Skip to content

యుద్ధకాండము · వానరు లసురవీరులతోఁదలపడుట · యుద్ధకాండము · వానరు లసురవీరులతోఁదలపడుట

Yuddha Kanda 87 · vānaru lasuravīrulatōm̐dalapaḍuṭa

yuddhakāṃḍamu · vānaru lasuravīrulatōm̐dalapaḍuṭa

Yuddha Kanda, section 87: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

62 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 87.

నటు దానవానీక మాకోట వెడలఁ బటు భయంకరవృత్తిఁబ్లవగ వల్లభులు

naṭu dānavānīka mākōṭa veḍalam̐ baṭu bhayaṃkaravr̥ttim̐blavaga vallabhulu

Report an error

భూ నభోంతరము లాస్ఫోటనధ్వనులు పూని యొక్కట నిండ భూరిసత్త్వములఁ

bhū nabhōṃtaramu lāsphōṭanadhvanulu pūni yokkaṭa niṃḍa bhūrisattvamulam̐

Report an error

దలకొని గిరులను దరువులు వైచి చెలఁగించి రప్పుడు సింహనాదములు.

dalakoni girulanu daruvulu vaici celam̐giṃci rappuḍu siṃhanādamulu.

Report an error

చలమున దైత్యులు చటులబాణములు బలువిడిఁగురిసిరి ప్లవగులమీఁద.

calamuna daityulu caṭulabāṇamulu baluviḍim̐gurisiri plavagulamīm̐da.

Report an error

నసురావలికిమున్న యా కపివరులు నసురులఁజంపంగ నడరి పెల్లార్చి.

nasurāvalikimunna yā kapivarulu nasurulam̐jaṃpaṃga naḍari pellārci.

Report an error

కపులకు మున్న రాక్షసు లుగ్రవృత్తిఁ గపులఁజంపుదమని కడఁక వాటించి,

kapulaku munna rākṣasu lugravr̥ttim̐ gapulam̐jaṃpudamani kaḍam̐ka vāṭiṃci,

Report an error

యసమునఁజలము పెంపార నొండొరుల వసుమతిపైఁబడవైతురు కినుక.

yasamunam̐jalamu peṃpāra noṃḍorula vasumatipaim̐baḍavaituru kinuka.

Report an error

నసురులచేతి శస్త్రాస్త్రంబు లొడిసి వెసఁబుచ్చి పెళ్లన విఱుతురు కపులుఁ;

nasurulacēti śastrāstraṃbu loḍisi vesam̐bucci peḷlana viṟuturu kapulum̐;

Report an error

గపికోటిచేతివృక్షంబులు గిరులుఁ గుపితులై విఱుతురు క్రూరదానవులుఁ;

gapikōṭicētivr̥kṣaṃbulu girulum̐ gupitulai viṟuturu krūradānavulum̐;

Report an error

గపులకాళ్లనుబట్టి కడఁగి రాక్షసులు కపులతోడనె మహోగ్రముగ వ్రేయుదురు;

gapulakāḷlanubaṭṭi kaḍam̐gi rākṣasulu kapulatōḍane mahōgramuga vrēyuduru;

Report an error

అసురులకడకాళు లలమి వానరులు నసురులతోడన యడుతురు బెట్టు.

asurulakaḍakāḷu lalami vānarulu nasurulatōḍana yaḍuturu beṭṭu.

Report an error

అటుపోరి జర్జరితాంగులై నేలఁ గుటిలదైత్యులుఁగపికోటులుఁద్రెళ్లి

aṭupōri jarjaritāṃgulai nēlam̐ guṭiladaityulum̐gapikōṭulum̐dreḷli

Report an error

దురములోఁబడియు నెత్తురులు గ్రక్కుచును బొరిఁబొరి మూర్ఛలు పొంది. రంతటను

duramulōm̐baḍiyu netturulu grakkucunu borim̐bori mūrchalu poṃdi. raṃtaṭanu

Report an error

దెలిసి వానరులును దేవశాత్రవులుఁ గలసి కయ్యము సేయఁగా నందుఁగపులు

delisi vānarulunu dēvaśātravulum̐ galasi kayyamu sēyam̐gā naṃdum̐gapulu

Report an error

దానవుతో నెత్తి దానవు వ్రేసి యేనుఁగుతోనెత్తి యేనుఁగు వ్రేసి

dānavutō netti dānavu vrēsi yēnum̐gutōnetti yēnum̐gu vrēsi

Report an error

తురగంబు తోనెత్తి తురగంబు వ్రేసి యరదంబుతో నెత్తి యరదంబు వ్రేసి

turagaṃbu tōnetti turagaṃbu vrēsi yaradaṃbutō netti yaradaṃbu vrēsi

Report an error

యరదంబుఁగొని కరి నదరంట వ్రేసి కరి నెత్తికొని తురంగముఁబడవ్రేసి

yaradaṃbum̐goni kari nadaraṃṭa vrēsi kari nettikoni turaṃgamum̐baḍavrēsi

Report an error

తురగంబు నెత్తి దైత్యుని డొల్లనేసి యురుసత్త్వులై పేర్చి యుగ్రత నార్చి

turagaṃbu netti daityuni ḍollanēsi yurusattvulai pērci yugrata nārci

Report an error

తరుచరవీరులు దర్పంబు మెఱసి పొరిఁబొరి నిబ్భంగిఁబొరివుచ్చుటయును

tarucaravīrulu darpaṃbu meṟasi porim̐bori nibbhaṃgim̐borivuccuṭayunu

Report an error

రయమునఁగోపంబు రంజిల్ల దైత్య చయమును వానరసమితిపైఁగవిసి

rayamunam̐gōpaṃbu raṃjilla daitya cayamunu vānarasamitipaim̐gavisi

Report an error

ప్రదరంబు లేసి చక్రంబులనేసి గదల నొప్పించి ఖడ్గంబులఁద్రుంచి

pradaraṃbu lēsi cakraṃbulanēsi gadala noppiṃci khaḍgaṃbulam̐druṃci

Report an error

భిండిపాలమ్ములఁబీచమ్ము లణఁచి ఖండించి సురియలఁగండలు బరులుఁ

bhiṃḍipālammulam̐bīcammu laṇam̐ci khaṃḍiṃci suriyalam̐gaṃḍalu barulum̐

Report an error

గుంతశూలమ్ములఁగ్రుచ్చి వానరుల నింతలింతలు సేసి యెసగ నార్చుటయు

guṃtaśūlammulam̐grucci vānarula niṃtaliṃtalu sēsi yesaga nārcuṭayu

Report an error

నంతటఁబోవక యగచరులార్చి యంతంత కడరి దైత్యావళిఁగిట్టి

naṃtaṭam̐bōvaka yagacarulārci yaṃtaṃta kaḍari daityāvaḷim̐giṭṭi

Report an error

తరుషండములుఁ బర్వతప్రకరములు నురువడి నెత్తి యత్యుగ్రత వైవఁ

taruṣaṃḍamulum̐ barvataprakaramulu nuruvaḍi netti yatyugrata vaivam̐

Report an error

బడియెడి దైత్యులుఁ బాఱు దైత్యులును నుడుగక యందందయొరలు దైత్యులును

baḍiyeḍi daityulum̐ bāṟu daityulunu nuḍugaka yaṃdaṃdayoralu daityulunu

Report an error

గలయంగ నెత్తురు గ్రక్కు దైత్యులును బొలుపఱి నేలపైఁబొరలు దైత్యులును

galayaṃga netturu grakku daityulunu bolupaṟi nēlapaim̐boralu daityulunu

Report an error

నందంద యట్టలై యాడు దైత్యులును మ్రంది ప్రత్యర్థులమఱచు దైత్యులును

naṃdaṃda yaṭṭalai yāḍu daityulunu mraṃdi pratyarthulamaṟacu daityulunu

Report an error

నెక్కినదైత్యులు నిటయట పడఁగ లెక్కసేయక కరాళించు గుఱ్ఱములుఁ

nekkinadaityulu niṭayaṭa paḍam̐ga lekkasēyaka karāḷiṃcu guṟṟamulum̐

Report an error

బక్కెర లూడంగఁబఱచు గుఱ్ఱములు దిక్కులు సుడివడఁదిరుగు గుఱ్ఱములుఁ

bakkera lūḍaṃgam̐baṟacu guṟṟamulu dikkulu suḍivaḍam̐dirugu guṟṟamulum̐

Report an error

గీలెడలిన క్రియఁగెడయు గుఱ్ఱములుఁ గూలి కాళ్లను దన్నికొనెడు గుఱ్ఱములు

gīleḍalina kriyam̐geḍayu guṟṟamulum̐ gūli kāḷlanu dannikoneḍu guṟṟamulu

Report an error

వికలంబులై నోరు విచ్చు గుఱ్ఱములు నొకరూపు నేర్పడకుండు గుఱ్ఱములుఁ;

vikalaṃbulai nōru viccu guṟṟamulu nokarūpu nērpaḍakuṃḍu guṟṟamulum̐;

Report an error

గరములు దునిసినఁగంపించు కరులు వెరవారఁగొమ్ములు విఱిగిన కరులు

garamulu dunisinam̐gaṃpiṃcu karulu veravāram̐gommulu viṟigina karulu

Report an error

మరలి లంకకు వెస మగిడెడుకరులుఁ దిరమేది దిర్దిరఁదిరిగెడు కరులుఁ

marali laṃkaku vesa magiḍeḍukarulum̐ diramēdi dirdiram̐dirigeḍu karulum̐

Report an error

గొండలకైవడిఁగూలెడు కరులుఁ గండతుండంబులై క్రాలెడు కరులు

goṃḍalakaivaḍim̐gūleḍu karulum̐ gaṃḍatuṃḍaṃbulai krāleḍu karulu

Report an error

మదములు దిగజాఱి మ్రగ్గెడు కరులు సదమదమయి నేలఁజదిసిన కరులు;

madamulu digajāṟi mraggeḍu karulu sadamadamayi nēlam̐jadisina karulu;

Report an error

రథికసారథిరథరథ్యయుక్తముగఁ బ్రథితంబుగాఁభువిఁబడు రథంబులును

rathikasārathiratharathyayuktamugam̐ brathitaṃbugām̐bhuvim̐baḍu rathaṃbulunu

Report an error

దోరగండ్లుగఁబడ్డఁ దునియురథములు నారంగఁ దలక్రిందులగు రథంబులును

dōragaṃḍlugam̐baḍḍam̐ duniyurathamulu nāraṃgam̐ dalakriṃdulagu rathaṃbulunu

Report an error

గీళ్లెల్లఁదప్పి మ్రగ్గిన రథంబులును ద్రాళ్లెల్లఁద్రెవ్వఁబొందని రథంబులును

gīḷlellam̐dappi mraggina rathaṃbulunu drāḷlellam̐drevvam̐boṃdani rathaṃbulunu

Report an error

నాలీల నుగ్గునూచగు రథంబులును నాలంబులోఁదఱచగుటయుఁజూచి

nālīla nuggunūcagu rathaṃbulunu nālaṃbulōm̐daṟacaguṭayum̐jūci

Report an error

సురఖేచరాదికస్తోమంబు‘చోద్య తర’మని యాత్మలఁదద్దయు మెచ్చ;

surakhēcarādikastōmaṃbu‘cōdya tara’mani yātmalam̐daddayu mecca;

Report an error

నప్పుడు కినిసి నరాంతకుండార్పు లొప్ప నిజాశ్వంబు నురువడిఁబఱపి

nappuḍu kinisi narāṃtakuṃḍārpu loppa nijāśvaṃbu nuruvaḍim̐baṟapi

Report an error

యసురుల‘నోడకుం’డనుచు వానరుల నసమునఁగిట్టి బిట్టదలించి తాఁకి

yasurula‘nōḍakuṃ’ḍanucu vānarula nasamunam̐giṭṭi biṭṭadaliṃci tām̐ki

Report an error

నెలకొని యొక్కొక్క నిమిషంబులోన నిలఁగూల్చె నేడునూఱేసివానరుల.

nelakoni yokkokka nimiṣaṃbulōna nilam̐gūlce nēḍunūṟēsivānarula.

Report an error

సురపతి శౌర్యంబు సొంపారుచుండ గిరుల ఖండించి యేఁగిన త్రోవవోలెఁ

surapati śauryaṃbu soṃpārucuṃḍa girula khaṃḍiṃci yēm̐gina trōvavōlem̐

Report an error

దరుచరకోటులు దఱచుగాఁబడుట నిరవొంద వాఁడు వోయినత్రోవ యొప్పె.

darucarakōṭulu daṟacugām̐baḍuṭa niravoṃda vām̐ḍu vōyinatrōva yoppe.

Report an error

నే వానరుండైన నేచి కోపమున భావంబులోఁదన్నుఁబరిమార్పఁదలఁచు

nē vānaruṃḍaina nēci kōpamuna bhāvaṃbulōm̐dannum̐barimārpam̐dalam̐cu

Report an error

నంతరంగముఁజొచ్చి నట్టిచందమున నంతకమున్న తా నతనిఁగీటడఁచు.

naṃtaraṃgamum̐jocci naṭṭicaṃdamuna naṃtakamunna tā natanim̐gīṭaḍam̐cu.

Report an error

నే కపియైనఁదన్నెదురంగఁదలఁచి భీకరుఁడై గిరి పెఱుకంగఁజూచు

nē kapiyainam̐danneduraṃgam̐dalam̐ci bhīkarum̐ḍai giri peṟukaṃgam̐jūcu

Report an error

నంతలోననె చేరి యధికరౌద్రమున నంతకమున్న తా నతనిఁగీటడఁచు.

naṃtalōnane cēri yadhikaraudramuna naṃtakamunna tā natanim̐gīṭaḍam̐cu.

Report an error

నే బలీముఖుఁడైన నే పగ్గలించి తా బెట్టుగాఁగఁ బాదప మెత్తఁదలఁచు

nē balīmukhum̐ḍaina nē paggaliṃci tā beṭṭugām̐gam̐ bādapa mettam̐dalam̐cu

Report an error

నంతంత డగ్గఱి యధికశౌర్యమున నంతకమున్న తా నతనిఁగీటడఁచు.

naṃtaṃta ḍaggaṟi yadhikaśauryamuna naṃtakamunna tā natanim̐gīṭaḍam̐cu.

Report an error

నంతటఁబోవక హయముఁబైఁబఱపి యంతంతఁబెనుగుంపులైన వానరుల

naṃtaṭam̐bōvaka hayamum̐baim̐baṟapi yaṃtaṃtam̐benuguṃpulaina vānarula

Report an error

ప్రేవులుదొబ్బలుఁబెల్లుగా నుఱుము గా వివిధములైనగతులఁద్రొక్కించి

prēvuludobbalum̐bellugā nuṟumu gā vividhamulainagatulam̐drokkiṃci

Report an error

గుండెలు వగులంగఁగోలెమ్ములగల నొండొంటఁదాఁకించి యుర్వరఁగూల్చి

guṃḍelu vagulaṃgam̐gōlemmulagala noṃḍoṃṭam̐dām̐kiṃci yurvaram̐gūlci

Report an error

యలుకతోఁబ్రళయకాలానిలుపగిదిఁ దలకొని యెందునుఁదానయైయుండి

yalukatōm̐braḷayakālānilupagidim̐ dalakoni yeṃdunum̐dānayaiyuṃḍi

Report an error

వానరవరసైన్యవనములు విఱుగ మాన కుగ్రతఁబలుమాఱుఁజరించె.

vānaravarasainyavanamulu viṟuga māna kugratam̐balumāṟum̐jariṃce.

Report an error

వాని శౌర్యంబును వాని శక్తియును వానరులెల్ల నోర్వఁగలేక యపుడు

vāni śauryaṃbunu vāni śaktiyunu vānarulella nōrvam̐galēka yapuḍu

Report an error

వికలులైయుండిరి విస్మితులగుచు; సకలదేవతలును జలియించి రపుడు.

vikalulaiyuṃḍiri vismitulagucu; sakaladēvatalunu jaliyiṃci rapuḍu.

Report an error

పటుభీతిఁబొందినప్లవగసైన్యముల నటు వేఁచుచున్న నరాంతకుఁజూచి

paṭubhītim̐boṃdinaplavagasainyamula naṭu vēm̐cucunna narāṃtakum̐jūci

Report an error

యనయంబుఁగోపించి యంబుద పటల మున నుండుసూర్యుండు మొనసినమాడ్కిఁ

yanayaṃbum̐gōpiṃci yaṃbuda paṭala muna nuṃḍusūryuṃḍu monasinamāḍkim̐

Report an error

గపిరాజతనయుఁడంగదకుమారుండు కపిసేనలో నుండి కడఁగి యేతెంచి:

gapirājatanayum̐ḍaṃgadakumāruṃḍu kapisēnalō nuṃḍi kaḍam̐gi yēteṃci:

Report an error

Illustration: Verse & Place (Project-owned).