Skip to content

కిష్కింధాకాండము · సీత గానమికి వానరులు పలవించుట · కిష్కింధాకాండము · సీత గానమికి వానరులు పలవించుట

Kishkindha Kanda 20 · sīta gānamiki vānarulu palaviṃcuṭa

kiṣkiṃdhākāṃḍamu · sīta gānamiki vānarulu palaviṃcuṭa

Kishkindha Kanda, section 20: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

39 passagesTelugu with transliteration

An original emblem for Kishkindha Kanda, section 20.

“నినజుని మితి దప్పె; నినవంశ్యుదేవి వనజాక్షిఁబొడగన్న వారముగాము.

“ninajuni miti dappe; ninavaṃśyudēvi vanajākṣim̐boḍaganna vāramugāmu.

Report an error

ఆజ్ఞాధురంధరుండైన సుగ్రీవుఁ “డాజ్ఞ దప్పిరి వీర.” లంచును మనలఁ

ājñādhuraṃdharuṃḍaina sugrīvum̐ “ḍājña dappiri vīra.” laṃcunu manalam̐

Report an error

బొడగన్న యప్పుడ భూపతి మెచ్చ నడిమికి రెండుగా నఱకించు నుఱక.

boḍaganna yappuḍa bhūpati mecca naḍimiki reṃḍugā naṟakiṃcu nuṟaka.

Report an error

కావున మనమింకఁగపిరాజుఁగానఁ బోవుట తగవును బుద్ధియుఁగాదు

kāvuna manamiṃkam̐gapirājum̐gānam̐ bōvuṭa tagavunu buddhiyum̐gādu

Report an error

వెలువడి మనమిప్డు వెస వచ్చినట్టి బిలములోపలఁజొచ్చి పేర్మి నుండుదము.

veluvaḍi manamipḍu vesa vaccinaṭṭi bilamulōpalam̐jocci pērmi nuṃḍudamu.

Report an error

అది యష్టదిక్పాలకాభేద్యమార్గ: మది పక్వఫలభరితారామమరయఁ

adi yaṣṭadikpālakābhēdyamārga: madi pakvaphalabharitārāmamarayam̐

Report an error

బొందుగా నచటఁగాపురమున్న మనల నెందు నెవ్వరికైన నెఱుఁగఁజొప్పడదు.”

boṃdugā nacaṭam̐gāpuramunna manala neṃdu nevvarikaina neṟum̐gam̐joppaḍadu.”

Report an error

అనఁగొందఱగచరు లాపని కీయ కొని. రంత మారుతి కోపించి పలికెఁ:

anam̐goṃdaṟagacaru lāpani kīya koni. raṃta māruti kōpiṃci palikem̐:

Report an error

“బెద్దబుద్ధివి నీవు! పినతండ్రి వనుప గద్దరివై రాము కార్యమై వచ్చి

“beddabuddhivi nīvu! pinataṃḍri vanupa gaddarivai rāmu kāryamai vacci

Report an error

కపులతోఁగూడి యా గంభీరబిలము జపలతఁజొచ్చి యచ్చటనుండినపుడె

kapulatōm̐gūḍi yā gaṃbhīrabilamu japalatam̐jocci yaccaṭanuṃḍinapuḍe

Report an error

భానుజుతో మళ్లఁబడుచొప్పుగాదె? తానును నీలుండు దారుండు నలుఁడు

bhānujutō maḷlam̐baḍucoppugāde? tānunu nīluṃḍu dāruṃḍu nalum̐ḍu

Report an error

దీని కెవ్విధి సమ్మతింపము; దక్కు వానరుల్‌ దమబంధువర్గంబు వాసి

dīni kevvidhi sammatiṃpamu; dakku vānarul damabaṃdhuvargaṃbu vāsi

Report an error

నినుఁగొల్చి యుండంగ నేరరు సుమ్ము. విను: మదియునుగాక, వృత్రారి తొల్లి

ninum̐golci yuṃḍaṃga nēraru summu. vinu: madiyunugāka, vr̥trāri tolli

Report an error

యర్మిలిఁదన వజ్రహతి నా బిలంబు నిర్మించె; నటువంటి నిశితవజ్రాస్త్ర

yarmilim̐dana vajrahati nā bilaṃbu nirmiṃce; naṭuvaṃṭi niśitavajrāstra

Report an error

కోటి లక్ష్మణునకుఁగొలఁది కగ్గలము. మాటమాత్రమున నీ మర్కటాధముల

kōṭi lakṣmaṇunakum̐golam̐di kaggalamu. māṭamātramuna nī markaṭādhamula

Report an error

నిన్ను నీ బలమును నీఱుగాఁజేయ కున్నె; యీ దుర్బుద్ధులొక్కట విడిచి

ninnu nī balamunu nīṟugām̐jēya kunne; yī durbuddhulokkaṭa viḍici

Report an error

“యవనిజఁబొడగానమైతి;”మటంచు రవిజునికడ కందఱము పోయి మ్రొక్కి

“yavanijam̐boḍagānamaiti;”maṭaṃcu ravijunikaḍa kaṃdaṟamu pōyi mrokki

Report an error

విన్నవింతము; జగద్విఖ్యాతి నతఁడు నిన్నును మమ్ము మన్నించు మోమోట

vinnaviṃtamu; jagadvikhyāti natam̐ḍu ninnunu mammu manniṃcu mōmōṭa

Report an error

నా మీఁద మీ తల్లి కనురక్తుఁడగుట నీ మీఁద నలుగఁడు; నీవె పుత్త్రుఁడవు

nā mīm̐da mī talli kanuraktum̐ḍaguṭa nī mīm̐da nalugam̐ḍu; nīve puttrum̐ḍavu

Report an error

కావునఁగడు నిన్నుఁగట్టుఁబట్టంబు.” నా విని యా వాలినందనుఁడనియెఁ:

kāvunam̐gaḍu ninnum̐gaṭṭum̐baṭṭaṃbu.” nā vini yā vālinaṃdanum̐ḍaniyem̐:

Report an error

“బితృసమానుని వాలిఁబృథ్విపైఁగూల్చి యతని భార్యవరించి యా మీఁదఁదనకు

“bitr̥samānuni vālim̐br̥thvipaim̐gūlci yatani bhāryavariṃci yā mīm̐dam̐danaku

Report an error

నుపకారియగు రామునుద్యోగమెల్లఁ జపలుఁడై మఱచి లక్ష్మణుఁడాగ్రహింప

nupakāriyagu rāmunudyōgamellam̐ japalum̐ḍai maṟaci lakṣmaṇum̐ḍāgrahiṃpa

Report an error

మఱికాదె చనుదెంచె మా పినతండ్రి యెఱుఁగవే యాతనిహీనవర్తనము?

maṟikāde canudeṃce mā pinataṃḍri yeṟum̐gavē yātanihīnavartanamu?

Report an error

నట్టికామాంధుని నట్టికృతఘ్ను నెట్టు నమ్మఁగవచ్చు? నిది యది యేల?

naṭṭikāmāṃdhuni naṭṭikr̥taghnu neṭṭu nammam̐gavaccu? nidi yadi yēla?

Report an error

శ్రీరాముకార్యంబు సేయక పోయి యా రవిసూనుచే నట సచ్చుకంటె

śrīrāmukāryaṃbu sēyaka pōyi yā ravisūnucē naṭa saccukaṃṭe

Report an error

నీ యెడఁజచ్చుట యిదిలెస్స; యింక ప్రాయోపవేశ నపరులు గం.”డనుచు

nī yeḍam̐jaccuṭa yidilessa; yiṃka prāyōpavēśa naparulu gaṃ.”ḍanucu

Report an error

వారును దానును వరదర్భశయను లై రాక వృథయౌట కాత్మఁజింతించి

vārunu dānunu varadarbhaśayanu lai rāka vr̥thayauṭa kātmam̐jiṃtiṃci

Report an error

తెవులును ముదిమియుఁదీవ్రవేదనయు నవతయు లేని ప్రాణంబులు గాన

tevulunu mudimiyum̐dīvravēdanayu navatayu lēni prāṇaṃbulu gāna

Report an error

లేచియు మఱి పవ్వళించియు దిశలు సూచియుఁదమ తమ చుట్టాలసుతులఁ

lēciyu maṟi pavvaḷiṃciyu diśalu sūciyum̐dama tama cuṭṭālasutulam̐

Report an error

దలఁచియు:“బాపురే! దైవమా! యిట్లు చలపట్టి మము వృథా చంప నిచ్చోట

dalam̐ciyu:“bāpurē! daivamā! yiṭlu calapaṭṭi mamu vr̥thā caṃpa niccōṭa

Report an error

సమకట్టితే?”యంచు సకలవానరులు గుమురులుగుమురులై కూడి యొండొరులు:

samakaṭṭitē?”yaṃcu sakalavānarulu gumurulugumurulai kūḍi yoṃḍorulu:

Report an error

“నలినాప్తకులుఁడు కానలకు రానేల? కులభామ నసురచేఁగోల్పడ నేల?

“nalināptakulum̐ḍu kānalaku rānēla? kulabhāma nasuracēm̐gōlpaḍa nēla?

Report an error

యొరసి దైత్యుఁడు జటాయువుఁజంపనేల? ధరణీశుఁడరుణనందనుఁగననేల?

yorasi daityum̐ḍu jaṭāyuvum̐jaṃpanēla? dharaṇīśum̐ḍaruṇanaṃdanum̐gananēla?

Report an error

ధరణిజవార్త యాతఁడు సెప్పనేల? తరణివంశ్యుడు పంపదరికి రానేల?

dharaṇijavārta yātam̐ḍu seppanēla? taraṇivaṃśyuḍu paṃpadariki rānēla?

Report an error

సుగ్రీవుకడకు రాసుతుఁడు రానేల? సుగ్రీవుఁడాతనిసొమ్ము గానేల?

sugrīvukaḍaku rāsutum̐ḍu rānēla? sugrīvum̐ḍātanisommu gānēla?

Report an error

వలనొప్ప వాలి భూవరుఁడేయనేల? బలిమితోడుతఁగపిబలము రానేల?

valanoppa vāli bhūvarum̐ḍēyanēla? balimitōḍutam̐gapibalamu rānēla?

Report an error

యినతనూజుఁడు మమ్ము నిటు పంపనేల? పనివడి మనకు నిప్పాటు రానేల?

yinatanūjum̐ḍu mammu niṭu paṃpanēla? panivaḍi manaku nippāṭu rānēla?

Report an error

యొక్కొటఁబ్రాణంబు లుఱక పోనేల? యక్కటా! భువిఁగైక యడిగినవరము

yokkoṭam̐brāṇaṃbu luṟaka pōnēla? yakkaṭā! bhuvim̐gaika yaḍiginavaramu

Report an error

మనువంశయుతముగా మనవంశమణఁచె” నని యని శోకించి యలయుచున్నంత

manuvaṃśayutamugā manavaṃśamaṇam̐ce” nani yani śōkiṃci yalayucunnaṃta

Report an error

Illustration: Verse & Place (Project-owned).