Skip to content

యుద్ధకాండము · రాముఁడు రావణు కరచరణముల ఖండించుట · యుద్ధకాండము · రాముఁడు రావణు కరచరణముల ఖండించుట

Yuddha Kanda 149 · rāmum̐ḍu rāvaṇu karacaraṇamula khaṃḍiṃcuṭa

yuddhakāṃḍamu · rāmum̐ḍu rāvaṇu karacaraṇamula khaṃḍiṃcuṭa

Yuddha Kanda, section 149: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

68 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 149.

నత్యుగ్రనిగ్రహవ్యగ్రులై కదిసి రత్యంతకాలకాలాకృతి నప్పు.

natyugranigrahavyagrulai kadisi ratyaṃtakālakālākr̥ti nappu.

Report an error

డలవు ధైర్యంబును నలుక దీపింపఁ బ్రళయ కాలమునాఁటి ఫాలాక్షుపగిది

ḍalavu dhairyaṃbunu naluka dīpiṃpam̐ braḷaya kālamunām̐ṭi phālākṣupagidi

Report an error

ఘనశాతకర్తరీక్రకచభల్లంబు నినవంశవల్లభుం డెసగ సంధించి

ghanaśātakartarīkrakacabhallaṃbu ninavaṃśavallabhuṃ ḍesaga saṃdhiṃci

Report an error

‘యరుదరు!’ దనఁద్రుంచె నద్దశాననుని శిరములు పదియును జేతు లిర్వదియుఁ.

‘yarudaru!’ danam̐druṃce naddaśānanuni śiramulu padiyunu jētu lirvadiyum̐.

Report an error

‘ద్రుంచుట బొంకొకో, త్రుంచితి!’ననుచుఁ ద్రుంచిన రాముఁడద్భుతమంది చూడఁ

‘druṃcuṭa boṃkokō, truṃciti!’nanucum̐ druṃcina rāmum̐ḍadbhutamaṃdi cūḍam̐

Report an error

గరవాల ముసల ముద్గర భిండిపాల శరచాప కేయూరచయములఁదనరు

garavāla musala mudgara bhiṃḍipāla śaracāpa kēyūracayamulam̐danaru

Report an error

కరము లిర్వదియును ఘనకిరీటముల శిరములు పదియును జెచ్చెర మొలచె.

karamu lirvadiyunu ghanakirīṭamula śiramulu padiyunu jeccera molace.

Report an error

మొలచినఁగోపించి మొగిఁద్రుంచె మఱియుఁ దలలుఁజేతులుఁబేర్చి దశరథాత్మజుఁడు.

molacinam̐gōpiṃci mogim̐druṃce maṟiyum̐ dalalum̐jētulum̐bērci daśarathātmajum̐ḍu.

Report an error

తల లుద్దవిడిఁద్రుంచుతఱిఁగ్రింద మొలచుఁ దలలకిరీటముల్‌ తద్బాణతతులఁ

tala luddaviḍim̐druṃcutaṟim̐griṃda molacum̐ dalalakirīṭamul tadbāṇatatulam̐

Report an error

దాఁకి మ్రోయుట చెవిఁదాఁకకమున్న తాఁకునత్తలల నుదగ్రహాసములు.

dām̐ki mrōyuṭa cevim̐dām̐kakamunna tām̐kunattalala nudagrahāsamulu.

Report an error

తరమిడి త్రెవ్వినతల లోలి మొలవఁ బరమేష్ఠిచేఁదొల్లి పడయుచో వరము

taramiḍi trevvinatala lōli molavam̐ baramēṣṭhicēm̐dolli paḍayucō varamu

Report an error

గళశరంబులఁదలల్‌ గనుకని మొలవ బలియుఁడై యీతఁడు పడసెనో యనఁగఁ

gaḷaśaraṃbulam̐dalal ganukani molava baliyum̐ḍai yītam̐ḍu paḍasenō yanam̐gam̐

Report an error

దలలోలి మొలతేరఁదడవఁగుత్తుకల నలిఁగాఁడి రాముబాణము లుండె నోలి.

dalalōli molatēram̐daḍavam̐guttukala nalim̐gām̐ḍi rāmubāṇamu luṃḍe nōli.

Report an error

మొగిఁద్రెంచుతలలు, నమ్ములతోన మీఁది కెగయఁద్రోచుచు దివి కెగయునత్తలలు,

mogim̐dreṃcutalalu, nammulatōna mīm̐di kegayam̐drōcucu divi kegayunattalalu,

Report an error

దొంతులకుత్తుకల్‌ దునుము నస్త్రములు నెంతయు రమ్యమై యెసగెఁజూపఱకు

doṃtulakuttukal dunumu nastramulu neṃtayu ramyamai yesagem̐jūpaṟaku

Report an error

ఫలితసౌరభరామబాణోత్పలములఁ గలయ రావణశిరఃకమలసంతతులు

phalitasaurabharāmabāṇōtpalamulam̐ galaya rāvaṇaśiraḥkamalasaṃtatulu

Report an error

రమణమై రక్తధారా సూత్రతతులఁ గ్రమమొప్ప నెత్తులు గట్టివేల్పులకుఁ

ramaṇamai raktadhārā sūtratatulam̐ gramamoppa nettulu gaṭṭivēlpulakum̐

Report an error

బొలుపొంద నాకాశపుష్పలావకుఁడు సొలవక పలుమాఱుఁజూపు చందమున.

bolupoṃda nākāśapuṣpalāvakum̐ḍu solavaka palumāṟum̐jūpu caṃdamuna.

Report an error

దనుజాధిపతి గొంత తడవు చూడ్కులకు నినకులాధీశ్వరుండేయుచో మఱియుఁ

danujādhipati goṃta taḍavu cūḍkulaku ninakulādhīśvaruṃḍēyucō maṟiyum̐

Report an error

ద్రెవ్విరాలెడు నెడత్రెవ్వని తలలు గ్రువ్వనిపేరులై కొమరొప్ప నప్పు

drevvirāleḍu neḍatrevvani talalu gruvvanipērulai komaroppa nappu

Report an error

డనిమిషావలియెల్ల నచ్చెరువంది కనుఁగొన నద్దశకంధరుం డమరె

ḍanimiṣāvaliyella nacceruvaṃdi kanum̐gona naddaśakaṃdharuṃ ḍamare

Report an error

లలి శిరోమాలికాలంకృతుండైన ప్రళయావసర ఘోరభైరవుపగిది.

lali śirōmālikālaṃkr̥tuṃḍaina praḷayāvasara ghōrabhairavupagidi.

Report an error

నా వేళ రఘురాముఁడాగ్రహవ్యగ్ర భావుఁడై రణబలప్రౌఢి దీపింప

nā vēḷa raghurāmum̐ḍāgrahavyagra bhāvum̐ḍai raṇabalaprauḍhi dīpiṃpa

Report an error

లక్షించి దృఢముష్టిలాఘవగతుల దక్షుఁడై రావణుతలలు బాహువులుఁ

lakṣiṃci dr̥ḍhamuṣṭilāghavagatula dakṣum̐ḍai rāvaṇutalalu bāhuvulum̐

Report an error

ద్రెంచుఁగ్రమ్మఱ మొలతెంచు వెండియును ద్రెంచుఁగ్రమ్మఱ మొలతెంచు; నిబ్భంగిఁ

dreṃcum̐grammaṟa molateṃcu veṃḍiyunu dreṃcum̐grammaṟa molateṃcu; nibbhaṃgim̐

Report an error

గరములు శిరములుఁగాకుత్స్థతిలకు శరపరంపరలచేఁ జటులవేగమునఁ

garamulu śiramulum̐gākutsthatilaku śaraparaṃparalacēm̐ jaṭulavēgamunam̐

Report an error

దెగుటలు మొలచుటల్‌ దెలియరాకుండె నగచరావలికి నయ్యనిమిషావలికి.

deguṭalu molacuṭal deliyarākuṃḍe nagacarāvaliki nayyanimiṣāvaliki.

Report an error

నా లోన రఘురామునమ్ములఁద్రెవ్వి రాలుచునున్న యా రావణుతలలు

nā lōna raghurāmunammulam̐drevvi rālucununna yā rāvaṇutalalu

Report an error

ఆవులింపవు; నొవ్వ; వలసముల్‌ గావు; లావు దూలవు; నిజోల్లాసముల్‌ సెడవు;

āvuliṃpavu; novva; valasamul gāvu; lāvu dūlavu; nijōllāsamul seḍavu;

Report an error

గాజువారవు; మిడుకవు; రెప్పవేయ; వోజ దప్పవు; వైర ముడుగవెంతయును.

gājuvāravu; miḍukavu; reppavēya; vōja dappavu; vaira muḍugaveṃtayunu.

Report an error

బగయొండె బొమముడిపాటొండె నిండు నగవొండె నార్పొండె నలువుచూపొండెఁ

bagayoṃḍe bomamuḍipāṭoṃḍe niṃḍu nagavoṃḍe nārpoṃḍe naluvucūpoṃḍem̐

Report an error

బలుకొండె మెచ్చొండెఁబైపఁడి పోరు నలవొండె ధృతియొండె హంకృతియొండెఁ

balukoṃḍe meccoṃḍem̐baipam̐ḍi pōru nalavoṃḍe dhr̥tiyoṃḍe haṃkr̥tiyoṃḍem̐

Report an error

గలుగని తలలేదు ఘనరణభూమి తలమునఁబడియున్నతలలలో నెందు.

galugani talalēdu ghanaraṇabhūmi talamunam̐baḍiyunnatalalalō neṃdu.

Report an error

నే నగ వే గర్వ మే రోషదృష్టి యా నగ వా గర్వ మా రోషదృష్టి

nē naga vē garva mē rōṣadr̥ṣṭi yā naga vā garva mā rōṣadr̥ṣṭi

Report an error

మొలతెంచు తలలందు మొగి నుర్విఁగూలు తలలందు సమములై తలకొనుచుండ

molateṃcu talalaṃdu mogi nurvim̐gūlu talalaṃdu samamulai talakonucuṃḍa

Report an error

దానవాధీశ్వరుతలలు బాహువులు భూనభోంతరము లద్భుతముగా నిండె.

dānavādhīśvarutalalu bāhuvulu bhūnabhōṃtaramu ladbhutamugā niṃḍe.

Report an error

నిండుట గనుఁగొని నిండఁగోపించి వెండియు నా రామవిభుఁడేయుచుండెఁ.

niṃḍuṭa ganum̐goni niṃḍam̐gōpiṃci veṃḍiyu nā rāmavibhum̐ḍēyucuṃḍem̐.

Report an error

ద్రెంచిన కరములుఁ ద్రెవ్వినతలలుఁ ద్రుంచినకరములుఁదునిఁగిన తలలు

dreṃcina karamulum̐ drevvinatalalum̐ druṃcinakaramulum̐dunim̐gina talalu

Report an error

బలువిడి పుట్టిన బాహుదండముల నలమి యప్పుడు వట్టి యద్దశాననుఁడు

baluviḍi puṭṭina bāhudaṃḍamula nalami yappuḍu vaṭṭi yaddaśānanum̐ḍu

Report an error

గణుతింప రాని వేగము లావు మెఱసి రణరోషదృష్టిమై రాముపై వైచె.

gaṇutiṃpa rāni vēgamu lāvu meṟasi raṇarōṣadr̥ṣṭimai rāmupai vaice.

Report an error

నఱిముఱి దశకంఠుఁడందందవైవఁ బఱతెంచి శిరములు బాహుదండములుఁ

naṟimuṟi daśakaṃṭhum̐ḍaṃdaṃdavaivam̐ baṟateṃci śiramulu bāhudaṃḍamulum̐

Report an error

గువలయహితవృత్తి కుశలుఁడై కళల నవిరళాకృతి జగదానందుఁడగుచుఁ

guvalayahitavr̥tti kuśalum̐ḍai kaḷala naviraḷākr̥ti jagadānaṃdum̐ḍagucum̐

Report an error

గమనీయవానరగ్రహమధ్యవీథి రమణమై నొప్పెడు రఘురామచంద్రుఁ

gamanīyavānaragrahamadhyavīthi ramaṇamai noppeḍu raghurāmacaṃdrum̐

Report an error

గని చంద్రుఁడను బుద్ధిఁగమలషండములు ఘనరాహుకోటులఁగడఁకతోఁగూడి

gani caṃdrum̐ḍanu buddhim̐gamalaṣaṃḍamulu ghanarāhukōṭulam̐gaḍam̐katōm̐gūḍi

Report an error

యడరి యన్యోన్యసహాయముల్‌ వడసి వడిఁబేర్చి తాఁకుకైవడిఁదాఁకుచుండె.

yaḍari yanyōnyasahāyamul vaḍasi vaḍim̐bērci tām̐kukaivaḍim̐dām̐kucuṃḍe.

Report an error

శిరములుఁ గరములుఁ జెలఁగి యేతెంచు వరుసలుచూడంగ వర్ణింప నొప్పె

śiramulum̐ garamulum̐ jelam̐gi yēteṃcu varusalucūḍaṃga varṇiṃpa noppe

Report an error

శ్రీరామవిజయలక్ష్మీవివాహమున కారణదేవత లర్థి శోభిల్లఁ

śrīrāmavijayalakṣmīvivāhamuna kāraṇadēvata larthi śōbhillam̐

Report an error

బల్లవరత్నదర్పణతోరణములు తెల్లమై కట్టిన తెఱఁగు దీపింపఁ.

ballavaratnadarpaṇatōraṇamulu tellamai kaṭṭina teṟam̐gu dīpiṃpam̐.

Report an error

దరిగెడు తలలు నుద్దామబాహువులుఁ గురిసెడు శరములు ఘూక కాకాది

darigeḍu talalu nuddāmabāhuvulum̐ guriseḍu śaramulu ghūka kākādi

Report an error

ఖగములు జగము లాకంపింపఁబేర్చి గగనమండలమెల్లఁ గలఁగొన నిండె

khagamulu jagamu lākaṃpiṃpam̐bērci gaganamaṃḍalamellam̐ galam̐gona niṃḍe

Report an error

గురుతరంబై జముకొల్వుకూటమునఁ గరముగ్రమగు మేలుకట్లనఁబరగి.

gurutaraṃbai jamukolvukūṭamunam̐ garamugramagu mēlukaṭlanam̐baragi.

Report an error

యిది దివ; మిది రాత్రి; యిది సంధ్యయనుట త్రిదశులకైనను దెలియరాకుండెఁ.

yidi diva; midi rātri; yidi saṃdhyayanuṭa tridaśulakainanu deliyarākuṃḍem̐.

Report an error

బ్రథితబాణాసనబాణదీప్తులను బ్రథనంబులోఁబట్టపగలయి తోచె.

brathitabāṇāsanabāṇadīptulanu brathanaṃbulōm̐baṭṭapagalayi tōce.

Report an error

నప్పుడు రఘురాముఁడా దైత్యుగెలుచు చొప్పింతయైనను జొప్పడకునికిఁ

nappuḍu raghurāmum̐ḍā daityugelucu coppiṃtayainanu joppaḍakunikim̐

Report an error

గనుఁగొని శరసంధిగతులు సాలించి తనలోనఁబలుమాఱుఁదలపోయఁదొడఁగెఁ:

ganum̐goni śarasaṃdhigatulu sāliṃci tanalōnam̐balumāṟum̐dalapōyam̐doḍam̐gem̐:

Report an error

“దెరలక శిరములు ద్రెంచి వేసరితి; దొరకొని కరములు ద్రుంచి వేసరితి;

“deralaka śiramulu dreṃci vēsariti; dorakoni karamulu druṃci vēsariti;

Report an error

నెసగుమర్మంబుల నేసి వేసరితి; విసువక పలుమాఱు వ్రేసి వేసరితి;

nesagumarmaṃbula nēsi vēsariti; visuvaka palumāṟu vrēsi vēsariti;

Report an error

నెబ్భంగిఁ దెగటారఁడీ దుష్టచిత్తుఁ; డెబ్భంగిఁదెగటార్తు నిద్దురాత్మకుని?”

nebbhaṃgim̐ degaṭāram̐ḍī duṣṭacittum̐; ḍebbhaṃgim̐degaṭārtu niddurātmakuni?”

Report an error

నని యని తలపోసి యలయుట సూచి జననాథుతో విభీషణుఁడిట్టులనియె:

nani yani talapōsi yalayuṭa sūci jananāthutō vibhīṣaṇum̐ḍiṭṭulaniye:

Report an error

“వనజాతజాతునివరమునఁజేసి యినకులాధీశ్వర! యీతని నాభి

“vanajātajātunivaramunam̐jēsi yinakulādhīśvara! yītani nābhi

Report an error

నమృత మున్నది కుండలాకృతి గలిగి యమృతత్వమూలమై యది చంపనీదు.

namr̥ta munnadi kuṃḍalākr̥ti galigi yamr̥tatvamūlamai yadi caṃpanīdu.

Report an error

దానవుతలలు నుద్దండబాహువులు మానక నీ వెన్నిమాఱు లేసినను

dānavutalalu nuddaṃḍabāhuvulu mānaka nī vennimāṟu lēsinanu

Report an error

మొలతెంచుచుండు నున్మూలముల్‌ గావు. తలఁకఁడు దీన నద్దనుజవల్లభుఁడు.

molateṃcucuṃḍu nunmūlamul gāvu. talam̐kam̐ḍu dīna naddanujavallabhum̐ḍu.

Report an error

తఱిమి యిమ్మెయి నీవు తలలు బాహువులు నఱుకుచున్నాఁడవు నరనాథ! కడఁగి.

taṟimi yimmeyi nīvu talalu bāhuvulu naṟukucunnām̐ḍavu naranātha! kaḍam̐gi.

Report an error

తుదయేది దీనికి?దొరకొని నీవు చదురొప్ప నాగ్నేయశర మేయుమింక.

tudayēdi dīniki?dorakoni nīvu caduroppa nāgnēyaśara mēyumiṃka.

Report an error

నా నాభివివరమూలామృతంబిగురు. దానవపతి దాను దాన లోఁదారు.

nā nābhivivaramūlāmr̥taṃbiguru. dānavapati dānu dāna lōm̐dāru.

Report an error

నిగిడెడు భవదీయనిష్ఠురాస్త్రములఁ దెగి మఱి చేతులుఁద్రిదశారితలలు

nigiḍeḍu bhavadīyaniṣṭhurāstramulam̐ degi maṟi cētulum̐dridaśāritalalu

Report an error

దురములోపల నూటతొమ్మిదిమాఱు లరుదుగా మొలతెంచు నంతట పొలియు.”

duramulōpala nūṭatommidimāṟu larudugā molateṃcu naṃtaṭa poliyu.”

Report an error

Illustration: Verse & Place (Project-owned).