Skip to content

యుద్ధకాండము · మకరి హనుమఁగబళించుట · యుద్ధకాండము · మకరి హనుమఁగబళించుట

Yuddha Kanda 128 · makari hanumam̐gabaḷiṃcuṭa

yuddhakāṃḍamu · makari hanumam̐gabaḷiṃcuṭa

Yuddha Kanda, section 128: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

39 passagesTelugu with transliteration

An original emblem for Yuddha Kanda, section 128.

బొలుపార సంసారభూరివారాశి మలయుచు వర్తించు మాయావధూటి

bolupāra saṃsārabhūrivārāśi malayucu vartiṃcu māyāvadhūṭi

Report an error

విషయరసంబులు వేడ్కతోఁగ్రోలు తృషితునిఁగబళించు తెఱఁగు దీపింప

viṣayarasaṃbulu vēḍkatōm̐grōlu tr̥ṣitunim̐gabaḷiṃcu teṟam̐gu dīpiṃpa

Report an error

నురువడి నందుండి యొక మహామకరి హరినాథుపాదంబు లలమి పట్టుటయుఁ

nuruvaḍi naṃduṃḍi yoka mahāmakari harināthupādaṃbu lalami paṭṭuṭayum̐

Report an error

దగిలిన యంఘ్రులుద్ధతశక్తిఁదిగిచి తిగువఁజాలక చాలధీరుఁడై నిలిచి

dagilina yaṃghruluddhataśaktim̐digici tiguvam̐jālaka cāladhīrum̐ḍai nilici

Report an error

యిదియెట్టిదో యని యేర్పడఁజూచి మది వాయుసూనుండు మకరిగా నెఱిఁగి

yidiyeṭṭidō yani yērpaḍam̐jūci madi vāyusūnuṃḍu makarigā neṟim̐gi

Report an error

యంతకంతకు మది నలుక రెట్టింప నంతలో నతినిష్ఠురాకారుఁడగుచు

yaṃtakaṃtaku madi naluka reṭṭiṃpa naṃtalō natiniṣṭhurākārum̐ḍagucu

Report an error

వేవేగ రఘురామవిజయవల్లరుల కావాలమై వాలు నా వాల మెత్తి

vēvēga raghurāmavijayavallarula kāvālamai vālu nā vāla metti

Report an error

రాగరసోద్రేక రావణయోగ భోగసంచితపాపములు డుల్చుపగిది

rāgarasōdrēka rāvaṇayōga bhōgasaṃcitapāpamulu ḍulcupagidi

Report an error

వాలమంకించి దుర్వారుఁడై విజయ లోలుఁడై మకరిపండ్లును డుల్ల నేసె.

vālamaṃkiṃci durvārum̐ḍai vijaya lōlum̐ḍai makaripaṃḍlunu ḍulla nēse.

Report an error

సంతతముని వరశాపరోగమున కంత మీ యౌషధ మని మ్రింగుకరణి

saṃtatamuni varaśāparōgamuna kaṃta mī yauṣadha mani mriṃgukaraṇi

Report an error

నఱిముఱి మకరి మహారోష మెత్తి మెఱసి యా హనుమంతు మ్రింగఁ జొచ్చుటయు,

naṟimuṟi makari mahārōṣa metti meṟasi yā hanumaṃtu mriṃgam̐ joccuṭayu,

Report an error

“నక్కటా! రాము కార్యము చిక్కువడియె నిక్కడ దీనిచే నిట్టి చందమునఁ

“nakkaṭā! rāmu kāryamu cikkuvaḍiye nikkaḍa dīnicē niṭṭi caṃdamunam̐

Report an error

దెగిపోదునో? యింకఁదెఱఁగేది?”యనుచుఁ దగ విచారించి యుద్ధతి వాయుసుతుఁడు

degipōdunō? yiṃkam̐deṟam̐gēdi?”yanucum̐ daga vicāriṃci yuddhati vāyusutum̐ḍu

Report an error

“కడుపులోపలఁజొచ్చి కడతేర్తు.”ననుచు నొడిసి మ్రింగుచునున్న నూరక యుండి

“kaḍupulōpalam̐jocci kaḍatērtu.”nanucu noḍisi mriṃgucununna nūraka yuṃḍi

Report an error

పదిలుఁడై యంధకూపముఁబోనిమకరి యుదరంబుఁజొచ్చె నా యురుబాహుబలుఁడు

padilum̐ḍai yaṃdhakūpamum̐bōnimakari yudaraṃbum̐jocce nā yurubāhubalum̐ḍu

Report an error

అంత నా మకరియు నాహారబుద్ధి సంతోషమునఁబోయె జలమధ్యమునకు.

aṃta nā makariyu nāhārabuddhi saṃtōṣamunam̐bōye jalamadhyamunaku.

Report an error

నా వీరవరుఁడంత నలుకతో దాని ప్రేవులు నరములు పెనఁచి త్రెంచుచును

nā vīravarum̐ḍaṃta nalukatō dāni prēvulu naramulu penam̐ci treṃcucunu

Report an error

నడరినకడఁకతో నమ్మహామకరి కడుపులోపల విషకబళంబువోలె

naḍarinakaḍam̐katō nammahāmakari kaḍupulōpala viṣakabaḷaṃbuvōle

Report an error

నఱుగక తిరుగుచు ననలంబు భంగిఁ జుఱువుచ్చఁదొడఁగిన స్రుక్కి యమ్మకరి

naṟugaka tirugucu nanalaṃbu bhaṃgim̐ juṟuvuccam̐doḍam̐gina srukki yammakari

Report an error

దేహంబులోపల ధృతి దీర డించి దాహంబుపెంపున ధరియింప రాక

dēhaṃbulōpala dhr̥ti dīra ḍiṃci dāhaṃbupeṃpuna dhariyiṃpa rāka

Report an error

వఱువట్లువట్టెడు వదనగహ్వరము తెఱచి నిల్పుటయు నత్తెరువున వచ్చి

vaṟuvaṭluvaṭṭeḍu vadanagahvaramu teṟaci nilpuṭayu natteruvuna vacci

Report an error

క్రూరునక్రగ్రాహఘోరప్రవాహ వారిపైఁబడుటయు వాయునందనుఁడు

krūrunakragrāhaghōrapravāha vāripaim̐baḍuṭayu vāyunaṃdanum̐ḍu

Report an error

పెనఁచి త్రెంచిన దాని ప్రేవులు ముద్ద గొని వచ్చి చెచ్చెఱఁగుత్తుకఁదుఱిమె.

penam̐ci treṃcina dāni prēvulu mudda goni vacci cecceṟam̐guttukam̐duṟime.

Report an error

నా లోన మకరియు“నాహార మఱుగఁ బోలదు పొ.”మ్మని బుద్ధిఁజింతించి

nā lōna makariyu“nāhāra maṟugam̐ bōladu po.”mmani buddhim̐jiṃtiṃci

Report an error

పరవశ యగుటయుఁ బవననందనుఁడు దరిఁజేర్చి మకరి నుద్ధతి వ్రచ్చి వెడలి

paravaśa yaguṭayum̐ bavananaṃdanum̐ḍu darim̐jērci makari nuddhati vracci veḍali

Report an error

కోరి చూడఁగ నొప్పె ఘోరాంధకార దారుణనిర్ముక్తతరుణార్కు పగిదిఁ.

kōri cūḍam̐ga noppe ghōrāṃdhakāra dāruṇanirmuktataruṇārku pagidim̐.

Report an error

బ్రళయారుణోదగ్రబడబాగ్ని శిఖలు కలయఁబర్విన నాఁటి ఘనపయోరాశి

braḷayāruṇōdagrabaḍabāgni śikhalu kalayam̐barvina nām̐ṭi ghanapayōrāśi

Report an error

కరణి నమ్మకరి రక్తములతోఁబెరసి యరుణమై కనుపట్టె నప్పు డా సరసి.

karaṇi nammakari raktamulatōm̐berasi yaruṇamai kanupaṭṭe nappu ḍā sarasi.

Report an error

యంత నా మకరియు నమరియై యమరి యంతరిక్షమున నుద్యద్విమానమున

yaṃta nā makariyu namariyai yamari yaṃtarikṣamuna nudyadvimānamuna

Report an error

జలదంబులోపలఁ జపలత మాని మెలపొందు తిరమైన మెఱుపుచందమున

jaladaṃbulōpalam̐ japalata māni melapoṃdu tiramaina meṟupucaṃdamuna

Report an error

నిలిచి మారుతిచేత నిజశాపముక్తి గలిగిన ముదమంది కపిముఖ్యుఁజూచి

nilici māruticēta nijaśāpamukti galigina mudamaṃdi kapimukhyum̐jūci

Report an error

“యో కపికుంజర! యో వానరేంద్ర! నీ కతంబున శాపనిర్ముక్తిఁగంటి;

“yō kapikuṃjara! yō vānarēṃdra! nī kataṃbuna śāpanirmuktim̐gaṃṭi;

Report an error

నే నింకఁబోయెద నింద్రలోకమున; కేను నీ కొకవార్త యెఱిఁగింపవలయు.’

nē niṃkam̐bōyeda niṃdralōkamuna; kēnu nī kokavārta yeṟim̐giṃpavalayu.’

Report an error

నని మున్ను హనుమంతు నాకొలనికినిఁ బనిచిన కృతకతాపసిఁజూపి పలికె:

nani munnu hanumaṃtu nākolanikinim̐ banicina kr̥takatāpasim̐jūpi palike:

Report an error

“వానరోత్తమ! మునివరుఁడు గాఁడితఁడు; వీని నమ్మకుమయ్య; వీఁడు రాక్షసుఁడు.

“vānarōttama! munivarum̐ḍu gām̐ḍitam̐ḍu; vīni nammakumayya; vīm̐ḍu rākṣasum̐ḍu.

Report an error

చలమున దానవేశ్వరుని యోగమున బలియుఁడై నినుఁజంపఁబనిపూని వచ్చి

calamuna dānavēśvaruni yōgamuna baliyum̐ḍai ninum̐jaṃpam̐banipūni vacci

Report an error

యే నిందులో నున్కి యెఱిఁగి నాచేతఁ బూని నిన్‌ జంపింపఁ బుత్తెంచినాఁడు.

yē niṃdulō nunki yeṟim̐gi nācētam̐ būni nin jaṃpiṃpam̐ butteṃcinām̐ḍu.

Report an error

వీఁడువధ్యుఁడు నీకు; వీని నమ్మకుము; వీఁడొప్పఁ;డిట వీని వేవేగ చంపి

vīm̐ḍuvadhyum̐ḍu nīku; vīni nammakumu; vīm̐ḍoppam̐;ḍiṭa vīni vēvēga caṃpi

Report an error

పొ మ్మౌషధములకు భుజశక్తి మెఱసి; యిమ్ముల ద్రోణాద్రి కిదె త్రోవ నీకు.”

po mmauṣadhamulaku bhujaśakti meṟasi; yimmula drōṇādri kide trōva nīku.”

Report an error

Illustration: Verse & Place (Project-owned).