నని దైన్యపాటుతో నాడు వాక్యములు విని రావణుఁడు కడువేఁడియూర్పడరఁ
nani dainyapāṭutō nāḍu vākyamulu vini rāvaṇum̐ḍu kaḍuvēm̐ḍiyūrpaḍaram̐
యుద్ధకాండము · మందోదరి హితోపదేశమును రావణుఁడు తిరస్కరించుట · యుద్ధకాండము · మందోదరి హితోపదేశమును రావణుఁడు తిరస్కరించుట
yuddhakāṃḍamu · maṃdōdari hitōpadēśamunu rāvaṇum̐ḍu tiraskariṃcuṭa
Yuddha Kanda, section 60: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
18 passagesTelugu with transliteration
నని దైన్యపాటుతో నాడు వాక్యములు విని రావణుఁడు కడువేఁడియూర్పడరఁ
nani dainyapāṭutō nāḍu vākyamulu vini rāvaṇum̐ḍu kaḍuvēm̐ḍiyūrpaḍaram̐
గలయంగ నెఱ్ఱనికన్నులఁగోప మొలుకుచు నుండ మందోదరిఁజూచి:
galayaṃga neṟṟanikannulam̐gōpa molukucu nuṃḍa maṃdōdarim̐jūci:
“హితమతివై నాకు నిన్నియుఁజెప్పి తతివ! నీ మాటలయం దొక్కటైన
“hitamativai nāku ninniyum̐jeppi tativa! nī māṭalayaṃ dokkaṭaina
మనసునఁబట్టదు. మగఁటిమి కలిమి ఘనుఁడనై మూఁడులోకంబులు గెలిచి
manasunam̐baṭṭadu. magam̐ṭimi kalimi ghanum̐ḍanai mūm̐ḍulōkaṃbulu gelici
దానవయక్షగంధర్వదేవాదు లైనను వెట్టిసేయఁగ నున్న నన్నుఁ
dānavayakṣagaṃdharvadēvādu lainanu veṭṭisēyam̐ga nunna nannum̐
దుదిఁబోయియింకఁగ్రోఁతులమర్వుసొచ్చి బ్రదికెడు నరునకుఁబ్రణమిల్లు మనుచు
dudim̐bōyiyiṃkam̐grōm̐tulamarvusocci bradikeḍu narunakum̐braṇamillu manucu
నిది యెట్టిమాటగా నీ సభ నాడి తిదినీకుఁబాఁడియే? యిక్ష్వాకుకులజు
nidi yeṭṭimāṭagā nī sabha nāḍi tidinīkum̐bām̐ḍiyē? yikṣvākukulaju
డెఱిఁగి యెఱింగి మున్నెగ్గొనరింప మఱికదా తెచ్చితి మనుజేశుదేవి.
ḍeṟim̐gi yeṟiṃgi munneggonariṃpa maṟikadā tecciti manujēśudēvi.
జడమతినై పోయి సంధిగావించి కడఁగి ఖరాదులఁగడతేర్చినట్టి
jaḍamatinai pōyi saṃdhigāviṃci kaḍam̐gi kharādulam̐gaḍatērcinaṭṭi
పగయు నీ మఱఁదలిబన్నంబు నెట్టి పగిది నీగుదును! జొప్పడ; దటుగాన
pagayu nī maṟam̐dalibannaṃbu neṭṭi pagidi nīgudunu! joppaḍa; daṭugāna
భీమబాణముల విభీషణు నినజు రామలక్ష్మణుల మర్కటులను ద్రుంచి
bhīmabāṇamula vibhīṣaṇu ninaju rāmalakṣmaṇula markaṭulanu druṃci
గెలుతు నవశ్యంబు; గెలుపు లేదేని ఁజల మొప్ప దురమున సమయుదుఁ;గాని
gelutu navaśyaṃbu; gelupu lēdēni m̐jala moppa duramuna samayudum̐;gāni
మానవేశ్వరుతోడ మఱి చేయ సంధి; జానకి నీను; నిశ్చయ మిట్టి దతివ!
mānavēśvarutōḍa maṟi cēya saṃdhi; jānaki nīnu; niścaya miṭṭi dativa!
యా యింద్రజిత్తుఁడుదాత్త విక్రముఁడు నీ యగ్రసుతుఁడుండ నీ కేలవగపు?
yā yiṃdrajittum̐ḍudātta vikramum̐ḍu nī yagrasutum̐ḍuṃḍa nī kēlavagapu?
నా కెదురెవ్వరు? నా తనూభవులు భీకరాకారు లభేద్య విక్రములు.”
nā kedurevvaru? nā tanūbhavulu bhīkarākāru labhēdya vikramulu.”
నన విని చింతించి యవనత యగుచుఁ జనియె మందోదరి సభనెడఁబాసి
nana vini ciṃtiṃci yavanata yagucum̐ janiye maṃdōdari sabhaneḍam̐bāsi
నీచమైనట్టిదుర్నీతి చేపట్టి యే చందమునఁ దన్ను నెఱుఁగఁడటంచు
nīcamainaṭṭidurnīti cēpaṭṭi yē caṃdamunam̐ dannu neṟum̐gam̐ḍaṭaṃcu
రమణీయతరమైన రావణలక్ష్మి క్రమమేది తొలఁగెడి కైవడి దోప.
ramaṇīyataramaina rāvaṇalakṣmi kramamēdi tolam̐geḍi kaivaḍi dōpa.
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).