చంద్రశీతలు రామజననాథచంద్రు నింద్రాదిదేవత లెల్ల వీక్షించి:
caṃdraśītalu rāmajananāthacaṃdru niṃdrādidēvata lella vīkṣiṃci:
యుద్ధకాండము · దివిజాభినందనము · యుద్ధకాండము · దివిజాభినందనము
yuddhakāṃḍamu · divijābhinaṃdanamu
Yuddha Kanda, section 162: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
32 passagesTelugu with transliteration
చంద్రశీతలు రామజననాథచంద్రు నింద్రాదిదేవత లెల్ల వీక్షించి:
caṃdraśītalu rāmajananāthacaṃdru niṃdrādidēvata lella vīkṣiṃci:
“మనుజుండవై నీవు మాకుఁగా వచ్చి జనియించి రాక్షసక్షయము గావించి
“manujuṃḍavai nīvu mākum̐gā vacci janiyiṃci rākṣasakṣayamu gāviṃci
యీ భంగి దుఃఖంబులిన్నియు నోర్చి భూభారమెంతయుఁబుచ్చి పోవైచి
yī bhaṃgi duḥkhaṃbulinniyu nōrci bhūbhārameṃtayum̐bucci pōvaici
మమ్మిట రక్షించి మా జీవనములు నెమ్మితో మాకిచ్చి నిలుకడ లొసగి
mammiṭa rakṣiṃci mā jīvanamulu nemmitō mākicci nilukaḍa losagi
పుచ్చుచున్నాఁడవు; పుణ్యాత్మ!వరము లిచ్చెద; మడుగు మభీష్టంబు లెలమి.”
puccucunnām̐ḍavu; puṇyātma!varamu licceda; maḍugu mabhīṣṭaṃbu lelami.”
ననవుడు రాముఁడా యమరులఁజూచి తనలోనఁజిఱునవ్వు దళుకొత్తఁబలికె:
nanavuḍu rāmum̐ḍā yamarulam̐jūci tanalōnam̐jiṟunavvu daḷukottam̐balike:
“నింపొంద మీ కృపనెల్ల కార్యములు సంపూర్ణములు మాకు జగములయందుఁ;
“niṃpoṃda mī kr̥panella kāryamulu saṃpūrṇamulu māku jagamulayaṃdum̐;
దమతమభూములఁ దమమందిరములఁ దమబంధుజనములఁదమతనూభవులఁ
damatamabhūmulam̐ damamaṃdiramulam̐ damabaṃdhujanamulam̐damatanūbhavulam̐
దమకళత్రాదులఁదగ వొప్ప విడిచి సమరంబులోపల సకలవానరులుఁ
damakaḷatrādulam̐daga voppa viḍici samaraṃbulōpala sakalavānarulum̐
దెగి తమ్ముడాఁపక తివిరి నా కొఱకుఁ బగఱతోఁబోరాడి ప్రాణముల్ విడిచి
degi tammuḍām̐paka tiviri nā koṟakum̐ bagaṟatōm̐bōrāḍi prāṇamul viḍici
యున్నారు; కపివీరు లున్న తాత్మకులు; నన్ను మన్నించుట నాకిండు వీరి.”
yunnāru; kapivīru lunna tātmakulu; nannu manniṃcuṭa nākiṃḍu vīri.”
ననవుడు విని దివ్యు“లౌఁగాక!”యనుచు: “వనచరప్రాణముల్ వచ్చుఁగా!”కనిరి.
nanavuḍu vini divyu“laum̐gāka!”yanucu: “vanacaraprāṇamul vaccum̐gā!”kaniri.
యని మహాదేవుండు నబ్జసంభవుఁడు ననఘు లయ్యింద్రాదులైన దిక్పతులు
yani mahādēvuṃḍu nabjasaṃbhavum̐ḍu nanaghu layyiṃdrādulaina dikpatulu
మునులును సురలు నిమ్ముల నుతించుచును జన దశరథుఁడును జనియె నద్దివికి.
munulunu suralu nimmula nutiṃcucunu jana daśarathum̐ḍunu janiye naddiviki.
ననిలోనఁదెగిపడ్డ యగచరులెల్ల ఘననిద్రమేల్కను కైవడి దోప
nanilōnam̐degipaḍḍa yagacarulella ghananidramēlkanu kaivaḍi dōpa
నమరులవరశక్తి నద్భుతంబెసగ సమరోర్వి నప్పుడు సప్రాణులగుచుఁ
namarulavaraśakti nadbhutaṃbesaga samarōrvi nappuḍu saprāṇulagucum̐
జనుదెంచి యా రామచంద్రుని వేడ్కఁ గనుఁగొని హర్షించి కలయ మ్రొక్కుటయుఁ
janudeṃci yā rāmacaṃdruni vēḍkam̐ ganum̐goni harṣiṃci kalaya mrokkuṭayum̐
దనరార నందఱ దయతోడఁజూచి జనలోకనాథుఁడు సంతోష మందె.
danarāra naṃdaṟa dayatōḍam̐jūci janalōkanāthum̐ḍu saṃtōṣa maṃde.
నంత విభీషణుం డా రాముతోడ నెంతయు భక్తితో నేర్పడఁబలికె:
naṃta vibhīṣaṇuṃ ḍā rāmutōḍa neṃtayu bhaktitō nērpaḍam̐balike:
“దేవ! రాఘవధరాధిప! నీవు నింక వేవేగ లంకకు విచ్చేసి యచట
“dēva! rāghavadharādhipa! nīvu niṃka vēvēga laṃkaku viccēsi yacaṭa
నవిరళమతితోడ నభిషేక మిప్పు డవధరింపఁగ వేళ.”యనిన రాఘవుఁడు
naviraḷamatitōḍa nabhiṣēka mippu ḍavadhariṃpam̐ga vēḷa.”yanina rāghavum̐ḍu
వరజటాఘనభారవల్కలయుతుఁడు భరతుఁడక్కడఁదపోభరమున నుండ
varajaṭāghanabhāravalkalayutum̐ḍu bharatum̐ḍakkaḍam̐dapōbharamuna nuṃḍa
నతనిఁజూడక మాకు ననుచితంబిచట చతురభోగక్రమసముచిత క్రియలు.”
natanim̐jūḍaka māku nanucitaṃbicaṭa caturabhōgakramasamucita kriyalu.”
అనుటయు నుచితజ్ఞుఁడగు విభీషణుఁడు ఘనభక్తియుక్తిమైఁ గడఁక దీపింపఁ
anuṭayu nucitajñum̐ḍagu vibhīṣaṇum̐ḍu ghanabhaktiyuktimaim̐ gaḍam̐ka dīpiṃpam̐
గనకపాత్రంబుల గంధాక్షతములు ఘనరత్నభూషణకనకాంబరములుఁ
ganakapātraṃbula gaṃdhākṣatamulu ghanaratnabhūṣaṇakanakāṃbaramulum̐
బుణ్యనాదములతోఁబుణ్యులతోడఁ బుణ్యచిహ్నములతోఁబుణ్యభామినులఁ
buṇyanādamulatōm̐buṇyulatōḍam̐ buṇyacihnamulatōm̐buṇyabhāminulam̐
బనిచి తెప్పించి నిర్భరభాగ్యధనుఁడు వినయాభిరతి వినువీథి నందంద
banici teppiṃci nirbharabhāgyadhanum̐ḍu vinayābhirati vinuvīthi naṃdaṃda
సురదుందుభులు మ్రోయ సురలు నుతింప సరస నచ్చరలు సేసలు నిండఁజల్ల
suraduṃdubhulu mrōya suralu nutiṃpa sarasa naccaralu sēsalu niṃḍam̐jalla
రామలక్ష్మణులకు రాజీవనేత్ర భూమినందనకు నప్పుడు గట్ట నిచ్చె.
rāmalakṣmaṇulaku rājīvanētra bhūminaṃdanaku nappuḍu gaṭṭa nicce.
నంత రాముఁడు నిశ్చలానందుఁడగుచు నెంతయుఁబ్రియమంది యింపొందఁబలికెఁ.
naṃta rāmum̐ḍu niścalānaṃdum̐ḍagucu neṃtayum̐briyamaṃdi yiṃpoṃdam̐balikem̐.
“గడుఁబెద్ద కార్యముల్ గలవు మా;కింకఁ దడయుటగా;దయోధ్యకుఁబోవవలయు.”
“gaḍum̐bedda kāryamul galavu mā;kiṃkam̐ daḍayuṭagā;dayōdhyakum̐bōvavalayu.”
ననుటయురాముని నా విభీషణుఁడు గనుఁగొని భక్తితోఁగరములు మొగిచి
nanuṭayurāmuni nā vibhīṣaṇum̐ḍu ganum̐goni bhaktitōm̐garamulu mogici
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).