డఱిముఱి హనుమంతుఁడటు కూలుటయును నెఱసి రావణుఁడంత నీలుపైఁగవిసె.
ḍaṟimuṟi hanumaṃtum̐ḍaṭu kūluṭayunu neṟasi rāvaṇum̐ḍaṃta nīlupaim̐gavise.
యుద్ధకాండము · నీలుఁడు రావణునితోఁబోరుట · యుద్ధకాండము · నీలుఁడు రావణునితోఁబోరుట
yuddhakāṃḍamu · nīlum̐ḍu rāvaṇunitōm̐bōruṭa
Yuddha Kanda, section 64: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
29 passagesTelugu with transliteration
డఱిముఱి హనుమంతుఁడటు కూలుటయును నెఱసి రావణుఁడంత నీలుపైఁగవిసె.
ḍaṟimuṟi hanumaṃtum̐ḍaṭu kūluṭayunu neṟasi rāvaṇum̐ḍaṃta nīlupaim̐gavise.
హనుమంతుఁడును మూర్ఛయంతలోఁదెలిసి దనుజుండు నీలుపైఁదఱుముట సూచి
hanumaṃtum̐ḍunu mūrchayaṃtalōm̐delisi danujuṃḍu nīlupaim̐daṟumuṭa sūci
యటుపోవఁదగదని యంతట నిలిచె. నటుదన్నుఁగిట్టి పెల్లార్చుచునున్న
yaṭupōvam̐dagadani yaṃtaṭa nilice. naṭudannum̐giṭṭi pellārcucununna
మనుజాశనునిమీఁద మలయశృంగంబు గొని వైచె నీలుండు గోపించి పేర్చి.
manujāśanunimīm̐da malayaśr̥ṃgaṃbu goni vaice nīluṃḍu gōpiṃci pērci.
నడుమనె తునుమాడె నాకారి దాని నెడపనికడఁకతో నేడమ్ము లేసి.
naḍumane tunumāḍe nākāri dāni neḍapanikaḍam̐katō nēḍammu lēsi.
వెండియు నీలుండు విపులవక్షంబుఁ గొండలుఁదరువులుఁ గొనివైచుటయును
veṃḍiyu nīluṃḍu vipulavakṣaṃbum̐ goṃḍalum̐daruvulum̐ gonivaicuṭayunu
వాని నన్నింటి రావణుఁడు చూర్ణంబు గా నిశితాస్త్రసంఘంబులుఁదునిమి
vāni nanniṃṭi rāvaṇum̐ḍu cūrṇaṃbu gā niśitāstrasaṃghaṃbulum̐dunimi
నీలునిమేనఁబెన్నెత్తురు లొలుక వాలినయమ్ములు వడిఁబెక్కు లేసె.
nīlunimēnam̐bennetturu loluka vālinayammulu vaḍim̐bekku lēse.
నేసిన నొచ్చియు నింత గైకొనక గాసిల్లి నీలుండు గడులాఘవమున
nēsina nocciyu niṃta gaikonaka gāsilli nīluṃḍu gaḍulāghavamuna
ధారుణి దైత్యులు దల్లడం బంద వీరుఁడై దానవవిభు తేరి కుఱికి
dhāruṇi daityulu dallaḍaṃ baṃda vīrum̐ḍai dānavavibhu tēri kuṟiki
పొలుపొంద నప్పు డద్భుతశక్తి మెఱసి నిలిచి యచ్చలమున నిగుడి యుప్పొంగి
polupoṃda nappu ḍadbhutaśakti meṟasi nilici yaccalamuna niguḍi yuppoṃgi
వడిఁబేర్చి యా రథధ్వజమున కెగసి పొడిచేసి చాపాగ్రమునకు లాగొప్ప
vaḍim̐bērci yā rathadhvajamuna kegasi poḍicēsi cāpāgramunaku lāgoppa
నెగసి చలంబున నెక్కెడలించి మగుడి రావణుఘనమకుటముల్ ద్రొక్కి
negasi calaṃbuna nekkeḍaliṃci maguḍi rāvaṇughanamakuṭamul drokki
యురుభుజనిజవిక్రమోన్నతి మెఱసి సురసిద్ధసాధ్యులు సోద్దెంబు నొంద
yurubhujanijavikramōnnati meṟasi surasiddhasādhyulu sōddeṃbu noṃda
నొక మౌళిపై నుండి యొక మౌళి వ్రేసి యొక మౌళిపై నుండి యొక మౌళియూఁచి
noka mauḷipai nuṃḍi yoka mauḷi vrēsi yoka mauḷipai nuṃḍi yoka mauḷiyūm̐ci
యొక మౌళిపై నుండి యొక మౌళి డుల్చి యొక మౌళిపై నుండి యొక మౌళిఁదన్ని
yoka mauḷipai nuṃḍi yoka mauḷi ḍulci yoka mauḷipai nuṃḍi yoka mauḷim̐danni
మకుటంబులన్నియు మట్టిమల్లార్చి యకలంకుఁడై నీలుఁడంతట పోక
makuṭaṃbulanniyu maṭṭimallārci yakalaṃkum̐ḍai nīlum̐ḍaṃtaṭa pōka
వారక తనుఁబట్ట వచ్చిన సూక్ష్మ మై రావణునిఁ జూచి యందంద నగుచు
vāraka tanum̐baṭṭa vaccina sūkṣma mai rāvaṇunim̐ jūci yaṃdaṃda nagucu
గొడగులు సించి గ్రక్కున మీఁదఁ ద్రోచి పొడిగాఁగఁ జామరంబులు ద్రుంచివైచి
goḍagulu siṃci grakkuna mīm̐dam̐ drōci poḍigām̐gam̐ jāmaraṃbulu druṃcivaici
విఱుగంగ నరదంబు వీఁకఁదాటించి కఱకఱితోడ నుత్కంఠ దీపింప
viṟugaṃga naradaṃbu vīm̐kam̐dāṭiṃci kaṟakaṟitōḍa nutkaṃṭha dīpiṃpa
దనుజేశు నురుముష్టిఁదాఁచి హారములు పెనఁచి రాఁదిగిచి యా పృథులవక్షంబుఁ
danujēśu nurumuṣṭim̐dām̐ci hāramulu penam̐ci rām̐digici yā pr̥thulavakṣaṃbum̐
జఱచి యందంద యుత్సాహంబు మెఱసి యుఱక యీ గతి నాడుచుండుట చూచి
jaṟaci yaṃdaṃda yutsāhaṃbu meṟasi yuṟaka yī gati nāḍucuṃḍuṭa cūci
తరుచరసేనలు దైత్యసేనలును బొరిఁబొరి నద్భుతంబుగఁజూచుచుండ
tarucarasēnalu daityasēnalunu borim̐bori nadbhutaṃbugam̐jūcucuṃḍa
వెఱఁగంది రా రామవిభుఁడు లక్ష్మణుఁడు. మఱి రావణుండును మహితాగ్నిశరము
veṟam̐gaṃdi rā rāmavibhum̐ḍu lakṣmaṇum̐ḍu. maṟi rāvaṇuṃḍunu mahitāgniśaramu
నయ్యెడ నారితో నలుక సంధించి యయ్యగ్నిసుతుతోడ ననియె మండుచును:
nayyeḍa nāritō naluka saṃdhiṃci yayyagnisututōḍa naniye maṃḍucunu:
“నీలాఘవము లెస్స; నిన్ను మెచ్చితిని. నీలాఘవమె నాకు నెడపక చూపు;
“nīlāghavamu lessa; ninnu meccitini. nīlāghavame nāku neḍapaka cūpu;
మిదె వచ్చె నా బాణ మినవహ్నిరుచుల; బ్రదికెడు చందంబుఁబరికించికొనుమ.”
mide vacce nā bāṇa minavahnirucula; bradikeḍu caṃdaṃbum̐barikiṃcikonuma.”
యని యేయుటయు నీలుఁడగ్ని బాణమునఁ దనువెల్ల మండుచు ధరణిపైఁబడియె.
yani yēyuṭayu nīlum̐ḍagni bāṇamunam̐ danuvella maṃḍucu dharaṇipaim̐baḍiye.
నగ్నిపుత్త్రుఁడు గాన యా తీవ్రశరము నగ్నిచేఁజావక యవశుఁడై యుండె.
nagniputtrum̐ḍu gāna yā tīvraśaramu nagnicēm̐jāvaka yavaśum̐ḍai yuṃḍe.
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).