukatō maṟiyum̐ boṃgi gadādaṃḍamuna ḍāsi vrēse.
నా ఘాతమున నెత్తు రడరిననైన రాఘవుబంటు శౌర్యంబింత సెడక
nā ghātamuna nettu raḍarinanaina rāghavubaṃṭu śauryaṃbiṃta seḍaka
గద పుచ్చుకొని మహాకాయుని వ్రేసె నుదురు భగ్నముగాఁగ నుతశక్తి మెఱసి
gada puccukoni mahākāyuni vrēse nuduru bhagnamugām̐ga nutaśakti meṟasi
యెదిరినఁదమ తండ్రి నీతని తండ్రి విదితంబుగాఁబట్టి వేమాఱుఁదొల్లి
yedirinam̐dama taṃḍri nītani taṃḍri viditaṃbugām̐baṭṭi vēmāṟum̐dolli
మున్నీటిలోపల ముంచుట దలఁచి మున్నిటిపగకునై ముంచెనో యనఁగ
munnīṭilōpala muṃcuṭa dalam̐ci munniṭipagakunai muṃcenō yanam̐ga
నసమేది దనుజుఁడా యంగదుఁగిట్టి వెసఁబేర్చి నెత్తురువెల్లిలో ముంచె;
nasamēdi danujum̐ḍā yaṃgadum̐giṭṭi vesam̐bērci netturuvellilō muṃce;
ముంచె రావణుఁబట్టి మున్నబ్ధి వాలి ముంచినగతి వాని ముంచెరక్తమున.
muṃce rāvaṇum̐baṭṭi munnabdhi vāli muṃcinagati vāni muṃceraktamuna.
నిటు మహాకాయుండు నింద్రుమన్మఁడును బటుగతిఁబోరుచోఁ బరగురక్తముల
niṭu mahākāyuṃḍu niṃdrumanmam̐ḍunu baṭugatim̐bōrucōm̐ baraguraktamula
జేవుఱుటేఱులఁ జెలువైన గిరుల భావంబు చేకొని భాస్వరులైరి.
jēvuṟuṭēṟulam̐ jeluvaina girula bhāvaṃbu cēkoni bhāsvarulairi.
గదయును గదయు నుగ్రంబుగాఁదాఁకి చిదురుపలగుటయుఁజెచ్చెఱవారు
gadayunu gadayu nugraṃbugām̐dām̐ki cidurupalaguṭayum̐jecceṟavāru
బలుఁడును నిర్జరపతియును దొల్లి కలసి పెనంగినకైవడి దోప
balum̐ḍunu nirjarapatiyunu dolli kalasi penaṃginakaivaḍi dōpa
బలుధూళియిద్దఱ పదహతి నెగయఁ దలపడి మల్లయుద్ధము సేయుచోటఁ
baludhūḷiyiddaṟa padahati negayam̐ dalapaḍi mallayuddhamu sēyucōṭam̐
జతురతమై‘వనచరవీరుఁ డీతఁ; డితఁడు రాక్షసుఁ.’డని యెఱుఁగంగరాక
jaturatamai‘vanacaravīrum̐ ḍītam̐; ḍitam̐ḍu rākṣasum̐.’ḍani yeṟum̐gaṃgarāka
కీలుబొమ్మలు పోరుక్రియలను దోచి వాలిసుగ్రీవుల వడువునఁబోర
kīlubommalu pōrukriyalanu dōci vālisugrīvula vaḍuvunam̐bōra
నాదటఁగపులెల్ల నంగదుఁజూచి: “యీ దుష్టరాక్షసు నేల పాలార్ప?
nādaṭam̐gapulella naṃgadum̐jūci: “yī duṣṭarākṣasu nēla pālārpa?
వాలినందనుఁడవు; వాలికైవడిని వాలినవాఁడవు వరభుజశక్తి;
vālinaṃdanum̐ḍavu; vālikaivaḍini vālinavām̐ḍavu varabhujaśakti;
వాలిదుందుభియును వడిఁబోరుచోట వాలి దుందుభి నింతవడి నిల్వనీఁడు;
vāliduṃdubhiyunu vaḍim̐bōrucōṭa vāli duṃdubhi niṃtavaḍi nilvanīm̐ḍu;
వేవేగ చంపు మీ విబుధకంటకుని నీ విక్రమక్రమనిపుణత మెఱసి.”
vēvēga caṃpu mī vibudhakaṃṭakuni nī vikramakramanipuṇata meṟasi.”
యని జయశబ్దంబు లడరింప నతఁడు దనుజుని తల ముష్టిఁదాటించె బెట్టు.
yani jayaśabdaṃbu laḍariṃpa natam̐ḍu danujuni tala muṣṭim̐dāṭiṃce beṭṭu.
పిడికిటిపోటున బిట్టుగాఁదిరిగి పడియె నా దైత్యుండు బల మఱి నేలఁ.
piḍikiṭipōṭuna biṭṭugām̐dirigi paḍiye nā daityuṃḍu bala maṟi nēlam̐.
బడియున్న రాక్షసపతి రొమ్ము ద్రొక్కి మెడ నుల్చి తలఁద్రెంచిమీఁదికి వైచి
baḍiyunna rākṣasapati rommu drokki meḍa nulci talam̐dreṃcimīm̐diki vaici
యంగదుఁడార్చె; నయ్యంగదుఁజూచి యంగద నార్చి రయ్యగచరపతులు.
yaṃgadum̐ḍārce; nayyaṃgadum̐jūci yaṃgada nārci rayyagacarapatulu.
విచ్చి దానవులును వెస నేఁగి లంకఁ జొచ్చియు వారిధిఁజొచ్చియు నాల్గు
vicci dānavulunu vesa nēm̐gi laṃkam̐ jocciyu vāridhim̐jocciyu nālgu
దెసలకుఁబాఱియు దీనతఁబొంద నసమున నుతియించి రంగదుఁగపులు;
desalakum̐bāṟiyu dīnatam̐boṃda nasamuna nutiyiṃci raṃgadum̐gapulu;
నుతియించి సీతామనోనాథుకడకు నతనిఁదోడ్కొనిపోయి యత్తెఱంగెల్ల
nutiyiṃci sītāmanōnāthukaḍaku natanim̐dōḍkonipōyi yatteṟaṃgella
వినుపింప రఘుపతి విని సంతసమున ఘనముగా నుప్పొంగి కౌఁగిటఁజేర్చి
vinupiṃpa raghupati vini saṃtasamuna ghanamugā nuppoṃgi kaum̐giṭam̐jērci
కరుణాకటాక్ష మంగదుమీఁద నునిచి సరసంపు మందహాసంబున నొప్పె.
karuṇākaṭākṣa maṃgadumīm̐da nunici sarasaṃpu maṃdahāsaṃbuna noppe.
హతశేషులగు రాక్షసావళి చెప్ప గతపడ్డ యమ్మహాకాయునిఁదలఁచి
hataśēṣulagu rākṣasāvaḷi ceppa gatapaḍḍa yammahākāyunim̐dalam̐ci
విన్ననై తలవాంచి వెఱఁగంది కుంది కన్నీరు నించి రాక్షసకులాధీశుఁ
vinnanai talavāṃci veṟam̐gaṃdi kuṃdi kannīru niṃci rākṣasakulādhīśum̐
డంతఃపురంబున కరిగి యా రాత్రి చింతించుచును నిద్ర సెందకయుండె.
ḍaṃtaḥpuraṃbuna karigi yā rātri ciṃtiṃcucunu nidra seṃdakayuṃḍe.
మఱునాఁడు పెక్కుసామంతులు గొలువ మెఱుఁగారునరదంబు మీఁదికి వచ్చి
maṟunām̐ḍu pekkusāmaṃtulu goluva meṟum̐gārunaradaṃbu mīm̐diki vacci
యరిగి పెంపారినయలవరి నెక్కి పరపైన తన కోట పరికించి చూచి
yarigi peṃpārinayalavari nekki parapaina tana kōṭa parikiṃci cūci
చూచి పాళెంబులు శోధించి మీఁద నేచిన పయికాపులిడఁబంచి యప్పు
cūci pāḷeṃbulu śōdhiṃci mīm̐da nēcina payikāpuliḍam̐baṃci yappu
డా రావణుండు ప్రహస్తుతో ననియెఁ. “బేరెక్కి యెందు నభేద్య మీ కోట;
ḍā rāvaṇuṃḍu prahastutō naniyem̐. “bērekki yeṃdu nabhēdya mī kōṭa;
యెట్టిశాత్రవులకు నెన్నఁడు డాయు నట్టిది గా; దిప్పు డగచరప్రతతి
yeṭṭiśātravulaku nennam̐ḍu ḍāyu naṭṭidi gā; dippu ḍagacarapratati
వచ్చి భేదించి దుర్వారమై యునికి యచ్చెరువైనది; యదియునుఁగాక
vacci bhēdiṃci durvāramai yuniki yacceruvainadi; yadiyunum̐gāka
శ్రీరాముభుజబలశ్రీ యెల్లచోట నారూఢతరము ప్రహస్త! కావునను
śrīrāmubhujabalaśrī yellacōṭa nārūḍhataramu prahasta! kāvunanu
నీవొండె, నదిగాక యేనొండె, రణము గావింప నా కుంభకర్ణుండు నొండెఁ
nīvoṃḍe, nadigāka yēnoṃḍe, raṇamu gāviṃpa nā kuṃbhakarṇuṃḍu noṃḍem̐
దగువార;మిందు నిద్రారతి దనకు మిగిలి నా తమ్ముఁడు మేల్కొనఁడయ్యె.
daguvāra;miṃdu nidrārati danaku migili nā tammum̐ḍu mēlkonam̐ḍayye.
బోయెదవో; యేను బోదునే.”యనిన నా యసురేంద్రున కతఁడిట్టులనియెఁ.:
bōyedavō; yēnu bōdunē.”yanina nā yasurēṃdruna katam̐ḍiṭṭulaniyem̐.:
“బోయెద నిదె నాదు భుజబలంబెల్ల నా యమరులు మెచ్చ నరులఁద్రుంచెదను.
“bōyeda nide nādu bhujabalaṃbella nā yamarulu mecca narulam̐druṃcedanu.
డాసి భూతప్రేతడాకినీ గణము లాసక్తితో నెత్తు రాని మోదింప
ḍāsi bhūtaprētaḍākinī gaṇamu lāsaktitō nettu rāni mōdiṃpa
నటు సూడు మాజిఁబ్రహస్తుండు కపుల నిటు సేయునే యననేపు సూపెదను.
naṭu sūḍu mājim̐brahastuṃḍu kapula niṭu sēyunē yananēpu sūpedanu.
‘బోరికిఁజను;’మన్న బుద్ధులు సెప్ప నారయఁబాఁడిగా; దైనను వినుము
‘bōrikim̐janu;’manna buddhulu seppa nārayam̐bām̐ḍigā; dainanu vinumu
దనుజేశ!యొకమాట; ‘తగ’దంటి;నింక విను వినకుండు; వివేకించి చూడు;
danujēśa!yokamāṭa; ‘taga’daṃṭi;niṃka vinu vinakuṃḍu; vivēkiṃci cūḍu;
దానికిఁగాదన దనుజేశ మున్ను మానైన బుద్ధులు మంత్రులు సెప్ప
dānikim̐gādana danujēśa munnu mānaina buddhulu maṃtrulu seppa
వినవైతి; విఁకనైన విను; సీత రామ జనపాలునకు నిమ్ము; సమరంబు వలవ.”
vinavaiti; vim̐kanaina vinu; sīta rāma janapālunaku nimmu; samaraṃbu valava.”
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).