Skip to content

యుద్ధకాండము · రావణుఁడు రామునిపై శూలము ప్రయోగించుట · యుద్ధకాండము · రావణుఁడు రామునిపై శూలము ప్రయోగించుట

Yuddha Kanda 145 · rāvaṇum̐ḍu rāmunipai śūlamu prayōgiṃcuṭa

yuddhakāṃḍamu · rāvaṇum̐ḍu rāmunipai śūlamu prayōgiṃcuṭa

Yuddha Kanda, section 145: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

28 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 145.

గలుషించి యప్పుడు కల్పాంతవహ్ని తులితమై మంటలు దొలఁకాడుచుండ

galuṣiṃci yappuḍu kalpāṃtavahni tulitamai maṃṭalu dolam̐kāḍucuṃḍa

Report an error

నా లోకలోకభయంకరాకార శూలంబుఁగొని రాముఁ జూచి రావణుఁడు

nā lōkalōkabhayaṃkarākāra śūlaṃbum̐goni rāmum̐ jūci rāvaṇum̐ḍu

Report an error

వసుమతి గంపింప వారిధుల్‌ గలఁగ దెసల నెల్లందుఁబ్రతిధ్వనుల్‌ సెలఁగ

vasumati gaṃpiṃpa vāridhul galam̐ga desala nellaṃdum̐bratidhvanul selam̐ga

Report an error

బిట్టుల్కి భూతముల్‌ బెదరఁగట్టల్క దట్టించి సింహనాదము సేసి పల్కెఁ:

biṭṭulki bhūtamul bedaram̐gaṭṭalka daṭṭiṃci siṃhanādamu sēsi palkem̐:

Report an error

“బన్నుగా రామ! యీ పటుశూలవహ్ని నిన్ను నీ తమ్ముని నీఱు గావించి

“bannugā rāma! yī paṭuśūlavahni ninnu nī tammuni nīṟu gāviṃci

Report an error

పోర నన్నెదిరించి పోరాడి చన్న వారినారుల బాష్పవారి వారింతుఁ

pōra nannediriṃci pōrāḍi canna vārinārula bāṣpavāri vāriṃtum̐

Report an error

జూడుము నీ.” వంచు శూల మంకించి యోడక రాముపై నుంకించి వైవ

jūḍumu nī.” vaṃcu śūla maṃkiṃci yōḍaka rāmupai nuṃkiṃci vaiva

Report an error

దానిపై రాముఁడుదగ్రుఁడై కినిసి వానలు కల్పాంతవహ్నిపైఁగురియు

dānipai rāmum̐ḍudagrum̐ḍai kinisi vānalu kalpāṃtavahnipaim̐guriyu

Report an error

వురుహూతుపగిది నద్భుతశితాస్త్రములు గురియంగ నది దానఁగుదియక వాని

vuruhūtupagidi nadbhutaśitāstramulu guriyaṃga nadi dānam̐gudiyaka vāni

Report an error

నుఱక నీఱుగఁజేసి యుగ్రవేగమునఁ బఱతెంచుగతిఁజూచి భానువంశజుఁడు

nuṟaka nīṟugam̐jēsi yugravēgamunam̐ baṟateṃcugatim̐jūci bhānuvaṃśajum̐ḍu

Report an error

దేవేంద్రుఁడర్థిఁబుత్తెంచిన శక్తి వావిరిఁగైకొని వైచె; వైచుటయు

dēvēṃdrum̐ḍarthim̐butteṃcina śakti vāvirim̐gaikoni vaice; vaicuṭayu

Report an error

నది నిర్గళద్ఘంటికారావ మగుచు నది విస్ఫురత్పావకారంభ మగుచు

nadi nirgaḷadghaṃṭikārāva magucu nadi visphuratpāvakāraṃbha magucu

Report an error

నది యక్షసురఖేచరానంద మగుచు నది రాక్షసాలోకనాభీల మగుచు

nadi yakṣasurakhēcarānaṃda magucu nadi rākṣasālōkanābhīla magucu

Report an error

వఱలు మనోవేగవాయువేగములఁ బఱతెంచు శూలంబు భస్మంబు సేసె.

vaṟalu manōvēgavāyuvēgamulam̐ baṟateṃcu śūlaṃbu bhasmaṃbu sēse.

Report an error

నప్పుడు రావణుండలుక చిత్తమున ముప్పిరిగొనఁగఁ గార్ముకదశకంబు

nappuḍu rāvaṇuṃḍaluka cittamuna muppirigonam̐gam̐ gārmukadaśakaṃbu

Report an error

ధరియించి పేర్చి యుదగ్రుఁడై యార్చి శరవృష్టి ముంచిన జననాథ సుతుఁడు

dhariyiṃci pērci yudagrum̐ḍai yārci śaravr̥ṣṭi muṃcina jananātha sutum̐ḍu

Report an error

తా నేక కోదండధరుఁడయ్యుఁదునిమె వాని యస్త్రములెల్ల వారనికడిమి.

tā nēka kōdaṃḍadharum̐ḍayyum̐dunime vāni yastramulella vāranikaḍimi.

Report an error

మదము మత్సరమును మానంబుఁజలముఁ గదురఁగన్నుల నిప్పుకలు నివ్వటిల్ల

madamu matsaramunu mānaṃbum̐jalamum̐ gaduram̐gannula nippukalu nivvaṭilla

Report an error

రావణుఁడెంతయు రఘురాముమీఁద వావిరి నమ్ములవానలు గురిసి

rāvaṇum̐ḍeṃtayu raghurāmumīm̐da vāviri nammulavānalu gurisi

Report an error

కుదియనికోపంబు కొలఁదికి మిగులఁ బదియింట మాతలిఁబదియింట హరుల

kudiyanikōpaṃbu kolam̐diki migulam̐ badiyiṃṭa mātalim̐badiyiṃṭa harula

Report an error

వికలసత్త్వులఁజేసి విషమాస్త్రమొకటఁ బ్రకటంబుగాఁద్రుంచెఁబటుకేతనంబు.

vikalasattvulam̐jēsi viṣamāstramokaṭam̐ brakaṭaṃbugām̐druṃcem̐baṭukētanaṃbu.

Report an error

విపులచింతాభరవివశులై తూలి కపులు నా కపులు నొక్కట విన్ననైరి.

vipulaciṃtābharavivaśulai tūli kapulu nā kapulu nokkaṭa vinnanairi.

Report an error

భువనముల్‌ శంకించె; బుధుఁడు వేధించె జవమున రోహిణీశకటంబునందుఁ;

bhuvanamul śaṃkiṃce; budhum̐ḍu vēdhiṃce javamuna rōhiṇīśakaṭaṃbunaṃdum̐;

Report an error

బటుతరతేజంబు భయదంబుగాఁగ నట విశాఖకు వచ్చె నంగారకుండు;

baṭutaratējaṃbu bhayadaṃbugām̐ga naṭa viśākhaku vacce naṃgārakuṃḍu;

Report an error

చటులోగ్రతరభంగి జలధు లుప్పొంగ నటదూర్మిమాలికల్‌ నభమంది పొరలె;

caṭulōgratarabhaṃgi jaladhu luppoṃga naṭadūrmimālikal nabhamaṃdi porale;

Report an error

నెగయు నౌర్వానలనిష్ఠురశిఖలు పొగలచందము గాఁగఁ బొగయంగఁదొడఁగె;

negayu naurvānalaniṣṭhuraśikhalu pogalacaṃdamu gām̐gam̐ bogayaṃgam̐doḍam̐ge;

Report an error

నుగ్రాంశుబింబంబు నొరయుచు వచ్చి యుగ్రదీప్తులతో మహోల్కలు డుల్లె;

nugrāṃśubiṃbaṃbu norayucu vacci yugradīptulatō mahōlkalu ḍulle;

Report an error

నవిరళతరతేజ మటుమాఱుపడఁగ రవియును గడుమందరశ్మియై తోచె.

naviraḷataratēja maṭumāṟupaḍam̐ga raviyunu gaḍumaṃdaraśmiyai tōce.

Report an error

Illustration: Verse & Place (Project-owned).