లనిన నక్కోమలి హనుమంతుఁజూచి తన పూర్వకథయెల్లఁ దాఁజెప్పఁదొడఁగె:
lanina nakkōmali hanumaṃtum̐jūci tana pūrvakathayellam̐ dām̐jeppam̐doḍam̐ge:
కిష్కింధాకాండము · హనుమదాదులు స్వయంప్రభచే సత్కృతులగుట · కిష్కింధాకాండము · హనుమదాదులు స్వయంప్రభచే సత్కృతులగుట
kiṣkiṃdhākāṃḍamu · hanumadādulu svayaṃprabhacē satkr̥tulaguṭa
Kishkindha Kanda, section 19: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
24 passagesTelugu with transliteration
లనిన నక్కోమలి హనుమంతుఁజూచి తన పూర్వకథయెల్లఁ దాఁజెప్పఁదొడఁగె:
lanina nakkōmali hanumaṃtum̐jūci tana pūrvakathayellam̐ dām̐jeppam̐doḍam̐ge:
“దగఁదొల్లి మయుఁడను దానవేశ్వరుఁడు తగిలి పద్మజునకుఁదపమాచరించి
“dagam̐dolli mayum̐ḍanu dānavēśvarum̐ḍu tagili padmajunakum̐dapamācariṃci
పసనొప్పునిర్మాణపటుశక్తి వడసి పసిఁడి నీ పురమిట్లు పరగ నిర్మించి
pasanoppunirmāṇapaṭuśakti vaḍasi pasim̐ḍi nī puramiṭlu paraga nirmiṃci
యవిరళ గతి హేమయనుదివ్యవనితఁ గవిసి యాతఁడు పెద్దకాలమిందుండ
yaviraḷa gati hēmayanudivyavanitam̐ gavisi yātam̐ḍu peddakālamiṃduṃḍa
నాతని వజ్రధారాహతుఁ జేసి యా తన్విఁగొనిపోయె నమరవల్లభుఁడు
nātani vajradhārāhatum̐ jēsi yā tanvim̐gonipōye namaravallabhum̐ḍu
ఆ తరళాక్షి నెయ్యపుఁ జెలి నేను. మా తండ్రి సౌవర్ణి మహితమానసుఁడు.
ā taraḷākṣi neyyapum̐ jeli nēnu. mā taṃḍri sauvarṇi mahitamānasum̐ḍu.
ఆ యింతిపనుపున నతితపోనిష్ఠఁ బాయకుండుదు స్వయంప్రభ యనుదాన.”
ā yiṃtipanupuna natitapōniṣṭham̐ bāyakuṃḍudu svayaṃprabha yanudāna.”
నని చెప్పి కందమూలాదు లందఱకుఁ దనివిదీర నొసగి దాహంబు దీర్చి:
nani ceppi kaṃdamūlādu laṃdaṟakum̐ danividīra nosagi dāhaṃbu dīrci:
“యనఘ! మీ రెవ్వరిందరుగు దేనేల? యనిమిషులకునైన నరుగుదే రాదు.
“yanagha! mī revvariṃdarugu dēnēla? yanimiṣulakunaina narugudē rādu.
వినుఁడిందు మీరలెవ్విధిని వచ్చితిరి?” యన విని హనుమంతుఁడతివకిట్లనియె.
vinum̐ḍiṃdu mīralevvidhini vaccitiri?” yana vini hanumaṃtum̐ḍativakiṭlaniye.
“దన తండ్రిపనుపున దండకాటవికి మునివృత్తి రాముఁడిమ్ముల వచ్చియుండ
“dana taṃḍripanupuna daṃḍakāṭaviki munivr̥tti rāmum̐ḍimmula vacciyuṃḍa
వనజాక్షి నా రామువరపత్నిఁగొనుచుఁ జనిన రామునివెంటఁజనిచని యేము
vanajākṣi nā rāmuvarapatnim̐gonucum̐ janina rāmuniveṃṭam̐janicani yēmu
జనకజ వెదకుచు జలశూన్యమగుట ఘనమైన డప్పిచేఁగడు డస్సియొక్క
janakaja vedakucu jalaśūnyamaguṭa ghanamaina ḍappicēm̐gaḍu ḍassiyokka
బిలములోపలఁజొచ్చి పెద్దచీకటికిఁ దలఁకక యొక్కట దైవయత్నమున
bilamulōpalam̐jocci peddacīkaṭikim̐ dalam̐kaka yokkaṭa daivayatnamuna
నీ యాశ్రమంబున కేతెంచి వెడలి పోయెడిమార్గంబు పొడగానలేక
nī yāśramaṃbuna kēteṃci veḍali pōyeḍimārgaṃbu poḍagānalēka
తిరుగుచున్నారము; ధృతిఁబెక్కుదినము లురిఁబడియున్నార మొకదిక్కు లేక.”
tirugucunnāramu; dhr̥tim̐bekkudinamu lurim̐baḍiyunnāra mokadikku lēka.”
యనిన:“రామునికార్యమై వచ్చినార లనఘులు పుణ్యాత్ము.”లని భక్తిఁజూచి:
yanina:“rāmunikāryamai vaccināra lanaghulu puṇyātmu.”lani bhaktim̐jūci:
“మీ కెద్దియిష్టమిమ్మెయి వేఁడుఁ.”డనిన “మా కీ బిలద్వారమార్గంబు వెడలఁ
“mī keddiyiṣṭamimmeyi vēm̐ḍum̐.”ḍanina “mā kī biladvāramārgaṃbu veḍalam̐
జేయుము; వేవేగ సీతను వెదకఁ బోయెద.”మనిన నుప్పొంగి యా మగువ:
jēyumu; vēvēga sītanu vedakam̐ bōyeda.”manina nuppoṃgi yā maguva:
“మొగి మీరు కన్నులు మూసికొం.”డనుచుఁ దగఁబల్కి వారలఁదన తపశ్శక్తి
“mogi mīru kannulu mūsikoṃ.”ḍanucum̐ dagam̐balki vāralam̐dana tapaśśakti
నెలఁతుక యవలీల నిమిషమాత్రమున బిలము వెల్వడఁదెచ్చిపెట్టి తాఁబోయెఁ
nelam̐tuka yavalīla nimiṣamātramuna bilamu velvaḍam̐deccipeṭṭi tām̐bōyem̐
బోయినఁగపివీరపుంగవులెల్ల నాయింతిఁబొగడుచు నటపోయి పోయి
bōyinam̐gapivīrapuṃgavulella nāyiṃtim̐bogaḍucu naṭapōyi pōyi
యాయతోన్నతబలులందొక్కనరసిఁ బాయక జలములు పానంబు సేసి
yāyatōnnatabalulaṃdokkanarasim̐ bāyaka jalamulu pānaṃbu sēsi
యంత నందఱు మహేంద్రాద్రికిఁబోయి రంత నంగదుఁడిట్టులనుచు శోకించె.
yaṃta naṃdaṟu mahēṃdrādrikim̐bōyi raṃta naṃgadum̐ḍiṭṭulanucu śōkiṃce.
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).