నవధరింపుము దేవ! యసురాధినాథ! యవనిజఁదెచ్చిన యంతనుండియును
navadhariṃpumu dēva! yasurādhinātha! yavanijam̐deccina yaṃtanuṃḍiyunu
యుద్ధకాండము · విభీషణుఁడు రావణునకు హితోపదేశ మొనర్చుట · యుద్ధకాండము · విభీషణుఁడు రావణునకు హితోపదేశ మొనర్చుట
yuddhakāṃḍamu · vibhīṣaṇum̐ḍu rāvaṇunaku hitōpadēśa monarcuṭa
Yuddha Kanda, section 9: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
46 passagesTelugu with transliteration
నవధరింపుము దేవ! యసురాధినాథ! యవనిజఁదెచ్చిన యంతనుండియును
navadhariṃpumu dēva! yasurādhinātha! yavanijam̐deccina yaṃtanuṃḍiyunu
దుర్నిమిత్తంబులు దోచుచున్నవియు; నిర్ణయం బట్టిది నిక్కువంబరయ:
durnimittaṃbulu dōcucunnaviyu; nirṇayaṃ baṭṭidi nikkuvaṃbaraya:
హోమకుండంబుల నున్న త్రేతాగ్ను లేమియు వెలుఁగవ యీ దివసముల
hōmakuṃḍaṃbula nunna trētāgnu lēmiyu velum̐gava yī divasamula
నా గుండములు సొచ్చి యలమిచుట్టియును సాగిలిపడియుండు సర్పముల్ పెక్కు
nā guṃḍamulu socci yalamicuṭṭiyunu sāgilipaḍiyuṃḍu sarpamul pekku
ఉడుగని మదముల నొలసి తుమ్మెదలఁ గడునొప్పు నమ్మదకరులెల్ల నిపుడు
uḍugani madamula nolasi tummedalam̐ gaḍunoppu nammadakarulella nipuḍu
కడు మేను డిల్లమై కంబాలతోడ మెడలెత్తుకొనిస్రుక్కి మెదలకున్నవియు.
kaḍu mēnu ḍillamai kaṃbālatōḍa meḍalettukonisrukki medalakunnaviyu.
నున్నతస్థితిగల యుత్తమాశ్వములు కన్నుల నొగి నీళ్లు గాఱుచునుండఁ
nunnatasthitigala yuttamāśvamulu kannula nogi nīḷlu gāṟucunuṃḍam̐
గవణంబు నీరును గడ్డియు నుడిగి జవసత్త్వములుదూలి సడలియున్నవియు.
gavaṇaṃbu nīrunu gaḍḍiyu nuḍigi javasattvamuludūli saḍaliyunnaviyu.
నటుగాన యిన్నింటి కసురాధినాథ! సటలేల? విను మొక్కశాంతి చెప్పెదను:
naṭugāna yinniṃṭi kasurādhinātha! saṭalēla? vinu mokkaśāṃti ceppedanu:
శ్రీరామునకు నిమ్ము సీతఁగొంపోయి; నేరమి వట్టఁ డా నృపకుంజరుండు;
śrīrāmunaku nimmu sītam̐goṃpōyi; nērami vaṭṭam̐ ḍā nr̥pakuṃjaruṃḍu;
నెందునీతిజ్ఞున కిది లెస్స కార్య. మిందఱు నెఱుఁగరా యిది బుద్ధియగుట
neṃdunītijñuna kidi lessa kārya. miṃdaṟu neṟum̐garā yidi buddhiyaguṭa
దనుజేశ! నీ చిత్తధర్మంబు నూది వినుమని చెప్పంగ వెఱతురుగాక!
danujēśa! nī cittadharmaṃbu nūdi vinumani ceppaṃga veṟaturugāka!
నాకుఁబోరాదు దానవనాథ! కాన నీకుఁజెప్పితి నిట్లు నీతిమార్గంబు.”
nākum̐bōrādu dānavanātha! kāna nīkum̐jeppiti niṭlu nītimārgaṃbu.”
నని బుద్ధిచెప్పిన యవ్విభీషణుని వినుతవాక్యంబులు వీనులు సొరక:
nani buddhiceppina yavvibhīṣaṇuni vinutavākyaṃbulu vīnulu soraka:
“యెవ్వరిదిక్కున నే భయంబెఱుఁగ; నెవ్విధంబున సీత నీను రామునకు.
“yevvaridikkuna nē bhayaṃbeṟum̐ga; nevvidhaṃbuna sīta nīnu rāmunaku.
దుర్జయుండగు నాకు దురములో నతఁడు నిర్జరుల్ తోడైన నిలుచునే?”యనుచుఁ
durjayuṃḍagu nāku duramulō natam̐ḍu nirjarul tōḍaina nilucunē?”yanucum̐
గోపంబు దీపింపఁగొల్వంత విడిచి వేపోయె దానవవిభుఁడు లోపలికి.
gōpaṃbu dīpiṃpam̐golvaṃta viḍici vēpōye dānavavibhum̐ḍu lōpaliki.
మఱునాఁడులేచి క్రమ్మఱ రావణుండు మఱవక సంధ్యాసమాధులు దీర్చి
maṟunām̐ḍulēci krammaṟa rāvaṇuṃḍu maṟavaka saṃdhyāsamādhulu dīrci
యనుజునివచనంబు లాత్మఁజింతించి తన మంత్రులును దానుఁదలపోయఁదలఁచి
yanujunivacanaṃbu lātmam̐jiṃtiṃci tana maṃtrulunu dānum̐dalapōyam̐dalam̐ci
భానుమండలనిభ ప్రభ గలయట్టి మానైన దివ్యవిమానంబు నెక్కి
bhānumaṃḍalanibha prabha galayaṭṭi mānaina divyavimānaṃbu nekki
కమనీయబహురత్నఖచితంబు లగుచుఁ గొమరారు నప్పైఁడికుంభముల్ మెఱయ
kamanīyabahuratnakhacitaṃbu lagucum̐ gomarāru nappaim̐ḍikuṃbhamul meṟaya
వెన్నెల నురువున విరచించినటుల నున్నతచ్ఛత్రంబు లొప్పారుచుండఁ
vennela nuruvuna viraciṃcinaṭula nunnatacchatraṃbu loppārucuṃḍam̐
గంకణఝణఝణత్కారంబు లెసగ నంకించి చామర లతివలు వీవఁ
gaṃkaṇajhaṇajhaṇatkāraṃbu lesaga naṃkiṃci cāmara lativalu vīvam̐
బెక్కుతూర్యంబులు పెల్లుగా మ్రోయఁ బెక్కండ్రు సుభటులు పెంపారఁగొలువఁ
bekkutūryaṃbulu pellugā mrōyam̐ bekkaṃḍru subhaṭulu peṃpāram̐goluvam̐
గ్రందు గాకుండంగఁగట్టికివారు సందడి జడియ నైశ్వర్యంబు మెఱయఁ
graṃdu gākuṃḍaṃgam̐gaṭṭikivāru saṃdaḍi jaḍiya naiśvaryaṃbu meṟayam̐
జనుదెంచి బహుమంత్రిసహితంబుగాఁగ మనుజాశనుఁడు సభామంటపంబునకు
janudeṃci bahumaṃtrisahitaṃbugām̐ga manujāśanum̐ḍu sabhāmaṃṭapaṃbunaku
‘నర్కవంశజు శరాహతిఁదెగి మీఁద నర్కబింబముఁజొత్తు’నని తెల్పుకరణిఁ
‘narkavaṃśaju śarāhatim̐degi mīm̐da narkabiṃbamum̐jottu’nani telpukaraṇim̐
జొచ్చి సింహాసనస్థుండయి పిలువఁ బుచ్చె నాయకుల నప్పుడు పడవాళ్ల.
jocci siṃhāsanasthuṃḍayi piluvam̐ bucce nāyakula nappuḍu paḍavāḷla.
వారలుఁ దమ రథావళులపై నెక్కి వారణంబుల నెక్కి వాజుల నెక్కి
vāralum̐ dama rathāvaḷulapai nekki vāraṇaṃbula nekki vājula nekki
తమ తమ తూర్యనాదములతో వచ్చి క్రమమున మంటపాంగణములయందు
tama tama tūryanādamulatō vacci kramamuna maṃṭapāṃgaṇamulayaṃdu
దమ వాహములు డిగ్గి తనరుసింహములు కొమరారఁగా గిరిగుహఁజొచ్చుకరణి
dama vāhamulu ḍiggi tanarusiṃhamulu komarāram̐gā giriguham̐joccukaraṇi
నా మంటపము చొచ్చి యా దానవేంద్రు చే మన్ననలుగాంచి చిత్తంబు లలర
nā maṃṭapamu cocci yā dānavēṃdru cē mannanalugāṃci cittaṃbu lalara
నుచితాసనమ్ములనుండిప్రధాను లుచితంబు లెఱిఁగింప నుత్తమంబనుచు:
nucitāsanammulanuṃḍipradhānu lucitaṃbu leṟim̐giṃpa nuttamaṃbanucu:
“దేవ! నేఁడెంతయుఁదెలిసియున్నాఁడు దేవరతమ్ముఁ డుద్దీపితబలుఁడు
“dēva! nēm̐ḍeṃtayum̐delisiyunnām̐ḍu dēvaratammum̐ ḍuddīpitabalum̐ḍu
ఘనుఁడైన యా కుంభకర్ణుం.”డనంగ విని:“పిల్వుఁ.”డనవుడు వేగ వారేఁగి:
ghanum̐ḍaina yā kuṃbhakarṇuṃ.”ḍanaṃga vini:“pilvum̐.”ḍanavuḍu vēga vārēm̐gi:
“దేవారి సభకు నేతెంచి కొల్వుండి దేవ! నిన్ బిలువఁబుత్తెంచె.”నావుడును
“dēvāri sabhaku nēteṃci kolvuṃḍi dēva! nin biluvam̐butteṃce.”nāvuḍunu
గొడుకులు కుంభ నికుంభులు గొలువఁ గడువేగమునఁగుంభకర్ణుఁడేతెంచి
goḍukulu kuṃbha nikuṃbhulu goluvam̐ gaḍuvēgamunam̐guṃbhakarṇum̐ḍēteṃci
మణిమయంబై దివ్యమహిమంబు గలిగి గణికాసమూహంబు గాననాదముల
maṇimayaṃbai divyamahimaṃbu galigi gaṇikāsamūhaṃbu gānanādamula
నెంతయునొప్పారి యెసగినమంట పాంతరంబునను సింహాసనస్థలిని
neṃtayunoppāri yesaginamaṃṭa pāṃtaraṃbunanu siṃhāsanasthalini
నున్న యన్నకు మ్రొక్కి యొగిఁగొల్వు సొచ్చి యున్నతాసనమున నున్న యా వేళ
nunna yannaku mrokki yogim̐golvu socci yunnatāsanamuna nunna yā vēḷa
నన్నతోడనె వచ్చి యా విభీషణుఁడు క్రన్ననఁగూర్చుండెఁగనకపీఠమున.
nannatōḍane vacci yā vibhīṣaṇum̐ḍu krannanam̐gūrcuṃḍem̐ganakapīṭhamuna.
నప్పుడు రావణుండమరవల్లభుని యొప్పెల్లఁగైకొనియుండి ప్రహస్తుఁ
nappuḍu rāvaṇuṃḍamaravallabhuni yoppellam̐gaikoniyuṃḍi prahastum̐
గనుఁగొని పలికె:“లంకాపురంబునకుఁ బనుపడఁగాఁబెట్టు బలువైనకాపు.
ganum̐goni palike:“laṃkāpuraṃbunakum̐ banupaḍam̐gām̐beṭṭu baluvainakāpu.
మఱియు నీ కడ నెల్ల మార్గంబులందు గిఱికొన్నకోటవాకిళ్ల నెల్లెడల
maṟiyu nī kaḍa nella mārgaṃbulaṃdu giṟikonnakōṭavākiḷla nelleḍala
జతనమైయుండ రాక్షసవీరవరులఁ బ్రతిదివసంబు లోపలను వెల్పలను.”
jatanamaiyuṃḍa rākṣasavīravarulam̐ bratidivasaṃbu lōpalanu velpalanu.”
అని దానవాధీశుఁ డా కుంభకర్ణుఁ గనుఁగొని పల్కె నుత్కంఠ దీపింప:
ani dānavādhīśum̐ ḍā kuṃbhakarṇum̐ ganum̐goni palke nutkaṃṭha dīpiṃpa:
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).