Skip to content

అరణ్యకాండము · జటాయుయుద్ధము · అరణ్యకాండము · జటాయుయుద్ధము

Aranya Kanda 22 · jaṭāyuyuddhamu

araṇyakāṃḍamu · jaṭāyuyuddhamu

Aranya Kanda, section 22: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

72 passagesTelugu with transliteration

An original emblem for Aranya Kanda, section 22.

యత్తఱి విహగేంద్రుఁడరుణతనూజుఁ డుత్తమసాహసుండొక కొండనుండి

yattaṟi vihagēṃdrum̐ḍaruṇatanūjum̐ ḍuttamasāhasuṃḍoka koṃḍanuṃḍi

Report an error

యుక్కలుండగు జటాయువు బిట్టు వినియె నక్కటా! రఘురామ!”యనునార్తరవము.

yukkaluṃḍagu jaṭāyuvu biṭṭu viniye nakkaṭā! raghurāma!”yanunārtaravamu.

Report an error

విని సంభ్రమించి నివ్వెఱఁగంది దిశలు గనుఁగొని మోమెత్తి గగనంబు సూచి:

vini saṃbhramiṃci nivveṟam̐gaṃdi diśalu ganum̐goni mōmetti gaganaṃbu sūci:

Report an error

“యదయుఁడై రావణుండా రాముదేవిఁ బొదివి యిమ్ములఁగొనిపోవుచున్నాఁడు.

“yadayum̐ḍai rāvaṇuṃḍā rāmudēvim̐ bodivi yimmulam̐gonipōvucunnām̐ḍu.

Report an error

నాఁ డీ వనంబున ననుఁగన్న మొదలు పోఁడిమి ఘనమైత్రిఁబ్రోచు రాఘవుఁడు.

nām̐ ḍī vanaṃbuna nanum̐ganna modalu pōm̐ḍimi ghanamaitrim̐brōcu rāghavum̐ḍu.

Report an error

తగదింక వర్జింప; దైత్యునిర్జించి తెగువమై వైదేహిఁదెత్తు; నొండేని,

tagadiṃka varjiṃpa; daityunirjiṃci teguvamai vaidēhim̐dettu; noṃḍēni,

Report an error

నినకులాధిపునకై యింకఁబ్రాణంబు లనిమొన నొప్పింతు.”నని నిశ్చయించి

ninakulādhipunakai yiṃkam̐brāṇaṃbu lanimona noppiṃtu.”nani niścayiṃci

Report an error

కులిశంబుధార తాఁకునకు నెబ్భంగి నలవిగా కెగయు మహాద్రిచందమున

kuliśaṃbudhāra tām̐kunaku nebbhaṃgi nalavigā kegayu mahādricaṃdamuna

Report an error

నురుశక్తి మెయివెంచి యూఁకించి యెగసి పొరిఁబొరి గిరిశృంగములు నుగ్గుగాఁగ,

nuruśakti meyiveṃci yūm̐kiṃci yegasi porim̐bori giriśr̥ṃgamulu nuggugām̐ga,

Report an error

మరలించి పుక్కిటిమాంసఖండములు ధరణిపై నుమిసి యుదగ్రభావమున

maraliṃci pukkiṭimāṃsakhaṃḍamulu dharaṇipai numisi yudagrabhāvamuna

Report an error

ఖరనఖంబులనున్న కరి సింహ శరభ శిరము లంతంతన చిద్రుపలై తొరుగఁ,

kharanakhaṃbulanunna kari siṃha śarabha śiramu laṃtaṃtana cidrupalai torugam̐,

Report an error

బటుతుండరోచులు పక్షదీధితులు చటులకోపోగ్రలోచన రుచుల్‌ వర్వఁ

baṭutuṃḍarōculu pakṣadīdhitulu caṭulakōpōgralōcana rucul varvam̐

Report an error

బక్షానిలంబులఁ బర్వతశిఖర వృక్షముల్‌ విఱిగిదిగ్వివరంబు నిండఁ,

bakṣānilaṃbulam̐ barvataśikhara vr̥kṣamul viṟigidigvivaraṃbu niṃḍam̐,

Report an error

బరగురావణతమఃపటలంబు నడఁప నరుదెంచుమధ్యందినార్కుచందమున

baragurāvaṇatamaḥpaṭalaṃbu naḍam̐pa narudeṃcumadhyaṃdinārkucaṃdamuna

Report an error

నాసన్నఖలరావణాదిత్యు మ్రింగ రాసి యుగ్రతవచ్చు రాహుచందమున,

nāsannakhalarāvaṇādityu mriṃga rāsi yugratavaccu rāhucaṃdamuna,

Report an error

వడిఁబేర్చి పఱచురావణరాహుమ్రింగఁ దడయక చనుదెంచు తార్క్ష్యునిపగిది:

vaḍim̐bērci paṟacurāvaṇarāhumriṃgam̐ daḍayaka canudeṃcu tārkṣyunipagidi:

Report an error

“నిలునిలు పోకుము; నిలు పోకు పోకు; నిలునిలు; రఘురామనృపచంద్రుదేవిఁ

“nilunilu pōkumu; nilu pōku pōku; nilunilu; raghurāmanr̥pacaṃdrudēvim̐

Report an error

గుటిలరాక్షస! యెందుఁగొనిపోయె దింక? నెటపోయె; దెటపోయె; దెందుఁబోయెదవు?

guṭilarākṣasa! yeṃdum̐gonipōye diṃka? neṭapōye; deṭapōye; deṃdum̐bōyedavu?

Report an error

పోయినఁబోనీను పొరిగొందునిన్ను; వ్రేయుదు,ఖండింతు,విదళింతుఁ,ద్రుంతు,

pōyinam̐bōnīnu porigoṃduninnu; vrēyudu,khaṃḍiṃtu,vidaḷiṃtum̐,druṃtu,

Report an error

దండింతుఁదుండింతుఁదలలుత్తరింతుఁ జెండుబెండుగ.” నంచు సీత నీక్షించి:

daṃḍiṃtum̐duṃḍiṃtum̐dalaluttariṃtum̐ jeṃḍubeṃḍuga.” naṃcu sīta nīkṣiṃci:

Report an error

యోడకోడకు దేవి! యుగ్రరాక్షసుని నీ డాడి నీ చెఱ నే విడిపింతు.”

yōḍakōḍaku dēvi! yugrarākṣasuni nī ḍāḍi nī ceṟa nē viḍipiṃtu.”

Report an error

ననిన యా పల్కు మహానిదాఘమున వనమయూరికి ఘనధ్వనియునుబోలి

nanina yā palku mahānidāghamuna vanamayūriki ghanadhvaniyunubōli

Report an error

వాడినచేనికి వానయుఁబోలి వేడుక గొంత గావించిన నలరి

vāḍinacēniki vānayum̐bōli vēḍuka goṃta gāviṃcina nalari

Report an error

యా సీత వల్కె: “జటాయువా! నన్ను నీ సురకంటకుండెత్తి యుద్వృత్తి

yā sīta valke: “jaṭāyuvā! nannu nī surakaṃṭakuṃḍetti yudvr̥tti

Report an error

మాయచే రామలక్ష్మణుల వంచించి యో యన్న! కొనిపోవుచున్నవాఁ.”డనిన

māyacē rāmalakṣmaṇula vaṃciṃci yō yanna! konipōvucunnavām̐.”ḍanina

Report an error

నలుకమై రథమున కడ్డంబు వచ్చి ప్రలయాభ్రనిర్ఘోషపటుభాషణములఁ

nalukamai rathamuna kaḍḍaṃbu vacci pralayābhranirghōṣapaṭubhāṣaṇamulam̐

Report an error

బలుమాఱు దశకంఠు భర్జించి మించి నిలిచి యిట్లనియె నూనిన కోప మెసగఁ

balumāṟu daśakaṃṭhu bharjiṃci miṃci nilici yiṭlaniye nūnina kōpa mesagam̐

Report an error

“బరమపావనుఁడైన బ్రహ్మమన్మఁడవు; వరపుణ్యనిధి విశ్రవసు తనూజుఁడవు;

“baramapāvanum̐ḍaina brahmamanmam̐ḍavu; varapuṇyanidhi viśravasu tanūjum̐ḍavu;

Report an error

ధనదానుజుండవు; దానవాగ్రణివి; విను మిట్టికృత్యంబు విహితమే నీకు?

dhanadānujuṃḍavu; dānavāgraṇivi; vinu miṭṭikr̥tyaṃbu vihitamē nīku?

Report an error

జగదేకపతి రామచంద్రుని దేవిఁ దగదోరి! కొనిపోవఁదగిలి యిబ్భంగి.

jagadēkapati rāmacaṃdruni dēvim̐ dagadōri! konipōvam̐dagili yibbhaṃgi.

Report an error

ముదలించి తేక రాముని డాఁగురించి సుదతి నీ భంగిఁదెచ్చుట బంటుతనమె?

mudaliṃci tēka rāmuni ḍām̐guriṃci sudati nī bhaṃgim̐deccuṭa baṃṭutaname?

Report an error

నీ లంకయును నిన్ను నీ బంధుజనులఁ గాలుచు నోరి! రాఘవుకోపవహ్ని.

nī laṃkayunu ninnu nī baṃdhujanulam̐ gālucu nōri! rāghavukōpavahni.

Report an error

యెఱిఁగియు విషమిటు లేల క్రోలెదవు? ఎఱగొన్న పెనుబాము నేల త్రొక్కెదవు?

yeṟim̐giyu viṣamiṭu lēla krōledavu? eṟagonna penubāmu nēla trokkedavu?

Report an error

అఱువదివేలేండ్ల యతివృద్ధు నన్ను నెఱఁగుదో యెఱుఁగవో యే జటాయువను.

aṟuvadivēlēṃḍla yativr̥ddhu nannu neṟam̐gudō yeṟum̐gavō yē jaṭāyuvanu.

Report an error

ఈ పుణ్యసాధ్వి నీవిప్పుడొప్పించి పోపొమ్ము; పోకున్నఁ బోరిలో నిన్నుఁ

ī puṇyasādhvi nīvippuḍoppiṃci pōpommu; pōkunnam̐ bōrilō ninnum̐

Report an error

దుండాగ్ర ధారలఁదునియలు సేసి మండిత చర్మమర్మములు భేదించి

duṃḍāgra dhāralam̐duniyalu sēsi maṃḍita carmamarmamulu bhēdiṃci

Report an error

యడరి నీదైన ప్రాణాభిమానములు విడిపించి జానకి విడిపింతు.” ననుడు

yaḍari nīdaina prāṇābhimānamulu viḍipiṃci jānaki viḍipiṃtu.” nanuḍu

Report an error

నరదంబు నిలిపి యుదగ్రుఁడై దైత్య వరుఁడల్గి విలు గుణధ్వని సేసి యార్చి

naradaṃbu nilipi yudagrum̐ḍai daitya varum̐ḍalgi vilu guṇadhvani sēsi yārci

Report an error

ఘోరబాణము లేయఁగోపించి విహగ వీరుఁడు తద్బాణవితతులు ద్రుంచి

ghōrabāṇamu lēyam̐gōpiṃci vihaga vīrum̐ḍu tadbāṇavitatulu druṃci

Report an error

యురుపక్షయుగమున నురము దట్టించి పొరి ఫాలములు సీఱి భుజములు వొడిచి

yurupakṣayugamuna nuramu daṭṭiṃci pori phālamulu sīṟi bhujamulu voḍici

Report an error

దరమిడి ఖరనఖతతుల నొప్పింపఁ గరముఁగోపించి రాక్షసకులేశ్వరుఁడు

daramiḍi kharanakhatatula noppiṃpam̐ garamum̐gōpiṃci rākṣasakulēśvarum̐ḍu

Report an error

ఖగరాజు నెఱకలు గాఁడనుగ్రంబు లగు బాణములు వది యడరి యేయుటయుఁ

khagarāju neṟakalu gām̐ḍanugraṃbu lagu bāṇamulu vadi yaḍari yēyuṭayum̐

Report an error

దుండాగ్రమున విల్లు దునియలుగాఁగ ఖండించి వడిఁబతాకము నేలఁగలపి

duṃḍāgramuna villu duniyalugām̐ga khaṃḍiṃci vaḍim̐batākamu nēlam̐galapi

Report an error

దనుజేశుమకుటముల్‌ ధరఁబడఁదన్ని పెనఁచి సారథిఁబట్టి ప్రేవులు సీఱి

danujēśumakuṭamul dharam̐baḍam̐danni penam̐ci sārathim̐baṭṭi prēvulu sīṟi

Report an error

తలమీఱి దనుజురథ్యములఁజెండాడి చలమొప్ప నరదంబుఁజదియ మోఁదుటయు

talamīṟi danujurathyamulam̐jeṃḍāḍi calamoppa naradaṃbum̐jadiya mōm̐duṭayu

Report an error

విరథుఁడై రాక్షసవిభుఁడు గంపించి ధరణిపైఁబడి లేచి ధరణిజఁగొనుచు

virathum̐ḍai rākṣasavibhum̐ḍu gaṃpiṃci dharaṇipaim̐baḍi lēci dharaṇijam̐gonucu

Report an error

మాయాబలంబున మఱి మింటి కెగసి పోయెఁ.,బోయినఁజూచి పోనీక మఱియు

māyābalaṃbuna maṟi miṃṭi kegasi pōyem̐.,bōyinam̐jūci pōnīka maṟiyu

Report an error

నడ్డగించి జటాయు వాకాశవీథి నొడ్డినగతిఁదాఁకి:“యోరి, పాపాత్మ!

naḍḍagiṃci jaṭāyu vākāśavīthi noḍḍinagatim̐dām̐ki:“yōri, pāpātma!

Report an error

జుణిఁగి యే లోకంబుఁజొచ్చిననైనఁ దృణముగాఁబట్టి వధింతు ని”న్ననినఁ

juṇim̐gi yē lōkaṃbum̐joccinanainam̐ dr̥ṇamugām̐baṭṭi vadhiṃtu ni”nnaninam̐

Report an error

దిరిగి రోషమున దైతేయవల్లభుఁడు కరముగ్రమైన ముద్గరము వైచుటయు

dirigi rōṣamuna daitēyavallabhum̐ḍu karamugramaina mudgaramu vaicuṭayu

Report an error

నది తుండమునఁద్రుంచి యతనిమస్తములు సదియంగ నడిచి కేశములు రాల్చుటయు

nadi tuṃḍamunam̐druṃci yatanimastamulu sadiyaṃga naḍici kēśamulu rālcuṭayu

Report an error

సురవైరి గోపించి స్రుక్కక కదిసి యురువడిఁబక్షీంద్రు నొడిసి రాఁదిగిచి

suravairi gōpiṃci srukkaka kadisi yuruvaḍim̐bakṣīṃdru noḍisi rām̐digici

Report an error

మొగిఁబట్టి యందంద ముష్టిఘట్టనలఁ దగిలి నొప్పింప నుద్ధతశక్తి మెఱయ

mogim̐baṭṭi yaṃdaṃda muṣṭighaṭṭanalam̐ dagili noppiṃpa nuddhataśakti meṟaya

Report an error

దనుజేంద్రవిహగేంద్రదారుణయుద్ధ మనిమిషాదులు సూచి యచ్చెరుపడిరి.

danujēṃdravihagēṃdradāruṇayuddha manimiṣādulu sūci yaccerupaḍiri.

Report an error

అరుదైనకడమిమై నంత రావణుఁడు కర ముగ్రగతి మించి ఖడ్గమంకించి

arudainakaḍamimai naṃta rāvaṇum̐ḍu kara mugragati miṃci khaḍgamaṃkiṃci

Report an error

యెఱకలుపదములు నెగిచి త్రుంచుటయు నెఱిదూలి ఖగపతి నేలకువ్రాలె

yeṟakalupadamulu negici truṃcuṭayu neṟidūli khagapati nēlakuvrāle

Report an error

నంత సంతోషించి యవనిజఁగొనుచు నెంతయు రయమున నేఁగె రావణుఁడు

naṃta saṃtōṣiṃci yavanijam̐gonucu neṃtayu rayamuna nēm̐ge rāvaṇum̐ḍu

Report an error

అప్పుడు బ్రహ్మాదులగు సురల్‌ మునులుఁ “దప్పదు రాముచే దశకంఠుఁ డీల్గు;

appuḍu brahmādulagu sural munulum̐ “dappadu rāmucē daśakaṃṭhum̐ ḍīlgu;

Report an error

మన మనోరథములు మనకు సిద్ధించు.” నని చెప్పికొని యుబ్బిరందఱుఁబ్రీతి.

mana manōrathamulu manaku siddhiṃcu.” nani ceppikoni yubbiraṃdaṟum̐brīti.

Report an error

ననిమిషపథమున నంత రావణుఁడు చనురయంబున సీతచరణ నూపురము

nanimiṣapathamuna naṃta rāvaṇum̐ḍu canurayaṃbuna sītacaraṇa nūpuramu

Report an error

సురవైరి కుత్పాత సూచకంబగుచు నురువడిఁబఱతెంచునుల్కయై పడియె.

suravairi kutpāta sūcakaṃbagucu nuruvaḍim̐baṟateṃcunulkayai paḍiye.

Report an error

జగతిపై జాహ్నవి జలధార లొలుకు పగిదియై యాకాశపథమున నుండి

jagatipai jāhnavi jaladhāra loluku pagidiyai yākāśapathamuna nuṃḍi

Report an error

చెలువకుచంబులఁజెలువొందుహార ములు ద్రెవ్వి యందంద పుడమిపైఁబడియెఁ.

celuvakucaṃbulam̐jeluvoṃduhāra mulu drevvi yaṃdaṃda puḍamipaim̐baḍiyem̐.

Report an error

నా లోన సీత“హాహా”రవంబెసగ లోలోనఁగడు నడలుచుఁబోయి పోయి

nā lōna sīta“hāhā”ravaṃbesaga lōlōnam̐gaḍu naḍalucum̐bōyi pōyi

Report an error

యట ఋశ్యమూకంబునందు వానరులఁ బటుసత్త్వులేవురఁబరికించి కాంచి

yaṭa r̥śyamūkaṃbunaṃdu vānarulam̐ baṭusattvulēvuram̐barikiṃci kāṃci

Report an error

తన వస్త్రమునఁగొంత దగఁజించిపుచ్చి. తనభూషణంబులు దాన బంధించి

tana vastramunam̐goṃta dagam̐jiṃcipucci. tanabhūṣaṇaṃbulu dāna baṃdhiṃci

Report an error

“వీరైన రామభూవిభున కీ వార్త లారయఁదెలుపరే.”యను బుద్ధినపుడు

“vīraina rāmabhūvibhuna kī vārta lārayam̐deluparē.”yanu buddhinapuḍu

Report an error

తడయక రాముచే దశకంఠుఁడింకఁ జెడునంచు ముడియ వైచినబాగు దోప

taḍayaka rāmucē daśakaṃṭhum̐ḍiṃkam̐ jeḍunaṃcu muḍiya vaicinabāgu dōpa

Report an error

వారి మధ్యంబున వైచుచుఁబోవ వారును దాఁచిరి వడిఁదానిఁబుచ్చి.

vāri madhyaṃbuna vaicucum̐bōva vārunu dām̐ciri vaḍim̐dānim̐bucci.

Report an error

దనుజాధిపతి యంత దశరథాత్మజులు ‘దనవెంట వత్తు’ రన్‌తల్లడంబునను

danujādhipati yaṃta daśarathātmajulu ‘danaveṃṭa vattu’ rantallaḍaṃbunanu

Report an error

వెలవెలఁబాఱుచు వెనుకఁజూచుచును దలఁకుచు వడి సముద్రము దాటిపోయి

velavelam̐bāṟucu venukam̐jūcucunu dalam̐kucu vaḍi samudramu dāṭipōyi

Report an error

జడిగొనుమరణసూచకనిమిత్తములు పొడసూచుచును రయంబునలంకఁజొచ్చి

jaḍigonumaraṇasūcakanimittamulu poḍasūcucunu rayaṃbunalaṃkam̐jocci

Report an error

Illustration: Verse & Place (Project-owned).