శ్రీ రుద్రభక్తాంఘ్రి శేఖర! శుద్ధ - వీరమాహేశ్వరాచార! సంగాఖ్య!
śrī rudrabhaktāṃghri śēkhara! śuddha - vīramāhēśvarācāra! saṃgākhya!
తృతీయాశ్వాసము · తృతీయాశ్వాసము
tr̥tīyāśvāsamu
Aswasa 3: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
Part 1 of 4: passages 1–296 of 1,184Telugu with transliteration
శ్రీ రుద్రభక్తాంఘ్రి శేఖర! శుద్ధ - వీరమాహేశ్వరాచార! సంగాఖ్య!
śrī rudrabhaktāṃghri śēkhara! śuddha - vīramāhēśvarācāra! saṃgākhya!
దండియై మఱియొక్క మిండజంగమము - వెండియు బసవనదండనాయకుఁడు
daṃḍiyai maṟiyokka miṃḍajaṃgamamu - veṃḍiyu basavanadaṃḍanāyakum̐ḍu
మంత్రులుఁ దానును మహిపతి వనుపఁ - దంత్రంబునకు జీవితము వెట్టునెడను
maṃtrulum̐ dānunu mahipati vanupam̐ - daṃtraṃbunaku jīvitamu veṭṭuneḍanu
“వచ్చి యీ యర్థంబు వలయు నింతయు - నిచ్చినఁగాని యొం డేనొల్ల” ననుచు
“vacci yī yarthaṃbu valayu niṃtayu - niccinam̐gāni yoṃ ḍēnolla” nanucu
ధట్టించి యడుగుడుఁ బెట్టెలమాడ - లట్టున్నభంగి నాయయ్యకు నొసఁగఁ
dhaṭṭiṃci yaḍuguḍum̐ beṭṭelamāḍa - laṭṭunnabhaṃgi nāyayyaku nosam̐gam̐
దంత్రసమేతులై ధరణీశుకడకు - మంత్రివర్గం బేఁగి మఱి యిట్టు లనిరి
daṃtrasamētulai dharaṇīśukaḍaku - maṃtrivargaṃ bēm̐gi maṟi yiṭṭu laniri
చెప్పినఁ గొండెమౌఁ జెప్పకయున్నఁ - దప్పగు నటుగాన చెప్పఁగవలసెఁ
ceppinam̐ goṃḍemaum̐ jeppakayunnam̐ - dappagu naṭugāna ceppam̐gavalasem̐
బనిసేయ వెఱతుము బసవయ్యతోడ - ధనమెల్ల నొక్కమిండని కిచ్చె” ననుచుఁ
banisēya veṟatumu basavayyatōḍa - dhanamella nokkamiṃḍani kicce” nanucum̐
గొండెంబు సెప్పినఁ గోపించి రాజు - బండారి బసవనదండనాయకుని
goṃḍeṃbu seppinam̐ gōpiṃci rāju - baṃḍāri basavanadaṃḍanāyakuni
రప్పించి “మాయర్థ మొప్పించి పొమ్ము - దప్పేమి? సాలుఁబ్రధానితనంబు
rappiṃci “māyartha moppiṃci pommu - dappēmi? sālum̐bradhānitanaṃbu
'దండింపరా' దనుతలఁపున నిట్లు - బండార మంతయుఁ బాడు సేసితివి
'daṃḍiṃparā' danutalam̐puna niṭlu - baṃḍāra maṃtayum̐ bāḍu sēsitivi
పరధనం బపహరింపనిబాస యండ్రు - పరధనం బెట్లోకో బసవ! కైకొంటి
paradhanaṃ bapahariṃpanibāsa yaṃḍru - paradhanaṃ beṭlōkō basava! kaikoṃṭi
వేయుమాటలు నేల వెఱతుము నీకు - మాయర్థ మొప్పించి నీయంత నుండు”
vēyumāṭalu nēla veṟatumu nīku - māyartha moppiṃci nīyaṃta nuṃḍu”
మనవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁ డగుచు - జననాథునకు బసవనమంత్రి యనియె
manavuḍum̐ giṃcitprahasitāsyum̐ ḍagucu - jananāthunaku basavanamaṃtri yaniye
“పరమేశుభక్తి యన్ సురతరు వుండ - హరుభక్తి యన్ కనకాచలం బుండఁ
“paramēśubhakti yan surataru vuṃḍa - harubhakti yan kanakācalaṃ buṃḍam̐
గామారిభక్తి చింతామణి యుండ - సోమార్ధధరుభక్తి సురధేను వుండ
gāmāribhakti ciṃtāmaṇi yuṃḍa - sōmārdhadharubhakti suradhēnu vuṃḍa
బగుతుఁ డాసించునే పరధనంబునకు - మృగపతి యెద్దెస మేయునే పుల్లు?
bagutum̐ ḍāsiṃcunē paradhanaṃbunaku - mr̥gapati yeddesa mēyunē pullu?
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడించుహంస - గోరునే పడియలనీరు ద్రావంగఁ?
kṣīrābdhilōpalam̐ grīḍiṃcuhaṃsa - gōrunē paḍiyalanīru drāvaṃgam̐?
జూతఫలంబులు సుంబించు చిలుక - భాతి బూరుగుమ్రానిపండ్లు గన్గొనునె?
jūtaphalaṃbulu suṃbiṃcu ciluka - bhāti būrugumrānipaṃḍlu gangonune?
రాకామలజ్యోత్స్నఁ ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ?
rākāmalajyōtsnam̐ drāvu cakōra - mākāṃkṣa sēyunē cīkaṭim̐ drāva?
విరిదమ్మివాసన విహరించుతేఁటి - పరిగొని సుడియునే బబ్బిలివిరుల?
viridammivāsana vihariṃcutēm̐ṭi - parigoni suḍiyunē babbilivirula?
నెఱుఁగునే యలదిగ్గజేంద్రంబుకొదమ - యెఱపంది చను సీక? నెఱుఁగవుగాక
neṟum̐gunē yaladiggajēṃdraṃbukodama - yeṟapaṃdi canu sīka? neṟum̐gavugāka
యరుదగు లింగ సదర్థులయిండ్ల - వరవుడ నా కొకసరకె యర్థంబు
yarudagu liṃga sadarthulayiṃḍla - varavuḍa nā kokasarake yarthaṃbu
పుడమీశ మీ ధనంబునకుఁ జే సాఁప - నొడయల కిచ్చితి నొడయలధనము
puḍamīśa mī dhanaṃbunakum̐ jē sām̐pa - noḍayala kicciti noḍayaladhanamu
పాదిగ దఱిఁగిన భక్తుండఁగాను - గాదేని ముడుపు లెక్కలుసూడు” మనుచు
pādiga daṟim̐gina bhaktuṃḍam̐gānu - gādēni muḍupu lekkalusūḍu” manucu
ధట్టుఁడు బసవనదండనాయఁకుఁడు - పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
dhaṭṭum̐ḍu basavanadaṃḍanāyam̐kum̐ḍu - peṭṭelu muṃdaṭam̐ beṭṭi tāḷamulu
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ - నచ్చెరువై లెక్క కగ్గలంబున్న
puccuḍu māḍa luppoṃgucum̐ jūḍa - nacceruvai lekka kaggalaṃbunna
“మధురపాండ్యుడు దన మంత్రిచే నిట్టు - లధికమర్థం బిచ్చి హయముల విలువఁ
“madhurapāṃḍyuḍu dana maṃtricē niṭṭu - ladhikamarthaṃ bicci hayamula viluvam̐
బనుచుడు నతఁడు సద్భక్తిపెక్కువను - జనిచని జంగమార్చన సేయఁ జేయ
banucuḍu natam̐ḍu sadbhaktipekkuvanu - janicani jaṃgamārcana sēyam̐ jēya
నర్థమంతయుఁ బోవ హయముల విలువ - నర్థంబు లేకున్న ననుమాన ముడిగి
narthamaṃtayum̐ bōva hayamula viluva - narthaṃbu lēkunna nanumāna muḍigi
పొలమునక్కలనెల్లఁ బిలిచి తెప్పించి - నలిఁ బాండ్యభూనాథునకుఁ బొడసూపఁ
polamunakkalanellam̐ bilici teppiṃci - nalim̐ bāṃḍyabhūnāthunakum̐ boḍasūpam̐
జొక్క నైనారుల మిక్కిలికరుణ - నక్కజం బంద నానక్క లన్నియును
jokka nainārula mikkilikaruṇa - nakkajaṃ baṃda nānakka lanniyunu
నిలఁ గంకణములతేజలు నయ్యెఁ గాదె - మలహరుభక్తులమహిమ దలంప
nilam̐ gaṃkaṇamulatējalu nayyem̐ gāde - malaharubhaktulamahima dalaṃpa
నిది సోద్యమే” యంచు నెల్లభక్తులును - సదమలచిత్తులై సంతసం బంద
nidi sōdyamē” yaṃcu nellabhaktulunu - sadamalacittulai saṃtasaṃ baṃda
నతివిస్మయాక్రాంతుఁడై బిజ్జలుఁడు - "ఇతఁ డీశ్వరుఁడకాక యితరుండె?” యనుచు
nativismayākrāṃtum̐ḍai bijjalum̐ḍu - "itam̐ ḍīśvarum̐ḍakāka yitaruṃḍe?” yanucu
వరవస్త్రభూషణావళి సమర్పించి - పరమానురాగుఁడై నరులెల్ల వినఁగ
varavastrabhūṣaṇāvaḷi samarpiṃci - paramānurāgum̐ḍai narulella vinam̐ga
“బండారిమీఁద నెవ్వండేని యింకఁ - గొండెంబు సెప్పు నా కుక్కలఁ జెండి
“baṃḍārimīm̐da nevvaṃḍēni yiṃkam̐ - goṃḍeṃbu seppu nā kukkalam̐ jeṃḍi
నాలుకల్గోసి సున్నము సాలఁబూసి - పోల వేఁచినయిస్ము వోయింతు నోళ్ల”
nālukalgōsi sunnamu sālam̐būsi - pōla vēm̐cinayismu vōyiṃtu nōḷla”
ననుచు నబ్బసవసింహము వీడుకొల్పఁ - జనుదెంచె నగరికి జనులు నుతింప.
nanucu nabbasavasiṃhamu vīḍukolpam̐ - janudeṃce nagariki janulu nutiṃpa.
వెండియు నొక్కయ్య వేశ్యాలయమున - నుండి బానిసఁ బిల్చి “బండారినగర
veṃḍiyu nokkayya vēśyālayamuna - nuṃḍi bānisam̐ bilci “baṃḍārinagara
మన నిత్యపడి వేఁడికొని వేగరమ్ము" - అనవుడు "నట్లకా” కని పోయి యచటఁ
mana nityapaḍi vēm̐ḍikoni vēgarammu" - anavuḍu "naṭlakā” kani pōyi yacaṭam̐
బడఁతి యబ్బసవయ్య పట్టంపుదేవిఁ - బొడగని కట్టినపుట్టంబు సూచి
baḍam̐ti yabbasavayya paṭṭaṃpudēvim̐ - boḍagani kaṭṭinapuṭṭaṃbu sūci
యసలారఁ బడి వేఁడుడంతఁ జాలించి - మసలక బానిస మగిడి యేతెంచి
yasalāram̐ baḍi vēm̐ḍuḍaṃtam̐ jāliṃci - masalaka bānisa magiḍi yēteṃci
అక్క యేమందు నీయాన నేనిప్పు - డొక్కసోద్యముఁ గంటి నక్కడి కేఁగి
akka yēmaṃdu nīyāna nēnippu - ḍokkasōdyamum̐ gaṃṭi nakkaḍi kēm̐gi
యట్టి దివ్యాంబరం బఖిలలోకములఁ - బుట్టదు బసవయ్యపట్టంపుదేవి
yaṭṭi divyāṃbaraṃ bakhilalōkamulam̐ - buṭṭadu basavayyapaṭṭaṃpudēvi
కట్టినపటవలిపుట్టంబు సూచి - నెట్టణ వచ్చితి నీ కెఱిఁగింప
kaṭṭinapaṭavalipuṭṭaṃbu sūci - neṭṭaṇa vacciti nī keṟim̐giṃpa
భావ వేఁడినఁజాలు బసవయ్య యిపుడ - యావస్త్ర మొసఁగెడు నరగలిగొనఁడు
bhāva vēm̐ḍinam̐jālu basavayya yipuḍa - yāvastra mosam̐geḍu naragaligonam̐ḍu
పరగు మహాదేవుభక్తులచేత - నరుదరు దనఁగ గణారాధనములఁ
paragu mahādēvubhaktulacēta - narudaru danam̐ga gaṇārādhanamulam̐
గొనివచ్చి జంగమకోటి సస్నేహ - మున నిచ్చినట్టి యమూల్యవస్త్రములు
gonivacci jaṃgamakōṭi sasnēha - muna niccinaṭṭi yamūlyavastramulu
వెంజావళియు జయరంజియు మంచు - పుంజంబు మణిపట్టు భూతిలకంబు
veṃjāvaḷiyu jayaraṃjiyu maṃcu - puṃjaṃbu maṇipaṭṭu bhūtilakaṃbu
శ్రీ వన్నియయు మహాచీని చీనియును - భావజతిలకంబు పచ్చనిపట్టు
śrī vanniyayu mahācīni cīniyunu - bhāvajatilakaṃbu paccanipaṭṭu
రాయశేఖరమును రాజవల్లభము - వాయుమేఘము గజవాళంబు గండ
rāyaśēkharamunu rājavallabhamu - vāyumēghamu gajavāḷaṃbu gaṃḍa
వడము గావులు సరిపట్టును హంస - పడియు వీణావళి పల్లడదట్టి
vaḍamu gāvulu saripaṭṭunu haṃsa - paḍiyu vīṇāvaḷi pallaḍadaṭṭi
వారణాసియు జీకు వాయుఁ గెందొగరు - గౌరిగనయమును క్షీరోదకంబు
vāraṇāsiyu jīku vāyum̐ geṃdogaru - gauriganayamunu kṣīrōdakaṃbu
పట్టును రత్నంబుపట్టును సంకు - పట్టును మరకతపట్టు పొంబట్టు
paṭṭunu ratnaṃbupaṭṭunu saṃku - paṭṭunu marakatapaṭṭu poṃbaṭṭu
నెఱపట్టు వెలిపట్టు నేత్రంబుపట్టు - మఱి తవరాజంబు మాందోళిరవియుఁ
neṟapaṭṭu velipaṭṭu nētraṃbupaṭṭu - maṟi tavarājaṃbu māṃdōḷiraviyum̐
జంద్రాతపంబును సాంధ్యరాగంబు - నింద్రనీలంబు మహేంద్రభూషణము
jaṃdrātapaṃbunu sāṃdhyarāgaṃbu - niṃdranīlaṃbu mahēṃdrabhūṣaṇamu
సన్ననడంచును శరధియు మేఘ - వన్నెయు రుద్రాక్షవన్నె కాంభోజి
sannanaḍaṃcunu śaradhiyu mēgha - vanneyu rudrākṣavanne kāṃbhōji
పులిగోరుపట్టును భూపతి రుద్ర - తిలకంబు సరిపట్టు మలయజసిరియు
puligōrupaṭṭunu bhūpati rudra - tilakaṃbu saripaṭṭu malayajasiriyu
గొలనిమేఘము గజావళి హయావళియు - వలిపంబు సరి గమ్మితెలుపు దివ్యాంబ
golanimēghamu gajāvaḷi hayāvaḷiyu - valipaṃbu sari gammitelupu divyāṃba
రంబును నుదయరాగంబు దేవాంబ - రంబు పొత్తియు గుజరాష్ట్రంబుపట్టు
raṃbunu nudayarāgaṃbu dēvāṃba - raṃbu pottiyu gujarāṣṭraṃbupaṭṭu
మొదలుగా నెఱుఁగమే మును దరతరమ - పదపడి మనవారు వడసినయట్టి
modalugā neṟum̐gamē munu daratarama - padapaḍi manavāru vaḍasinayaṭṭi
మానితవస్త్రవితానముల్ గలవు - గాని యావస్త్రసమానముల్ గావు
mānitavastravitānamul galavu - gāni yāvastrasamānamul gāvu
తథ్య మిట్టిద” యని దాసి సెప్పుడును - మిథ్య సేయక వేశ్య మిండనిఁ జూచి
tathya miṭṭida” yani dāsi seppuḍunu - mithya sēyaka vēśya miṃḍanim̐ jūci
“నలి దలిర్పఁగ నీవు నాతోడి వలపు - గలవేని బసవయ్యకాంత గంగాంబ
“nali dalirpam̐ga nīvu nātōḍi valapu - galavēni basavayyakāṃta gaṃgāṃba
కట్టన పుట్టంబుఁ గ్రక్కునఁ దెచ్చి - నెట్టణ నా కిమ్ము నేర్పు దలిర్ప”
kaṭṭana puṭṭaṃbum̐ grakkunam̐ decci - neṭṭaṇa nā kimmu nērpu dalirpa”
ననవుడు "నట్లకా” కనుచు మిండండు - సని కాంచి! బసవ “నీవనిత గంగాంబ
nanavuḍu "naṭlakā” kanucu miṃḍaṃḍu - sani kāṃci! basava “nīvanita gaṃgāṃba
కట్టిన పటవలిపుట్టంబు మాకు - నిట్టున్నభంగిన యిప్పింపవలయు”
kaṭṭina paṭavalipuṭṭaṃbu māku - niṭṭunnabhaṃgina yippiṃpavalayu”
ననవుడుఁ దనసతి నాస్థానసదన - మునకుఁ బిల్వఁగఁబంచి ముద్దియఁ గదిసి
nanavuḍum̐ danasati nāsthānasadana - munakum̐ bilvam̐gam̐baṃci muddiyam̐ gadisi
“పుట్టు సా వెఱుఁగనియట్టిమహాత్ముఁ - డిట్టలంబుగ నీదు పుట్టమడ్గెడిని
“puṭṭu sā veṟum̐ganiyaṭṭimahātmum̐ - ḍiṭṭalaṃbuga nīdu puṭṭamaḍgeḍini
పుట్టమీ వేగ మీపుట్ట మిచ్చినను - బుట్టము మన” మనియట్టిచందమున
puṭṭamī vēga mīpuṭṭa miccinanu - buṭṭamu mana” maniyaṭṭicaṃdamuna
లజ్జయు సిగ్గు దలంపక బసవఁ - డజ్జలజాక్షి వల్వఱిముఱిఁ బట్టి
lajjayu siggu dalaṃpaka basavam̐ - ḍajjalajākṣi valvaṟimuṟim̐ baṭṭi
యొలువంగ నొలువంగ నొక్కవస్త్రంబు - దళితాంబుజానన మొలఁబాయకున్నఁ
yoluvaṃga noluvaṃga nokkavastraṃbu - daḷitāṃbujānana molam̐bāyakunnam̐
గనుఁగొని యద్భుతాక్రాంతాత్ములైన - జనములఁ గనుఁగొని జంగమంబనియె
ganum̐goni yadbhutākrāṃtātmulaina - janamulam̐ ganum̐goni jaṃgamaṃbaniye
“గహనమే చూడ జగద్ధితసూత్ర - సహజవాహనులగు శంభుభక్తులకు
“gahanamē cūḍa jagaddhitasūtra - sahajavāhanulagu śaṃbhubhaktulaku
నలి నిడిగుడినయనారను భక్తుఁ డిల నాలిచీరలొ ల్బీడె భక్తులకుఁ
nali niḍiguḍinayanāranu bhaktum̐ ḍila nālicīralo lbīḍe bhaktulakum̐
బండ్రెండువర్షముల్ వాయక నేని - పండ్రెండుమూరల పసిఁడిపుట్టంబు
baṃḍreṃḍuvarṣamul vāyaka nēni - paṃḍreṃḍumūrala pasim̐ḍipuṭṭaṃbu
విపరీతగతిఁదన్ను వేఁడుడు నొక్క - దపసికిఁ దేడరదాసయ్య యీఁడె
viparītagatim̐dannu vēm̐ḍuḍu nokka - dapasikim̐ dēḍaradāsayya yīm̐ḍe
అదిగాక బల్లహుం డఖిలంబు నెఱుఁగ - సదమలచిత్తుఁడై సతిని మున్నీఁడె?
adigāka ballahuṃ ḍakhilaṃbu neṟum̐ga - sadamalacittum̐ḍai satini munnīm̐ḍe?
యఱలేక రూపించి యడుగంగఁదడవ - మఱిమొన్న యధరుండు మాణిక్య మీఁడె?
yaṟalēka rūpiṃci yaḍugaṃgam̐daḍava - maṟimonna yadharuṃḍu māṇikya mīm̐ḍe?
దండియై మొన్న యధరుఁ డిమ్మడించి - మిండభక్తునకు నర్మిలి నర్థమీఁడె?
daṃḍiyai monna yadharum̐ ḍimmaḍiṃci - miṃḍabhaktunaku narmili narthamīm̐ḍe?
మహి నిడుగుడిని బెర్మాణి యన్ గణము - గహనంపుదుర్భిక్షకాలంబునందుఁ
mahi niḍuguḍini bermāṇi yan gaṇamu - gahanaṃpudurbhikṣakālaṃbunaṃdum̐
జాటించి సకలార్థసంపదల్ సంద్ర - జూటుభక్తుల కిలు చూఱవెట్టండె?
jāṭiṃci sakalārthasaṃpadal saṃdra - jūṭubhaktula kilu cūṟaveṭṭaṃḍe?
తనయపెండిలిసేయుతత్ప్రస్తవమునఁ - జనుదెంచి యొకతపోధనుఁడు వేఁడినను
tanayapeṃḍilisēyutatprastavamunam̐ - janudeṃci yokatapōdhanum̐ḍu vēm̐ḍinanu
నక్కాంత వెండ్రుక లప్పుడ కోసి - చక్కన మానకం జారుఁ డీఁ డెట్టు?”
nakkāṃta veṃḍruka lappuḍa kōsi - cakkana mānakaṃ jārum̐ ḍīm̐ ḍeṭṭu?”
లనుచు గీటునఁ బుచ్చుచును మిండగీఁడు - కినియునో తడవైనఁ దనవేశ్య యనుచు
lanucu gīṭunam̐ buccucunu miṃḍagīm̐ḍu - kiniyunō taḍavainam̐ danavēśya yanucu
బసవని వారించి వసుధఁ బ్రోవైనఁ - బసిఁడిచెఱంగుల పట్టువస్త్రములు
basavani vāriṃci vasudham̐ brōvainam̐ - basim̐ḍiceṟaṃgula paṭṭuvastramulu
మోపిడి తనమోవనోపి నన్నియును - నేపారఁ గొని వచ్చి యిచ్చె లంజియకు
mōpiḍi tanamōvanōpi nanniyunu - nēpāram̐ goni vacci yicce laṃjiyaku
“నిక్కంబు బసవని నిజభక్తిమహిమఁ - దక్కువ గాదయ్యెఁ దరుణిమానంబు”
“nikkaṃbu basavani nijabhaktimahimam̐ - dakkuva gādayyem̐ daruṇimānaṃbu”
అని భక్తమండలి వినుతింపుచుండ - వనిత యంతర్వాసమున కేఁగె నంత.
ani bhaktamaṃḍali vinutiṃpucuṃḍa - vanita yaṃtarvāsamuna kēm̐ge naṃta.
బసవనిభక్తి ప్రభాపటలంబు - దెసల వసుంధర దివి దీటుకొనఁగ
basavanibhakti prabhāpaṭalaṃbu - desala vasuṃdhara divi dīṭukonam̐ga
దినకరుఁ డాత్మీయతేజంబు దఱుఁగు - డును మది లజ్జించి చని యపరాబ్ధిఁ
dinakarum̐ ḍātmīyatējaṃbu daṟum̐gu - ḍunu madi lajjiṃci cani yaparābdhim̐
బడియెనో యన్నట్లు భానుండు గ్రుంకెఁ- జెడిమిత్రుఁడరుగ రాజీవముల్ మొగిచె
baḍiyenō yannaṭlu bhānuṃḍu gruṃkem̐- jeḍimitrum̐ḍaruga rājīvamul mogice
భేరులు శంఖముల్ భోరనఁ జెలఁగె - మారసంహారు నాగారాంతరముల
bhērulu śaṃkhamul bhōranam̐ jelam̐ge - mārasaṃhāru nāgārāṃtaramula
నలరుచుఁబంచమహాశబ్దరావ - ములు మ్రోసె భక్తసమూహాలయముల
nalarucum̐baṃcamahāśabdarāva - mulu mrōse bhaktasamūhālayamula
ఘనధూపధూమసంజనితమేఘములు - సెనసి కప్పినమాడ్కిఁ జీకటుల్ వర్వె
ghanadhūpadhūmasaṃjanitamēghamulu - senasi kappinamāḍkim̐ jīkaṭul varve
వరముక్తిసతి బసవనికి నారతులు - పరువడినెత్తు దీపంబులో యనఁగ
varamuktisati basavaniki nāratulu - paruvaḍinettu dīpaṃbulō yanam̐ga
నక్షత్రచయ మంతరిక్షంబు నిండి - యక్షీణతరకాంతి యసలార వెలిఁగె
nakṣatracaya maṃtarikṣaṃbu niṃḍi - yakṣīṇatarakāṃti yasalāra velim̐ge
చంద్రునిచేటు దైత్యేంద్రునిపాటు - నింద్రునిభంగంబు నెఱిఁగి యెఱింగి
caṃdrunicēṭu daityēṃdrunipāṭu - niṃdrunibhaṃgaṃbu neṟim̐gi yeṟiṃgi
గొఱియ మ్రుచ్చిలి శూద్రకుండను రాజు - నఱకు వడుటతొల్లి యెఱిఁగి యెఱింగి
goṟiya mruccili śūdrakuṃḍanu rāju - naṟaku vaḍuṭatolli yeṟim̐gi yeṟiṃgi
జారులఁ జోరులఁ జర్చించుకవుల - భూరివివేకంబుఁబొగడంగనేల?
jārulam̐ jōrulam̐ jarciṃcukavula - bhūrivivēkaṃbum̐bogaḍaṃganēla?
యనఁగ సంధ్యావేళయందు సద్భక్త - జనులు లింగార్చనల్ సలుపంగ నంత
yanam̐ga saṃdhyāvēḷayaṃdu sadbhakta - janulu liṃgārcanal salupaṃga naṃta
మిండజంగమకోటి నిండారుభక్తి - దండనాయకుఁడంప దండతండములు
miṃḍajaṃgamakōṭi niṃḍārubhakti - daṃḍanāyakum̐ḍaṃpa daṃḍataṃḍamulu
ఘనసారతాంబూలగంధప్రసూన - వినుతాభరణవస్త్రవితతులు గొనుచుఁ
ghanasāratāṃbūlagaṃdhaprasūna - vinutābharaṇavastravitatulu gonucum̐
గరమర్ధి లంజెఱికంబు సేయంగ - నరిగెద మేమంచు ననురక్తి నరుగ
garamardhi laṃjeṟikaṃbu sēyaṃga - narigeda mēmaṃcu nanurakti naruga
లింగసర్వేంద్రియలీనుండు ముగ్ధ - సంగయ్య నానొక్క శరణుఁ డీక్షించి
liṃgasarvēṃdriyalīnuṃḍu mugdha - saṃgayya nānokka śaraṇum̐ ḍīkṣiṃci
భక్తిననుచువాఁడు బసవబండారి - వ్యక్తమిట్లేఁగెడు వార్జంగమములు
bhaktinanucuvām̐ḍu basavabaṃḍāri - vyaktamiṭlēm̐geḍu vārjaṃgamamulu
కొనిపోవునవి గంధకుసుమకర్పూర - వినుత తాంబూలాదివితతులట్లయ్యుఁ
konipōvunavi gaṃdhakusumakarpūra - vinuta tāṃbūlādivitatulaṭlayyum̐
జను నిది లింగావసరవేళ యున్న - పనులకు నేఁగెడు పగిది గా” దనుచు
janu nidi liṃgāvasaravēḷa yunna - panulaku nēm̐geḍu pagidi gā” danucu
నదియును నొక్కలింగార్చన గాఁగ - మది నిశ్చయించి సమ్మదము దుల్కాడఁ
nadiyunu nokkaliṃgārcana gām̐ga - madi niścayiṃci sammadamu dulkāḍam̐
గలనైన లంజెఱికం బనునట్టి - పలు కెఱుంగమిఁ జేసి బసవయ్యఁ జూచి
galanaina laṃjeṟikaṃ banunaṭṭi - palu keṟuṃgamim̐ jēsi basavayyam̐ jūci
“యేనును బోదునా యీయయ్యగాండ్ర - తోన లంజెఱికంబు మానుగాఁ జేయ”
“yēnunu bōdunā yīyayyagāṃḍra - tōna laṃjeṟikaṃbu mānugām̐ jēya”
ననవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁడగుచుఁ - "జనుజియ్య! నా ముగ్ధసంగయ్యదేవ!”
nanavuḍum̐ giṃcitprahasitāsyum̐ḍagucum̐ - "janujiyya! nā mugdhasaṃgayyadēva!”
యని గారవింపుచు నాయయ్య కపుడుఁ - గనుఁగొన సహజశృంగారంబు సేసిఁ
yani gāraviṃpucu nāyayya kapuḍum̐ - ganum̐gona sahajaśr̥ṃgāraṃbu sēsim̐
పరిచారకులఁబిల్చి పటుభక్తి గల్గు - తరుణియింటికిఁ బంపఁ దత్సతిఁజూచి
paricārakulam̐bilci paṭubhakti galgu - taruṇiyiṃṭikim̐ baṃpam̐ datsatim̐jūci
“గణుతింపఁ బ్రమథలోకంబుకన్యకయొ? - గణిక సాక్షాద్రుద్రగణికయో? తలఁప
“gaṇutiṃpam̐ bramathalōkaṃbukanyakayo? - gaṇika sākṣādrudragaṇikayō? talam̐pa
జిత్తరురూపమో? చెలువయో పసిఁడి - పుత్తడియో” నాఁగఁ బొలఁతి యేతెంచి
jittarurūpamō? celuvayō pasim̐ḍi - puttaḍiyō” nām̐gam̐ bolam̐ti yēteṃci
ముగ్ధమిండనిపాదములమీఁదఁ బడివి - దగ్ధ మిండెత సముద్యద్భక్తి మెఱసి
mugdhamiṃḍanipādamulamīm̐dam̐ baḍivi - dagdha miṃḍeta samudyadbhakti meṟasi
పడిగంబు వెట్టించి పాదముల్ గడిగి - కడువేడ్కఁ బాదోదకంబు సేవించి
paḍigaṃbu veṭṭiṃci pādamul gaḍigi - kaḍuvēḍkam̐ bādōdakaṃbu sēviṃci
ప్రీతియెలర్ప విభూతి వీడియము - లాతన్వి దాన సమర్పణ సేసి
prītiyelarpa vibhūti vīḍiyamu - lātanvi dāna samarpaṇa sēsi
యనుపవచ్చినవారలరుగ మిండనికిఁ - దనహస్త మిచ్చి తోడ్కొని పోవునెడను
yanupavaccinavāralaruga miṃḍanikim̐ - danahasta micci tōḍkoni pōvuneḍanu
స్ఫాటికసోపానసంక్తి నొప్పారు - హాటకకుట్టిమహర్మ్యస్థలమునఁ
sphāṭikasōpānasaṃkti noppāru - hāṭakakuṭṭimaharmyasthalamunam̐
గలయంగఁ గస్తూరికలయంపి మీఁద - వెలుఁగు ముక్తాఫలంబుల మ్రుగ్గులమరఁ
galayaṃgam̐ gastūrikalayaṃpi mīm̐da - velum̐gu muktāphalaṃbula mruggulamaram̐
గంభకట్లను మేలుకట్లను బొలుచు - గంభీరపుష్పకాగారంబునందు
gaṃbhakaṭlanu mēlukaṭlanu bolucu - gaṃbhīrapuṣpakāgāraṃbunaṃdu
మహితలంబితరత్నమాలికానిచయ - బహుమణిదీపవిభ్రమకాంతి వర్వ
mahitalaṃbitaratnamālikānicaya - bahumaṇidīpavibhramakāṃti varva
మించి వెల్గెడుపట్టెమంచంబు పుష్ప - సంచితంబగు నండజముపాన్పు దనర
miṃci velgeḍupaṭṭemaṃcaṃbu puṣpa - saṃcitaṃbagu naṃḍajamupānpu danara
వివిధసౌరభసుఖాన్విత మగుమంద - పవనంబు జాలకపంక్తిఁ దన్పార
vividhasaurabhasukhānvita magumaṃda - pavanaṃbu jālakapaṃktim̐ danpāra
శ్రీరుద్రవరదివ్య సింహాసనంబొ? - గౌరీమనోహరు చారుపుష్పకమొ?
śrīrudravaradivya siṃhāsanaṃbo? - gaurīmanōharu cārupuṣpakamo?
గంగావతంసుని శృంగారగృహమొ? - అంగజవిజయుని యనుఁగుమంటపమొ?
gaṃgāvataṃsuni śr̥ṃgāragr̥hamo? - aṃgajavijayuni yanum̐gumaṃṭapamo?
అన నతిరమణీయమగు సజ్జపట్టుఁ - గని మిండఁ డద్భుతాక్రాంతాత్ముఁ డగుచు
ana natiramaṇīyamagu sajjapaṭṭum̐ - gani miṃḍam̐ ḍadbhutākrāṃtātmum̐ ḍagucu
నదియును నాతి లింగార్చన సేయు - సదనంబుగాఁ దన మదిలోనఁ దలఁచి
nadiyunu nāti liṃgārcana sēyu - sadanaṃbugām̐ dana madilōnam̐ dalam̐ci
యుత్తుంగసింహాసనోపమంబైన - యత్తన్విచారు పర్యంకంబు దిగువ
yuttuṃgasiṃhāsanōpamaṃbaina - yattanvicāru paryaṃkaṃbu diguva
నవనిపైఁ గంబళి యాసనంబుగను - శివసమారాధన సేయఁ గూర్చుండి
navanipaim̐ gaṃbaḷi yāsanaṃbuganu - śivasamārādhana sēyam̐ gūrcuṃḍi
భూతి సర్వాంగముల్ పూయుచో నతఁడు - "భూతివూయవదేవి వొలఁతి నీ”వనిన
bhūti sarvāṃgamul pūyucō natam̐ḍu - "bhūtivūyavadēvi volam̐ti nī”vanina
“నిచ్చఁబార్వతి వూయు పచ్చవిభూతి - యిచ్చె నొక్కయ్య నా కీమునిమాపు
“niccam̐bārvati vūyu paccavibhūti - yicce nokkayya nā kīmunimāpu
పూసితి సర్వాంగములఁ జూడు” మనుచు - భాసురంబగు మేని పసుపుఁజూపుడును
pūsiti sarvāṃgamulam̐ jūḍu” manucu - bhāsuraṃbagu mēni pasupum̐jūpuḍunu
వలయుచో రుద్రాక్షములు ధరింపుచును - "లలన! రుద్రాక్షముల్ దాల్పవే”మనిన
valayucō rudrākṣamulu dhariṃpucunu - "lalana! rudrākṣamul dālpavē”manina
“కడుఁ గందు లవణసాగరతీరమునను - బొడమిన రుద్రాక్షములు సహింపమిని
“kaḍum̐ gaṃdu lavaṇasāgaratīramunanu - boḍamina rudrākṣamulu sahiṃpamini
దెల్లంబు క్షీరాబ్ధితీరమందుండు - తెల్లరుద్రాక్షముల్ దెచ్చె నొక్కయ్య
dellaṃbu kṣīrābdhitīramaṃduṃḍu - tellarudrākṣamul decce nokkayya
యెప్పుడుఁ దాల్ప నున్ఫెక్కిన” వనుచు - నప్పొల్తి ముత్యాలహారముల్ సూప
yeppuḍum̐ dālpa nunphekkina” vanucu - nappolti mutyālahāramul sūpa
నక్కజుండగుచు ముత్యాలసూసకము - ముక్కునఁ దాల్చిన ముత్యంబుఁ జూచి
nakkajuṃḍagucu mutyālasūsakamu - mukkunam̐ dālcina mutyaṃbum̐ jūci
“యుత్తమాగంబున నువిద! రుద్రాక్ష - లుత్తమంబయ్యెఁ బో క్రొత్త మాకిదియు
“yuttamāgaṃbuna nuvida! rudrākṣa - luttamaṃbayyem̐ bō krotta mākidiyu
నెక్కడ వినఁబడ దిట్లు రుద్రాక్ష - ముక్కునఁ దాల్చిన ముఖ్యమే?”మనిన
nekkaḍa vinam̐baḍa diṭlu rudrākṣa - mukkunam̐ dālcina mukhyamē?”manina
“దేవ! యేమనిచెప్ప? దేవుఁడే యెఱుఁగు - నా విశేషంబు వేదాతీత” మనుఁడు
“dēva! yēmaniceppa? dēvum̐ḍē yeṟum̐gu - nā viśēṣaṃbu vēdātīta” manum̐ḍu
నురుజటావలి విచ్చి యొత్తిచుట్టుచును - "దరళాక్షి! జడలేల తాల్ప వీ” వనిన
nurujaṭāvali vicci yotticuṭṭucunu - "daraḷākṣi! jaḍalēla tālpa vī” vanina
సగముప్రసాదపుష్పములకు నునిచి - సగమునఁదాల్చితి సన్నంపుజడలు
sagamuprasādapuṣpamulaku nunici - sagamunam̐dālciti sannaṃpujaḍalu
సన్నుతతద్భస్మసమ్మిశ్ర మగుచు - వెన్నున నిదె చూడు వ్రేలెడి” ననుచు
sannutatadbhasmasammiśra magucu - vennuna nide cūḍu vrēleḍi” nanucu
పటుగళాభరణసంఘటితమై యొప్పు - పటవలికుచ్చులు వడఁతి సూపుడును
paṭugaḷābharaṇasaṃghaṭitamai yoppu - paṭavalikucculu vaḍam̐ti sūpuḍunu
“భువి నిట్టిభక్తురాలవు గచ్చడంబు - ధవళాక్షి! మఱి యేల తాల్ప వీ” వనిన
“bhuvi niṭṭibhakturālavu gaccaḍaṃbu - dhavaḷākṣi! maṟi yēla tālpa vī” vanina
"లింగవంతులు గాని లెంగుల దృష్టి - భంగిగా నాపయిఁబాఱకయుండఁ
"liṃgavaṃtulu gāni leṃgula dr̥ṣṭi - bhaṃgigā nāpayim̐bāṟakayuṃḍam̐
గట్టితి సర్వాంగకచ్చడం” బనుచుఁ - గట్టిన సమకట్టుఁగాంత సూపుడును
gaṭṭiti sarvāṃgakaccaḍaṃ” banucum̐ - gaṭṭina samakaṭṭum̐gāṃta sūpuḍunu
వనిత యపూర్వలాంఛనధారిగాఁగ - మనమునఁ దలపోసి మహిఁజాఁగిమ్రొక్కి
vanita yapūrvalāṃchanadhārigām̐ga - manamunam̐ dalapōsi mahim̐jām̐gimrokki
“యిట్టిలాంఛనమున కెవ్వ రాచార్యు? - లెట్టివి నియమంబు? లెట్టిది సపర్య?
“yiṭṭilāṃchanamuna kevva rācāryu? - leṭṭivi niyamaṃbu? leṭṭidi saparya?
తరుణి! మీ గురుసంప్రదాయంబు వారు - ధరణి నే ఠావునఁ దపము సేయుదురు?
taruṇi! mī gurusaṃpradāyaṃbu vāru - dharaṇi nē ṭhāvunam̐ dapamu sēyuduru?
సంతతంబును నేరి సద్గోష్ఠి నుందు - రింతయుఁజెప్పు మాకేర్పడ” ననిన
saṃtataṃbunu nēri sadgōṣṭhi nuṃdu - riṃtayum̐jeppu mākērpaḍa” nanina
“నాగమనిగమోక్తి నవ్వామదేవ - యోగిచే శివదీక్ష యొప్పంగఁబడసి
“nāgamanigamōkti navvāmadēva - yōgicē śivadīkṣa yoppaṃgam̐baḍasi
కైలాసమునఁ దపోవేళ మెప్పించి - శూలిచేఁ బడసె మున్నీలాంఛనంబు
kailāsamunam̐ dapōvēḷa meppiṃci - śūlicēm̐ baḍase munnīlāṃchanaṃbu
అది గారణముగఁ బూర్వాచార్యురాలు - సదమలాత్మక హిమశైలతనూజ
adi gāraṇamugam̐ būrvācāryurālu - sadamalātmaka himaśailatanūja
శ్రీనందనుని గెల్చి శివుని మెప్పించి - మేన నర్ధము గొన్న మెలఁతవర్గంబు;
śrīnaṃdanuni gelci śivuni meppiṃci - mēna nardhamu gonna melam̐tavargaṃbu;
జగములన్నియుఁ దన శక్తిఁబాలించు - జగదేకసుందరి సంతతిమేము;
jagamulanniyum̐ dana śaktim̐bāliṃcu - jagadēkasuṃdari saṃtatimēmu;
శివరహస్యాది ప్రసిద్ధశాస్త్రములు - శివునిచేఁబడసిన చెలువశిష్యలము;
śivarahasyādi prasiddhaśāstramulu - śivunicēm̐baḍasina celuvaśiṣyalamu;
ఆకాంక్షతోడ జన్నావులపాలు - సేకొని యష్టావశేషంబు సేసి
ākāṃkṣatōḍa jannāvulapālu - sēkoni yaṣṭāvaśēṣaṃbu sēsi
చెఱకుకట్టెలపొడి సేరెఁడు సల్లి - మఱి యిష్టలింగసమర్పణ సేసి
ceṟakukaṭṭelapoḍi sērem̐ḍu salli - maṟi yiṣṭaliṃgasamarpaṇa sēsi
తప్పక యీ ప్రసాదంబింతగొందు - మెప్పాటఁగలనైన నెఱుఁగమోగిరము
tappaka yī prasādaṃbiṃtagoṃdu - meppāṭam̐galanaina neṟum̐gamōgiramu
గలిగెనే వెండియుఁ గందమూలాది - ఫలపత్త్రశాకముల్ భక్తులిచ్చినను
galigenē veṃḍiyum̐ gaṃdamūlādi - phalapattraśākamul bhaktuliccinanu
స్వామికర్పించి ప్రసాదంబు గొందు - మేమని చెప్పుదు మీ తపశ్చరణ?
svāmikarpiṃci prasādaṃbu goṃdu - mēmani ceppudu mī tapaścaraṇa?
తనువును, మనమును, ధనమును విడిచి - మనికులై రసికులై, మగ్నులై గోష్ఠి
tanuvunu, manamunu, dhanamunu viḍici - manikulai rasikulai, magnulai gōṣṭhi
తవులంబు గలిగినతజ్జంగమాను - భవమందు నెప్పుడుఁ బాయకుండుదుము.
tavulaṃbu galiginatajjaṃgamānu - bhavamaṃdu neppuḍum̐ bāyakuṃḍudumu.
అనఘ! త్రికాలలింగార్చన మీఁది పనులు దక్కఁగ లేవు బగళులు రేలు
anagha! trikālaliṃgārcana mīm̐di panulu dakkam̐ga lēvu bagaḷulu rēlu
గతి మాకు వేఱొండు గలదె జంగమమ - గతి మనోవాక్కాయకర్మంబులందు
gati māku vēṟoṃḍu galade jaṃgamama - gati manōvākkāyakarmaṃbulaṃdu
ఇట్టిది గురుమార్గమిది నిజవ్రతము - ఇట్టిది సారిత్రమిది లాంఛనంబు
iṭṭidi gurumārgamidi nijavratamu - iṭṭidi sāritramidi lāṃchanaṃbu
తలఁప మా గురుసంప్రదాయంబువారు - గలరు శ్రీగిరి యాదిగా నెల్లయెడల
talam̐pa mā gurusaṃpradāyaṃbuvāru - galaru śrīgiri yādigā nellayeḍala
నధిపసాక్షాజ్జగదంబాసమాన - లధికంబు గలరు దాక్షారామమునను”
nadhipasākṣājjagadaṃbāsamāna - ladhikaṃbu galaru dākṣārāmamunanu”
అని సమంచితవిదగ్ధాలాపములను - వినుపింప నాయయ్య విస్మితుండగుచుఁ
ani samaṃcitavidagdhālāpamulanu - vinupiṃpa nāyayya vismituṃḍagucum̐
జెలువ పర్యంకంబు సింహాసనముగఁ - దలఁచి గంధద్రవ్యతాంబూలవితతి
jeluva paryaṃkaṃbu siṃhāsanamugam̐ - dalam̐ci gaṃdhadravyatāṃbūlavitati
యొడఁబడ నంత నొండొండు శోధించి - “పడఁతర్ఘ్యపణ్యముల్ వట్టు” నావుడును
yoḍam̐baḍa naṃta noṃḍoṃḍu śōdhiṃci - “paḍam̐targhyapaṇyamul vaṭṭu” nāvuḍunu
“దనరఁగ నీయయ్య మనసు వచ్చుటయుఁ - గనుఁగొన నా నేర్పుకలిమిగా” కనుచు
“danaram̐ga nīyayya manasu vaccuṭayum̐ - ganum̐gona nā nērpukalimigā” kanucu
హసనంబు దళుకొత్త నర్ఘ్యపణ్యములు - పసిఁడిబిందెలఁ బట్టి పడిగముల్వెట్టి
hasanaṃbu daḷukotta narghyapaṇyamulu - pasim̐ḍibiṃdelam̐ baṭṭi paḍigamulveṭṭi
గ్రక్కున సకలోపకరణంబులోలి - జక్కొల్పి యమ్ముగ్ధసంగయ్య కలరఁ
grakkuna sakalōpakaraṇaṃbulōli - jakkolpi yammugdhasaṃgayya kalaram̐
గరమొప్ప గంటలుఁ గాంస్యతాళములు - నరుదొంద మ్రోయ ధూపానంతరంబు
garamoppa gaṃṭalum̐ gāṃsyatāḷamulu - narudoṃda mrōya dhūpānaṃtaraṃbu
దెఱవ యుదంచిత దృగ్దీధితులను - నఱితిహారంబుల యంశుజాలములఁ
deṟava yudaṃcita dr̥gdīdhitulanu - naṟitihāraṃbula yaṃśujālamulam̐
బొలుపగు కంకణస్ఫురితరోచులను - మిళితమై కన్నులు మిఱుమిట్లు గొనఁగ
bolupagu kaṃkaṇasphuritarōculanu - miḷitamai kannulu miṟumiṭlu gonam̐ga
వెలుఁగు నీ రాజసంబులపల్లెరముల - నలర నందిచ్చునయ్యవసరంబునను
velum̐gu nī rājasaṃbulapalleramula - nalara naṃdiccunayyavasaraṃbunanu
“మలసంహరుఁడు జటామకుటంబుమీఁద - నిలిపియు నా కందు నెఱిఁబుచ్చలేఁడు
“malasaṃharum̐ḍu jaṭāmakuṭaṃbumīm̐da - nilipiyu nā kaṃdu neṟim̐buccalēm̐ḍu
భక్తులపాదసంస్పర్శనంబునను - వ్యక్తిగా నిర్మలత్వంబుఁబొందుదును”
bhaktulapādasaṃsparśanaṃbunanu - vyaktigā nirmalatvaṃbum̐boṃdudunu”
అని యాత్మఁ దలపోసి యరుదెంచుమాడ్కి - వనజారి ప్రాఙ్ముఖంబున నుదయించె
ani yātmam̐ dalapōsi yarudeṃcumāḍki - vanajāri prāṅmukhaṃbuna nudayiṃce
బసవని సితకీర్తి వర్వెనా, శివుని - భసితాగరాగప్రభలు వర్వె నాఁగ,
basavani sitakīrti varvenā, śivuni - bhasitāgarāgaprabhalu varve nām̐ga,
నా రుద్రునట్టహాసాంశులు దనరె - నా, రజతాచలచారుదీధితులు
nā rudrunaṭṭahāsāṃśulu danare - nā, rajatācalacārudīdhitulu
విలసిల్లెనా, నభోవీథి నెల్లెడల - నెలకొని యచ్చవెన్నెల వెల్లి విరియ
vilasillenā, nabhōvīthi nelleḍala - nelakoni yaccavennela velli viriya
నక్కాంత ముగ్ధసంగయ్యకుఁ బ్రీతి - నెక్కొని యాత్మలో నివ్వటిలంగ
nakkāṃta mugdhasaṃgayyakum̐ brīti - nekkoni yātmalō nivvaṭilaṃga
ననయంబు లింగపూజనల నటించు - తనదు విలాసినీజనుల రావించి
nanayaṃbu liṃgapūjanala naṭiṃcu - tanadu vilāsinījanula rāviṃci
“యక్కమహాదేవి! యల్ల మద్దెలలు - జక్కొల్పి వేగంబ సంధించుకొనుఁడు
“yakkamahādēvi! yalla maddelalu - jakkolpi vēgaṃba saṃdhiṃcukonum̐ḍu
స్వరమానమున బసవప్రమథవ్వ! - కరమర్థిఁ బట్టఁడు కాహళ లోలి;
svaramānamuna basavapramathavva! - karamarthim̐ baṭṭam̐ḍu kāhaḷa lōli;
సకళవ్వ! నీవును సంగళవ్వయును - నొకరీతి నిలువుఁడు సుకరంబుగాఁగ;
sakaḷavva! nīvunu saṃgaḷavvayunu - nokarīti niluvum̐ḍu sukaraṃbugām̐ga;
బాలరుద్రమ! యెత్తుపట్టఁగ వాళ - గ్రోలు వాయింపుము! గుడ్డవ్వ! నీవు
bālarudrama! yettupaṭṭam̐ga vāḷa - grōlu vāyiṃpumu! guḍḍavva! nīvu
సిట్టితాళము వట్టు శివదేవి! నీవు - సట్టన నృత్యంబు సరసంబెఱింగి;
siṭṭitāḷamu vaṭṭu śivadēvi! nīvu - saṭṭana nr̥tyaṃbu sarasaṃbeṟiṃgi;
సంగుదాసమ! మహేశ్వరి! వీరభద్ర - లింగవ్వ! మీరు గేళికలు సేయుండు;
saṃgudāsama! mahēśvari! vīrabhadra - liṃgavva! mīru gēḷikalu sēyuṃḍu;
రమణదుకూలాంబరమును గంచుకము - నమరించికొని చల్లడము బిగియించి
ramaṇadukūlāṃbaramunu gaṃcukamu - namariṃcikoni callaḍamu bigiyiṃci
యేతెమ్ము నీవు పురాత్మ! శీఘ్ర - మాతతమ్ముగ నృత్యమాడుదు గాని
yētemmu nīvu purātma! śīghra - mātatammuga nr̥tyamāḍudu gāni
తాళముల్వట్టుఁడు దాళగింపుండు - నాళతివేళకు నందఱు ననుచు
tāḷamulvaṭṭum̐ḍu dāḷagiṃpuṃḍu - nāḷativēḷaku naṃdaṟu nanucu
నవిరళంబుగ నంత నార్భటం బిచ్చి - జవనిక రప్పించి సరసమై నిలిచి
naviraḷaṃbuga naṃta nārbhaṭaṃ bicci - javanika rappiṃci sarasamai nilici
పొలుపగు ముఖరసంబును సౌష్ఠవమ్ము - లలియు భావంబు ధూకళియు ఝంకళియు
polupagu mukharasaṃbunu sauṣṭhavammu - laliyu bhāvaṃbu dhūkaḷiyu jhaṃkaḷiyu
మఱియు ఠేవము విభ్రమమును రేఖయును - నెఱయంగ నీ రీతి నృత్యంబు సలుప
maṟiyu ṭhēvamu vibhramamunu rēkhayunu - neṟayaṃga nī rīti nr̥tyaṃbu salupa
లింగార్చనంబు సల్లీలఁ జేయుచును - మంగళారవములు సంగడి నులియ
liṃgārcanaṃbu sallīlam̐ jēyucunu - maṃgaḷāravamulu saṃgaḍi nuliya
వెల్ల వేగుడు స్వచిత్తోల్లాస మమర - సల్లీల నమ్ముగ్ధసంగయ్యకిట్టు
vella vēguḍu svacittōllāsa mamara - sallīla nammugdhasaṃgayyakiṭṭu
లంగన పరిచర్య లాచరింపగ - లింగావసరము సెల్లించు నంతటను
laṃgana paricarya lācariṃpaga - liṃgāvasaramu selliṃcu naṃtaṭanu
నొగి మనోహరుని పాదోదకసేవ - నగణితలీల దివ్యాంగుండనైతి
nogi manōharuni pādōdakasēva - nagaṇitalīla divyāṃguṃḍanaiti
నఖిలమాహేశసమగ్రప్రసాద - సుఖసేవ నా కింకఁజొప్పుడునేని
nakhilamāhēśasamagraprasāda - sukhasēva nā kiṃkam̐joppuḍunēni
నిలుకాల నిలువంగనేరక తిరుగు - నలమట వాయుఁబొమ్మని తలపోసి
nilukāla niluvaṃganēraka tirugu - nalamaṭa vāyum̐bommani talapōsi
వచ్చినమాడ్కి దివాకరుండంతఁ - జెచ్చెర నుదయాద్రిశిఖరమెక్కుడును
vaccinamāḍki divākaruṃḍaṃtam̐ - jeccera nudayādriśikharamekkuḍunu
బసవనియాత్మ కింపెసఁగ మిండండు - వెస నేఁగుదెంచి తా వెండి యిట్లనియె
basavaniyātma kiṃpesam̐ga miṃḍaṃḍu - vesa nēm̐gudeṃci tā veṃḍi yiṭlaniye
“బసవ! యేమని చెప్ప భర్గుఁడే యెఱుఁగు - నెసఁగ లంజెఱిక మే నీ రాత్రిసేఁత
“basava! yēmani ceppa bhargum̐ḍē yeṟum̐gu - nesam̐ga laṃjeṟika mē nī rātrisēm̐ta
నీవును మా తోడ రావైతిగాని - వేవునంతకు నొక్క విధమైన సుఖము
nīvunu mā tōḍa rāvaitigāni - vēvunaṃtaku nokka vidhamaina sukhamu
ఐనను లంజెర్క మచ్చోటఁ జేయు - చో నిన్నుఁ దలఁచితిఁజుమ్మయ్య బసవ!
ainanu laṃjerka maccōṭam̐ jēyu - cō ninnum̐ dalam̐citim̐jummayya basava!
పుట్టితిఁగాని మున్నిట్టి సుఖంబు - నిట్టిలంజెఱికంబు నెఱుఁగ నెన్నఁడును
puṭṭitim̐gāni munniṭṭi sukhaṃbu - niṭṭilaṃjeṟikaṃbu neṟum̐ga nennam̐ḍunu
మలహరుకృపలేని మత్తికాండ్రకును - గలుగునే లంజెఱికం బిట్లు నేయఁ
malaharukr̥palēni mattikāṃḍrakunu - galugunē laṃjeṟikaṃ biṭlu nēyam̐
బగలు రాత్రియు నెడఁబడక లంజెఱిక - మొగినెన్నియుగము లిట్లొప్పుగఁ జేసి
bagalu rātriyu neḍam̐baḍaka laṃjeṟika - moginenniyugamu liṭloppugam̐ jēsi
పడసితి చెప్పుమా పరమేశుచేతఁ - గడునొప్పు లింగజంగమసంపదలను
paḍasiti ceppumā paramēśucētam̐ - gaḍunoppu liṃgajaṃgamasaṃpadalanu
సడిసన్న శివభక్తి సౌభాగ్యమహిమ - లొడఁగూడునే వెండి యొండుమార్గమున
saḍisanna śivabhakti saubhāgyamahima - loḍam̐gūḍunē veṃḍi yoṃḍumārgamuna
నాకును నీ కారణమునఁ గాఁజేసి - చేకూరెనిట్టి లంజెఱిక మీ రాత్రి
nākunu nī kāraṇamunam̐ gām̐jēsi - cēkūreniṭṭi laṃjeṟika mī rātri
బండారి! నీయాన పసిబిడ్డనాఁట - నుండియు శ్రీగిరి నుండుదునచట
baṃḍāri! nīyāna pasibiḍḍanām̐ṭa - nuṃḍiyu śrīgiri nuṃḍudunacaṭa
ననుపమకదళీవనాంతరబిల్వ - వనముల నేకాంతవాసంబునందుఁ
nanupamakadaḷīvanāṃtarabilva - vanamula nēkāṃtavāsaṃbunaṃdum̐
బన్నుగా నఱకాలఁగన్నును నొసలఁ - గన్నును గలమహాగణములు గలరు
bannugā naṟakālam̐gannunu nosalam̐ - gannunu galamahāgaṇamulu galaru
చూతుము గాని యెచ్చోట మున్నిట్టి - భూతిశాసనధారిఁ బొడగాన మేము
cūtumu gāni yeccōṭa munniṭṭi - bhūtiśāsanadhārim̐ boḍagāna mēmu
పొలుపగు పచ్చవిభూతిపూఁతయును - దెలుపగు రుద్రాక్షములు నెఱ్ఱజడలు
polupagu paccavibhūtipūm̐tayunu - delupagu rudrākṣamulu neṟṟajaḍalu
నంతకుఁదగిన సర్వాంగకచ్చడము - వింతయై యున్నది యింతి వేషంబు
naṃtakum̐dagina sarvāṃgakaccaḍamu - viṃtayai yunnadi yiṃti vēṣaṃbu
నిట్టిలాంఛనదారి నిట్టివిరాగి - నిట్టి నిష్ఠాశాలి నేమనవచ్చు?
niṭṭilāṃchanadāri niṭṭivirāgi - niṭṭi niṣṭhāśāli nēmanavaccu?
ఇంతి నొక్కతెఁజెప్పనేల తత్సతికి - సంతతంబును బరిచర్యలు సేయు
iṃti nokkatem̐jeppanēla tatsatiki - saṃtataṃbunu baricaryalu sēyu
లలనలందఱు నట్టిలాంఛనధరులు - చెలువలమహిమంబు శివుఁడె యెఱుఁగు”
lalanalaṃdaṟu naṭṭilāṃchanadharulu - celuvalamahimaṃbu śivum̐ḍe yeṟum̐gu”
ననుచుఁ దత్సతుల లాంఛనములు నచటి - తన మిండతనమును దప్పకచెప్పఁ
nanucum̐ datsatula lāṃchanamulu nacaṭi - tana miṃḍatanamunu dappakaceppam̐
బలుమాఱు నడుగుచు నలి జంగమములు - సెలఁగుచు నొండొరుఁ జేవ్రేసి నవ్వ
balumāṟu naḍugucu nali jaṃgamamulu - selam̐gucu noṃḍorum̐ jēvrēsi navva
బసవం డసమసముల్లసనుఁడై చెన్న - బసవని దెసఁజూచి పసరింపఁదొడఁగె
basavaṃ ḍasamasamullasanum̐ḍai cenna - basavani desam̐jūci pasariṃpam̐doḍam̐ge
"ఇట్టి నెట్టణభక్తి యిట్టి ముగ్ధత్వ - మిట్టిమహత్త్వంబు నెందును గలదె?
"iṭṭi neṭṭaṇabhakti yiṭṭi mugdhatva - miṭṭimahattvaṃbu neṃdunu galade?
నిక్క మీశ్వరుఁగాని నిజ మెఱుంగమిని - ముక్కంటి భక్తులు ముగ్ధలు గారె?”
nikka mīśvarum̐gāni nija meṟuṃgamini - mukkaṃṭi bhaktulu mugdhalu gāre?”
అని ప్రశంసింపంగ నా చెన్నబసవఁ - డనురక్తి ముకుళితహస్తుఁడై మ్రొక్కి
ani praśaṃsiṃpaṃga nā cennabasavam̐ - ḍanurakti mukuḷitahastum̐ḍai mrokki
“పరగు నీ నూతన ప్రాక్తనభక్త - వరగణంబులలోన వచియింపఁజూప
“paragu nī nūtana prāktanabhakta - varagaṇaṃbulalōna vaciyiṃpam̐jūpa
నిల నిట్టి ముగ్ధలు గలరొకో?” యనుచు - నలి దీటుకొనఁగ విన్నపము సేయుడును
nila niṭṭi mugdhalu galarokō?” yanucu - nali dīṭukonam̐ga vinnapamu sēyuḍunu
బరమానురాగసంపదఁ దేలి సోలి - కరమర్థి మఱి ముగ్ధగణముల కథలు
baramānurāgasaṃpadam̐ dēli sōli - karamarthi maṟi mugdhagaṇamula kathalu
పసరింపఁ దలఁచి సద్భక్తి బండారి - బసవయ్య యా చెన్నబసవనికనియె
pasariṃpam̐ dalam̐ci sadbhakti baṃḍāri - basavayya yā cennabasavanikaniye
వ్యక్తంబెఱుంగవే యయ్యళయూర - భక్తుండు మును రుద్రపశుపతి నాఁగఁ
vyaktaṃbeṟuṃgavē yayyaḷayūra - bhaktuṃḍu munu rudrapaśupati nām̐gam̐
ప్రథితమౌ నాదిపురాణమందబ్ధి - మథనావసర మొక్కకథికుండు సదువఁ
prathitamau nādipurāṇamaṃdabdhi - mathanāvasara mokkakathikuṃḍu saduvam̐
గమలజ కమలాక్షు లమితదైత్యాదు - లమరులు సెడి పాఱ నందుద్భవించి
gamalaja kamalākṣu lamitadaityādu - lamarulu seḍi pāṟa naṃdudbhaviṃci
పొరి నజాండములెల్ల దరికొని కాల్చు - గరళంబు మ్రింగె శ్రీకఱకంఠుఁడనిన
pori najāṃḍamulella darikoni kālcu - garaḷaṃbu mriṃge śrīkaṟakaṃṭhum̐ḍanina
నా రుద్రపశుపతి యాలించి భర్గుఁ - డారగించుట నిక్కమా విషం? బనుడు
nā rudrapaśupati yāliṃci bhargum̐ - ḍāragiṃcuṭa nikkamā viṣaṃ? banuḍu
'ననుమానమా! త్రావె హరుఁడు విషంబు - బనుగొన నటమీఁదిపను లెఱుంగమన
'nanumānamā! trāve harum̐ḍu viṣaṃbu - banugona naṭamīm̐dipanu leṟuṃgamana
విని యుల్కిపడి వీపువిఱిగి “హా! చెడితి' - ననినేలఁబడి పొర్లి యక్కటా! నిన్ను
vini yulkipaḍi vīpuviṟigi “hā! ceḍiti' - naninēlam̐baḍi porli yakkaṭā! ninnu
వెఱ్ఱిఁ జేసిరిగాక! విశ్వేశ యెట్టి - వెఱ్ఱివారైనను విషముఁ ద్రావుదురె?
veṟṟim̐ jēsirigāka! viśvēśa yeṭṭi - veṟṟivārainanu viṣamum̐ drāvudure?
బ్రదుకుదురె? విషమ్ముపాలైనవార? - లిది యెట్లు వినవచ్చు; నేమి సేయుదును?
bradukudure? viṣammupālainavāra? - lidi yeṭlu vinavaccu; nēmi sēyudunu?
నిక్క మెవ్విధమున నిన్నె కానెఱుఁగ - ముక్కంటి! నాకింక దిక్కెవ్వరయ్య?
nikka mevvidhamuna ninne kāneṟum̐ga - mukkaṃṭi! nākiṃka dikkevvarayya?
నా కొఱకైనఁబినాకి! యివ్విషము - చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను
nā koṟakainam̐bināki! yivviṣamu - cēkona kumiyavē nīku mrokkedanu
కటకటా! మేన సగంబున నుండి - యెట వోయితవ్వ! నీ వెఱుఁగవే గౌరి!
kaṭakaṭā! mēna sagaṃbuna nuṃḍi - yeṭa vōyitavva! nī veṟum̐gavē gauri!
ప్రమథగణములార! పరమాప్తులార! - సమసిన వెండి మీ శక్యమే కాన?
pramathagaṇamulāra! paramāptulāra! - samasina veṃḍi mī śakyamē kāna?
శతరుద్రులార! యసంఖ్యాతులార! - క్షితిధరకన్యకాపతిఁ గావరయ్య!
śatarudrulāra! yasaṃkhyātulāra! - kṣitidharakanyakāpatim̐ gāvarayya!
వీరభద్రయ్యరో! విషముఁ బ్రాణేశుఁ - డారగించె నిఁ కెట్టులవునోకదయ్య!
vīrabhadrayyarō! viṣamum̐ brāṇēśum̐ - ḍāragiṃce nim̐ keṭṭulavunōkadayya!
ఓ పురాతనులార! యొడయండు బ్రదుక - నోపునొకో! విషంబొగి నారగించెఁ
ō purātanulāra! yoḍayaṃḍu braduka - nōpunokō! viṣaṃbogi nāragiṃcem̐
జావు దప్పింపరే సద్గురు నాథు - దీవన లీయరే కావరే శివునిఁ
jāvu dappiṃparē sadguru nāthu - dīvana līyarē kāvarē śivunim̐
దల్లి లేని ప్రజలఁ దలఁతురే యొరులు - తల్లి యున్న విషముఁ ద్రావనేలిచ్చు!
dalli lēni prajalam̐ dalam̐turē yorulu - talli yunna viṣamum̐ drāvanēliccu!
పరమేశుఁడీ బారి బ్రదికెనేనియును - మరణంబు లేదువో మఱి యెన్నఁటికిని!
paramēśum̐ḍī bāri bradikenēniyunu - maraṇaṃbu lēduvō maṟi yennam̐ṭikini!
నని ప్రలాపింపుచుఁ బనవుచు నొండు - వినఁజాలఁ బ్రాణము ల్విడుతు నే ననుచుఁ
nani pralāpiṃpucum̐ banavucu noṃḍu - vinam̐jālam̐ brāṇamu lviḍutu nē nanucum̐
దడయక ఘనజలాంతరమున నుఱుకఁ - బడకుండ నా రుద్రపశుపతిఁ బట్టి
daḍayaka ghanajalāṃtaramuna nuṟukam̐ - baḍakuṃḍa nā rudrapaśupatim̐ baṭṭi
పార్వతీసహితుఁడై ప్రమథరుద్రాది - సర్వసురాసురసంఘంబు గొలువ
pārvatīsahitum̐ḍai pramatharudrādi - sarvasurāsurasaṃghaṃbu goluva
హరుఁడు ప్రత్యక్షమై “యడుగుము నీకు - వరమిత్తు నెయ్యది వాంఛింతం” బనుడుఁ
harum̐ḍu pratyakṣamai “yaḍugumu nīku - varamittu neyyadi vāṃchiṃtaṃ” banuḍum̐
గడుసంభ్రమంబున మృడుపదాబ్జములఁ - బడి రుద్రపశుపతి భట్టారకుండు
gaḍusaṃbhramaṃbuna mr̥ḍupadābjamulam̐ - baḍi rudrapaśupati bhaṭṭārakuṃḍu
“ఏమియు నే నొల్ల నీ విషసేవ - నేమేమి వుట్టునో యే వినఁజాల
“ēmiyu nē nolla nī viṣasēva - nēmēmi vuṭṭunō yē vinam̐jāla
గ్రక్కున నుమియవే కాలకూటంబు - నిక్కంబు నాకెక్కె నీయీవి” యనిన
grakkuna numiyavē kālakūṭaṃbu - nikkaṃbu nākekke nīyīvi” yanina
దశనకాంతులు దశదిశలఁ బర్వంగఁ - బశుపతి యా రుద్రపశుపతి కనియె
daśanakāṃtulu daśadiśalam̐ barvaṃgam̐ - baśupati yā rudrapaśupati kaniye
“ఇట లోకములలోన నెన్ననే కాక - యట మ్రింగ నుమియంగ నది యెంతవెద్ద
“iṭa lōkamulalōna nennanē kāka - yaṭa mriṃga numiyaṃga nadi yeṃtavedda
యణుమాత్ర నా కంఠమందుఁ జిక్కినది - గణుతింప నున్నదే కాలకూటంబు
yaṇumātra nā kaṃṭhamaṃdum̐ jikkinadi - gaṇutiṃpa nunnadē kālakūṭaṃbu
యింత సంతాపింప నేల నీ” కనుచు - వింతన వ్వొలయంగ సంతరించుడును
yiṃta saṃtāpiṃpa nēla nī” kanucu - viṃtana vvolayaṃga saṃtariṃcuḍunu
“నమ్మంగఁ జాలఁ బినాకి యివ్విషము - గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను
“nammaṃgam̐ jālam̐ bināki yivviṣamu - grammana nokkiṃta gaḍupu soccinanu
బెద్దయుఁ బుట్టునో పిమ్మటివార్త - దద్దయు విన నోపఁ దా మున్న చత్తు
beddayum̐ buṭṭunō pimmaṭivārta - daddayu vina nōpam̐ dā munna cattu
సమయనిమ్మొండేనిఁ జావనీవేని - యుమియు మివ్విషమొండె నొండు సెప్పకుము
samayanimmoṃḍēnim̐ jāvanīvēni - yumiyu mivviṣamoṃḍe noṃḍu seppakumu
తక్కిన మాటలు దనకింప” వనుచు - నిక్కంబు తెగువమై నిష్ఠించి పలుక
takkina māṭalu danakiṃpa” vanucu - nikkaṃbu teguvamai niṣṭhiṃci paluka
‘నుమియకుండినఁజచ్చునో ముగ్ధ’ యనుచు - నుమ బోటి యాత్మలో నుత్తలపడగ
‘numiyakuṃḍinam̐jaccunō mugdha’ yanucu - numa bōṭi yātmalō nuttalapaḍaga
“నుమిసినఁ గొని కాల్చునోతమ్ము” ననుచుఁ - గమలాక్షముఖ్యులు గడగడ వడఁకఁ
“numisinam̐ goni kālcunōtammu” nanucum̐ - gamalākṣamukhyulu gaḍagaḍa vaḍam̐kam̐
బ్రమథు లాతని ముగ్ధభక్తికి మెచ్చి - యమితమహోత్సవులై చూచుచుండ
bramathu lātani mugdhabhaktiki mecci - yamitamahōtsavulai cūcucuṃḍa
నొక్కింత నవ్వుచు నుడురాజధరుఁడు - గ్రక్కున లేనెత్తి కౌఁగిటఁ జేర్చి
nokkiṃta navvucu nuḍurājadharum̐ḍu - grakkuna lēnetti kaum̐giṭam̐ jērci
ప్రమథులయాన నీ పాదంబులాన - సమయ నివ్విషమున సత్యమిట్లనిన
pramathulayāna nī pādaṃbulāna - samaya nivviṣamuna satyamiṭlanina
నమ్మవే వలపలి నా తొడ యెక్కి - నెమ్మిఁ జూచుచునుండు నీలకంఠంబు”
nammavē valapali nā toḍa yekki - nemmim̐ jūcucunuṃḍu nīlakaṃṭhaṃbu”
నని యూరుపీఠంబునందు ధరించె - మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
nani yūrupīṭhaṃbunaṃdu dhariṃce - munu guṟiyunnadē mugdhatvamunaku
నదిగాక కుత్తుక హాలాహలంబు - కదలినంతటనె చచ్చెదఁగాక! యనుచుఁ
nadigāka kuttuka hālāhalaṃbu - kadalinaṃtaṭane caccedam̐gāka! yanucum̐
దన కరవాలు ఱొమ్మున దూసి మోపి - కొని కుత్తుకయ చూచుచును ఱెప్పలిడక
dana karavālu ṟommuna dūsi mōpi - koni kuttukaya cūcucunu ṟeppaliḍaka
పశుపతి తొడమీఁదఁ బాయక రుద్ర - పశుపతి నేఁడును బరగుచున్నాఁడు
paśupati toḍamīm̐dam̐ bāyaka rudra - paśupati nēm̐ḍunu baragucunnām̐ḍu
ఇల నొప్పు చోళమండలమున మఱియు - నలి నీలనక్కనైనారనుగణము
ila noppu cōḷamaṃḍalamuna maṟiyu - nali nīlanakkanaināranugaṇamu
ఉవిదయుఁ దానును శివలింగపూజ - సవినయప్రీతిమైఁ జలుపు చున్నెడను
uvidayum̐ dānunu śivaliṃgapūja - savinayaprītimaim̐ jalupu cunneḍanu
శివదేవుపై నొక్క సెలఁది వ్రాకుడును “శివశివ! ప్రేలు శివునకు” ననుచు
śivadēvupai nokka selam̐di vrākuḍunu “śivaśiva! prēlu śivunaku” nanucu
నా పొల్తి యప్పుడ తూపొడ్వఁ దడవ - కోపించి యాతఁడు గొంతి కిట్లనియె
nā polti yappuḍa tūpoḍvam̐ daḍava - kōpiṃci yātam̐ḍu goṃti kiṭlaniye
“పాపికా! బ్రమసితే ప్రాణవల్లభునిఁ - దూపొడ్వఁగూడునే తుంపురు ల్నిండ
“pāpikā! bramasitē prāṇavallabhunim̐ - dūpoḍvam̐gūḍunē tuṃpuru lniṃḍa
నిటుగాని నీ భక్తి యెఱుఁగంగరాదె! - యెటయేనిఁ బొమ్ము ని న్నే నొల్ల” ననుచు
niṭugāni nī bhakti yeṟum̐gaṃgarāde! - yeṭayēnim̐ bommu ni nnē nolla” nanucu
వెడలంగ నడిచి యవ్విభుఁడు దా రాత్రి - మృడునర్చనము సేయునెడ లింగమందు
veḍalaṃga naḍici yavvibhum̐ḍu dā rātri - mr̥ḍunarcanamu sēyuneḍa liṃgamaṃdu
నక్కాంత దూపొడ్చు చక్కటిఁ దక్కఁ - దక్కెల్లఁ బ్రేలిన నక్కజంబంది
nakkāṃta dūpoḍcu cakkaṭim̐ dakkam̐ - dakkellam̐ brēlina nakkajaṃbaṃdi
పతి వేగ సతి వెంటఁ బాఱి పాదముల - కతిభక్తియుక్తి సాష్టాంగుఁడై మ్రొక్కి
pati vēga sati veṃṭam̐ bāṟi pādamula - katibhaktiyukti sāṣṭāṃgum̐ḍai mrokki
“పాపి! పొ”మ్మని నిన్నుఁబఱపినయట్టి - పాపంబు సైరింపు పటుభక్తినిరత
“pāpi! po”mmani ninnum̐baṟapinayaṭṭi - pāpaṃbu sairiṃpu paṭubhaktinirata
నీవు దూపొడిచినఠావు దక్కంగ - దేవుని మేనెల్లఁ జూవె ప్రేలినది
nīvu dūpoḍicinaṭhāvu dakkaṃga - dēvuni mēnellam̐ jūve prēlinadi
ఈ దిక్కు దూపొడ్చి యీ సంకటంబు - నా దేవునకు మాన్పవే దయతోడ”
ī dikku dūpoḍci yī saṃkaṭaṃbu - nā dēvunaku mānpavē dayatōḍa”
ననుచు వెండియు మ్రొక్క నంగన వచ్చి - తనపతి ప్రాణేశుతనువున నున్న
nanucu veṃḍiyu mrokka naṃgana vacci - tanapati prāṇēśutanuvuna nunna
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).