Skip to content

యుద్ధకాండము · విభీషణు యోగ్యతను హనుమ రామునకెఱిఁగించుట · యుద్ధకాండము · విభీషణు యోగ్యతను హనుమ రామునకెఱిఁగించుట

Yuddha Kanda 16 · vibhīṣaṇu yōgyatanu hanuma rāmunakeṟim̐giṃcuṭa

yuddhakāṃḍamu · vibhīṣaṇu yōgyatanu hanuma rāmunakeṟim̐giṃcuṭa

Yuddha Kanda, section 16: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

26 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 16.

“దనుజాధినాథుఁడుద్దండకోపమునఁ దను సభలోపలఁదన్నె నన్మాడ్కి

“danujādhināthum̐ḍuddaṃḍakōpamunam̐ danu sabhalōpalam̐danne nanmāḍki

Report an error

నఖిలంబు నెఱుఁగంగ నాడె నీ యసుర నిఖిలేశ! యా మాట నిజము గానోపు.

nakhilaṃbu neṟum̐gaṃga nāḍe nī yasura nikhilēśa! yā māṭa nijamu gānōpu.

Report an error

నుడుగక మనలకై యుచిత మాడుటయుఁ వెడలఁద్రోచిన వాని విడిచి వచ్చుటయు

nuḍugaka manalakai yucita māḍuṭayum̐ veḍalam̐drōcina vāni viḍici vaccuṭayu

Report an error

గలుగనోపునుగాని కపటంబు గాదు. వలవదు శంకింప వసుధేశ! యితనిఁ.

galuganōpunugāni kapaṭaṃbu gādu. valavadu śaṃkiṃpa vasudhēśa! yitanim̐.

Report an error

గపటమానుసు లెట్టి క్రమమున నున్నఁ గపట మింతటిలోనఁగానంగవచ్చు.

gapaṭamānusu leṭṭi kramamuna nunnam̐ gapaṭa miṃtaṭilōnam̐gānaṃgavaccu.

Report an error

నితనిమాటలలోన నేమాటయైనఁ గృతకమై తోపదు; కీడనరాదు.

nitanimāṭalalōna nēmāṭayainam̐ gr̥takamai tōpadu; kīḍanarādu.

Report an error

మనుజేశ! దనుజులమర్మజ్ఞుఁడితఁడు; మనదెస నుండుట మానైననీతి.

manujēśa! danujulamarmajñum̐ḍitam̐ḍu; manadesa nuṃḍuṭa mānainanīti.

Report an error

నను రావణుఁడు వట్టి నాఁడు బంధించి యెనలేని బాధల నేఁచుట సూచి

nanu rāvaṇum̐ḍu vaṭṭi nām̐ḍu baṃdhiṃci yenalēni bādhala nēm̐cuṭa sūci

Report an error

యితడు నాకై పెక్కుహితవులు వలికె. నితనిచిత్తస్థితి యెఱుఁగుదుఁగొంత.”

yitaḍu nākai pekkuhitavulu valike. nitanicittasthiti yeṟum̐gudum̐goṃta.”

Report an error

యనినమాటలు దనయాత్మకు నెక్క వనజాప్తసుతుఁజూచి వసుధేశుఁడనియె:

yaninamāṭalu danayātmaku nekka vanajāptasutum̐jūci vasudhēśum̐ḍaniye:

Report an error

“నర్కజ!యితఁడు మేలౌట గీడౌట తర్కింప నేటికి? ధర్మంబుత్రోవ

“narkaja!yitam̐ḍu mēlauṭa gīḍauṭa tarkiṃpa nēṭiki? dharmaṃbutrōva

Report an error

శరణనివచ్చిన శత్రువునైనఁ బరికింపఁగా రాచపాఁడి రక్షింప.

śaraṇanivaccina śatruvunainam̐ barikiṃpam̐gā rācapām̐ḍi rakṣiṃpa.

Report an error

నొక కపోతము డేగ యుద్ధతిఁదఱుమ వికలభావంబున వేగంబ వచ్చి

noka kapōtamu ḍēga yuddhatim̐daṟuma vikalabhāvaṃbuna vēgaṃba vacci

Report an error

శిబిమాటు సొచ్చెఁ; జొచ్చిన డేగ యడుగ శిబి తను విచ్చి చెచ్చెర గువ్వఁగాచె.

śibimāṭu soccem̐; joccina ḍēga yaḍuga śibi tanu vicci ceccera guvvam̐gāce.

Report an error

నపకీర్తిఁజెందక యార్తుఁజేకొన్న కృప యశ్వమేధసత్కృతిఫలంబిచ్చు.

napakīrtim̐jeṃdaka yārtum̐jēkonna kr̥pa yaśvamēdhasatkr̥tiphalaṃbiccu.

Report an error

నీ విభీషణుఁడేల? యింక సుగ్రీవ! రావణుఁడైన గర్వము దక్కి వచ్చి

nī vibhīṣaṇum̐ḍēla? yiṃka sugrīva! rāvaṇum̐ḍaina garvamu dakki vacci

Report an error

శరణన్నఁగాతు నే చందంబునందు; మరియాద యిట్టిది మా కులక్రమము

śaraṇannam̐gātu nē caṃdaṃbunaṃdu; mariyāda yiṭṭidi mā kulakramamu

Report an error

అభయ మిచ్చితి వేగ యర్కజ! పోయి సభయుని న వ్విభీషణుఁదోడితెమ్మ.”

abhaya micciti vēga yarkaja! pōyi sabhayuni na vvibhīṣaṇum̐dōḍitemma.”

Report an error

యనవుడు సుగ్రీవుఁడా రాముకృపకుఁ గను వ్రాల్చియటు శిరఃకంపంబు సేసి

yanavuḍu sugrīvum̐ḍā rāmukr̥pakum̐ ganu vrālciyaṭu śiraḥkaṃpaṃbu sēsi

Report an error

“పరికింప నీవలెఁబగవానితమ్ము శరణన్నఁగైకొను సత్కృపారసము

“parikiṃpa nīvalem̐bagavānitammu śaraṇannam̐gaikonu satkr̥pārasamu

Report an error

నీకుఁగాకెందు నే నృపులకుఁజెల్లుఁ? గాకుత్థ్సతిలక! నిక్కము ధాత్రిలోన”

nīkum̐gākeṃdu nē nr̥pulakum̐jellum̐? gākutthsatilaka! nikkamu dhātrilōna”

Report an error

నని పల్కి సుగ్రీవుఁడాకాశమునకుఁ దన సేనతో సముద్ధతగతి నెగసి:

nani palki sugrīvum̐ḍākāśamunakum̐ dana sēnatō samuddhatagati negasi:

Report an error

“చేకొని యభయంబు శ్రీరాముఁడిచ్చె నీకు విభీషణ! నిక్కంబు నమ్ము;

“cēkoni yabhayaṃbu śrīrāmum̐ḍicce nīku vibhīṣaṇa! nikkaṃbu nammu;

Report an error

ర.”మ్మని కపిరాజు రాక్షసరాజు నిమ్ములఁగౌఁగిట నెనయంగఁజేర్చి

ra.”mmani kapirāju rākṣasarāju nimmulam̐gaum̐giṭa nenayaṃgam̐jērci

Report an error

తోడ్కొనివచ్చి సంతోషంబుఁగృపయు వేడ్కయు నెసగ నవ్విభుఁగానుపింప

tōḍkonivacci saṃtōṣaṃbum̐gr̥payu vēḍkayu nesaga navvibhum̐gānupiṃpa

Report an error

నిండ నానందించి నృపుఁజూచి యతఁడు దండప్రణామంబు దగఁజేసి నిలిచి

niṃḍa nānaṃdiṃci nr̥pum̐jūci yatam̐ḍu daṃḍapraṇāmaṃbu dagam̐jēsi nilici

Report an error

Illustration: Verse & Place (Project-owned).