నప్పుడరుంధతి:“యకట! యిక్ష్వాకు లిప్పాటువడుచుండ నిటు సూడవలసె!’
nappuḍaruṃdhati:“yakaṭa! yikṣvāku lippāṭuvaḍucuṃḍa niṭu sūḍavalase!’
అయోధ్యాకాండము · రామాదుల యరణ్యప్రయాణము · అయోధ్యాకాండము · రామాదుల యరణ్యప్రయాణము
ayōdhyākāṃḍamu · rāmādula yaraṇyaprayāṇamu
Ayodhya Kanda, section 22: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
91 passagesTelugu with transliteration
నప్పుడరుంధతి:“యకట! యిక్ష్వాకు లిప్పాటువడుచుండ నిటు సూడవలసె!’
nappuḍaruṃdhati:“yakaṭa! yikṣvāku lippāṭuvaḍucuṃḍa niṭu sūḍavalase!’
నని వసిష్ఠునిఁ బల్క నమ్మహామౌని తన బుద్ధి నెంతయుఁదలపోసి చూచి
nani vasiṣṭhunim̐ balka nammahāmauni tana buddhi neṃtayum̐dalapōsi cūci
“యే రూపమునఁబోవ దిది దైవయోగ మూరకుండుము;సూచుచుండుద.”మనియె
“yē rūpamunam̐bōva didi daivayōga mūrakuṃḍumu;sūcucuṃḍuda.”maniye
నప్పుడు రఘురాముఁడడవికై పూని తప్పక వెడలె.నా దశరథాధిపుఁడు
nappuḍu raghurāmum̐ḍaḍavikai pūni tappaka veḍale.nā daśarathādhipum̐ḍu
మదిలోన వగచి సుమంత్రునిఁజూచి: “యిదె రాముఁడడవుల కేఁగుచున్నాఁడు;
madilōna vagaci sumaṃtrunim̐jūci: “yide rāmum̐ḍaḍavula kēm̐gucunnām̐ḍu;
కొనిపొమ్మురథ.”మన్నఁగువలయాధీశు పనుపునఁగొనిపోయి భక్తితోమ్రొక్కి:
konipommuratha.”mannam̐guvalayādhīśu panupunam̐gonipōyi bhaktitōmrokki:
“రథమిదె పుత్తెంచె రాజునీ కడకు; రథమెక్కి విచ్చేయు రఘురామచంద్ర!”
“rathamide putteṃce rājunī kaḍaku; rathamekki viccēyu raghurāmacaṃdra!”
యనవుడు దశరథునాజ్ఞకు వెఱచి మును సీత నెక్కించి మొగి నాయుధములుఁ
yanavuḍu daśarathunājñaku veṟaci munu sīta nekkiṃci mogi nāyudhamulum̐
దనరుజోడునుబెట్టి తాను లక్ష్మణుఁడు ఘనమైనరథమెక్కి కదలె రాఘవుఁడు.
danarujōḍunubeṭṭi tānu lakṣmaṇum̐ḍu ghanamainarathamekki kadale rāghavum̐ḍu.
అంతఁబౌరులు వృద్ధులాప్తులు మంత్రు లింతులు బాలురు హితులు నాశ్రితులు
aṃtam̐baurulu vr̥ddhulāptulu maṃtru liṃtulu bāluru hitulu nāśritulu
వంత బ్రాహ్మణరాజవైశ్యశూద్రాదు లంతంత నలుగడ నడలుచు వెడలి
vaṃta brāhmaṇarājavaiśyaśūdrādu laṃtaṃta nalugaḍa naḍalucu veḍali
ముందట నిరుపార్శ్వములఁబిఱుందటను సందడింపుచు మది జడిగొన్న వగలఁ
muṃdaṭa nirupārśvamulam̐biṟuṃdaṭanu saṃdaḍiṃpucu madi jaḍigonna vagalam̐
“గడఁగి యిక్ష్వాకుల గౌరవంబెల్ల నడఁచెనే మంథర”యని తిట్టువారుఁ;
“gaḍam̐gi yikṣvākula gauravaṃbella naḍam̐cenē maṃthara”yani tiṭṭuvārum̐;
“దగవేది రఘురాముఁదపసిగాఁజేయ నగునమ్మకైకేయి!”కని దూఱువారుఁ,
“dagavēdi raghurāmum̐dapasigām̐jēya nagunammakaikēyi!”kani dūṟuvārum̐,
“దాలిమి దిగనాడి దశరథాధీశుఁ డాలికి వెఱచెనే!”యని రోయువారుఁ,
“dālimi diganāḍi daśarathādhīśum̐ ḍāliki veṟacenē!”yani rōyuvārum̐,
“జనవెల్లఁజెడి రామసౌమిత్రులింత యనదలై పోదురే!” యని వేఁగువారుఁ;
“janavellam̐jeḍi rāmasaumitruliṃta yanadalai pōdurē!” yani vēm̐guvārum̐;
“బనుగొన్న సామ్రాజ్యభారంబు మాని పొనుపడ నిట్లేల పోదు!”రన్వారు;
“banugonna sāmrājyabhāraṃbu māni ponupaḍa niṭlēla pōdu!”ranvāru;
“నీ పదునాలుగేం డ్లెట్లు వీ రడవి నాపద వేగింతు.”రని పొక్కువారు;
“nī padunālugēṃ ḍleṭlu vī raḍavi nāpada vēgiṃtu.”rani pokkuvāru;
“నే నోము నోచెనో యీ మహీతనయ తా.”నంచు మదిలోనఁదలపోయువారు;
“nē nōmu nōcenō yī mahītanaya tā.”naṃcu madilōnam̐dalapōyuvāru;
“నతి దుఃఖమున రాముఁడడవికి నేఁగ హితమతి భరతుఁడే యేలు.”నన్‌వారు;
“nati duḥkhamuna rāmum̐ḍaḍaviki nēm̐ga hitamati bharatum̐ḍē yēlu.”nanvāru;
“నతిమృదుగాత్రి యీయబల భూపుత్రి పతిఁబాయలే.”దని ప్రణుతించువారు;
“natimr̥dugātri yīyabala bhūputri patim̐bāyalē.”dani praṇutiṃcuvāru;
“నీ సుతుఁడడవుల కేఁగంగఁబూనఁ గౌసల్య యెట్లోర్చెఁగా.”యనువారు;
“nī sutum̐ḍaḍavula kēm̐gaṃgam̐būnam̐ gausalya yeṭlōrcem̐gā.”yanuvāru;
నై రామునరదంబు నందంద కదిసి భూరిశోకాగ్నులఁ బొగులుచుఁ బోవ
nai rāmunaradaṃbu naṃdaṃda kadisi bhūriśōkāgnulam̐ bogulucum̐ bōva
నంతఁగౌసల్యయు నా సుమిత్రయును జింతాపరంపరఁ జిక్కి శోకింప
naṃtam̐gausalyayu nā sumitrayunu jiṃtāparaṃparam̐ jikki śōkiṃpa
వారికరంబులు వలనొప్ప నూది వారిపై వ్రాలుచు వగలఁదూలుచును
vārikaraṃbulu valanoppa nūdi vāripai vrālucu vagalam̐dūlucunu
గలయ నంతఃపురకాంతలు దన్నుఁ గొలిచి రా దశరథక్షోణిపాలకుఁడు
galaya naṃtaḥpurakāṃtalu dannum̐ golici rā daśarathakṣōṇipālakum̐ḍu
భూరిలోచనబాష్పపూరంబు దొరుగ “హారామ! హారామ!”యని పలుమాఱు
bhūrilōcanabāṣpapūraṃbu doruga “hārāma! hārāma!”yani palumāṟu
నెలుఁగెత్తి యేడ్చుచు నేచిన వగల నలిఁదూలి పొగులుచు నగరంబు వెడలె.
nelum̐getti yēḍcucu nēcina vagala nalim̐dūli pogulucu nagaraṃbu veḍale.
నప్పుడు రవిదీప్తులణఁగె; నల్‌దెసల నుప్పొంగెఁదమము; వహ్నులు మండవయ్యె;
nappuḍu ravidīptulaṇam̐ge; naldesala nuppoṃgem̐damamu; vahnulu maṃḍavayye;
ధరణి బీఁటలువాఱెఁ; దారలు మాసె; విరసించి గ్రహములు వినువీథిఁబోరె;
dharaṇi bīm̐ṭaluvāṟem̐; dāralu māse; virasiṃci grahamulu vinuvīthim̐bōre;
నెలసినమదధార లింకె దంతులకుఁ; గలయ నశ్వములకుఁగన్నీరు రాలె;
nelasinamadadhāra liṃke daṃtulakum̐; galaya naśvamulakum̐gannīru rāle;
వారు వీరన కెల్లవారుఁ బెల్లడలఁ బౌరుల యేడ్పు లంబరమెల్ల నిండె.
vāru vīrana kellavārum̐ bellaḍalam̐ baurula yēḍpu laṃbaramella niṃḍe.
సురవరకామినీశోకరావంబుఁ బొరిఁబొరి వినవచ్చెఁబురజనంబులకు.
suravarakāminīśōkarāvaṃbum̐ borim̐bori vinavaccem̐burajanaṃbulaku.
నప్పుడు దశరథుం డా రామురథము చొప్పు బాష్పములచేఁజూడఁజొప్పడక:
nappuḍu daśarathuṃ ḍā rāmurathamu coppu bāṣpamulacēm̐jūḍam̐joppaḍaka:
“చంద్రబింబముతోడ సరియైన రామ చంద్రునిమొగ మొకసారి చూచెదను.
“caṃdrabiṃbamutōḍa sariyaina rāma caṃdrunimoga mokasāri cūcedanu.
ఓ సుమంత్రుండ! రథమునుపవే.”యనుచు నా సుమంత్రుఁడు వినునట్లు చీఱుచును
ō sumaṃtruṃḍa! rathamunupavē.”yanucu nā sumaṃtrum̐ḍu vinunaṭlu cīṟucunu
వెనుకొని పురి దాటి వెస నేఁగుదేర మనుజేశుఁగాంచి సుమంత్రుతో ననియె:
venukoni puri dāṭi vesa nēm̐gudēra manujēśum̐gāṃci sumaṃtrutō naniye:
“నిదె వచ్చుచున్నవాఁడినకులేశ్వరుఁడు; పొద,పొద,పోనిమ్ము,పోనిమ్ము రథము.”
“nide vaccucunnavām̐ḍinakulēśvarum̐ḍu; poda,poda,pōnimmu,pōnimmu rathamu.”
ననియని రఘురాముఁడందంద పలుక మొనసి యాతఁడురయంబునఁదేరుఁబఱప
naniyani raghurāmum̐ḍaṃdaṃda paluka monasi yātam̐ḍurayaṃbunam̐dērum̐baṟapa
నంత వసిష్ఠుఁడయ్యవనీశుఁ జూచి యంతరంగంబున నడలుచుఁబలికె:
naṃta vasiṣṭhum̐ḍayyavanīśum̐ jūci yaṃtaraṃgaṃbuna naḍalucum̐balike:
“ననఘ! శోకించుచు ననుపఁగా రాదు. మనుజేశ! నీ వింక మఱలు మిచ్చోట.”
“nanagha! śōkiṃcucu nanupam̐gā rādu. manujēśa! nī viṃka maṟalu miccōṭa.”
నన విని దశరథుఁడచ్చోట నిలిచి తన సూనురథమటు తప్పక చూచి,
nana vini daśarathum̐ḍaccōṭa nilici tana sūnurathamaṭu tappaka cūci,
యదియుఁగానక ధూళియటు సూచిచూచి, యదియుఁగానక బయలటుసూచిచూచి,
yadiyum̐gānaka dhūḷiyaṭu sūcicūci, yadiyum̐gānaka bayalaṭusūcicūci,
“హా!”యని యెలుఁగెత్తి“హారామ!రామ! హా!”యని యేడ్చుచు నవనిపైఁద్రెళ్లి
“hā!”yani yelum̐getti“hārāma!rāma! hā!”yani yēḍcucu navanipaim̐dreḷli
పొరలుచుఁగెంధూళిబ్రుంగి కన్విచ్చి కరముగ్రమగు దృష్టిఁ గైకేయిఁజూచి:
poralucum̐geṃdhūḷibruṃgi kanvicci karamugramagu dr̥ṣṭim̐ gaikēyim̐jūci:
“నీ పాపమెఱుఁగక నిన్ను మన్నించి నా పుత్త్రరత్నంబు నటు కోలుపోతి;
“nī pāpameṟum̐gaka ninnu manniṃci nā puttraratnaṃbu naṭu kōlupōti;
నిన్నుఁ బెండ్లాడి నే నీచుండ నైతి; నన్నిట మేటినై యల్పుండ నైతి;
ninnum̐ beṃḍlāḍi nē nīcuṃḍa naiti; nanniṭa mēṭinai yalpuṃḍa naiti;
నడరునిందలకెల్ల నాధారమైతిఁ; గడపటఁజెఱిచితిఁ గాకుత్స్థకులము.
naḍaruniṃdalakella nādhāramaitim̐; gaḍapaṭam̐jeṟicitim̐ gākutsthakulamu.
నినుఁజూడఁగారాదు; నిను ముట్టరాదు; చెనఁటి, నీ తోడ భాషింపఁగారాదు.”
ninum̐jūḍam̐gārādu; ninu muṭṭarādu; cenam̐ṭi, nī tōḍa bhāṣiṃpam̐gārādu.”
అని దశరథుఁడాడ నారాజసతులు కనుకనిఁదనుఁదిట్టఁగైకేయి వినుచుఁ
ani daśarathum̐ḍāḍa nārājasatulu kanukanim̐danum̐diṭṭam̐gaikēyi vinucum̐
దల వాంచికొనియుండె.దశరథుండంత నలయుచుఁజని యయోధ్యాపురిఁజొచ్చి
dala vāṃcikoniyuṃḍe.daśarathuṃḍaṃta nalayucum̐jani yayōdhyāpurim̐jocci
పాడువాఱినయట్టి పట్టణవీధి నాడాడ నిలుచుచునపుడు కౌసల్య
pāḍuvāṟinayaṭṭi paṭṭaṇavīdhi nāḍāḍa nilucucunapuḍu kausalya
నగరంతఁజొచ్చి యానన ధూళితోడఁ బొగులుచు, సెజ్జపైఁబొరలుచు, మిగుల
nagaraṃtam̐jocci yānana dhūḷitōḍam̐ bogulucu, sejjapaim̐boralucu, migula
నలయుచు,సొలయుచు,నసురుసురనుచు నలుదెసల్ సూచుచు, నాలుక యెండ
nalayucu,solayucu,nasurusuranucu naludesal sūcucu, nāluka yeṃḍa
“హారామ!హారామ!”యనుచు దైవంబు దూఱుచుఁ,దనుఁదానెదూషించుకొనుచు,
“hārāma!hārāma!”yanucu daivaṃbu dūṟucum̐,danum̐dānedūṣiṃcukonucu,
నే పాటు నే దుఃఖమెఱుఁగని యట్టి నా పుత్త్రరత్నంబు నాదు కోడలును
nē pāṭu nē duḥkhameṟum̐gani yaṭṭi nā puttraratnaṃbu nādu kōḍalunu
నెంతదవ్వరిగిరో?యెందున్నవారొ? యెంతలోఁగుందిరో? యెట్టులేఁగెదరొ?
neṃtadavvarigirō?yeṃdunnavāro? yeṃtalōm̐guṃdirō? yeṭṭulēm̐gedaro?
కందమూలములు శాకములు నేరీతిఁ దిందురో? యెట్లు వర్తింతురో యడవి?
kaṃdamūlamulu śākamulu nērītim̐ diṃdurō? yeṭlu vartiṃturō yaḍavi?
నని రామసీతలయాయాసములకుఁ దనమదినడలుచుఁదలఁపోయుచుండెఁ.
nani rāmasītalayāyāsamulakum̐ danamadinaḍalucum̐dalam̐pōyucuṃḍem̐.
గౌసల్యయును నంతకంటె శోకింప నా సుమిత్రాదేవి యడలార్పుచుండె.
gausalyayunu naṃtakaṃṭe śōkiṃpa nā sumitrādēvi yaḍalārpucuṃḍe.
నంత రాముఁడు పౌరులందఱుఁగొలువఁ గొంత దవ్వేఁగి పేర్కొని వారిఁబలికె:
naṃta rāmum̐ḍu paurulaṃdaṟum̐goluvam̐ goṃta davvēm̐gi pērkoni vārim̐balike:
“ననఘాత్ములార! మీరందఱు మగుడి చనుఁడయోధ్యకు నాకు జయముగోరుండు
“nanaghātmulāra! mīraṃdaṟu maguḍi canum̐ḍayōdhyaku nāku jayamugōruṃḍu
భరతుని యాజ్ఞలోపలను వర్తించి పొరయుఁడు సౌఖ్యముల్.పొండు మీ.”రనిన
bharatuni yājñalōpalanu vartiṃci porayum̐ḍu saukhyamul.poṃḍu mī.”ranina
వారలందఱు నేకవాక్యులై పలికి. “రో రామ! యిట్లాడ నుచితమే నీకు?
vāralaṃdaṟu nēkavākyulai paliki. “rō rāma! yiṭlāḍa nucitamē nīku?
భరతుఁడు మా కేల? పట్టణంబేల? వరమందిరము లేల వనుల కీ వరుగ!
bharatum̐ḍu mā kēla? paṭṭaṇaṃbēla? varamaṃdiramu lēla vanula kī varuga!
వత్తుము నీ వెంట;వల దంటివేనిఁ జత్తుము; దీనికై సందేహ మేల?”
vattumu nī veṃṭa;vala daṃṭivēnim̐ jattumu; dīnikai saṃdēha mēla?”
యనియని పలుకుచు నఖిలభూప్రజలు దనుఁగొల్చి రా రఘూద్వహుఁడునాఁడేఁగి
yaniyani palukucu nakhilabhūprajalu danum̐golci rā raghūdvahum̐ḍunām̐ḍēm̐gi
తమసా నదీతీర తటమున విడిసి తమసలో సాంధ్యకృత్యములెల్లఁదీర్చి
tamasā nadītīra taṭamuna viḍisi tamasalō sāṃdhyakr̥tyamulellam̐dīrci
తగుసౌధమున మృదుతల్పంబునందు మొగిఁబవ్వళించు నా మోహనమూర్తి
tagusaudhamuna mr̥dutalpaṃbunaṃdu mogim̐bavvaḷiṃcu nā mōhanamūrti
తరుమూలమునఁబర్ణతల్పంబునందు ధరణిజయును దానుఁదగ విశ్రమించి,
tarumūlamunam̐barṇatalpaṃbunaṃdu dharaṇijayunu dānum̐daga viśramiṃci,
తనుఁజుట్టి పౌరులు దమయిండ్లు మఱచి తనయుల భార్యలతగులు వోవిడిచి
tanum̐juṭṭi paurulu damayiṃḍlu maṟaci tanayula bhāryalatagulu vōviḍici
వనములఁదనవెంట వచ్చువారగుచు నినుపారు భక్తితో నిద్రింపఁ జూచి
vanamulam̐danaveṃṭa vaccuvāragucu ninupāru bhaktitō nidriṃpam̐ jūci
వారలమరలింప వలనొండు లేక యా రాత్రి మధ్యంబునందు సుమంత్రుఁ
vāralamaraliṃpa valanoṃḍu lēka yā rātri madhyaṃbunaṃdu sumaṃtrum̐
“దే రాయితముసేసి తెమ్మ”ని పలికి పౌరుల వంచించు భావమాతనికిఁ
“dē rāyitamusēsi temma”ni paliki paurula vaṃciṃcu bhāvamātanikim̐
దెలిపి యయోధ్యకైతేరు వోనిచ్చి తలకొని మగుడించి తమస దాటించి
delipi yayōdhyakaitēru vōnicci talakoni maguḍiṃci tamasa dāṭiṃci
తృణశిలావృతభూమిఁదేరు దోలించి గణుతింపరానివేగమునఁబోవుచును
tr̥ṇaśilāvr̥tabhūmim̐dēru dōliṃci gaṇutiṃparānivēgamunam̐bōvucunu
దమరాకయును మహీధవునిచేఁతయును దమకించి విని మనస్తాపంబు నొంది
damarākayunu mahīdhavunicēm̐tayunu damakiṃci vini manastāpaṃbu noṃdi
తెరువుపల్లెలవారు ధృతిదూలి యేడ్చు పరుసంపుటెలుఁగులు పలుమాఱు వినుచు
teruvupallelavāru dhr̥tidūli yēḍcu parusaṃpuṭelum̐gulu palumāṟu vinucu
వనతతుల్ సీతకు వరుసఁజూపుచును నినకులమణియైన యిక్ష్వాకునకును
vanatatul sītaku varusam̐jūpucunu ninakulamaṇiyaina yikṣvākunakunu
మనువు మున్నొసగినమహిఁగనుంగొనుచుఁ జనివేగవతి దాటి సరయువు దాటి
manuvu munnosaginamahim̐ganuṃgonucum̐ janivēgavati dāṭi sarayuvu dāṭi
నరనాథుఁడమ్మఱునాఁడు మాపటికిఁ గరము వేగమున గంగానదిఁ జేరి
naranāthum̐ḍammaṟunām̐ḍu māpaṭikim̐ garamu vēgamuna gaṃgānadim̐ jēri
తడయక యింగుదీతరుసమీపమున విడిసి యచ్చటఁబ్రీతి విశ్రాంతి నొందె.
taḍayaka yiṃgudītarusamīpamuna viḍisi yaccaṭam̐brīti viśrāṃti noṃde.
నారయఁదమసలో నట నిద్రవోవు పౌరులందఱును బ్రభాతంబునందుఁ
nārayam̐damasalō naṭa nidravōvu paurulaṃdaṟunu brabhātaṃbunaṃdum̐
గరమర్థితో మేలుకాంచి నల్‌దెసలు పరికించి నివ్వెఱపడి శోకమెసగ
garamarthitō mēlukāṃci naldesalu parikiṃci nivveṟapaḍi śōkamesaga
రామునిఁగానక రథము చొప్పరసి “రాముఁడయోధ్యాపురమున కీ రాత్రి
rāmunim̐gānaka rathamu copparasi “rāmum̐ḍayōdhyāpuramuna kī rātri
యవనినాథుఁడు విల్వనంపిన మరల భువనభారముఁబూనఁబోనోపు.”ననుచు
yavanināthum̐ḍu vilvanaṃpina marala bhuvanabhāramum̐būnam̐bōnōpu.”nanucu
నని యయోధ్యకు వచ్చి యచ్చట రాముఁ గనుఁగొనఁ జాలక ఘనశోకవహ్ని
nani yayōdhyaku vacci yaccaṭa rāmum̐ ganum̐gonam̐ jālaka ghanaśōkavahni
ననయంబుఁబొగులుచు“నకట!రాఘవుడు మనలవంచించిక్రమ్మఱఁబోయె.”ననుచు
nanayaṃbum̐bogulucu“nakaṭa!rāghavuḍu manalavaṃciṃcikrammaṟam̐bōye.”nanucu
నా రాముకృపయు సత్యంబు ధర్మంబుఁ జారువర్తనము నిచ్చలు నుతించుచును
nā rāmukr̥payu satyaṃbu dharmaṃbum̐ jāruvartanamu niccalu nutiṃcucunu
నితరవస్తువులపై నిచ్చలు మాని యతనిఁదలంచుచు నతనిఁబాయుటకు
nitaravastuvulapai niccalu māni yatanim̐dalaṃcucu natanim̐bāyuṭaku
నంతరంగంబుననడలుచునుండి. రంత నక్కడ గుహుండను చెంచురాజు
naṃtaraṃgaṃbunanaḍalucunuṃḍi. raṃta nakkaḍa guhuṃḍanu ceṃcurāju
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).