యనుపమంబగు లగ్న మాసన్నమైన మనుజేంద్రుఁబిలువ సుమంత్రునిఁబనుపఁ
yanupamaṃbagu lagna māsannamaina manujēṃdrum̐biluva sumaṃtrunim̐banupam̐
అయోధ్యాకాండము · సుమంత్రుఁడు కైకనగరి కేఁగుట · అయోధ్యాకాండము · సుమంత్రుఁడు కైకనగరి కేఁగుట
ayōdhyākāṃḍamu · sumaṃtrum̐ḍu kaikanagari kēm̐guṭa
Ayodhya Kanda, section 4: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
10 passagesTelugu with transliteration
యనుపమంబగు లగ్న మాసన్నమైన మనుజేంద్రుఁబిలువ సుమంత్రునిఁబనుపఁ
yanupamaṃbagu lagna māsannamaina manujēṃdrum̐biluva sumaṃtrunim̐banupam̐
గైకేయినగరికిఁగడఁకతోఁ బోయి వాకిట నిలుచుండి వలనొప్పఁబలికె:
gaikēyinagarikim̐gaḍam̐katōm̐ bōyi vākiṭa nilucuṃḍi valanoppam̐balike:
“దేవ! సూర్యుఁడు వొడతెంచుచున్నాఁడు; వేవేగ మీరట విచ్చేయవలయు;
“dēva! sūryum̐ḍu voḍateṃcucunnām̐ḍu; vēvēga mīraṭa viccēyavalayu;
శ్రీరాముపట్టాభిషేకంబు సేయ నారూఢమగు లగ్న మాసన్నమయ్యె;
śrīrāmupaṭṭābhiṣēkaṃbu sēya nārūḍhamagu lagna māsannamayye;
మనుజేశ! యభిషేకమంటపంబునకు మునులు రాజులు మహాత్ములు వచ్చినారు
manujēśa! yabhiṣēkamaṃṭapaṃbunaku munulu rājulu mahātmulu vaccināru
పౌరులు బంధులు భటు లెల్లవారు మీ రాకఁగోరి యిమ్మెయి నున్నవార.”
paurulu baṃdhulu bhaṭu lellavāru mī rākam̐gōri yimmeyi nunnavāra.”
లని విని దశరథుఁ డా వార్తలెల్లఁ దనకుఁగేవల ము సంతాపంబు సేయ
lani vini daśarathum̐ ḍā vārtalellam̐ danakum̐gēvala mu saṃtāpaṃbu sēya
వినియు నిద్రించిన విధమున నుండె వనట“నీవును నొంపవచ్చితే!”యనుచు.
viniyu nidriṃcina vidhamuna nuṃḍe vanaṭa“nīvunu noṃpavaccitē!”yanucu.
నా సమయంబున ననియెఁగైకేయి: “యోసుమంత్రుఁడ! వేగ యుర్వీశుకడకు
nā samayaṃbuna naniyem̐gaikēyi: “yōsumaṃtrum̐ḍa! vēga yurvīśukaḍaku
రామునిఁదోడ్తెమ్ము రాజుపం.”పనుడు నా మాట విని యతఁడప్పుడే పోయి
rāmunim̐dōḍtemmu rājupaṃ.”panuḍu nā māṭa vini yatam̐ḍappuḍē pōyi
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).