ఆలోన సుగ్రీవుఁడా ఋశ్యమూక శైలసానువులందుఁ జరియించుచుండి
ālōna sugrīvum̐ḍā r̥śyamūka śailasānuvulaṃdum̐ jariyiṃcucuṃḍi
కిష్కింధాకాండము · సుగ్రీవసఖ్యము · కిష్కింధాకాండము · సుగ్రీవసఖ్యము
kiṣkiṃdhākāṃḍamu · sugrīvasakhyamu
Kishkindha Kanda, section 2: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
98 passagesTelugu with transliteration
ఆలోన సుగ్రీవుఁడా ఋశ్యమూక శైలసానువులందుఁ జరియించుచుండి
ālōna sugrīvum̐ḍā r̥śyamūka śailasānuvulaṃdum̐ jariyiṃcucuṃḍi
యా పంపచేరువయందున్న రామ భూపాలు లక్ష్మణుఁబొడఁగాంచి వెఱచి
yā paṃpacēruvayaṃdunna rāma bhūpālu lakṣmaṇum̐boḍam̐gāṃci veṟaci
యచలంబుపైకి గుండనకచెట్టనక కిచకిచధ్వనులతోఁగిచకొట్టుకొనుచు
yacalaṃbupaiki guṃḍanakaceṭṭanaka kicakicadhvanulatōm̐gicakoṭṭukonucu
నెగఁబ్రాఁకి యొక్కచో నేకాంతముండి యగచరులకు వారి నట చూపిచూపి;
negam̐brām̐ki yokkacō nēkāṃtamuṃḍi yagacarulaku vāri naṭa cūpicūpi;
“విలుపూని యిద్దఱు వివిధశస్త్రాస్త్ర కలితులై యదె పంపకడ నున్నవారు;
“vilupūni yiddaṟu vividhaśastrāstra kalitulai yade paṃpakaḍa nunnavāru;
వినుఁ,డిందుఁ,బ్రచ్ఛన్నవేషులై వాలి పనుపున మనలఁజంపఁగ వచ్చినారొ?
vinum̐,ḍiṃdum̐,bracchannavēṣulai vāli panupuna manalam̐jaṃpam̐ga vaccināro?
కాదేని మునులకు ఖడ్గతూణీర కోదండశరములగొడవ యేమిటికి?
kādēni munulaku khaḍgatūṇīra kōdaṃḍaśaramulagoḍava yēmiṭiki?
వినుతసాహసులైన వీరివేషములు గనుఁగొన నా బుద్ధి గలఁగుచున్నదియు.
vinutasāhasulaina vīrivēṣamulu ganum̐gona nā buddhi galam̐gucunnadiyu.
నెక్కడికైనను నేఁగుట కార్య; మిక్కడ నుండుట యిది బుద్ధి గాదు.”
nekkaḍikainanu nēm̐guṭa kārya; mikkaḍa nuṃḍuṭa yidi buddhi gādu.”
అని మంత్రివరులతో నాడువాక్యములు విని హనుమంతుండు విమలుఁడై పలికె:.
ani maṃtrivarulatō nāḍuvākyamulu vini hanumaṃtuṃḍu vimalum̐ḍai palike:.
“బూని వీరలఁజూడఁబుణ్యమానసులు గాని కానేరరు కపటమానసులు;
“būni vīralam̐jūḍam̐buṇyamānasulu gāni kānēraru kapaṭamānasulu;
ఆ రవిచంద్రులోయన నొప్పు వీరు కారణపురుషులు కడు విచారింప;
ā ravicaṃdrulōyana noppu vīru kāraṇapuruṣulu kaḍu vicāriṃpa;
నే రూపమున వచ్చి యిందున్నవారొ? వీరి చొప్పెఱుఁగక వెఱవ నేమిటికి?
nē rūpamuna vacci yiṃdunnavāro? vīri coppeṟum̐gaka veṟava nēmiṭiki?
ననిన సుగ్రీవుండు హనుమంతుఁజూచి: “విను వాలిపనుపున వీరలిచ్చటికిఁ
nanina sugrīvuṃḍu hanumaṃtum̐jūci: “vinu vālipanupuna vīraliccaṭikim̐
జనుదెంచి రను శంక జనియించె నాకుఁ. గినిసి యే వేళ నే కీడెంచునొక్కొ?
janudeṃci ranu śaṃka janiyiṃce nākum̐. ginisi yē vēḷa nē kīḍeṃcunokko?
తన పగతుని నమ్మఁదగ. దటుగాన చని నీవు వీరలఁజతురతఁగదిసి
tana pagatuni nammam̐daga. daṭugāna cani nīvu vīralam̐jaturatam̐gadisi
వీ రేలవచ్చిరో వీరి లోఁతెఱిఁగి వీరితో భాషించి వేవేగ వచ్చి
vī rēlavaccirō vīri lōm̐teṟim̐gi vīritō bhāṣiṃci vēvēga vacci
పవనజ! నాలోని భయమెల్ల మాన్పు; మవిరతగతి నేఁగు.”మని వీడుకొలిపి
pavanaja! nālōni bhayamella mānpu; maviratagati nēm̐gu.”mani vīḍukolipi
యలమెడు భీతిమై నందుండ వెఱచి మలయాద్రి కటువోయె మంత్రులుఁదాను.
yalameḍu bhītimai naṃduṃḍa veṟaci malayādri kaṭuvōye maṃtrulum̐dānu.
వటు వేషధారియై వాయునందనుఁడు నట పంపకడకుఁ దా నర్థితోఁబోయి
vaṭu vēṣadhāriyai vāyunaṃdanum̐ḍu naṭa paṃpakaḍakum̐ dā narthitōm̐bōyi
కరమర్థి రామలక్ష్మణులకు మ్రొక్కి కరములు ముకుళించి కడుభక్తిఁబలికె:
karamarthi rāmalakṣmaṇulaku mrokki karamulu mukuḷiṃci kaḍubhaktim̐balike:
“నవని నింద్రోపేంద్రు, లర్థినాశ్వినులు, రవిచంద్రులన రూపరమ్యతతోడ
“navani niṃdrōpēṃdru, larthināśvinulu, ravicaṃdrulana rūparamyatatōḍa
నెగుబుజంబులతోడ నిందుబింబంబు నగు మొగంబులతోడ నలినపత్రములఁ
negubujaṃbulatōḍa niṃdubiṃbaṃbu nagu mogaṃbulatōḍa nalinapatramulam̐
దెగడుకన్నులతోడ దివిజులు మెచ్చి పొగడు విక్రమకళాభుజశక్తితోడ
degaḍukannulatōḍa divijulu mecci pogaḍu vikramakaḷābhujaśaktitōḍa
నరుదైన రాజచిహ్నములతో మీరు శరచాపహస్తులై చనుదెంచినారు.
narudaina rājacihnamulatō mīru śaracāpahastulai canudeṃcināru.
భూరితపోవేషములు మీకు నేల? మీ రెవ్వ?రిచటి కేమిటికి వచ్చితిరి?”
bhūritapōvēṣamulu mīku nēla? mī revva?ricaṭi kēmiṭiki vaccitiri?”
అని సుధామధురవాక్యంబుల నధిక వినయవిధేయుఁడై విన్నవించుటయు
ani sudhāmadhuravākyaṃbula nadhika vinayavidhēyum̐ḍai vinnaviṃcuṭayu
నతని వాచాశుద్ధి కతనిబుద్ధికిని నతనిచమత్కృతి కతని యాకృతికి
natani vācāśuddhi katanibuddhikini natanicamatkr̥ti katani yākr̥tiki
నతనిమనఃప్రీతి కతని నీతికిని మతి సంతసిల్లి రామక్షితీశ్వరుఁడు
natanimanaḥprīti katani nītikini mati saṃtasilli rāmakṣitīśvarum̐ḍu
తమ్మునిఁజూచి:“యీతనియట్లు వలుకఁ దమ్మిచూలికిని నాతనివధూమణికిఁ
tammunim̐jūci:“yītaniyaṭlu valukam̐ dammicūlikini nātanivadhūmaṇikim̐
దగుఁగాక యొరులకుఁదరమె? వ్యాకరణ నిగమశాస్త్రంబులన్నియు నేర్వఁబోలు
dagum̐gāka yorulakum̐darame? vyākaraṇa nigamaśāstraṃbulanniyu nērvam̐bōlu
నితనిసల్లాపంబు నితనిరూపంబు నతులలక్షణలక్షితాను భావంబు.
nitanisallāpaṃbu nitanirūpaṃbu natulalakṣaṇalakṣitānu bhāvaṃbu.
నిటువంటిదూత నా కిపుడబ్బెనేని ఘటియింపకున్నె మత్కార్యంబులెల్లఁ?
niṭuvaṃṭidūta nā kipuḍabbenēni ghaṭiyiṃpakunne matkāryaṃbulellam̐?
గావున మత్కార్యగతు లీతనికినిఁ గోవిదాత్మక! పూసగ్రుచ్చినయట్లు
gāvuna matkāryagatu lītanikinim̐ gōvidātmaka! pūsagruccinayaṭlu
చెప్పుమేర్పడ.” నన్న శ్రీరాముతమ్ముఁ డప్పుడు ప్రియమంది హనుమంతుఁజూచి:
ceppumērpaḍa.” nanna śrīrāmutammum̐ ḍappuḍu priyamaṃdi hanumaṃtum̐jūci:
‘యేమన్నదమ్ముల మిక్ష్వాకు కులుల; మీ మహాత్ముఁడు రాముఁ; డేను లక్ష్మణుఁడ
‘yēmannadammula mikṣvāku kulula; mī mahātmum̐ḍu rāmum̐; ḍēnu lakṣmaṇum̐ḍa
దశరథరాజనందనుల మిద్దఱము. దశరథుపనుపునఁదపసివేషముల
daśaratharājanaṃdanula middaṟamu. daśarathupanupunam̐dapasivēṣamula
దండకావనమునఁదగిలి వర్తించు చుండ రాముని దేవి నుర్వీతనూజ
daṃḍakāvanamunam̐dagili vartiṃcu cuṃḍa rāmuni dēvi nurvītanūja
మముడాఁగురించి దుర్మదుఁడు రావణుఁడు క్రమమేదికొనిపోయెఁగపటమార్గమున.
mamuḍām̐guriṃci durmadum̐ḍu rāvaṇum̐ḍu kramamēdikonipōyem̐gapaṭamārgamuna.
వానిపోయినజాడ వదలక వెదకఁ గానలనడుమ నొక్కట వచ్చివచ్చి
vānipōyinajāḍa vadalaka vedakam̐ gānalanaḍuma nokkaṭa vaccivacci
శబరి సుగ్రీవునిచరితంబు సెప్ప సబలుఁడాతఁడు మాకుసఖుఁడుగాఁగోరి
śabari sugrīvunicaritaṃbu seppa sabalum̐ḍātam̐ḍu mākusakhum̐ḍugām̐gōri
వచ్చితి మిచటి,కెవ్వఁడవు నీ? వింక నచ్చుగా నెఱిఁగింపు మనఘ! నీ తెఱఁగు
vacciti micaṭi,kevvam̐ḍavu nī? viṃka naccugā neṟim̐giṃpu managha! nī teṟam̐gu
అని పల్క:“హనుమంతుఁడనుపేరివాఁడ; నినతనూజునిమంత్రి; నే వాయుసుతుఁడ;
ani palka:“hanumaṃtum̐ḍanupērivām̐ḍa; ninatanūjunimaṃtri; nē vāyusutum̐ḍa;
నాంజనేయుఁడ; భిక్షుకాకృతి నిప్పు డంజక మీ చందమరయ వచ్చితిని.
nāṃjanēyum̐ḍa; bhikṣukākr̥ti nippu ḍaṃjaka mī caṃdamaraya vaccitini.
వినుఁడు: సుగ్రీవుఁడు విశ్రుతకీర్తి వనచరులకు రాజు వరబలాధికుఁడు
vinum̐ḍu: sugrīvum̐ḍu viśrutakīrti vanacarulaku rāju varabalādhikum̐ḍu
భానుసూనుఁడు బృహద్భానుతేజుండు మానభూషణుఁడసమానవిక్రముఁడు
bhānusūnum̐ḍu br̥hadbhānutējuṃḍu mānabhūṣaṇum̐ḍasamānavikramum̐ḍu
అన్నయౌవాలిచే నపహృతరాజ్య ఖిన్నుడై యిప్పుడిగ్గిరి నున్నవాఁడు.
annayauvālicē napahr̥tarājya khinnuḍai yippuḍiggiri nunnavām̐ḍu.
ఆర్తుఁడు మీ సఖుఁడై యుండజేయ నేర్తు.”నావుడు రామనృపుచిత్త మెఱిఁగి
ārtum̐ḍu mī sakhum̐ḍai yuṃḍajēya nērtu.”nāvuḍu rāmanr̥pucitta meṟim̐gi
మఱియును సౌమిత్రి మారుతిఁజూచి తెఱఁగొప్ప నతనితో ధీరుఁడై పలికె:
maṟiyunu saumitri mārutim̐jūci teṟam̐goppa natanitō dhīrum̐ḍai palike:
“విను రాఘవుఁడు లోకవిఖ్యాతసత్త్వుఁ డనుపమదివ్యాస్త్రుఁడసమసాహసుఁడు
“vinu rāghavum̐ḍu lōkavikhyātasattvum̐ ḍanupamadivyāstrum̐ḍasamasāhasum̐ḍu
కరుణాపయోధి యకారణసుకృతి శరణాగతత్రాణసద్ధర్మపరుఁడు
karuṇāpayōdhi yakāraṇasukr̥ti śaraṇāgatatrāṇasaddharmaparum̐ḍu
జగదేకనాథుం డశరణశరణ్యుఁ డగణితగుణగణ్యుఁడధికాధికుండు
jagadēkanāthuṃ ḍaśaraṇaśaraṇyum̐ ḍagaṇitaguṇagaṇyum̐ḍadhikādhikuṃḍu
అతిలోకవిక్రముఁడతిసత్యవాది హితుఁడనై బంటనై యేను వర్తింతుఁ;
atilōkavikramum̐ḍatisatyavādi hitum̐ḍanai baṃṭanai yēnu vartiṃtum̐;
గావున రాఘవక్ష్మాపాలమణికి లే వసాధ్యంబులు లెక్కింప నెందుఁ
gāvuna rāghavakṣmāpālamaṇiki lē vasādhyaṃbulu lekkiṃpa neṃdum̐
గుటిలరాక్షసుఁడున్నగుఱుతు మున్నెఱిగి యిట సీత సాధింప నేమ చాలుదుము.
guṭilarākṣasum̐ḍunnaguṟutu munneṟigi yiṭa sīta sādhiṃpa nēma cāludumu.
అలవుమై నేకాకులై పోవఁదగదు. తలపోయ నిది రాజధర్మంబు గాదు.
alavumai nēkākulai pōvam̐dagadu. talapōya nidi rājadharmaṃbu gādu.
కాన సుగ్రీవునిఁ గైకొనఁదలఁపు మానవాధీశ్వరుమదిలోనఁగలదు.
kāna sugrīvunim̐ gaikonam̐dalam̐pu mānavādhīśvarumadilōnam̐galadu.
ఇటమీఁద నీ కార్య మే వెంటనైన ఘటియింపు.”మనవుడుఁగరువలిసుతుఁడు
iṭamīm̐da nī kārya mē veṃṭanaina ghaṭiyiṃpu.”manavuḍum̐garuvalisutum̐ḍu
నెఱయ సంతసమంది నిజమూర్తిఁజూపి మఱి తన్ను రామలక్ష్మణులు మన్నింపఁ
neṟaya saṃtasamaṃdi nijamūrtim̐jūpi maṟi tannu rāmalakṣmaṇulu manniṃpam̐
దనుఁగృతకృత్యుగాఁదపననందనుని వనచరరాజుగా వరుస నెన్నుచును
danum̐gr̥takr̥tyugām̐dapananaṃdanuni vanacararājugā varusa nennucunu
నరిగి రాఘవులవృత్తాంతమంతయును దొరకొని సుగ్రీవుతో నొప్పఁజెప్పి
narigi rāghavulavr̥ttāṃtamaṃtayunu dorakoni sugrīvutō noppam̐jeppi
రమణీయమూర్తుల రామలక్ష్మణుల కమనీయగుణములు కడఁగి వర్ణించి:
ramaṇīyamūrtula rāmalakṣmaṇula kamanīyaguṇamulu kaḍam̐gi varṇiṃci:
“జగతిపై నతిశోకసాగరమగ్నుఁ డగు నీకు రఘురాముఁడనుతెప్ప గలిగె.
“jagatipai natiśōkasāgaramagnum̐ ḍagu nīku raghurāmum̐ḍanuteppa galige.
బ్రదికితి సుగ్రీవ; పగయెల్లఁదీరెఁ; దుదముట్టఁగలిగె సంతోషంబు నీకు.
bradikiti sugrīva; pagayellam̐dīrem̐; dudamuṭṭam̐galige saṃtōṣaṃbu nīku.
నా దశరథపుత్రుఁడా సుచారిత్రుఁ డా దయాపరమూర్తి యా సత్యవాది
nā daśarathaputrum̐ḍā sucāritrum̐ ḍā dayāparamūrti yā satyavādi
ఆ పుణ్యనిధి రాముఁడట నీకుఁగర్త! నీ పుణ్యమేమన నేర్తు సుగ్రీవ!
ā puṇyanidhi rāmum̐ḍaṭa nīkum̐garta! nī puṇyamēmana nērtu sugrīva!
నిరుపేదవానికి నిధి యబ్బినట్లు కరమర్థి నీ కిట గల్గె రాఘవుఁడు.
nirupēdavāniki nidhi yabbinaṭlu karamarthi nī kiṭa galge rāghavum̐ḍu.
ఆ మహాత్ముఁడు దండ్రియానతి దండ కామధ్యమున నుండఁగా దశాననుఁడు
ā mahātmum̐ḍu daṃḍriyānati daṃḍa kāmadhyamuna nuṃḍam̐gā daśānanum̐ḍu
తనదేవి మ్రుచ్చిలితనమున నెత్తి కొనిపోవ వాని మార్కొని త్రుంచివైవఁ
tanadēvi mruccilitanamuna netti konipōva vāni mārkoni truṃcivaivam̐
జింతించి నీతోడఁజెలిమి వాటింప నెంతయుఁదలపోసి యే తెంచె నిటకు.”
jiṃtiṃci nītōḍam̐jelimi vāṭiṃpa neṃtayum̐dalapōsi yē teṃce niṭaku.”
ననిన సుగ్రీవుండు హర్షంబు నొంది యనిలనందనుఁజూచి యర్థితోఁబలికెఁ:
nanina sugrīvuṃḍu harṣaṃbu noṃdi yanilanaṃdanum̐jūci yarthitōm̐balikem̐:
“బవనజ! నాలోనిభయమెల్ల నడఁగెఁ; దవిలి నా చేసినతపమెల్లఁబండె.
“bavanaja! nālōnibhayamella naḍam̐gem̐; davili nā cēsinatapamellam̐baṃḍe.
నలవడ నాకు నీయట్టి యంజనము గలుగుటఁగంటి రాఘవనిధానంబుఁ;
nalavaḍa nāku nīyaṭṭi yaṃjanamu galuguṭam̐gaṃṭi rāghavanidhānaṃbum̐;
గలఁగక నీవంటి కర్ణధారుండు గలుగుట శోకాబ్ధిఁగడతేఱఁగంటిఁ.
galam̐gaka nīvaṃṭi karṇadhāruṃḍu galuguṭa śōkābdhim̐gaḍatēṟam̐gaṃṭim̐.
గడఁకతో ఋశ్యమూకమునకు వారిఁ దొడితెచ్చి నాదైన దుఃఖంబు మాన్పు.
gaḍam̐katō r̥śyamūkamunaku vārim̐ doḍitecci nādaina duḥkhaṃbu mānpu.
పొ.”మ్మనవుడు వాయుపుత్త్రుండు వోయి నెమ్మితో రఘురామనృపతికి మ్రొక్కి:
po.”mmanavuḍu vāyuputtruṃḍu vōyi nemmitō raghurāmanr̥patiki mrokki:
“దేవ! సుగ్రీవుండు దేవరబంటు దేవ! నిన్ దర్శింపఁదివుఱుచున్నాఁడు.
“dēva! sugrīvuṃḍu dēvarabaṃṭu dēva! nin darśiṃpam̐divuṟucunnām̐ḍu.
విచ్చేయుఁ.”డని విన్నవించిన రాముఁ డిచ్చలో హర్షించి యేపు దీపించి
viccēyum̐.”ḍani vinnaviṃcina rāmum̐ ḍiccalō harṣiṃci yēpu dīpiṃci
హనుమంతుఁగొనియాడి యతిశుభలగ్న మున హనుమంతుండు ముందట నడవఁ
hanumaṃtum̐goniyāḍi yatiśubhalagna muna hanumaṃtuṃḍu muṃdaṭa naḍavam̐
దనతమ్ముఁడునుఁదానుఁదగ ఋశ్యమూక మున కేఁగియానందమునఁబొందెవిభుఁడు
danatammum̐ḍunum̐dānum̐daga r̥śyamūka muna kēm̐giyānaṃdamunam̐boṃdevibhum̐ḍu
హనుమంతుఁడంత నేకాంతంబునందు మనుజేశ్వరులడించి మలయాద్రి కరిగి
hanumaṃtum̐ḍaṃta nēkāṃtaṃbunaṃdu manujēśvarulaḍiṃci malayādri karigi
శ్రీరామదర్శనోద్గ్రీవు సుగ్రీవుఁ జేరి:“నీ కోరికల్ చేకూరె నింక;
śrīrāmadarśanōdgrīvu sugrīvum̐ jēri:“nī kōrikal cēkūre niṃka;
రా దేవ! వచ్చిరి రామలక్ష్మణులు నాదట ఋశ్యమూకాద్రికి.”ననుడు
rā dēva! vacciri rāmalakṣmaṇulu nādaṭa r̥śyamūkādriki.”nanuḍu
నినతనూజుఁడు ప్రీతి నిచ్చలో నుబ్బి మనుజవేషము దాల్చి మకుటకేయూర
ninatanūjum̐ḍu prīti niccalō nubbi manujavēṣamu dālci makuṭakēyūra
ఘనతరశృంగారకలితుఁడై యపుడు తన మంత్రులును దానుఁదడయ కేతెంచి
ghanataraśr̥ṃgārakalitum̐ḍai yapuḍu tana maṃtrulunu dānum̐daḍaya kēteṃci
డక్కక భక్తితో డాసి రామునకుఁ జక్కఁజాగిలి మ్రొక్కి సంప్రీతి వెలయ
ḍakkaka bhaktitō ḍāsi rāmunakum̐ jakkam̐jāgili mrokki saṃprīti velaya
ముకుళితహస్తుఁడై ముందటనున్న యకలంకు సుగ్రీవు నధిపతి సూచి
mukuḷitahastum̐ḍai muṃdaṭanunna yakalaṃku sugrīvu nadhipati sūci
యాలింగనము సేసి యతని కిట్లనియె. నాలోన దరహాస మమృతమై తొరుగ:
yāliṃganamu sēsi yatani kiṭlaniye. nālōna darahāsa mamr̥tamai toruga:
“నీ వాయుసుతునిచే నినసుత! యేను నీ విక్రమంబును నీ గుణావళులు
“nī vāyusutunicē ninasuta! yēnu nī vikramaṃbunu nī guṇāvaḷulu
విని ప్రీతి నొందితి; వెఱవకు మింక. నెనసి నీ పగవాని నేనె చంపెదను.
vini prīti noṃditi; veṟavaku miṃka. nenasi nī pagavāni nēne caṃpedanu.
నా కాప్తబంధుండు నమ్మినసఖుఁడు నీకంటె నొకఁడు గణిం చినఁగలఁడె?”
nā kāptabaṃdhuṃḍu namminasakhum̐ḍu nīkaṃṭe nokam̐ḍu gaṇiṃ cinam̐galam̐ḍe?”
యని యూఱడించిన నర్కనందనుఁడు “ననిచినబంటుగా నన్నుఁగైకొంటి;
yani yūṟaḍiṃcina narkanaṃdanum̐ḍu “nanicinabaṃṭugā nannum̐gaikoṃṭi;
దేవ! నీ కారుణ్యదృష్టి నన్ సోఁకె. నేవెంట ధన్యుఁడ నే నింక నెందు.
dēva! nī kāruṇyadr̥ṣṭi nan sōm̐ke. nēveṃṭa dhanyum̐ḍa nē niṃka neṃdu.
నలినాప్తకులనాథ! నా యట్టిబంటు గలిగె నీ; కటుగాన కడిమి నెందు.
nalināptakulanātha! nā yaṭṭibaṃṭu galige nī; kaṭugāna kaḍimi neṃdu.
“దివిరి రావణుని వధించితిఁ; గడఁగి యవనిజఁగైకొంటి.” నని నిశ్చయింపు.”
“diviri rāvaṇuni vadhiṃcitim̐; gaḍam̐gi yavanijam̐gaikoṃṭi.” nani niścayiṃpu.”
మని రామసుగ్రీవు లన్యోన్యభాష లనలు సన్నిధిఁబల్కి యకలంకులైరి.
mani rāmasugrīvu lanyōnyabhāṣa lanalu sannidhim̐balki yakalaṃkulairi.
అపుడర్క సుతునకు నా రాఘవునకు విపులభూరుహశాఖ విఱిచి వాయుజుఁడు
apuḍarka sutunaku nā rāghavunaku vipulabhūruhaśākha viṟici vāyujum̐ḍu
ఆసనంబుగ వైవ నందుఁగూర్చుండి యాసక్తిఁబరిణామ మరయుచునుండ
āsanaṃbuga vaiva naṃdum̐gūrcuṃḍi yāsaktim̐bariṇāma marayucunuṃḍa
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).