“విను కుంభకర్ణ! నీ విన నిది యొకటి; జనపదంబున కేఁగి చయ్యన నేను
“vinu kuṃbhakarṇa! nī vina nidi yokaṭi; janapadaṃbuna kēm̐gi cayyana nēnu
యుద్ధకాండము · రావణుఁడు కుంభకర్ణునకు సీతానయనమెఱిఁగించుట · యుద్ధకాండము · రావణుఁడు కుంభకర్ణునకు సీతానయనమెఱిఁగించుట
yuddhakāṃḍamu · rāvaṇum̐ḍu kuṃbhakarṇunaku sītānayanameṟim̐giṃcuṭa
Yuddha Kanda, section 10: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
57 passagesTelugu with transliteration
“విను కుంభకర్ణ! నీ విన నిది యొకటి; జనపదంబున కేఁగి చయ్యన నేను
“vinu kuṃbhakarṇa! nī vina nidi yokaṭi; janapadaṃbuna kēm̐gi cayyana nēnu
రామునిదేవి ధరాసుత సీతఁ గామించి తెచ్చితిఁ గంజదళాక్షి.
rāmunidēvi dharāsuta sītam̐ gāmiṃci teccitim̐ gaṃjadaḷākṣi.
మఱి మొన్న నొక హనుమంతుఁడన్క్రోఁతి పఱతెంచి సీతకుఁబరిణామ మొసగి
maṟi monna noka hanumaṃtum̐ḍankrōm̐ti paṟateṃci sītakum̐bariṇāma mosagi
‘దేవి! నీ పతి రామదేవుఁడు వచ్చు.’ నావుడు మదిలోన నమ్మి యా సీత
‘dēvi! nī pati rāmadēvum̐ḍu vaccu.’ nāvuḍu madilōna nammi yā sīta
యున్నది. యెంతయు నుద్దండవృత్తి నన్నరుం డయ్యబ్ధి కవ్వల విడిసె.
yunnadi. yeṃtayu nuddaṃḍavr̥tti nannaruṃ ḍayyabdhi kavvala viḍise.
వనములలోఁ గలవనచరులెల్లఁ బెనుమూఁకగాఁగూడఁబెట్టి యేతెంచెఁ.
vanamulalōm̐ galavanacarulellam̐ benumūm̐kagām̐gūḍam̐beṭṭi yēteṃcem̐.
జెచ్చెర నని చేసి సీతఁగొంపోవ వచ్చినాఁడతఁడు. తా వచ్చుఁగాకేమి?
jeccera nani cēsi sītam̐goṃpōva vaccinām̐ḍatam̐ḍu. tā vaccum̐gākēmi?
సురనాథసురలను స్రుక్కించినాఁడ; హరుఁడున్నకైలాస మగలించినాఁడ;
suranāthasuralanu srukkiṃcinām̐ḍa; harum̐ḍunnakailāsa magaliṃcinām̐ḍa;
శంభుచేఁజంద్రహాసంబుఁగొన్నాఁడ; నంభోజభవు వరం బడిగికొన్నాఁడ;
śaṃbhucēm̐jaṃdrahāsaṃbum̐gonnām̐ḍa; naṃbhōjabhavu varaṃ baḍigikonnām̐ḍa;
దానిపై నీ లావు తగిలియున్నాఁడ; మానవుడే నన్ను మర్దించువాఁడు?
dānipai nī lāvu tagiliyunnām̐ḍa; mānavuḍē nannu mardiṃcuvām̐ḍu?
రాముఁడెన్నఁడు గెల్చురణములో నన్నుఁ! గోమలి నెన్నఁడు గొనిపోవు నతఁడు?”
rāmum̐ḍennam̐ḍu gelcuraṇamulō nannum̐! gōmali nennam̐ḍu gonipōvu natam̐ḍu?”
ననవుడుఁగోపించి యా కుంభకర్ణుఁ డనియె రావణుతోడ నందఱు వినఁగ:
nanavuḍum̐gōpiṃci yā kuṃbhakarṇum̐ ḍaniye rāvaṇutōḍa naṃdaṟu vinam̐ga:
“రాము వంచించి యా రామునిదేవి నేమఱియుండంగ నేచి యుద్వృత్తిఁ
“rāmu vaṃciṃci yā rāmunidēvi nēmaṟiyuṃḍaṃga nēci yudvr̥ttim̐
దెత్తువే? యిదియేల తెచ్చితి కడఁగి? చిత్తంబులో నీతిఁ జింతింపవైతి;
dettuvē? yidiyēla tecciti kaḍam̐gi? cittaṃbulō nītim̐ jiṃtiṃpavaiti;
ధర్మమార్గము నీవు తలపోయవైతి; వర్మిలిఁగులమెల్ల నణఁగఁజేసితివి.
dharmamārgamu nīvu talapōyavaiti; varmilim̐gulamella naṇam̐gam̐jēsitivi.
సీతఁదెచ్చినయప్డె చెడియె నీ లంక. యే తెఱంగున నైన నిదియె నిశ్చయము.
sītam̐deccinayapḍe ceḍiye nī laṃka. yē teṟaṃguna naina nidiye niścayamu.
ఇట్టననేల? యా యినకులేశ్వరుని నెట్టన శరములు నెఱిఁగాఁడకుండ
iṭṭananēla? yā yinakulēśvaruni neṭṭana śaramulu neṟim̐gām̐ḍakuṃḍa
బ్రదికివచ్చితి నీదు భాగ్యంబుకతన. నిది మేలు కీడని యెన్నంగనేల?
bradikivacciti nīdu bhāgyaṃbukatana. nidi mēlu kīḍani yennaṃganēla?
పోవచ్చునే యింకఁబూనెదుగాక! రావణ! యింతకార్యము చక్కఁబెట్ట
pōvaccunē yiṃkam̐būnedugāka! rāvaṇa! yiṃtakāryamu cakkam̐beṭṭa
నా మీఁదఁబడియె; వానరుల రాఘవుల నేమియుఁదలఁపక యింక సుఖింపు.”
nā mīm̐dam̐baḍiye; vānarula rāghavula nēmiyum̐dalam̐paka yiṃka sukhiṃpu.”
మని పల్కుటయును మహాపార్శ్వుఁడనియె: “ఘనమైన యెల్లలోకములకు నీవ
mani palkuṭayunu mahāpārśvum̐ḍaniye: “ghanamaina yellalōkamulaku nīva
పతివట! యా సీత బలిమిని బట్టి రతి సల్పనేరవా, రాక్షసాధీశ!”
pativaṭa! yā sīta balimini baṭṭi rati salpanēravā, rākṣasādhīśa!”
యనవుడుఁజిత్తంబునందు మోదించి దనుజాధినాథుఁడాతనిఁజూచి పలికె:
yanavuḍum̐jittaṃbunaṃdu mōdiṃci danujādhināthum̐ḍātanim̐jūci palike:
“విను మహాపార్శ్వ! యే వేధకొల్వునకుఁ జనుచోటఁబుంజికస్థలయను నాతి
“vinu mahāpārśva! yē vēdhakolvunakum̐ janucōṭam̐buṃjikasthalayanu nāti
వలువూడిపడఁబట్టి వడిఁగుదియించి బలిమి భోగించితిఁబైఁబడి తొల్లి.
valuvūḍipaḍam̐baṭṭi vaḍim̐gudiyiṃci balimi bhōgiṃcitim̐baim̐baḍi tolli.
యా మేరలన్నియు నబ్జజుం డెఱిఁగి నా మీఁదఁ గోపించి నయ మింత లేక:
yā mēralanniyu nabjajuṃ ḍeṟim̐gi nā mīm̐dam̐ gōpiṃci naya miṃta lēka:
“యోరి రాక్షస! కడు నుచితంబుఁదక్కి నారీజనులయెడ నయ మింత లేక
“yōri rākṣasa! kaḍu nucitaṃbum̐dakki nārījanulayeḍa naya miṃta lēka
బలిమి నెవ్వతెనైనఁబట్టి భోగించి నలఁదురఁగాఁజేయునపుడ నీ తలలు
balimi nevvatenainam̐baṭṭi bhōgiṃci nalam̐duram̐gām̐jēyunapuḍa nī talalu
వారక యిల నూఱువ్రయ్యలై రాలుఁ బోరోరి!” యనుచు శప్తునిఁజేసి విడిచె.
vāraka yila nūṟuvrayyalai rālum̐ bōrōri!” yanucu śaptunim̐jēsi viḍice.
నది కారణంబుగా నంగనాజనుల హృదయంబుగరఁగక యే నెందుఁగలయ.
nadi kāraṇaṃbugā naṃganājanula hr̥dayaṃbugaram̐gaka yē neṃdum̐galaya.
నా లావు గొనక వానరులతోఁగూడి యీలంకపై రాముఁడేతెంచుటెల్ల
nā lāvu gonaka vānarulatōm̐gūḍi yīlaṃkapai rāmum̐ḍēteṃcuṭella
నిద్రించు సింహంబు నెఱి మేలుకొలుపు భద్రదంతావళప్రతతి విధంబ.”
nidriṃcu siṃhaṃbu neṟi mēlukolupu bhadradaṃtāvaḷapratati vidhaṃba.”
యని పల్కుటయు నవ్వి యవ్విభీషణుఁడు దనుజనాథునితోడఁ దగ విన్నవించె:
yani palkuṭayu navvi yavvibhīṣaṇum̐ḍu danujanāthunitōḍam̐ daga vinnaviṃce:
“మొనయునిట్టూర్పులు మ్రోఁగుటగాఁగ ఘనమైన చింతయె గరళంబు గాఁగ
“monayuniṭṭūrpulu mrōm̐guṭagām̐ga ghanamaina ciṃtaye garaḷaṃbu gām̐ga
దారుణంబైన సీతాకాలసర్ప మే రూపమున నిన్ను నేల పోనిచ్చు
dāruṇaṃbaina sītākālasarpa mē rūpamuna ninnu nēla pōniccu
నపకీర్తియటె; పాప మటె; సుఖంబునకు విపరీతమటె; యిట్టి విధమేల?యుడుగు.”
napakīrtiyaṭe; pāpa maṭe; sukhaṃbunaku viparītamaṭe; yiṭṭi vidhamēla?yuḍugu.”
మని యన్నతోఁబల్కి యంతటఁబోక సునిశితంబుగఁబ్రహస్తునిఁజూచి పలికె:
mani yannatōm̐balki yaṃtaṭam̐bōka suniśitaṃbugam̐brahastunim̐jūci palike:
“నెఱిపిడుగులఁబోలు నృపునిబాణములు గఱులంట నీదు వక్షము గాఁడునాఁడె
“neṟipiḍugulam̐bōlu nr̥punibāṇamulu gaṟulaṃṭa nīdu vakṣamu gām̐ḍunām̐ḍe
యెఱుఁగుదుగాకేల యిట్టట్టుపడెదు. కఱకులాడిన మాడ్కిఁగాదు; మీఁదటను
yeṟum̐gudugākēla yiṭṭaṭṭupaḍedu. kaṟakulāḍina māḍkim̐gādu; mīm̐daṭanu
నీ కుంభకర్ణుండు నీ నికుంభుఁడును నీ కుంభుఁడును మఱి యీ మహోదరుఁడు
nī kuṃbhakarṇuṃḍu nī nikuṃbhum̐ḍunu nī kuṃbhum̐ḍunu maṟi yī mahōdarum̐ḍu
నీ మహాపార్శ్వుండు నీ యింద్రజిత్తు రాముని గెల్చువారా రణంబునను?
nī mahāpārśvuṃḍu nī yiṃdrajittu rāmuni gelcuvārā raṇaṃbunanu?
నేపు చూపక యప్పుడెందుఁబోయెదరు? ప్రాపైన తఱి నడ్డపడుదురుగాక!
nēpu cūpaka yappuḍeṃdum̐bōyedaru? prāpaina taṟi naḍḍapaḍudurugāka!
కడఁగి యింద్రుఁడు వచ్చి కాచిన నైనఁ గడు నడ్డపడి సురల్ గాచిన నైనఁ
kaḍam̐gi yiṃdrum̐ḍu vacci kācina nainam̐ gaḍu naḍḍapaḍi sural gācina nainam̐
గాలాగ్నిరుద్రుండు గాచిన నైనఁ గాలమృత్యువు వచ్చి కాచిన నైన
gālāgnirudruṃḍu gācina nainam̐ gālamr̥tyuvu vacci kācina naina
రావణుఁజంపక రామభూపాలుఁ డే విధంబుననైన నేల పోనిచ్చు?
rāvaṇum̐jaṃpaka rāmabhūpālum̐ ḍē vidhaṃbunanaina nēla pōniccu?
దనుజేశుపై విల్లు ధరియించునపుడు మనచేతసాధ్యుఁడే మనుకులేశ్వరుఁడు?
danujēśupai villu dhariyiṃcunapuḍu manacētasādhyum̐ḍē manukulēśvarum̐ḍu?
పిడికిట నడఁగునే పేర్చుకాలాగ్ని? పుడిసిట నడఁగునే పొంగారుజలధి?
piḍikiṭa naḍam̐gunē pērcukālāgni? puḍisiṭa naḍam̐gunē poṃgārujaladhi?
పట్టంగ వచ్చునే పాతాళతలము? గట్టింపవచ్చునే గగనభాగంబు?
paṭṭaṃga vaccunē pātāḷatalamu? gaṭṭiṃpavaccunē gaganabhāgaṃbu?
త్రెంపంగ వచ్చునే దిగ్వితానంబు? త్రుంపంగ వచ్చునే ధూర్జటివిల్లు?
treṃpaṃga vaccunē digvitānaṃbu? truṃpaṃga vaccunē dhūrjaṭivillu?
అఱచేత నణఁచిన నణఁగునే సూర్యుఁ డెఱుఁగని మీతోడ నిట్లాడనేల?
aṟacēta naṇam̐cina naṇam̐gunē sūryum̐ ḍeṟum̐gani mītōḍa niṭlāḍanēla?
కడుమూర్ఖు నాకారి కామాతురుండు మడియఁడే మీ యట్టిమంత్రులు గలుగ?
kaḍumūrkhu nākāri kāmāturuṃḍu maḍiyam̐ḍē mī yaṭṭimaṃtrulu galuga?
నా బుద్ధి వినునె యీ నాకేశవైరి మీ బుద్ధిఁజెడుఁగాక మిక్కిలి క్రొవ్వి?”
nā buddhi vinune yī nākēśavairi mī buddhim̐jeḍum̐gāka mikkili krovvi?”
యని మొగమోడక యాడఁబ్రహస్తుఁ డనువాఁడుగనుఁగొని యా విభీషణుని:
yani mogamōḍaka yāḍam̐brahastum̐ ḍanuvām̐ḍuganum̐goni yā vibhīṣaṇuni:
“నురగులతోఁబోరి యోడ మెన్నఁడును సురలతోఁబోరాడి స్రుక్క మెన్నఁడును;
“nuragulatōm̐bōri yōḍa mennam̐ḍunu suralatōm̐bōrāḍi srukka mennam̐ḍunu;
యక్షులతోఁగిట్టి యలయ మెన్నఁడును; రాక్షసావలిచేతఁగ్రాఁగ మెన్నఁడును;
yakṣulatōm̐giṭṭi yalaya mennam̐ḍunu; rākṣasāvalicētam̐grām̐ga mennam̐ḍunu;
నరుఁడైన యా రామనరనాయకునకు దురములో మే మోడుదుమె విభీషణుఁడ?
narum̐ḍaina yā rāmanaranāyakunaku duramulō mē mōḍudume vibhīṣaṇum̐ḍa?
యే చందమున వారి నెఱుఁగుదో కాని నీ చేత వింటిమి నేఁడిట్టివింత.
yē caṃdamuna vāri neṟum̐gudō kāni nī cēta viṃṭimi nēm̐ḍiṭṭiviṃta.
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).