వేవులవార లా విధమెల్లఁ జెప్పఁ గా విని విఘ్నంబుగావించుకొఱకు
vēvulavāra lā vidhamellam̐ jeppam̐ gā vini vighnaṃbugāviṃcukoṟaku
యుద్ధకాండము · కాలనేమి కథ · యుద్ధకాండము · కాలనేమి కథ
yuddhakāṃḍamu · kālanēmi katha
Yuddha Kanda, section 127: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
84 passagesTelugu with transliteration
వేవులవార లా విధమెల్లఁ జెప్పఁ గా విని విఘ్నంబుగావించుకొఱకు
vēvulavāra lā vidhamellam̐ jeppam̐ gā vini vighnaṃbugāviṃcukoṟaku
నొంటిమై రావణుండొగిఁ గాలనేమి యింటికి నడురేయి యేఁగుదెంచుటయు
noṃṭimai rāvaṇuṃḍogim̐ gālanēmi yiṃṭiki naḍurēyi yēm̐gudeṃcuṭayu
భక్తితోడుత నర్ఘ్యపాద్యాదు లిచ్చి నక్తంచరేశ్వరునకు నాతఁడనియె:
bhaktitōḍuta narghyapādyādu licci naktaṃcarēśvarunaku nātam̐ḍaniye:
“నీ మధ్యరాత్రి నీ విటకు విచ్చేయు టేమి కారణము? నా కెఱిఁగింపు.”మనిన
“nī madhyarātri nī viṭaku viccēyu ṭēmi kāraṇamu? nā keṟim̐giṃpu.”manina
“నని నేఁడు నా శక్తిహతి మృతుండయిన యనుజునికై రాముఁడటు తన్నుఁబనుప
“nani nēm̐ḍu nā śaktihati mr̥tuṃḍayina yanujunikai rāmum̐ḍaṭu tannum̐banupa
సంజీవకరణిచే సౌమిత్రిఁబడయ నంజనాసుతుఁడిప్పు డరుగుచున్నాఁడు.
saṃjīvakaraṇicē saumitrim̐baḍaya naṃjanāsutum̐ḍippu ḍarugucunnām̐ḍu.
చని వేగ హనుమంతుఁజంపు; కాదేని విను భానుఁగనుదాఁక విఘ్నంబుసేయు.
cani vēga hanumaṃtum̐jaṃpu; kādēni vinu bhānum̐ganudām̐ka vighnaṃbusēyu.
కలదు దేవాసుర కల్పితంబైన నలినాకరము ద్రోణనగసమీపమున;
kaladu dēvāsura kalpitaṃbaina nalinākaramu drōṇanagasamīpamuna;
మదముతో నొక మహామకరి యందుండు; నది దేవతల మ్రింగు; నగచరుండెంత?
madamutō noka mahāmakari yaṃduṃḍu; nadi dēvatala mriṃgu; nagacaruṃḍeṃta?
యా సరోవరమున కనిలజుండరుగ మోసపుచ్చుము; వేగముగ నేఁగు.”మనిన
yā sarōvaramuna kanilajuṃḍaruga mōsapuccumu; vēgamuga nēm̐gu.”manina
మనమున నట నీతిమార్గంబు దెలియ దనుజేశుతో నాడెఁదగఁగాలనేమి:
manamuna naṭa nītimārgaṃbu deliya danujēśutō nāḍem̐dagam̐gālanēmi:
“మాయామృగాకృతి మారీచుఁడరిగి మాయమై పోఁడె; యా మతము పోవిడువు.
“māyāmr̥gākr̥ti mārīcum̐ḍarigi māyamai pōm̐ḍe; yā matamu pōviḍuvu.
ఘోరాజిఁగూలిరి కుంభకర్ణాది వీరదానవులెల్ల; విను మింకనైన.
ghōrājim̐gūliri kuṃbhakarṇādi vīradānavulella; vinu miṃkanaina.
మనుజేశునకు సీత మరలంగ నిచ్చి దనుజేశ! లంక నీ తమ్మున కిచ్చి
manujēśunaku sīta maralaṃga nicci danujēśa! laṃka nī tammuna kicci
యరిగి మృడావాసమైన కైలాస ధరణీధరమునందుఁదపసివై యుండు.
yarigi mr̥ḍāvāsamaina kailāsa dharaṇīdharamunaṃdum̐dapasivai yuṃḍu.
కాదేని బిరుదవై కదనరంగమున మేదినీపతిచేత మృతిఁబొంది మీఁద
kādēni birudavai kadanaraṃgamuna mēdinīpaticēta mr̥tim̐boṃdi mīm̐da
నొనరంగ విష్ణుసాయుజ్యంబు నొందు.” మని పల్కఁగన్నుల నలుకఁగెంపెసగ
nonaraṃga viṣṇusāyujyaṃbu noṃdu.” mani palkam̐gannula nalukam̐geṃpesaga
నా యెడ వెసఁజంద్రహాసంబు వెఱికి వ్రేయఁదలంచె: నా విధమాతఁడెఱిఁగి
nā yeḍa vesam̐jaṃdrahāsaṃbu veṟiki vrēyam̐dalaṃce: nā vidhamātam̐ḍeṟim̐gi
“యిదె చనుచున్నాఁడనే.”నంచు నచటు గదలి మనోవేగగతి లావు మెఱసి
“yide canucunnām̐ḍanē.”naṃcu nacaṭu gadali manōvēgagati lāvu meṟasi
చని చూత పున్నాగ చంపక క్రముక పనస చందన జంబు పాటలీ వకుళ
cani cūta punnāga caṃpaka kramuka panasa caṃdana jaṃbu pāṭalī vakuḷa
కదళికా ఖర్జూర కర్పూరతరులు మొదలుగాఁగల భూజముల సొంపు మిగిలి
kadaḷikā kharjūra karpūratarulu modalugām̐gala bhūjamula soṃpu migili
బహుశిష్యగణవేదపఠనముల్ సెలఁగ, మహనీయమణిదీపమాలికల్ వెలుఁగ,
bahuśiṣyagaṇavēdapaṭhanamul selam̐ga, mahanīyamaṇidīpamālikal velum̐ga,
భాసురమంజరీఫల హోమధూమ ధూసరీకృత లతాదుల నొప్పు మిగిలి,
bhāsuramaṃjarīphala hōmadhūma dhūsarīkr̥ta latādula noppu migili,
కలకంఠ శుక నీలకంఠ శారికల కలహంసకల రవ కలకలంబెసగ,
kalakaṃṭha śuka nīlakaṃṭha śārikala kalahaṃsakala rava kalakalaṃbesaga,
హుతదానమంత్రస్వరోదీర్ణమైన కృతకాశ్రమము ద్రోణగిరిసమీపమున
hutadānamaṃtrasvarōdīrṇamaina kr̥takāśramamu drōṇagirisamīpamuna
నిర్మించి మునివోలె నియతితోఁగపట నిర్మలాకృతిఁదాల్చి నేత్రముల్ మొగిచి
nirmiṃci munivōle niyatitōm̐gapaṭa nirmalākr̥tim̐dālci nētramul mogici
సన్నంపుటెలుఁగున జపమాల పూస లెన్నుట మంత్రమై యెదిటికిఁదోప
sannaṃpuṭelum̐guna japamāla pūsa lennuṭa maṃtramai yediṭikim̐dōpa
నా వనంబున నుండ నాకాశవీథిఁ బోవుచో మారుతపుత్త్రుఁ డీక్షించి:
nā vanaṃbuna nuṃḍa nākāśavīthim̐ bōvucō mārutaputtrum̐ ḍīkṣiṃci:
“యిది యొక్కముని వనంబింత యొప్పగునె? యిది నాఁడు లే; దిప్పుడెందువచ్చితినొ?
“yidi yokkamuni vanaṃbiṃta yoppagune? yidi nām̐ḍu lē; dippuḍeṃduvaccitino?
యెక్కడి దుగ్ధాబ్ధి; యెక్కడి మేరు? వెక్కడి మునివనంబిది; త్రోవ దప్పెఁ.
yekkaḍi dugdhābdhi; yekkaḍi mēru? vekkaḍi munivanaṃbidi; trōva dappem̐.
దెరు విమ్మునీంద్రుచేఁదెలియంగ నడిగి యరిగెదఁగా;”కంచు నవనికేతెంచి
deru vimmunīṃdrucēm̐deliyaṃga naḍigi yarigedam̐gā;”kaṃcu navanikēteṃci
వనపక్వఫలములు వాంఛఁబుట్టింప మునిశాపభయమున ముట్ట నోడుచును
vanapakvaphalamulu vāṃcham̐buṭṭiṃpa muniśāpabhayamuna muṭṭa nōḍucunu
మునిఁజేరఁజనుదెంచి మ్రొక్కి కేల్మొగిచి: “మునినాథ! దుగ్ధసముద్రంబుకడకు
munim̐jēram̐janudeṃci mrokki kēlmogici: “muninātha! dugdhasamudraṃbukaḍaku
మనుజనాయకశిఖామణి యైన రామ జననాథుపనుపునఁ జనుచున్నవాఁడ;
manujanāyakaśikhāmaṇi yaina rāma jananāthupanupunam̐ janucunnavām̐ḍa;
హనుమంతుఁడనువాఁడ; నధికమౌతృష్ణ జనియించె; నిచ్చోట జలములు గలవె?
hanumaṃtum̐ḍanuvām̐ḍa; nadhikamautr̥ṣṇa janiyiṃce; niccōṭa jalamulu galave?
చెప్పవే.”యనవుడుఁజిఱునవ్వు నవ్వి: “డప్పి వో మా కమండలువుతోయములు
ceppavē.”yanavuḍum̐jiṟunavvu navvi: “ḍappi vō mā kamaṃḍaluvutōyamulu
ద్రావు; మీ ఫలములు దనియంగ నమలు; నీ వింక నీ రాత్రి నిద్రింపు మిచట.
drāvu; mī phalamulu daniyaṃga namalu; nī viṃka nī rātri nidriṃpu micaṭa.
నగచరోత్తమ! యతీతానాగతంబు లగు మేర లెఱుఁగుదు నంతరంగమున;
nagacarōttama! yatītānāgataṃbu lagu mēra leṟum̐gudu naṃtaraṃgamuna;
రాము వంచించి యా రామునిదేవి భూమిజఁజెఱగొని పోవ రావణుఁడు
rāmu vaṃciṃci yā rāmunidēvi bhūmijam̐jeṟagoni pōva rāvaṇum̐ḍu
అవనీశుఁడును వాలి నవలీలఁజంపి లవణాంబునిధిఁగట్టి లంకపై విడిసి
avanīśum̐ḍunu vāli navalīlam̐jaṃpi lavaṇāṃbunidhim̐gaṭṭi laṃkapai viḍisi
యనిలోనఁగుంభకర్ణాదిరాక్షసులఁ దునుమాడి యింద్రజిత్తును ద్రుంచి వైవఁ
yanilōnam̐guṃbhakarṇādirākṣasulam̐ dunumāḍi yiṃdrajittunu druṃci vaivam̐
బుత్త్రశోకంబునఁ బుట్టినయలుక రాత్రించరేశుండు రణభూమిలోన
buttraśōkaṃbunam̐ buṭṭinayaluka rātriṃcarēśuṃḍu raṇabhūmilōna
మయునిచేఁ బడసిన మహనీయశక్తి రయమునఁగొని సుమిత్రాపుత్త్రు వైవఁ
mayunicēm̐ baḍasina mahanīyaśakti rayamunam̐goni sumitrāputtru vaivam̐
బడిన యా సౌమిత్రిప్రాణముల్ వడయ వడి నౌషధములకు వచ్చితి వీవు.
baḍina yā saumitriprāṇamul vaḍaya vaḍi nauṣadhamulaku vacciti vīvu.
వినుము నీ విప్పుడు వేయోజనంబు లనిలనందన! వచ్చిత నిల వేగమున.
vinumu nī vippuḍu vēyōjanaṃbu lanilanaṃdana! vaccita nila vēgamuna.
నన్ను నధర్మాత్మునకుఁగానరాదు; నిన్ను నుత్తమునిఁగా నిశ్చయించితిని.
nannu nadharmātmunakum̐gānarādu; ninnu nuttamunim̐gā niścayiṃcitini.
జగదేకహితముగా జనియించెఁగాన జగతీశుపని మీకు సమకూర్పవలయు.
jagadēkahitamugā janiyiṃcem̐gāna jagatīśupani mīku samakūrpavalayu.
దివ్యౌషధంబులు దీపించునట్టి దివ్యమంత్రము లుపదేశింతు నీకుఁ;
divyauṣadhaṃbulu dīpiṃcunaṭṭi divyamaṃtramu lupadēśiṃtu nīkum̐;
గంజాప్తు నుదయంబుఁగని శక్తి మిగుల సంజీవనీ ముఖ్య సకలౌషధములు
gaṃjāptu nudayaṃbum̐gani śakti migula saṃjīvanī mukhya sakalauṣadhamulu
కలవు మా వనమునఁ; గనుఁగొని యందు వలసినయవి గొంచు వడి లంక కరుగు.
kalavu mā vanamunam̐; ganum̐goni yaṃdu valasinayavi goṃcu vaḍi laṃka karugu.
కనురెప్పవెట్టెడుకంటె వేగమునఁ జనియెదు నా మంత్రసామర్థ్యమునను.”
kanureppaveṭṭeḍukaṃṭe vēgamunam̐ janiyedu nā maṃtrasāmarthyamunanu.”
ననవుడుఁ గపటసంయమిఁ జూచి పవన తనయుండు వల్కె:“నో తాపసాధీశ!
nanavuḍum̐ gapaṭasaṃyamim̐ jūci pavana tanayuṃḍu valke:“nō tāpasādhīśa!
యక్కడ లక్ష్మణుండబ్భంగి నుండ నిక్కడ నుచితమే యిటు నాకు నిలువ?
yakkaḍa lakṣmaṇuṃḍabbhaṃgi nuṃḍa nikkaḍa nucitamē yiṭu nāku niluva?
ఫలములు నా కేల పతిపంపుకార్య ఫలముగా సౌమిత్రిఁబడయకమున్న?
phalamulu nā kēla patipaṃpukārya phalamugā saumitrim̐baḍayakamunna?
నిద్రవోవుట నాకు నీతియే? దీర్ఘ నిద్ర గైకొని రామనృపుతమ్ముడుండ?
nidravōvuṭa nāku nītiyē? dīrgha nidra gaikoni rāmanr̥putammuḍuṃḍa?
జలము లల్పంబులు సాలవు; లేదె నలినాకరంబైన నదియైన;”ననుడు
jalamu lalpaṃbulu sālavu; lēde nalinākaraṃbaina nadiyaina;”nanuḍu
“నున్నది చేరువ నొక దివ్యసరసి; కన్నులు మూసి యా కమలాకరమున
“nunnadi cēruva noka divyasarasi; kannulu mūsi yā kamalākaramuna
నమృతోపమానంబులగు నిర్మలోద కములు ద్రావిన దివ్యకాయుండ వౌదు.
namr̥tōpamānaṃbulagu nirmalōda kamulu drāvina divyakāyuṃḍa vaudu.
దృగ్గోచరములగు దివ్యౌషధములు; దిగ్గనఁజను.”మంచుఁదెరువు సూపుటకుఁ
dr̥ggōcaramulagu divyauṣadhamulu; digganam̐janu.”maṃcum̐deruvu sūpuṭakum̐
గపటసంయమి శిష్యగణముఁబంచుటయుఁ గపివీరుఁడేతెంచి కనియె నక్కొలను.
gapaṭasaṃyami śiṣyagaṇamum̐baṃcuṭayum̐ gapivīrum̐ḍēteṃci kaniye nakkolanu.
మాకంద మందార మాధవీ వకుళ శాకోట కుటజకుచందనసాల
mākaṃda maṃdāra mādhavī vakuḷa śākōṭa kuṭajakucaṃdanasāla
నీపార్జునాశోక నింబ కదంబ తాపింఛ తరులసత్తటములదానిఁ,
nīpārjunāśōka niṃba kadaṃba tāpiṃcha tarulasattaṭamuladānim̐,
గమనీయ కోమల కమల కల్హార విమలకైరవముల విలసిల్లుదాని,
gamanīya kōmala kamala kalhāra vimalakairavamula vilasilludāni,
లలితకల్లోల డోలాకేళిఁదేలు కలనాద కలహంస గతులొప్పుదానిఁ,
lalitakallōla ḍōlākēḷim̐dēlu kalanāda kalahaṃsa gatuloppudānim̐,
బటుహంసచంచుచుంబకబక క్రౌంచ పటల కారండవ ప్రతతులదాని,
baṭuhaṃsacaṃcucuṃbakabaka krauṃca paṭala kāraṃḍava pratatuladāni,
వెనుకొని తముఁబిల్చి విరహులమీఁద బనిచిన గెల్చి నిర్భరవృత్తి గొన్న
venukoni tamum̐bilci virahulamīm̐da banicina gelci nirbharavr̥tti gonna
విపులాభిమానార్థవితతు లీకున్నఁ గుపితుఁడై రతిరాజు కొఱ్ఱులఁబెట్టె
vipulābhimānārthavitatu līkunnam̐ gupitum̐ḍai ratirāju koṟṟulam̐beṭṭe
ననఁ బక్వబంధంబులై వాఁడి మిగిలి మొనసిన కైరవ ముకుళాగ్ర శిఖల
nanam̐ bakvabaṃdhaṃbulai vām̐ḍi migili monasina kairava mukuḷāgra śikhala
మూగి చలింపని మొకరితుమ్మెదల బాగొప్ప నొప్పుల బలసినదాని,
mūgi caliṃpani mokaritummedala bāgoppa noppula balasinadāni,
మఱికొన్ని యెడలను మకరందములకుఁ దెఱపి సూపక తమ్ముఁ ద్రిప్పుచునున్న
maṟikonni yeḍalanu makaraṃdamulakum̐ deṟapi sūpaka tammum̐ drippucununna
కమలగేహాంతరకమలకుఁబ్రీతి సమరీతి మంగళాచారగీతములు
kamalagēhāṃtarakamalakum̐brīti samarīti maṃgaḷācāragītamulu
నలిఁబాడుగాయక నాయకు లనఁగ మెలపున నందంద మృదురీతి మ్రోయు
nalim̐bāḍugāyaka nāyaku lanam̐ga melapuna naṃdaṃda mr̥durīti mrōyu
మధుపానరసమత్త మధుకరతతుల బధిరాబ్జపుట సమీపము లొప్పుదానిఁ,
madhupānarasamatta madhukaratatula badhirābjapuṭa samīpamu loppudānim̐,
గాము నుగ్రాక్షుచేఁగ్రమ్మఱఁబడయఁ గామించి తీరమాకందబృందములు
gāmu nugrākṣucēm̐grammaṟam̐baḍayam̐ gāmiṃci tīramākaṃdabr̥ṃdamulu
నలరు నగ్నులలోన నాజ్యహోమములు చెలువంద నందంద చేయు చందమునఁ
nalaru nagnulalōna nājyahōmamulu celuvaṃda naṃdaṃda cēyu caṃdamunam̐
జిలుకలు చంచులఁజించినఁ దొరుగు ఫలరసధారలు పర్ణాగ్రవీథిఁ
jilukalu caṃculam̐jiṃcinam̐ dorugu phalarasadhāralu parṇāgravīthim̐
దొలఁగక యురిలి చెందొవలలోఁదొరుగు పొలు పెంతయునుజూడఁబొసఁగెడుదాని,
dolam̐gaka yurili ceṃdovalalōm̐dorugu polu peṃtayunujūḍam̐bosam̐geḍudāni,
ఫలరసంబులు వచ్చి పైపయిఁదొరుగ నొలసి చెందొవలలో నుండరాకున్నఁ
phalarasaṃbulu vacci paipayim̐doruga nolasi ceṃdovalalō nuṃḍarākunnam̐
దొలఁగునుజ్జ్వలహోమధూమంబు లనఁగ నలు లాకసంబున నమరెడుదాని
dolam̐gunujjvalahōmadhūmaṃbu lanam̐ga nalu lākasaṃbuna namareḍudāni
నా కంజపత్రంబులను పళ్లెరముల శీకరాక్షతములు సెలువొంద నునిచి
nā kaṃjapatraṃbulanu paḷleramula śīkarākṣatamulu seluvoṃda nunici
కొల నప్పుడుత్ఫుల్ల కువలయవలయ దళవిలోచనములఁదనరాక కెదురు
kola nappuḍutphulla kuvalayavalaya daḷavilōcanamulam̐danarāka keduru
చూచు తెఱంగున శోభిల్లుదానిఁ, జూచి డగ్గఱ వచ్చి సుఖకేలిఁదేలి
cūcu teṟaṃguna śōbhilludānim̐, jūci ḍaggaṟa vacci sukhakēlim̐dēli
యడరుసమ్మదమున నానందమంది కడువిస్మయము నొంది కన్నులు మూసి
yaḍarusammadamuna nānaṃdamaṃdi kaḍuvismayamu noṃdi kannulu mūsi
యక్కొలనికి డిగ్గి హనుమంతుఁడంత నెక్కొన్నతృష్ణతో నీరు గ్రోలంగఁ
yakkolaniki ḍiggi hanumaṃtum̐ḍaṃta nekkonnatr̥ṣṇatō nīru grōlaṃgam̐
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).