“నోరామ! వాలికి నొగి నాకు నైన వైరానుకథనంబు వర్ణింతు వినుము:
“nōrāma! vāliki nogi nāku naina vairānukathanaṃbu varṇiṃtu vinumu:
కిష్కింధాకాండము · వాలిసుగ్రీవుల కలహకథ · కిష్కింధాకాండము · వాలిసుగ్రీవుల కలహకథ
kiṣkiṃdhākāṃḍamu · vālisugrīvula kalahakatha
Kishkindha Kanda, section 4: the complete selected Telugu original, with ISO 15919 transliteration.
108 passagesTelugu with transliteration
“నోరామ! వాలికి నొగి నాకు నైన వైరానుకథనంబు వర్ణింతు వినుము:
“nōrāma! vāliki nogi nāku naina vairānukathanaṃbu varṇiṃtu vinumu:
మా తండ్రితరువాత మంత్రులు వెద్ద యీతఁడంచును వానరేంద్రపట్టంబు
mā taṃḍritaruvāta maṃtrulu vedda yītam̐ḍaṃcunu vānarēṃdrapaṭṭaṃbu
వాలికిఁగట్టి; రా వాలియు నన్నుఁ జాల మన్నన సేసి సంప్రీతి నడపు.
vālikim̐gaṭṭi; rā vāliyu nannum̐ jāla mannana sēsi saṃprīti naḍapu.
నతనికి బంటనై యహరహంబేనుఁ బితృసమానుఁడుగాఁగఁబేర్మి సేవింతు.
nataniki baṃṭanai yaharahaṃbēnum̐ bitr̥samānum̐ḍugām̐gam̐bērmi sēviṃtu.
నీ రీతి నన్యోన్యహితులమై మెలఁగ శ్రీరామ! యొకనాఁడు చిరవైర మూని
nī rīti nanyōnyahitulamai melam̐ga śrīrāma! yokanām̐ḍu ciravaira mūni
తొడరినకడఁకతో దుందుభి కన్న కొడుకు మాయావి యన్ఘోరరాక్షసుఁడు
toḍarinakaḍam̐katō duṃdubhi kanna koḍuku māyāvi yanghōrarākṣasum̐ḍu
నడురేయి కిష్కింధనగరంబు బెదర వడి నార్చి గర్వదుర్వారుఁడై పేర్చి
naḍurēyi kiṣkiṃdhanagaraṃbu bedara vaḍi nārci garvadurvārum̐ḍai pērci
యని సేయఁబిలిచిన నలుక దీపింప ననుపమబలశాలియగు వాలి వెడలి
yani sēyam̐bilicina naluka dīpiṃpa nanupamabalaśāliyagu vāli veḍali
ననుఁగూడి యుద్ధసన్నద్ధుఁడై వేగ తన మీఁద నడవ నిద్దఱఁజూచి వాఁడు
nanum̐gūḍi yuddhasannaddhum̐ḍai vēga tana mīm̐da naḍava niddaṟam̐jūci vām̐ḍu
ననిసేయ కతిభీతుఁడై పాఱిపోయి తన గుహఁజొచ్చిన దర్పించి వాలి
nanisēya katibhītum̐ḍai pāṟipōyi tana guham̐joccina darpiṃci vāli
గుహవాత నన్నుంచి గుహతానుఁజొచ్చి గుహలోన నొకయేఁడు ఘోరయుద్ధంబు
guhavāta nannuṃci guhatānum̐jocci guhalōna nokayēm̐ḍu ghōrayuddhaṃbu
కడుకొని సేయ రక్తము వెల్లి విరిసి యుడుగక గుహవాత నుబ్బినఁజూచి
kaḍukoni sēya raktamu velli virisi yuḍugaka guhavāta nubbinam̐jūci
కనుకని నార్చురాక్షసుని యార్పులును విని”వాలి రాక్షసవిభునిచేఁజచ్చె.
kanukani nārcurākṣasuni yārpulunu vini”vāli rākṣasavibhunicēm̐jacce.
నిచ్చోట నేనుండు టెఱిఁగిన వెడలి వచ్చి దైత్యుఁడు పట్టి వధియించు నన్ను.”
niccōṭa nēnuṃḍu ṭeṟim̐gina veḍali vacci daityum̐ḍu paṭṭi vadhiyiṃcu nannu.”
నని నిశ్చయము సేసి యప్పుడే పోయి కొనివచ్చి యొకకొండ గుహవాతనునిచి
nani niścayamu sēsi yappuḍē pōyi konivacci yokakoṃḍa guhavātanunici
యచ్చట వాలికి నట తిలోదకము లిచ్చి కిష్కింధకు నేను వచ్చుటయు
yaccaṭa vāliki naṭa tilōdakamu licci kiṣkiṃdhaku nēnu vaccuṭayu
“వాలి వోయినతరువాత నీ రాజ్య పాలనంబున కీవె ప్రాప్తుండ.”వనుచు
“vāli vōyinataruvāta nī rājya pālanaṃbuna kīve prāptuṃḍa.”vanucu
వదలక మంత్రులు వానరరాజ్య పదమున ననుఁదెచ్చి పట్టంబు గట్ట
vadalaka maṃtrulu vānararājya padamuna nanum̐decci paṭṭaṃbu gaṭṭa
వానరకులచక్రవర్తినై యేను నూని రాజ్యము సేయుచుండితి. నంత-
vānarakulacakravartinai yēnu nūni rājyamu sēyucuṃḍiti. naṃta-
మనుజేశ! మఱి వాలి మాయావిఁజంపి ననుఁజీఱిచీఱి యంతట గుహవాత
manujēśa! maṟi vāli māyāvim̐jaṃpi nanum̐jīṟicīṟi yaṃtaṭa guhavāta
పెనచివైచినకొండఁబిండిగాఁదన్ని చనుదెంచి ననుఁజూచి చాలఁగోపించి
penacivaicinakoṃḍam̐biṃḍigām̐danni canudeṃci nanum̐jūci cālam̐gōpiṃci
తన కేనుజేయువందనముఁగైకొనక యెనసినకినుకతో నిట్లనిపలికె:
tana kēnujēyuvaṃdanamum̐gaikonaka yenasinakinukatō niṭlanipalike:
“నోరి! తమ్ముఁడవని యూరడి నమ్మి పోరాడఁబగతుపైఁబోయిన చోట
“nōri! tammum̐ḍavani yūraḍi nammi pōrāḍam̐bagatupaim̐bōyina cōṭa
ననుడించి చనుదెంచి నా రాజ్యపదముఁ గొని ప్రీతినిట్లుండఁగూడునే నీకుఁ?
nanuḍiṃci canudeṃci nā rājyapadamum̐ goni prītiniṭluṃḍam̐gūḍunē nīkum̐?
గడుఁబాపబుద్ధివి గావున నిన్నుఁ దొడరి చంపిన నాకు దోషంబు లేదు.”
gaḍum̐bāpabuddhivi gāvuna ninnum̐ doḍari caṃpina nāku dōṣaṃbu lēdu.”
అనవుడు నే వాలియడుగుల కెఱఁగి వినయంబు భయమును వెలయ నిట్లంటి:
anavuḍu nē vāliyaḍugula keṟam̐gi vinayaṃbu bhayamunu velaya niṭlaṃṭi:
“నొకయేఁడు మాయావియును మీరుఁబోరఁ బ్రకటింప రక్తపూరము గుహవాత
“nokayēm̐ḍu māyāviyunu mīrum̐bōram̐ brakaṭiṃpa raktapūramu guhavāta
వెడలిన భయమంది విపరీతబుద్ధి వడిఁబారి యిచటి కే వచ్చినఁజూచి
veḍalina bhayamaṃdi viparītabuddhi vaḍim̐bāri yicaṭi kē vaccinam̐jūci
రట్టడిమంత్రు లీ రాజ్యంబు నాకుఁ గట్టి; రింతియకాని కపట మే నెఱుఁగ.
raṭṭaḍimaṃtru lī rājyaṃbu nākum̐ gaṭṭi; riṃtiyakāni kapaṭa mē neṟum̐ga.
నాకు నీ యాగమనంబె శోభనము. నీ కపిరాజ్యంబు నీవె కైకొనుము.
nāku nī yāgamanaṃbe śōbhanamu. nī kapirājyaṃbu nīve kaikonumu.
వావిఁదమ్ముఁడఁగాని వాలి, నీ కేను సేవకుండ, సుతుండఁ,జెప్ప నేమిటికి?
vāvim̐dammum̐ḍam̐gāni vāli, nī kēnu sēvakuṃḍa, sutuṃḍam̐,jeppa nēmiṭiki?
గరుణాఢ్య! నాయెడఁగల్ల గల్గినను గరుణింపు;”మని పెక్కుగతులఁబ్రార్థింప
garuṇāḍhya! nāyeḍam̐galla galginanu garuṇiṃpu;”mani pekkugatulam̐brārthiṃpa
నంతకంతకు మండి“యనుజునిపట్ల నింతేల?”యని మంత్రులెంత సెప్పినను
naṃtakaṃtaku maṃḍi“yanujunipaṭla niṃtēla?”yani maṃtruleṃta seppinanu
అనయుఁడై నా పత్నియగు రుమఁబుచ్చి కొని రాజ్యమును బుచ్చికొని చంపఁగడఁగ
anayum̐ḍai nā patniyagu rumam̐bucci koni rājyamunu buccikoni caṃpam̐gaḍam̐ga
వెఱచి యేకాకినై వెనుకొని వాలి తఱుమ భూలోకమంతయు నేను దిరిగి
veṟaci yēkākinai venukoni vāli taṟuma bhūlōkamaṃtayu nēnu dirigi
యేపఱ పఱతెంచి యిందున్నవాఁడ నీ పర్వతము వాలికెక్కరాకునికి.”
yēpaṟa paṟateṃci yiṃdunnavām̐ḍa nī parvatamu vālikekkarākuniki.”
ననిన రాముఁడు వెఱఁగంది:“యీ కొండ యినతనూభవ! వాలికెట్లెక్కరాదు?
nanina rāmum̐ḍu veṟam̐gaṃdi:“yī koṃḍa yinatanūbhava! vālikeṭlekkarādu?
వినుపింపు.” మనవుడు వినతుఁడై నిలిచి యినతనూజుఁడు ప్రీతి నిట్లని పలికెఁ:
vinupiṃpu.” manavuḍu vinatum̐ḍai nilici yinatanūjum̐ḍu prīti niṭlani palikem̐:
“దొల్లి దుందుభియను దుష్టరాక్షసుఁడు బల్లిదుఁడై వరబలము రంజిల్ల
“dolli duṃdubhiyanu duṣṭarākṣasum̐ḍu ballidum̐ḍai varabalamu raṃjilla
ముల్లోకములు దనమొనకు భీతిల్ల మల్లడిగొని పెనుమహిషమై పోయి
mullōkamulu danamonaku bhītilla mallaḍigoni penumahiṣamai pōyi
తఱిమి సముద్రునిఁ దనతోడ ననికి నఱిమి పిల్చుటయు నయ్యంభోధి గలఁగి
taṟimi samudrunim̐ danatōḍa naniki naṟimi pilcuṭayu nayyaṃbhōdhi galam̐gi
ఘనరత్నకోటులు కానుకలిచ్చి “తునియనిబలిమి నీతోడఁబోరాడ
ghanaratnakōṭulu kānukalicci “tuniyanibalimi nītōḍam̐bōrāḍa
ఘనమైనతుహినాద్రిగాని యేఁబూని యని సేయఁజాలఁబొ.”మ్మనిన నేతెంచి
ghanamainatuhinādrigāni yēm̐būni yani sēyam̐jālam̐bo.”mmanina nēteṃci
జంభారి దోస్త్సంభసంభావితోగ్ర దంభోళినైశిత్యదర్పభంగముల
jaṃbhāri dōstsaṃbhasaṃbhāvitōgra daṃbhōḷinaiśityadarpabhaṃgamula
నతులశృంగముల హిమాద్రిఁగోరాడ నతిభీతుఁడై పర్వతాధీశుఁ డనియె:
natulaśr̥ṃgamula himādrim̐gōrāḍa natibhītum̐ḍai parvatādhīśum̐ ḍaniye:
“నీ సరివాడఁనా నిలిచి పోరాడ? నో సరింపక నిల్వనోర్తునే యేను?
“nī sarivāḍam̐nā nilici pōrāḍa? nō sariṃpaka nilvanōrtunē yēnu?
ఈ లోకమున నిన్ను నెదిరి పోరాడ వాలినభుజశక్తి వాలికిఁ గలదు.
ī lōkamuna ninnu nediri pōrāḍa vālinabhujaśakti vālikim̐ galadu.
బలియుఁడై కిష్కింధఁబాలించునతఁడు కలహంబుపై వాంఛ గలదేని నీకు
baliyum̐ḍai kiṣkiṃdham̐bāliṃcunatam̐ḍu kalahaṃbupai vāṃcha galadēni nīku
నలఘువిక్రమ! యింక నట కేఁగు”మనిన జెలఁగి రాక్షసుఁడు కిష్కింధకేతెంచి
nalaghuvikrama! yiṃka naṭa kēm̐gu”manina jelam̐gi rākṣasum̐ḍu kiṣkiṃdhakēteṃci
విలయకాలాభీలవేళ గర్జిల్లు జలదంబుగతి నార్చి:“సరిఁదనతోడ
vilayakālābhīlavēḷa garjillu jaladaṃbugati nārci:“sarim̐danatōḍa
నాలంబు సేయ ర.”మ్మని వాలిఁబిల్వ వాలి కోపించి వెల్వడివచ్చి యార్చి
nālaṃbu sēya ra.”mmani vālim̐bilva vāli kōpiṃci velvaḍivacci yārci
దుందుభిగతి మ్రోయుదుందుభిఁదాఁకి “యెందుఁబోవఁగవచ్చు నింక నీ.”కనుచు
duṃdubhigati mrōyuduṃdubhim̐dām̐ki “yeṃdum̐bōvam̐gavaccu niṃka nī.”kanucu
శిలలు పాదపములు చెచ్చెఱ రువ్వి తల ముష్టిహతులఁగొందలమందఁజేయ
śilalu pādapamulu cecceṟa ruvvi tala muṣṭihatulam̐goṃdalamaṃdam̐jēya
వాఁడును వానరేశ్వరుని వక్షంబు వాఁడికొమ్ములఁగ్రుమ్మ వానిఁ గోపించి
vām̐ḍunu vānarēśvaruni vakṣaṃbu vām̐ḍikommulam̐grumma vānim̐ gōpiṃci
యతి ఘోరుఁడై పేర్చి యచలంబు వైవ గతితప్ప నుఱికి రక్కసుఁడెదిరింప
yati ghōrum̐ḍai pērci yacalaṃbu vaiva gatitappa nuṟiki rakkasum̐ḍediriṃpa
గండశైలము వుచ్చి కపిరాజువైవ నొండొండ కొమ్ముల నోసరిల్లుచును
gaṃḍaśailamu vucci kapirājuvaiva noṃḍoṃḍa kommula nōsarillucunu
అఱుగ్రమ్మికొని వాలి నదరంట వ్రేయఁ దఱిమి వృక్షంబునఁదరుచరుండడువ
aṟugrammikoni vāli nadaraṃṭa vrēyam̐ daṟimi vr̥kṣaṃbunam̐darucaruṃḍaḍuva
మాటున నసురఁగ్రమ్మఱ వచ్చి తాఁకి మోటతా డెత్తుక మోఁద నా వాలి
māṭuna nasuram̐grammaṟa vacci tām̐ki mōṭatā ḍettuka mōm̐da nā vāli
గదిసి కొమ్ములఁజిమ్మఁగపిరాజు నిలిచి కదలనిముష్టి వక్త్రంబునఁబొడువ
gadisi kommulam̐jimmam̐gapirāju nilici kadalanimuṣṭi vaktraṃbunam̐boḍuva
రక్కసుఁడొడువ మర్కటరాజు పొడువ దక్కక యిరువురు దర్పించి పేర్చి
rakkasum̐ḍoḍuva markaṭarāju poḍuva dakkaka yiruvuru darpiṃci pērci
గొనకొని నూఱేండ్లు ఘోరయుద్ధంబు మనువంశవల్లభ! మఱిచేసి వాలి
gonakoni nūṟēṃḍlu ghōrayuddhaṃbu manuvaṃśavallabha! maṟicēsi vāli
బలిమిఁగొమ్ములు వట్టి పడవైచి చంపి తలకొన్న లావుమైఁదన్నెఁ;దన్నుటయు
balimim̐gommulu vaṭṭi paḍavaici caṃpi talakonna lāvumaim̐dannem̐;dannuṭayu
ముక్కునఁజెవుల మోమున నెత్తురొలుక నక్కులిశాహతి నద్రియుఁబోలె
mukkunam̐jevula mōmuna netturoluka nakkuliśāhati nadriyum̐bōle
నా యుగ్రదైత్యుమహాకళేబరము పోయి యోజనమాత్రమునఁదూలి పడియె.
nā yugradaityumahākaḷēbaramu pōyi yōjanamātramunam̐dūli paḍiye.
గైరికనిర్ఘరాకారంబు లగుచు నా రక్తకణము లీ యద్రిపైఁబడిన
gairikanirgharākāraṃbu lagucu nā raktakaṇamu lī yadripaim̐baḍina
నారసి యిచట నిత్యము తపంబున్న దారుణశక్తి మతంగుండు గినిసి
nārasi yicaṭa nityamu tapaṃbunna dāruṇaśakti mataṃguṃḍu ginisi
యీ పర్వతము వాలికెక్క రాకుండ శాపంబు గావించె జగదేకనాథ!
yī parvatamu vālikekka rākuṃḍa śāpaṃbu gāviṃce jagadēkanātha!
కాన, యీ ఋశ్యమూకమునందు వెఱవ కేను గాఁపురముందు నెల్లకాలంబు.
kāna, yī r̥śyamūkamunaṃdu veṟava kēnu gām̐puramuṃdu nellakālaṃbu.
కడఁగి యా దుందుభికాయంబు వుచ్చి, పుడమి యోజనదూరమునఁబాఱవైవ
kaḍam̐gi yā duṃdubhikāyaṃbu vucci, puḍami yōjanadūramunam̐bāṟavaiva
వలనైనభుజశక్తి వాలికిఁగాక తలపోయ నొరులకుఁదరముగాదధిప!
valanainabhujaśakti vālikim̐gāka talapōya norulakum̐daramugādadhipa!
కైకొని నీ వంతకంటెను దూర మీ కళేబర మిపుడిట మీటకున్న
kaikoni nī vaṃtakaṃṭenu dūra mī kaḷēbara mipuḍiṭa mīṭakunna
నినవంశ! మీ సత్త్వమే నాత్మ నమ్మ.” ననవుడు విని రాముఁడల్లన నవ్వి:
ninavaṃśa! mī sattvamē nātma namma.” nanavuḍu vini rāmum̐ḍallana navvi:
“యా దుందుభిశరీర మల్లన మీటి నీదు సందేహంబు నేఁడు వాపెదను;
“yā duṃdubhiśarīra mallana mīṭi nīdu saṃdēhaṃbu nēm̐ḍu vāpedanu;
ఇనతనూభవ! దాని నేర్పడఁజూపు.” మనవుడు సుగ్రీవుఁడర్థితోఁజూప
inatanūbhava! dāni nērpaḍam̐jūpu.” manavuḍu sugrīvum̐ḍarthitōm̐jūpa
ఘనమేరుమందరాకారమైయున్నఁ గని కళేబరముడగ్గఱకు నేతెంచి
ghanamērumaṃdarākāramaiyunnam̐ gani kaḷēbaramuḍaggaṟaku nēteṃci
గొనకొని దానిఁగైకొనక యంగుష్ఠ మునఁబదియోజనంబులు పాఱమీటి
gonakoni dānim̐gaikonaka yaṃguṣṭha munam̐badiyōjanaṃbulu pāṟamīṭi
వైచిన రఘురామువరశక్తి పేర్మిఁ జూచియు నమ్మక సుగ్రీవుఁడనియె:
vaicina raghurāmuvaraśakti pērmim̐ jūciyu nammaka sugrīvum̐ḍaniye:
“మెలపుమై నిది వాలి మీటెడునాఁడు దలమైన రక్తమాంసములతో నుండు;
“melapumai nidi vāli mīṭeḍunām̐ḍu dalamaina raktamāṃsamulatō nuṃḍu;
మనుజేశ! నేఁడస్థిమాత్రమై యుండఁ గని నీవు మీటితిగాక యొక్కింత
manujēśa! nēm̐ḍasthimātramai yuṃḍam̐ gani nīvu mīṭitigāka yokkiṃta
వడిఁబేర్చి, నీ లావు వాలిలావునకుఁ గడు నెక్కుడని నమ్మఁగారాదు దేవ!
vaḍim̐bērci, nī lāvu vālilāvunakum̐ gaḍu nekkuḍani nammam̐gārādu dēva!
(అతఁడదియునుఁగాక యలవోక మీటు క్షితిధరంబులఁబుట్టచెండ్లకైవడిని;
(atam̐ḍadiyunum̐gāka yalavōka mīṭu kṣitidharaṃbulam̐buṭṭaceṃḍlakaivaḍini;
జతురంబుధులయందు సంధ్యలు వార్చు; సితికంఠుపదములు శిరమర్థిఁజేర్చు;
jaturaṃbudhulayaṃdu saṃdhyalu vārcu; sitikaṃṭhupadamulu śiramarthim̐jērcu;
వాయువుకన్న జవంబు హెచ్చుగను దోయధులన్ని దోడ్తో దాటివచ్చు.
vāyuvukanna javaṃbu heccuganu dōyadhulanni dōḍtō dāṭivaccu.
వాలికి నిర్జరేశ్వరదత్తహేమ మాలి కెవ్వరుసాటి? మఱియొండు వినుము:)
vāliki nirjarēśvaradattahēma māli kevvarusāṭi? maṟiyoṃḍu vinumu:)
ధరణీశ! యీ యేడుతాళ్లును దొల్లి వరశక్తియుక్తిమై వాలి బిట్టేచి
dharaṇīśa! yī yēḍutāḷlunu dolli varaśaktiyuktimai vāli biṭṭēci
కరముల నొక్కటిగాఁగూడఁబట్టి తరమిడి వానిపత్రములెల్లఁద్రుంచు;
karamula nokkaṭigām̐gūḍam̐baṭṭi taramiḍi vānipatramulellam̐druṃcu;
నడరి యీ తాళంబులందొక్కటైన వడిఁగదల్పగ లేరు వాసవాదులును;
naḍari yī tāḷaṃbulaṃdokkaṭaina vaḍim̐gadalpaga lēru vāsavādulunu;
దలకొని యొకకోలఁదాళంబు లేడు నిలువక కాఁడిపో నెఱిఁదెగనేయ
dalakoni yokakōlam̐dāḷaṃbu lēḍu niluvaka kām̐ḍipō neṟim̐deganēya
వసుధేశ! నీ లావు వాలిలావునకు నసమానగతి నెక్కుడని నమ్మవచ్చు.
vasudhēśa! nī lāvu vālilāvunaku nasamānagati nekkuḍani nammavaccu.
ధరణీశ! యీ సప్తతాళంబులొక్క శరమునఁదెగవ్రేయుశౌర్యంబు గలుగు
dharaṇīśa! yī saptatāḷaṃbulokka śaramunam̐degavrēyuśauryaṃbu galugu
పురుషునిచే వాలి వొలియు నటంచు నరసి నాకు మతంగుఁడనుముని సెప్పె.”
puruṣunicē vāli voliyu naṭaṃcu narasi nāku mataṃgum̐ḍanumuni seppe.”
ననవుడు విని రాముఁడల్లన నవ్వి: “వనచరాధిప! తాళ్లు వదలక చూపు.”
nanavuḍu vini rāmum̐ḍallana navvi: “vanacarādhipa! tāḷlu vadalaka cūpu.”
మనవుడు సుగ్రీవుఁ డా రాము వేగ గొనిపోయి యా తాళ్లు గుఱు తెఱిఁగింప
manavuḍu sugrīvum̐ ḍā rāmu vēga gonipōyi yā tāḷlu guṟu teṟim̐giṃpa
నశనిసంకాశంబు నసదృశంబైన నిశితాస్త్ర మరిఁబోసి నిపుణుఁడై నృపుఁడు
naśanisaṃkāśaṃbu nasadr̥śaṃbaina niśitāstra marim̐bōsi nipuṇum̐ḍai nr̥pum̐ḍu
ముంచి యొక్కటఁబంక్తిముఖు నాండ్రతాళ్లు ద్రెంచినగతిఁ ద్రాళ్లు దెగనేయుటయును
muṃci yokkaṭam̐baṃktimukhu nāṃḍratāḷlu dreṃcinagatim̐ drāḷlu deganēyuṭayunu
అవనిపై వక్రంబులైయున్న తాళ్ల నవిరళంబుగ వడి నటు గాఁడిపాఱి
avanipai vakraṃbulaiyunna tāḷla naviraḷaṃbuga vaḍi naṭu gām̐ḍipāṟi
చేరువగిరి దాటి చెచ్చెఱఁబోయి ధారుణి దూరి పాతాళంబుఁజేరి
cēruvagiri dāṭi cecceṟam̐bōyi dhāruṇi dūri pātāḷaṃbum̐jēri
యలయక తీవ్రత నమ్మహాశరము తొలఁగక రఘురాముదొన వచ్చి చొచ్చెఁ
yalayaka tīvrata nammahāśaramu tolam̐gaka raghurāmudona vacci coccem̐
జొచ్చినఁగనుఁగొని సుగ్రీవుఁడప్పు డచ్చెరువునఁబొంది యానందమంది
joccinam̐ganum̐goni sugrīvum̐ḍappu ḍacceruvunam̐boṃdi yānaṃdamaṃdi
“సప్తపాతాళసంసక్తమూలములు సప్తాశ్వమండలాచ్ఛాదిపత్రములు
“saptapātāḷasaṃsaktamūlamulu saptāśvamaṃḍalācchādipatramulu
నగుసప్తతాళంబు లస్త్రమొక్కటనె తెగనేసె; నాదు సందేహంబు వాసె;
nagusaptatāḷaṃbu lastramokkaṭane teganēse; nādu saṃdēhaṃbu vāse;
వాలి రాఘవునిచే వడిఁజచ్చు నింక; నేలితిఁగపిరాజ్యమే.”నంచుఁబొంగి
vāli rāghavunicē vaḍim̐jaccu niṃka; nēlitim̐gapirājyamē.”naṃcum̐boṃgi
కమలాప్తకులనాథుఁగాకుత్స్థుఁజూచి కమలాప్తసుతుఁడంతఁగరములు మొగిచి:
kamalāptakulanāthum̐gākutsthum̐jūci kamalāptasutum̐ḍaṃtam̐garamulu mogici:
“దేవ! దేవరమూర్తి దృష్టించి లావు భావింపనేరక పశుబుద్ధి నైతి.
“dēva! dēvaramūrti dr̥ṣṭiṃci lāvu bhāviṃpanēraka paśubuddhi naiti.
నినజుండ నేను; నీ వినవంశభవుఁడ; వని సమబుద్ధిమై నపరాధినైతి.
ninajuṃḍa nēnu; nī vinavaṃśabhavum̐ḍa; vani samabuddhimai naparādhinaiti.
నీ లోకములకెల్ల నేలిక వీవు. బాలిశు నన్ను నీ బంటుగా నేలి
nī lōkamulakella nēlika vīvu. bāliśu nannu nī baṃṭugā nēli
నా శత్రుఁదెగటార్చి నా రాజ్యమిచ్చి నా శోక ముడుపవే నరనాథచంద్ర!”
nā śatrum̐degaṭārci nā rājyamicci nā śōka muḍupavē naranāthacaṃdra!”
యనవుడు సుగ్రీవు నతికృపాదృష్టిఁ గనుఁగొని మన్నించి కాకుత్స్థుఁడనియెఁ
yanavuḍu sugrīvu natikr̥pādr̥ṣṭim̐ ganum̐goni manniṃci kākutsthum̐ḍaniyem̐
Keys: ← → turn the page, J K step through the verses.
Illustration: Verse & Place (Project-owned).