Skip to content

అయోధ్యాకాండము · రాముఁడు సీత కెల్ల వృత్తాంతము నెఱిఁగించుట · అయోధ్యాకాండము · రాముఁడు సీత కెల్ల వృత్తాంతము నెఱిఁగించుట

Ayodhya Kanda 12 · rāmum̐ḍu sīta kella vr̥ttāṃtamu neṟim̐giṃcuṭa

ayōdhyākāṃḍamu · rāmum̐ḍu sīta kella vr̥ttāṃtamu neṟim̐giṃcuṭa

Ayodhya Kanda, section 12: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

20 passagesTelugu with transliteration

An original emblem for Ayodhya Kanda, section 12.

యనురాగ మొందుచు నంత రాఘవుఁడు దన నగరికి వచ్చి తగవొప్ప మఱియు

yanurāga moṃducu naṃta rāghavum̐ḍu dana nagariki vacci tagavoppa maṟiyu

Report an error

నంతిపురంబున కరుగుచో సీత యింతులుఁదానును నెదురేఁగుదెంచి

naṃtipuraṃbuna karugucō sīta yiṃtulum̐dānunu nedurēm̐gudeṃci

Report an error

తనుఁజూచి మది విన్నఁదనము గైకొన్న ఘనుని రాఘవుఁజూచి కడుఁజిన్నవోయి:

tanum̐jūci madi vinnam̐danamu gaikonna ghanuni rāghavum̐jūci kaḍum̐jinnavōyi:

Report an error

“యిదియేమి నా ప్రాణహృదయేశ! నీదు వదనాంబుజము గడువాడువాఱినది?

“yidiyēmi nā prāṇahr̥dayēśa! nīdu vadanāṃbujamu gaḍuvāḍuvāṟinadi?

Report an error

గట్టిగాఁబుష్యయోగము దప్పకుండఁ బట్టంబుఁగట్టెనే పార్థివేశ్వరుఁడు?

gaṭṭigām̐buṣyayōgamu dappakuṃḍam̐ baṭṭaṃbum̐gaṭṭenē pārthivēśvarum̐ḍu?

Report an error

సోమమండలముతో జోడగునట్టి నీ మోముఁదమ్మికి నీడ రాదేల?

sōmamaṃḍalamutō jōḍagunaṭṭi nī mōmum̐dammiki nīḍa rādēla?

Report an error

చామరద్వయము పార్శ్వంబుల నెవ్వి? యేమొకోమును పట్టపేనుంగు రాదు?

cāmaradvayamu pārśvaṃbula nevvi? yēmokōmunu paṭṭapēnuṃgu rādu?

Report an error

శ్రీరామ నీ మౌళి సేసఁబ్రా లెవ్వి? పౌరులు నినుఁగొల్చి బలసిరా రేల?

śrīrāma nī mauḷi sēsam̐brā levvi? paurulu ninum̐golci balasirā rēla?

Report an error

దుందుభిపటహాది తూర్యఘోషములు వందిమాగధుల కైవారంబు లెవ్వి?

duṃdubhipaṭahādi tūryaghōṣamulu vaṃdimāgadhula kaivāraṃbu levvi?

Report an error

సౌమిత్రి మోమునఁ జాలదుల్లాస మేమిచందమొ! నాకు నెఱిఁగింపు మధిప!”

saumitri mōmunam̐ jāladullāsa mēmicaṃdamo! nāku neṟim̐giṃpu madhipa!”

Report an error

యనిపల్కుసీతముగ్ధాలాపములకు మనమునఁగుంది, యమ్మానినిఁజూచి:

yanipalkusītamugdhālāpamulaku manamunam̐guṃdi, yammāninim̐jūci:

Report an error

“మునులకు నృపచిహ్నములగొడవేల? విను మది యెట్లన్న వివరింతు నీకుఁ :

“munulaku nr̥pacihnamulagoḍavēla? vinu madi yeṭlanna vivariṃtu nīkum̐ :

Report an error

గైక మా తండ్రిచేఁ గరమొప్పఁదొల్లి గైకొన్నవరములు గాంక్షించి నేఁడు

gaika mā taṃḍricēm̐ garamoppam̐dolli gaikonnavaramulu gāṃkṣiṃci nēm̐ḍu

Report an error

కొడుకు పట్టముఁగట్టుకొని రాజ్యమేల, నడవుల నన్నుండ నడిగెఁ గావునను

koḍuku paṭṭamum̐gaṭṭukoni rājyamēla, naḍavula nannuṃḍa naḍigem̐ gāvunanu

Report an error

బనివడి వనములఁబదునాలుగేండ్లు జనకుశాసనమునఁజరియింపవలసెఁ.

banivaḍi vanamulam̐badunālugēṃḍlu janakuśāsanamunam̐jariyiṃpavalasem̐.

Report an error

దల్లిదండ్రులమాట దాటక చేయు బల్లిదులకును సంపదలుఁ, గీర్తియును,

dallidaṃḍrulamāṭa dāṭaka cēyu ballidulakunu saṃpadalum̐, gīrtiyunu,

Report an error

నాక లోకాది నానావిధ పుణ్య లోకంబు లరచేతిలో నుండుఁగాన

nāka lōkādi nānāvidha puṇya lōkaṃbu laracētilō nuṃḍum̐gāna

Report an error

యే నరణ్యములకు నేఁగెద.” ననిన జానకి రఘురామచంద్రునిఁజూచి

yē naraṇyamulaku nēm̐geda.” nanina jānaki raghurāmacaṃdrunim̐jūci

Report an error

కదిరిన భీతిమై గాలికిఁ గదలు కదళిచందంబున గడగడ వడఁకి

kadirina bhītimai gālikim̐ gadalu kadaḷicaṃdaṃbuna gaḍagaḍa vaḍam̐ki

Report an error

బెదరి డగ్గుత్తికవెట్టి పెన్వగలఁ జెదరి యంతంతకుఁజెలు వేది పలికె:

bedari ḍagguttikaveṭṭi penvagalam̐ jedari yaṃtaṃtakum̐jelu vēdi palike:

Report an error

Illustration: Verse & Place (Project-owned).