“నిత్యసత్యత్రాణ! నిత్యకల్యాణ! నిత్యజగత్త్రాణ! నిత్యగీర్వాణ!
“nityasatyatrāṇa! nityakalyāṇa! nityajagattrāṇa! nityagīrvāṇa!
యుద్ధకాండము · విభీషణస్తోత్రము · యుద్ధకాండము · విభీషణస్తోత్రము
yuddhakāṃḍamu · vibhīṣaṇastōtramu
Yuddha Kanda, section 17: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
31 passagesTelugu with transliteration
“నిత్యసత్యత్రాణ! నిత్యకల్యాణ! నిత్యజగత్త్రాణ! నిత్యగీర్వాణ!
“nityasatyatrāṇa! nityakalyāṇa! nityajagattrāṇa! nityagīrvāṇa!
జగదన్వయాకార! జగదాది వీర! జగదుదయాకార! జగదబ్ధిపూర!
jagadanvayākāra! jagadādi vīra! jagadudayākāra! jagadabdhipūra!
సర్వసంగాతీత! సర్వానుభూత! సర్వజగత్పూత! సర్వ నిర్ణేత!
sarvasaṃgātīta! sarvānubhūta! sarvajagatpūta! sarva nirṇēta!
గురులఘుక్రమరూప! గురుబోధదీప! గురుమధురాలాప! గురుచారుచాప!
gurulaghukramarūpa! gurubōdhadīpa! gurumadhurālāpa! gurucārucāpa!
పద్మసన్నిభనేత్ర! బహుజీవసూత్ర! పద్మాకలితగాత్ర! పరమపవిత్ర!
padmasannibhanētra! bahujīvasūtra! padmākalitagātra! paramapavitra!
కవిజనసంవేద్య! కరుణానవద్య! వివిధశాస్త్రోత్పాద్య! వేదాంతవేద్య!
kavijanasaṃvēdya! karuṇānavadya! vividhaśāstrōtpādya! vēdāṃtavēdya!
పరమాత్ముఁడవు నీవ; పరమంబు నీవ; పరమవిద్యయు నీవ; పరికింప నెందు.
paramātmum̐ḍavu nīva; paramaṃbu nīva; paramavidyayu nīva; parikiṃpa neṃdu.
భువనకర్తయు నీవ; భువనంబు నీవ, భువనహర్తయు నీవ; భువనైక వీర.
bhuvanakartayu nīva; bhuvanaṃbu nīva, bhuvanahartayu nīva; bhuvanaika vīra.
యాగభోక్తయు నీవ; యాగంబు నీవ; యాగఫలప్రదుండరయంగ నీవ.
yāgabhōktayu nīva; yāgaṃbu nīva; yāgaphalapraduṃḍarayaṃga nīva.
చంద్రార్కులును నీవ; జలధులు నీవ; యింద్రాదులును నీవ; యిలయును నీవ.
caṃdrārkulunu nīva; jaladhulu nīva; yiṃdrādulunu nīva; yilayunu nīva.
మూఁడుమూర్తులు నీవ; మూఁడుమూర్తులకు బోఁడిగా నవ్వలిపొడవును నీవ.
mūm̐ḍumūrtulu nīva; mūm̐ḍumūrtulaku bōm̐ḍigā navvalipoḍavunu nīva.
క్షరమును నీవ; యక్షరమును నీవ; క్షరసాక్షి వీవ; యక్షరసాక్షి వీవ.
kṣaramunu nīva; yakṣaramunu nīva; kṣarasākṣi vīva; yakṣarasākṣi vīva.
త్రిభువనవందిత! దేవాదిదేవ! యభయ మీదేవ! నా కఖిలాధినాథ!
tribhuvanavaṃdita! dēvādidēva! yabhaya mīdēva! nā kakhilādhinātha!
జయజయ శతకోటిజలజాప్తతేజ! జయజయ సంసారసర్పసుపర్ణ!
jayajaya śatakōṭijalajāptatēja! jayajaya saṃsārasarpasuparṇa!
లలితాగమస్తోత్ర! లక్ష్మీకళత్ర! విలసద్దయాపాత్ర! విబుధారిజైత్ర!
lalitāgamastōtra! lakṣmīkaḷatra! vilasaddayāpātra! vibudhārijaitra!
యలఘుమునిస్తుత! యాద్యంతరహిత! దళితశాత్రవభీమ! దశరథరామ!
yalaghumunistuta! yādyaṃtarahita! daḷitaśātravabhīma! daśaratharāma!
దినకరశశినేత్ర! దివ్యచారిత్ర! యనుపమశుభగాత్ర! యఖిలైక సూత్ర!
dinakaraśaśinētra! divyacāritra! yanupamaśubhagātra! yakhilaika sūtra!
వేనోళ్లుగల భోగివిభుఁడైన నుతులు పూని నేర్చునె చేయ భూపాల! నిన్నుఁ.?
vēnōḷlugala bhōgivibhum̐ḍaina nutulu pūni nērcune cēya bhūpāla! ninnum̐.?
(బాయనిసద్భక్తిఁబాకారి నుతులు సేయంగ నేర్చునె శ్రీరామ! నిన్ను?)
(bāyanisadbhaktim̐bākāri nutulu sēyaṃga nērcune śrīrāma! ninnu?)
నప్పద్మసంభవుండైన నీ మహిమ నొప్పార నుతియింప నోపునే తవిలి?
nappadmasaṃbhavuṃḍaina nī mahima noppāra nutiyiṃpa nōpunē tavili?
యే నిన్ను నెఱుఁగంగ నెంతటివాఁడ? నే నిన్ను నుతియింప నెంతటివాఁడ?
yē ninnu neṟum̐gaṃga neṃtaṭivām̐ḍa? nē ninnu nutiyiṃpa neṃtaṭivām̐ḍa?
దానవుండను వృథాతరళచిత్తుఁడను భూనాథ! నీ వాదిపురుషోత్తముఁడవు
dānavuṃḍanu vr̥thātaraḷacittum̐ḍanu bhūnātha! nī vādipuruṣōttamum̐ḍavu
నరనాథ! యార్తుని నన్ను రక్షింపు; పరమదుర్జను దైత్యపతిఁద్రుంచివైవు.
naranātha! yārtuni nannu rakṣiṃpu; paramadurjanu daityapatim̐druṃcivaivu.
మఖిలశరణ్యుండ వైన నీ మఱుఁగు సుఖమని యే వచ్చి చొచ్చితిఁబ్రీతి.”
makhilaśaraṇyuṃḍa vaina nī maṟum̐gu sukhamani yē vacci coccitim̐brīti.”
ననిన నాతనిఁగరుణాంబుధిలోన మనుజేశ్వరుండు గ్రమ్మఱ నోలలార్చి:
nanina nātanim̐garuṇāṃbudhilōna manujēśvaruṃḍu grammaṟa nōlalārci:
“నమ్ము! విభీషణ! నాకీశవైరి తమ్ముఁడవా? నాకుఁ దమ్ముఁడ వీవు;
“nammu! vibhīṣaṇa! nākīśavairi tammum̐ḍavā? nākum̐ dammum̐ḍa vīvu;
మఱుఁగకు మింక; లక్ష్మణుకంటె నిన్ను నఱలేనివానిఁగా నాత్మఁగైకొంటి.”
maṟum̐gaku miṃka; lakṣmaṇukaṃṭe ninnu naṟalēnivānim̐gā nātmam̐gaikoṃṭi.”
నని భయం బుడిపి దయార్ద్రవాక్యముల జననాయకుఁడు విభీషణు నాదరించె.
nani bhayaṃ buḍipi dayārdravākyamula jananāyakum̐ḍu vibhīṣaṇu nādariṃce.
నెయ్యంబుతోడ నా నృపుఁడప్పు డతని చె య్యూదుకొని వార్ధి సేరంగఁబోయి:
neyyaṃbutōḍa nā nr̥pum̐ḍappu ḍatani ce yyūdukoni vārdhi sēraṃgam̐bōyi:
“మాకు నిక్కము సెప్పుమా విభీషణుఁడ! నాకారిశక్తియు నమ్మినబలము.”
“māku nikkamu seppumā vibhīṣaṇum̐ḍa! nākāriśaktiyu namminabalamu.”
ననిన విభీషణుండా రామచంద్రుఁ గనుఁగొని మ్రొక్కి నిక్కము విన్నవించెఁ:
nanina vibhīṣaṇuṃḍā rāmacaṃdrum̐ ganum̐goni mrokki nikkamu vinnaviṃcem̐:
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).