భూమీశ! విను: మంగభూపతిసుతుఁడు రోమపాదుఁడు గుణారూఢుండు దొల్లి
bhūmīśa! vinu: maṃgabhūpatisutum̐ḍu rōmapādum̐ḍu guṇārūḍhuṃḍu dolli
బాలకాండము · ఋశ్యశృంగ కథ · బాలకాండము · ఋశ్యశృంగ కథ
bālakāṃḍamu · r̥śyaśr̥ṃga katha
Bala Kanda, section 6: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
103 passagesTelugu with transliteration
భూమీశ! విను: మంగభూపతిసుతుఁడు రోమపాదుఁడు గుణారూఢుండు దొల్లి
bhūmīśa! vinu: maṃgabhūpatisutum̐ḍu rōmapādum̐ḍu guṇārūḍhuṃḍu dolli
తా నేలి పాలించుధరణిపై నెందు వానలు లేకున్న వగలచేఁ బొగిలి
tā nēli pāliṃcudharaṇipai neṃdu vānalu lēkunna vagalacēm̐ bogili
వరమునీంద్రులచేత వర్షహోమములు పరువడిఁ జేయించి పడయ రాకున్న
varamunīṃdrulacēta varṣahōmamulu paruvaḍim̐ jēyiṃci paḍaya rākunna
భూరిశోకంబునఁబొగులుచునున్న యా రాజుఁగనుఁగొని యమ్మును లనిరి:
bhūriśōkaṃbunam̐bogulucununna yā rājum̐ganum̐goni yammunu laniri:
“పరహితోన్నతుఁడు విభండకసుతుఁడు చిరపుణ్యనిధి ఋశ్యశృంగుఁడన్వాఁడు
“parahitōnnatum̐ḍu vibhaṃḍakasutum̐ḍu cirapuṇyanidhi r̥śyaśr̥ṃgum̐ḍanvām̐ḍu
నగధైర్య!పుట్టిననాఁటనుండియును నగరరాష్ట్రముల నెన్నఁడు నెఱుంగమిని
nagadhairya!puṭṭinanām̐ṭanuṃḍiyunu nagararāṣṭramula nennam̐ḍu neṟuṃgamini
నతఁడెందు నాఁడువారను పేరెఱుంగఁ; డతఁడు దాపసవృత్తి నడవుల నుండు;
natam̐ḍeṃdu nām̐ḍuvāranu pēreṟuṃgam̐; ḍatam̐ḍu dāpasavr̥tti naḍavula nuṃḍu;
వసుధేశ! యతఁడిందువచ్చినఁజాలు వెసఁబాయు నీ యనావృష్టిదోషంబు”
vasudhēśa! yatam̐ḍiṃduvaccinam̐jālu vesam̐bāyu nī yanāvr̥ṣṭidōṣaṃbu”
నావుడు “మునినాథు నగరి కే రీతి రావింతు?”నని విచారము సేసి తెలిసి
nāvuḍu “munināthu nagari kē rīti rāviṃtu?”nani vicāramu sēsi telisi
యనురక్తిఁగడుఁబ్రోడలగు వారసతుల వినుతయౌవనరూపవిభ్రమవతుల
yanuraktim̐gaḍum̐brōḍalagu vārasatula vinutayauvanarūpavibhramavatula
మనసిజమోహనమంత్ర దేవతలఁ బనిచె నొప్పెడువారిఁబ్రార్థించి యతఁడు
manasijamōhanamaṃtra dēvatalam̐ banice noppeḍuvārim̐brārthiṃci yatam̐ḍu
అతివ లమ్మునియున్న యడవికిఁబోయి యతని యాశ్రమభూమి నల్లనఁగదిసి
ativa lammuniyunna yaḍavikim̐bōyi yatani yāśramabhūmi nallanam̐gadisi
చతురనర్తనకళాసంగీతగతుల నతనికిఁదమయొప్పులర్థిఁ జూపుటయు
caturanartanakaḷāsaṃgītagatula natanikim̐damayoppularthim̐ jūpuṭayu
నా పుణ్యనిధి వార లాఁడువారగుట రూపింపనేరక రుచులఁజొప్పడక
nā puṇyanidhi vāra lām̐ḍuvāraguṭa rūpiṃpanēraka ruculam̐joppaḍaka
యలసయానముల నీ యడవిలో నొప్ప మెలఁగెడు నివి వింతమృగములో కాక
yalasayānamula nī yaḍavilō noppa melam̐geḍu nivi viṃtamr̥gamulō kāka
యనుచుండ నొక్కనాఁడతివలు ప్రీతిఁ దనుఁజేరవచ్చినఁ దప్పక చూచి
yanucuṃḍa nokkanām̐ḍativalu prītim̐ danum̐jēravaccinam̐ dappaka cūci
చన్నులపేరడ్గి చన్నుల మీఁద నున్నహారములకు నుద్దేశమడిగి
cannulapēraḍgi cannula mīm̐da nunnahāramulaku nuddēśamaḍigi
“మాకుఁగొమ్మొక్కటిమస్తకమ్మునను మీకుఁగొమ్ములు రెండు మెఱసె ఱొమ్మునను
“mākum̐gommokkaṭimastakammunanu mīkum̐gommulu reṃḍu meṟase ṟommunanu
నే వృక్షములఁగల్గె నివి యపూర్వములు మీ వల్కలము లతిమృదులంబు లరయ;
nē vr̥kṣamulam̐galge nivi yapūrvamulu mī valkalamu latimr̥dulaṃbu laraya;
మా జటాబంధంబుమాడ్కివి గావు మీ జటాబంధముల్ మెఱుఁగులఁబొదలె;
mā jaṭābaṃdhaṃbumāḍkivi gāvu mī jaṭābaṃdhamul meṟum̐gulam̐bodale;
మేని బూడిదపూఁత మేల్‌తావి గొట్టు; వీనులవిందు మీ వేదనాదములు
mēni būḍidapūm̐ta mēltāvi goṭṭu; vīnulaviṃdu mī vēdanādamulu
కని విని యెఱుఁగ మిక్కాననభూమి; మునులకు నీ వేషములు గలవొక్కొ?
kani vini yeṟum̐ga mikkānanabhūmi; munulaku nī vēṣamulu galavokko?
ఎక్కడిమును?”లన్న నింతు లా ఘనుని చిక్కుట భావించి చెలఁగి నవ్వుచును
ekkaḍimunu?”lanna niṃtu lā ghanuni cikkuṭa bhāviṃci celam̐gi navvucunu
“నానుపూర్విగ శ్రుతిహారియౌ సామ గానంబు వాడి చక్కఁగఁబదక్రమము
“nānupūrviga śrutihāriyau sāma gānaṃbu vāḍi cakkam̐gam̐badakramamu
శుద్ధమార్గంబునఁజూపంగ నేర్తు; మిద్ధర మాచర్యలెఱుఁగ మీ తరమె?”
śuddhamārgaṃbunam̐jūpaṃga nērtu; middhara mācaryaleṟum̐ga mī tarame?”
యని నేర్పుమాటల నమ్మునిస్వామిఁ గనుఁబ్రామి మఱియు నక్కన్యకామణులు
yani nērpumāṭala nammunisvāmim̐ ganum̐brāmi maṟiyu nakkanyakāmaṇulu
“ఎవ్వరితనయుఁడ?వెవ్వఁడ? వేల యివ్వనంబుననుండు? టెఱిఁగింపు”మనుడు
“evvaritanayum̐ḍa?vevvam̐ḍa? vēla yivvanaṃbunanuṃḍu? ṭeṟim̐giṃpu”manuḍu
“నడరుకీర్తులఁబుణ్యుఁడగు విభండకుని కొడుకును? ఋశ్యశృంగుండు నా పేరు;
“naḍarukīrtulam̐buṇyum̐ḍagu vibhaṃḍakuni koḍukunu? r̥śyaśr̥ṃguṃḍu nā pēru;
విపులమనోనిష్ఠ వెలయ నీ యడవిఁ దపము సేయుటకునై తగిలి వర్తింతు;
vipulamanōniṣṭha velaya nī yaḍavim̐ dapamu sēyuṭakunai tagili vartiṃtu;
వినుఁడు: మీరిచటికి విచ్చేయుకతన ననఘుండనైతిఁ గృతార్థుండనైతి.”
vinum̐ḍu: mīricaṭiki viccēyukatana nanaghuṃḍanaitim̐ gr̥tārthuṃḍanaiti.”
నని మునులని వారి నాశ్రమంబునకుఁ గొనిపోయి ఋశ్యశృంగుఁడు పూజసేసె.
nani munulani vāri nāśramaṃbunakum̐ gonipōyi r̥śyaśr̥ṃgum̐ḍu pūjasēse.
నెలనాఁగ లమ్ముని యిచ్చినపూజ లలరుచుఁగైకొని యతని వీక్షించి
nelanām̐ga lammuni yiccinapūja lalarucum̐gaikoni yatani vīkṣiṃci
“మునివర, మా వనంబునఁదెచ్చినార మనుపమఫలరాజి” యనుచు లడ్వములు
“munivara, mā vanaṃbunam̐deccināra manupamaphalarāji” yanucu laḍvamulu
నతిరసంబులు మనోహరములు నైన యతిరసంబులుమనోహరములు మఱియు
natirasaṃbulu manōharamulu naina yatirasaṃbulumanōharamulu maṟiyu
సారరసంబుల చవులగ్గలింపఁ బేరు సెప్పఁగరాని పెక్కుభక్ష్యములు
sārarasaṃbula cavulaggaliṃpam̐ bēru seppam̐garāni pekkubhakṣyamulu
నిచ్చిన నమలుచు నెడనెడఁజవులు మెచ్చుచుఁదనిసి యా మెలఁతలఁజూచి
niccina namalucu neḍaneḍam̐javulu meccucum̐danisi yā melam̐talam̐jūci
“మున్నిట్టి ఫలముల మునివరులార! యెన్నఁడు నెఱుఁగమ యే వనంబులను.
“munniṭṭi phalamula munivarulāra! yennam̐ḍu neṟum̐gama yē vanaṃbulanu.
మీ తపంబె తపంబు; మీ తపోవనమె యీ తపోవనముల కెక్కుడు తలఁప.”
mī tapaṃbe tapaṃbu; mī tapōvaname yī tapōvanamula kekkuḍu talam̐pa.”
నని పల్క నయ్యింతు లల్లన నగుచు ననువొందఁ దనులత లరసోఁకఁ గదిసి
nani palka nayyiṃtu lallana nagucu nanuvoṃdam̐ danulata larasōm̐kam̐ gadisi
తావి యూర్పులచేతఁదాలిమి దూలి పోవ నొయ్యన ముఖాంబురుహంబు లెత్తి
tāvi yūrpulacētam̐dālimi dūli pōva noyyana mukhāṃburuhaṃbu letti
పలుకులఁదళుకులఁ బాటతేటలను బిలుపుల సొలపుల బెల్లించి యతని
palukulam̐daḷukulam̐ bāṭatēṭalanu bilupula solapula belliṃci yatani
హృదయంబు గరఁగంగ నిఱిచన్నుఁగవలు గదియించి బిగియారఁ గౌగిళ్ల మరపి
hr̥dayaṃbu garam̐gaṃga niṟicannum̐gavalu gadiyiṃci bigiyāram̐ gaugiḷla marapi
“యనఘ! పోయెద మింక నాశ్రమంబునకు” నని విభాండకుదెస నడరినభీతి
“yanagha! pōyeda miṃka nāśramaṃbunaku” nani vibhāṃḍakudesa naḍarinabhīti
నరిగి చేరువనుండి రావనంబునను నరవిందలోచన లరిగిన పిదప
narigi cēruvanuṃḍi rāvanaṃbunanu naraviṃdalōcana larigina pidapa
వారింక నెప్పుడు వత్తురో యనుచు నా ఋశ్యశృంగుఁడు నట నిద్రలేక
vāriṃka neppuḍu vatturō yanucu nā r̥śyaśr̥ṃgum̐ḍu naṭa nidralēka
యా రాత్రి వేగించి యా మఱునాఁడు నా రమణులఁ గన్న యచటి కేతేర
yā rātri vēgiṃci yā maṟunām̐ḍu nā ramaṇulam̐ ganna yacaṭi kētēra
నందియల్ మొరయంగ నసదుఁగౌఁదీగ లందంద వడఁకాడ నంచల నడల
naṃdiyal morayaṃga nasadum̐gaum̐dīga laṃdaṃda vaḍam̐kāḍa naṃcala naḍala
మగువలు వచ్చి యమ్మహితాత్ముఁగాంచి నగు మొగంబులతోడ నలువొందఁజేరి
maguvalu vacci yammahitātmum̐gāṃci nagu mogaṃbulatōḍa naluvoṃdam̐jēri
“మునివర! మా వనంబునకు రావలయు” నని పల్క రాకకు ననుమతించుటయుఁ
“munivara! mā vanaṃbunaku rāvalayu” nani palka rākaku nanumatiṃcuṭayum̐
దమవిలాసంబులఁ దమ యుపాయములఁ దమకంబు వుట్టించి తరలాక్షులంత
damavilāsaṃbulam̐ dama yupāyamulam̐ damakaṃbu vuṭṭiṃci taralākṣulaṃta
నొనర దీమంబుల నొక వింతమృగముఁ గొనివచ్చు తెఱఁగునఁగొనివచ్చిరతని.
nonara dīmaṃbula noka viṃtamr̥gamum̐ gonivaccu teṟam̐gunam̐gonivacciratani.
నతఁడు సొచ్చుటయును నయ్యంగదేశ మతుల వర్షముల సస్యంబుల నొప్పె.
natam̐ḍu soccuṭayunu nayyaṃgadēśa matula varṣamula sasyaṃbula noppe.
ననఘుఁడారాజన్యుఁడాత్మజ శాంత యను కన్య నిచ్చిన నా నృపునింట
nanaghum̐ḍārājanyum̐ḍātmaja śāṃta yanu kanya niccina nā nr̥puniṃṭa
నతఁడుండు; దశరథుండమ్మునిఁ దెచ్చి హితమతిఁబుత్త్రకామేష్టినాఁ బరగు
natam̐ḍuṃḍu; daśarathuṃḍammunim̐ decci hitamatim̐buttrakāmēṣṭinām̐ baragu
క్రతు వమ్మునీంద్రుచేఁ గావించెనేని సుతుల నల్వుర బహుశ్రుతుల నున్నతుల
kratu vammunīṃdrucēm̐ gāviṃcenēni sutula nalvura bahuśrutula nunnatula
నాతనిచేఁగాంచునని చెప్పెఁదెలియ నా తోడఁ దొల్లి సనత్కుమారుండు.
nātanicēm̐gāṃcunani ceppem̐deliya nā tōḍam̐ dolli sanatkumāruṃḍu.
అటుగాన నీ వింక నా ఋశ్యశృంగుఁ బటుభక్తియుక్తిమైఁబ్రార్థించి తెమ్ము.”
aṭugāna nī viṃka nā r̥śyaśr̥ṃgum̐ baṭubhaktiyuktimaim̐brārthiṃci temmu.”
అనవుడు దశరథుం డా రోమపాద జననాథువీటికిఁజని ఋశ్యశృంగుఁ
anavuḍu daśarathuṃ ḍā rōmapāda jananāthuvīṭikim̐jani r̥śyaśr̥ṃgum̐
గ్రతువున కాచార్యుగా వరియించి యతులిత చతురంతయానాఢ్యుఁ జేసి
gratuvuna kācāryugā variyiṃci yatulita caturaṃtayānāḍhyum̐ jēsi
యతని విరోధ్యసాధ్యకు నయోధ్యకును జతురుఁడై తోడ్తెచ్చె శాంతతోఁగూడ.
yatani virōdhyasādhyaku nayōdhyakunu jaturum̐ḍai tōḍtecce śāṃtatōm̐gūḍa.
వచ్చుచో దూతలవలను వీక్షించి పుచ్చి ముందర వారిఁ“బురమును నగరు
vaccucō dūtalavalanu vīkṣiṃci pucci muṃdara vārim̐“buramunu nagaru
వాసవపురికంటె వైభవంబెసగఁ గైసేయవలయును గడువేగ మీర”
vāsavapurikaṃṭe vaibhavaṃbesagam̐ gaisēyavalayunu gaḍuvēga mīra”
లని పల్క వారును నరిగి పౌరులకు వినుపింపఁ, జేసిరి వివిధశిల్పములు.
lani palka vārunu narigi paurulaku vinupiṃpam̐, jēsiri vividhaśilpamulu.
దుందుభి శంఖాది తూర్యనాదంబు లందంద మ్రోయఁగ నంత భూపతియుఁ
duṃdubhi śaṃkhādi tūryanādaṃbu laṃdaṃda mrōyam̐ga naṃta bhūpatiyum̐
ముందుగా రథమెక్కి ముదము సిత్తమునఁ జెంది శాంతయు ఋశ్యశృంగుండు నడవఁ
muṃdugā rathamekki mudamu sittamunam̐ jeṃdi śāṃtayu r̥śyaśr̥ṃguṃḍu naḍavam̐
బురమున కేతెంచెఁ బురజనుల్ సేయు పరమ మంగళతతుల్ పరగఁగైకొనుచు.
buramuna kēteṃcem̐ burajanul sēyu parama maṃgaḷatatul paragam̐gaikonucu.
నీ రీతి నా ఋశ్యశృంగునిఁదెచ్చి భూరమణుం డంతిపురమున నునిచి
nī rīti nā r̥śyaśr̥ṃgunim̐decci bhūramaṇuṃ ḍaṃtipuramuna nunici
వితతార్ఘ్యపాద్యాది విధులఁ బూజించి యతికృతార్థుఁడ నైతినని సంతసిల్లె.
vitatārghyapādyādi vidhulam̐ būjiṃci yatikr̥tārthum̐ḍa naitinani saṃtasille.
నా సమయంబున నా రాజసతులు కౌసల్యమొదలుగాఁ గడు వేడ్కతోడ
nā samayaṃbuna nā rājasatulu kausalyamodalugām̐ gaḍu vēḍkatōḍa
మహితభూషణ వస్త్రమాల్యాదులిచ్చి బహువిధంబుల వారిఁబ్రార్థించి. రంతఁ
mahitabhūṣaṇa vastramālyādulicci bahuvidhaṃbula vārim̐brārthiṃci. raṃtam̐
గొంతకాలమునకుఁగువలయజనులు సంతోషమంద వసంతమేతేర
goṃtakālamunakum̐guvalayajanulu saṃtōṣamaṃda vasaṃtamētēra
నడరెడు వేడుక నా ఋశ్యశృంగు కడకు భూపతి వచ్చి కడుభక్తి మ్రొక్కి
naḍareḍu vēḍuka nā r̥śyaśr̥ṃgu kaḍaku bhūpati vacci kaḍubhakti mrokki
“సన్నుతస్థితి నన్ను సంయమిప్రవర! చెన్నొంద జన్నంబు సేయింపవలయు.”
“sannutasthiti nannu saṃyamipravara! cennoṃda jannaṃbu sēyiṃpavalayu.”
నని విన్నవించిన “నౌఁగాక” యనుచు నినకులోత్తముఁజూచి యిట్లని పలికె:
nani vinnaviṃcina “naum̐gāka” yanucu ninakulōttamum̐jūci yiṭlani palike:
“వేగంబె తెప్పింపు విహితంబులైన యాగసంభారంబులన్నియు నధిప!”
“vēgaṃbe teppiṃpu vihitaṃbulaina yāgasaṃbhāraṃbulanniyu nadhipa!”
యనవుడుఁదగువారి “నయ్యైతెఱంగు లొనరింపుఁ”డనుచు నియోగించి యప్పు
yanavuḍum̐daguvāri “nayyaiteṟaṃgu lonariṃpum̐”ḍanucu niyōgiṃci yappu
డఖిల సంభారంబులర్థిఁదెప్పించి మఖము సూచుటకు సుమంత్రునిఁబంపి,
ḍakhila saṃbhāraṃbularthim̐deppiṃci makhamu sūcuṭaku sumaṃtrunim̐baṃpi,
కేకయక్ష్మానాథుఁ గీర్తిసనాథు నా కాశిరాజు నవ్యాహతతేజు
kēkayakṣmānāthum̐ gīrtisanāthu nā kāśirāju navyāhatatēju
జనకాంగ రాజాది జననాథ వరుల ననఘ చరిత్రులనర్థి రప్పించి,
janakāṃga rājādi jananātha varula nanagha caritrulanarthi rappiṃci,
మనుజనాయకుఁడు సుమంత్రుతో ననియె “ననఘుల వేదవేదాంగపారగుల
manujanāyakum̐ḍu sumaṃtrutō naniye “nanaghula vēdavēdāṃgapāragula
గృహమేధులగువారిఁ గృతతంత్రభాష్య మహితార్థనిశ్చయమతుల భూసురులఁ
gr̥hamēdhulaguvārim̐ gr̥tataṃtrabhāṣya mahitārthaniścayamatula bhūsurulam̐
బరగు సుయజ్ఞు జాబాలిఁగశ్యపుని సురుచిరాత్ముని వసిష్ఠుని వామదేవు
baragu suyajñu jābālim̐gaśyapuni surucirātmuni vasiṣṭhuni vāmadēvu
రయమునఁ దోడ్కొనిరమ్ము నీ” వనినఁ బ్రియమున నాతండు వెంపార నరిగి
rayamunam̐ dōḍkonirammu nī” vaninam̐ briyamuna nātaṃḍu veṃpāra narigi
యురుభక్తి నందఱ నొగిఁదోడితేరఁ బరువడితో నర్ఘ్యపాద్యాదులిచ్చి
yurubhakti naṃdaṟa nogim̐dōḍitēram̐ baruvaḍitō narghyapādyādulicci
నిర్మలవ్రతనిధి నియతార్థమతము ధర్మార్థయుతముగాఁ దగుమాటఁబలికె:
nirmalavratanidhi niyatārthamatamu dharmārthayutamugām̐ dagumāṭam̐balike:
“మునులార!కొడుకులు మును నాకు లేమి మనమున నే నొక్క మతముఁజింతించి
“munulāra!koḍukulu munu nāku lēmi manamuna nē nokka matamum̐jiṃtiṃci
మిత్రసూక్తుల నశ్వమేధయాగమును పుత్త్రులకొఱకునై పుత్త్రకామేష్టిఁ
mitrasūktula naśvamēdhayāgamunu puttrulakoṟakunai puttrakāmēṣṭim̐
జేయంగ నీ ఋశ్యశృంగుఁదోడ్తెచ్చి మీ యనుగ్రహముఁగామించియున్నాఁడ.”
jēyaṃga nī r̥śyaśr̥ṃgum̐dōḍtecci mī yanugrahamum̐gāmiṃciyunnām̐ḍa.”
ననవుడు నా వసిష్ఠాది సంయములు జననాథుమాటకు సంతోషమంది
nanavuḍu nā vasiṣṭhādi saṃyamulu jananāthumāṭaku saṃtōṣamaṃdi
“యినకులోత్తమ!లోకహిత మాచరింపఁ దనయులఁగోరు నీ తలఁపొప్పు నింక
“yinakulōttama!lōkahita mācariṃpam̐ danayulam̐gōru nī talam̐poppu niṃka
నశ్వంబు విడువు మీ యశ్వమేధమున విశ్వరక్షకులైన విక్రమోజ్జ్వలులు
naśvaṃbu viḍuvu mī yaśvamēdhamuna viśvarakṣakulaina vikramōjjvalulu
నలుగురు గొడుకులు నరనాథ! నీకుఁ గలిగెద.”రని పల్కఁగడు సంతసిల్లి
naluguru goḍukulu naranātha! nīkum̐ galigeda.”rani palkam̐gaḍu saṃtasilli
సవనయోగ్యంబైన జవనాశ్వమరసి భువనపావనమూర్తి పూజించి నొసటఁ
savanayōgyaṃbaina javanāśvamarasi bhuvanapāvanamūrti pūjiṃci nosaṭam̐
బ్రకటిత బిరుదాంక పట్టికఁగట్టి యొకయేఁడు దన యిచ్చ నుర్విఁజరింప
brakaṭita birudāṃka paṭṭikam̐gaṭṭi yokayēm̐ḍu dana yicca nurvim̐jariṃpa
సమకట్టి విడిచె నశ్వంబు రక్షింప విమతోగ్రులగు సైన్యవిభులతోఁగూడ.
samakaṭṭi viḍice naśvaṃbu rakṣiṃpa vimatōgrulagu sainyavibhulatōm̐gūḍa.
నంత వసిష్ఠాదులనుమతి సేయ వింతగా శిల్పకోవిదుల రావించి
naṃta vasiṣṭhādulanumati sēya viṃtagā śilpakōvidula rāviṃci
సరయువు నుత్తరస్థలి యాగశాల విరచింపఁగాఁబంచె వేదోక్తసరణి;
sarayuvu nuttarasthali yāgaśāla viraciṃpam̐gām̐baṃce vēdōktasaraṇi;
మఱియు నానా దేశమనుజవల్లభుల వఱలువిప్రనృపాలవైశ్యశూద్రులను
maṟiyu nānā dēśamanujavallabhula vaṟaluvipranr̥pālavaiśyaśūdrulanu
రప్పించె. నంత వర్షము పూర్ణమైన నెప్పటిమధుమాస మేతేర నృపుఁడు
rappiṃce. naṃta varṣamu pūrṇamaina neppaṭimadhumāsa mētēra nr̥pum̐ḍu
చిరతపోనిధి ఋశ్యశృంగుసమ్మతియు గురునియానతియుఁగైకొని మంచివేళ
ciratapōnidhi r̥śyaśr̥ṃgusammatiyu guruniyānatiyum̐gaikoni maṃcivēḷa
నిహితసంభారవర్ణితహోమకుండ సహితమై యేకవింశతిరమ్యయూప
nihitasaṃbhāravarṇitahōmakuṃḍa sahitamai yēkaviṃśatiramyayūpa
మహితమై శ్రౌతధర్మక్రియాచార విహితమై మాయాప్రవీణదైతేయ
mahitamai śrautadharmakriyācāra vihitamai māyāpravīṇadaitēya
రహితమై సకలామరహితమై యొప్పు మహనీయమగు యాగమంటపంబమర
rahitamai sakalāmarahitamai yoppu mahanīyamagu yāgamaṃṭapaṃbamara
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).