Skip to content

యుద్ధకాండము · ఇంద్రజిత్తు తృతీయయుద్ధము · యుద్ధకాండము · ఇంద్రజిత్తు తృతీయయుద్ధము

Yuddha Kanda 102 · iṃdrajittu tr̥tīyayuddhamu

yuddhakāṃḍamu · iṃdrajittu tr̥tīyayuddhamu

Yuddha Kanda, section 102: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

16 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 102.

ననవుడు నింద్రజిత్తా రావణునకు వినయంబుతో మ్రొక్కి వీడ్కొని కదలి

nanavuḍu niṃdrajittā rāvaṇunaku vinayaṃbutō mrokki vīḍkoni kadali

Report an error

వాయువేగముగల వాజులఁబూన్చి యాయితంబయినట్టి యరదంబు నెక్కి

vāyuvēgamugala vājulam̐būnci yāyitaṃbayinaṭṭi yaradaṃbu nekki

Report an error

శరదభ్రసంభృతశైలంబుకరణి గురుభజుండై వెలిగొడగులనీడ

śaradabhrasaṃbhr̥taśailaṃbukaraṇi gurubhajuṃḍai veligoḍagulanīḍa

Report an error

రమణీయకంకణరణితముల్‌ మొరయ రమణు లిమ్ములఁజామరమ్ములువీవ

ramaṇīyakaṃkaṇaraṇitamul moraya ramaṇu limmulam̐jāmarammuluvīva

Report an error

నొలసి మోమున సంగరోత్సాహలీల దళుకొత్త నేతెంచి తల్లికి మ్రొక్కి

nolasi mōmuna saṃgarōtsāhalīla daḷukotta nēteṃci talliki mrokki

Report an error

జనని దీవింపంగఁజని తన పత్నిఁ దనయుల వీడ్కొని తమ్ములచావుఁ

janani dīviṃpaṃgam̐jani tana patnim̐ danayula vīḍkoni tammulacāvum̐

Report an error

దలపోసి కోపాగ్ని దరికొనఁబేర్చి యలఘుదర్పంబున నయ్యింద్రజిత్తు

dalapōsi kōpāgni darikonam̐bērci yalaghudarpaṃbuna nayyiṃdrajittu

Report an error

మానక రోషసమగ్రతతోడ దానవకోటులుదవిలి సేవింప

mānaka rōṣasamagratatōḍa dānavakōṭuludavili sēviṃpa

Report an error

ఘనకామరూపముల్‌ గల మంత్రివరులు తనుఁగొల్వ నుత్తరద్వారంబునందు

ghanakāmarūpamul gala maṃtrivarulu tanum̐golva nuttaradvāraṃbunaṃdu

Report an error

నద్రులగతిఁదేరు లఱువదికోట్లు భద్రగజంబులుపదుమూఁడుకోట్లుఁ

nadrulagatim̐dēru laṟuvadikōṭlu bhadragajaṃbulupadumūm̐ḍukōṭlum̐

Report an error

దురగంబు లరయంగఁదుదనూఱుకోట్లు గురుశక్తి నాల్గేసికొమ్ములకరులు

duragaṃbu larayaṃgam̐dudanūṟukōṭlu guruśakti nālgēsikommulakarulu

Report an error

నారయ నొకకోటి యడరి తో నడవ భేరుండములువోలెఁబెంపు వహించి

nāraya nokakōṭi yaḍari tō naḍava bhēruṃḍamuluvōlem̐beṃpu vahiṃci

Report an error

చిలుకవన్నెలతోడఁ జెలఁగుగుఱ్ఱములు కొలఁదులై నాలుగుకోటులు నడవ

cilukavannelatōḍam̐ jelam̐guguṟṟamulu kolam̐dulai nālugukōṭulu naḍava

Report an error

వలుఁద నిస్సాణాదివాద్యముల్‌ మ్రోయఁ గలనికి వెడలి లంకాపురినుండి

valum̐da nissāṇādivādyamul mrōyam̐ galaniki veḍali laṃkāpurinuṃḍi

Report an error

తనచు ట్టసంఖ్యమై దైత్యులు గొలువ ఘనతర భీషణాకారంబుతోడ

tanacu ṭṭasaṃkhyamai daityulu goluva ghanatara bhīṣaṇākāraṃbutōḍa

Report an error

వానరవీర దుర్వారనాదముల మానైన రణమహీమధ్యంబు నందు

vānaravīra durvāranādamula mānaina raṇamahīmadhyaṃbu naṃdu

Report an error

Illustration: Verse & Place (Project-owned).