Skip to content

కిష్కింధాకాండము · వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధము · కిష్కింధాకాండము · వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధము

Kishkindha Kanda 5 · vālisugrīvula dvaṃdvayuddhamu

kiṣkiṃdhākāṃḍamu · vālisugrīvula dvaṃdvayuddhamu

Kishkindha Kanda, section 5: the complete selected Telugu original, with ISO 15919 transliteration.

63 passagesTelugu with transliteration

An original emblem for Kishkindha Kanda, section 5.

“జెచ్చెర నీవు గిష్కింధకుఁబోయి యచ్చట వాలితో నని చేయుచుండు.

“jeccera nīvu giṣkiṃdhakum̐bōyi yaccaṭa vālitō nani cēyucuṃḍu.

Report an error

మవలీల నొకకోల నా వాలిఁజంపి ప్రవిమలకపిరాజ్యపదము నీ కిత్తు.

mavalīla nokakōla nā vālim̐jaṃpi pravimalakapirājyapadamu nī kittu.

Report an error

వెఱవక సుగ్రీవ! వేగపొ.”మ్మనిన నఱలేనికడఁకతో నప్పు డుప్పొంగి

veṟavaka sugrīva! vēgapo.”mmanina naṟalēnikaḍam̐katō nappu ḍuppoṃgi

Report an error

నలుఁడు నీలుఁడు నంజనాతనూభవుఁడు బలియుఁడు తారుండు బలసి తో నడవ

nalum̐ḍu nīlum̐ḍu naṃjanātanūbhavum̐ḍu baliyum̐ḍu tāruṃḍu balasi tō naḍava

Report an error

నాజికి సన్నద్ధుఁడై బల్మి మెఱసి రాజిల్లి వెనుక రా రామలక్ష్మణులు

nājiki sannaddhum̐ḍai balmi meṟasi rājilli venuka rā rāmalakṣmaṇulu

Report an error

(వచ్చి కిష్కింధ కివ్వలనున్న వనము సొచ్చి గూఢముగ నచ్చోఁదన్నుఁబనుప)

(vacci kiṣkiṃdha kivvalanunna vanamu socci gūḍhamuga naccōm̐dannum̐banupa)

Report an error

వడిఁబోయి కిష్కింధవాకిట నిలిచి యడరి సుగ్రీవుఁడుదగ్రుఁడై యార్చి

vaḍim̐bōyi kiṣkiṃdhavākiṭa nilici yaḍari sugrīvum̐ḍudagrum̐ḍai yārci

Report an error

తడయక తనతోడఁదగిలి పోరాడ వడి నేఁగుదెమ్మని వాలిఁబిల్చుటయుఁ

taḍayaka tanatōḍam̐dagili pōrāḍa vaḍi nēm̐gudemmani vālim̐bilcuṭayum̐

Report an error

గరిబృంహితంబు లాకర్ణించి పెలుచఁ గరివైరి కోపించుకరణిఁగోపించి

garibr̥ṃhitaṃbu lākarṇiṃci pelucam̐ garivairi kōpiṃcukaraṇim̐gōpiṃci

Report an error

శితికంఠచరణరాజీవాలి వాల కృతబంధరావణగ్రీవాలి యైన

śitikaṃṭhacaraṇarājīvāli vāla kr̥tabaṃdharāvaṇagrīvāli yaina

Report an error

వాలి సుగ్రీవుని వడి వచ్చి తాఁక వాలిసుగ్రీవు లవక్రవిక్రములు

vāli sugrīvuni vaḍi vacci tām̐ka vālisugrīvu lavakravikramulu

Report an error

సమరూప సమకోప సమజవాటోప సమసుప్రతాపులై జానుజంఘోరు

samarūpa samakōpa samajavāṭōpa samasupratāpulai jānujaṃghōru

Report an error

జత్రు వక్షోనాభి జఘనదేశములు చిత్రవైఖరి నొంచి చించి చెండాడి

jatru vakṣōnābhi jaghanadēśamulu citravaikhari noṃci ciṃci ceṃḍāḍi

Report an error

చెలరేఁగి పూర్వపశ్చిమసముద్రములు బలువిడిఁబోరాడు భంగిఁబోరాడ

celarēm̐gi pūrvapaścimasamudramulu baluviḍim̐bōrāḍu bhaṃgim̐bōrāḍa

Report an error

నా యెడ ధృతి రాముఁడమ్ము సంధించి యేయ నుద్యోగించి యిరువురఁజూచి

nā yeḍa dhr̥ti rāmum̐ḍammu saṃdhiṃci yēya nudyōgiṃci yiruvuram̐jūci

Report an error

వదనముల్‌, రదనముల్‌ ,వాలముల్‌ ,బాహు లుదరంబు, లధరంబు, లూరులు, బరులు

vadanamul, radanamul ,vālamul ,bāhu ludaraṃbu, ladharaṃbu, lūrulu, barulu

Report an error

కక్షముల్‌, వక్షముల్‌, కాళ్లును, వ్రేళ్లు, వీక్షలు, శిక్షలు, వేషభాషలును,

kakṣamul, vakṣamul, kāḷlunu, vrēḷlu, vīkṣalu, śikṣalu, vēṣabhāṣalunu,

Report an error

జెక్కులు, ముక్కులు, శిరము, లంసములు ప్రక్కలు, పిక్కలు, పాదయుగ్మములు,

jekkulu, mukkulu, śiramu, laṃsamulu prakkalu, pikkalu, pādayugmamulu,

Report an error

కర్ణముల్‌, వర్ణముల్‌, గళము లంగములు నిర్ణయింపఁగ నొక్కనెఱియైనఁజూచి

karṇamul, varṇamul, gaḷamu laṃgamulu nirṇayiṃpam̐ga nokkaneṟiyainam̐jūci

Report an error

యే తెఱంగునఁజూడ నిరువురియందు నీతఁడు సుగ్రీవుఁ, డీతఁడు వాలి,

yē teṟaṃgunam̐jūḍa niruvuriyaṃdu nītam̐ḍu sugrīvum̐, ḍītam̐ḍu vāli,

Report an error

యని యేర్పఱించుట కలవి గాకున్నఁ దనలోన వెఱఁగంది దశరథాత్మజుఁడు

yani yērpaṟiṃcuṭa kalavi gākunnam̐ danalōna veṟam̐gaṃdi daśarathātmajum̐ḍu

Report an error

“ఎడపక యేసిన నీ యమ్ముచేతఁ దొడిఁబడ నెవ్వఁడు ద్రుంగునో!”యనుచు

“eḍapaka yēsina nī yammucētam̐ doḍim̐baḍa nevvam̐ḍu druṃgunō!”yanucu

Report an error

నమ్ము వేయకయుండె; నంత, సుగ్రీవుఁ డిమ్మెయిఁగడు డస్సి యేపెల్లఁబొలిసి

nammu vēyakayuṃḍe; naṃta, sugrīvum̐ ḍimmeyim̐gaḍu ḍassi yēpellam̐bolisi

Report an error

వలఁతియై పోరాడి వాలికి నోడి బలమేది యాతని బలుముష్టిహతుల

valam̐tiyai pōrāḍi vāliki nōḍi balamēdi yātani balumuṣṭihatula

Report an error

గుల్లలతిత్తియై కుట్టూర్పు లెసగఁ “జెల్లఁబో నేనేల శ్రీరాము నమ్మి

gullalatittiyai kuṭṭūrpu lesagam̐ “jellam̐bō nēnēla śrīrāmu nammi

Report an error

వచ్చితిఁ? బదివేలు వచ్చెఁ; జాల్చాలు వచ్చినత్రోవఁబోవఁగవలె.”ననుచు

vaccitim̐? badivēlu vaccem̐; jālcālu vaccinatrōvam̐bōvam̐gavale.”nanucu

Report an error

మెలకువ చెడితోఁక మెడమీఁద వైచి సొలసి నల్గడలఁజూచుచుఁబాఱిపోయి

melakuva ceḍitōm̐ka meḍamīm̐da vaici solasi nalgaḍalam̐jūcucum̐bāṟipōyi

Report an error

తన ఋశ్యమూకంబు తడయక యెక్కి తనమది శోకించుతఱి రాముఁడరుగ

tana r̥śyamūkaṃbu taḍayaka yekki tanamadi śōkiṃcutaṟi rāmum̐ḍaruga

Report an error

నలఘువిక్రమధాముఁడగు రాముతోడఁ దలవాంచికొని యర్కతనయుఁడిట్లనియె:

nalaghuvikramadhāmum̐ḍagu rāmutōḍam̐ dalavāṃcikoni yarkatanayum̐ḍiṭlaniye:

Report an error

“వసుధేశ! నిను నమ్మి వాలితోఁదొడరి యసమానబలరూఢి నడరి పోరాడ

“vasudhēśa! ninu nammi vālitōm̐doḍari yasamānabalarūḍhi naḍari pōrāḍa

Report an error

నన్నుపేక్షించితి; ననుఁగావవైతి; మిన్నకచూచితి; మేకొనవైతి.

nannupēkṣiṃciti; nanum̐gāvavaiti; minnakacūciti; mēkonavaiti.

Report an error

జగతిపై సూర్యవంశంబునఁబుట్టి తగునయ్య! యిట్టియధర్మంబు సేయ?

jagatipai sūryavaṃśaṃbunam̐buṭṭi tagunayya! yiṭṭiyadharmaṃbu sēya?

Report an error

దేవ! నీసత్యంబు తేజంబు నమ్మి యే వాలిఁదొడరితి; నింతియె కాని

dēva! nīsatyaṃbu tējaṃbu nammi yē vālim̐doḍariti; niṃtiye kāni

Report an error

యతఁడేడ? నేనేడ? యాహవంబేడ? బ్రతికివచ్చుట యేడ? భావించి చూడ

yatam̐ḍēḍa? nēnēḍa? yāhavaṃbēḍa? bratikivaccuṭa yēḍa? bhāviṃci cūḍa

Report an error

నేమిభాగ్యముననో యెప్పటియట్ల రామ! యీ పర్వతాగ్రము చేరఁగలిగెఁ!

nēmibhāgyamunanō yeppaṭiyaṭla rāma! yī parvatāgramu cēram̐galigem̐!

Report an error

బగతునిచే భంగపాటు, నీ రీతి నగుఁబాటు, నొదవె నిన్‌ నమ్మినకతన.

bagatunicē bhaṃgapāṭu, nī rīti nagum̐bāṭu, nodave nin namminakatana.

Report an error

దగవును గృపయును ధైర్యంబు శక్తి మిగుల నీ యెడఁజూచి మెచ్చి నమ్మితిని

dagavunu gr̥payunu dhairyaṃbu śakti migula nī yeḍam̐jūci mecci nammitini

Report an error

అనవుడు:“సుగ్రీవ! యాత్మలో నింత యనుమానపడ నేల? యకట! నావలనఁ

anavuḍu:“sugrīva! yātmalō niṃta yanumānapaḍa nēla? yakaṭa! nāvalanam̐

Report an error

దప్పులేశము లేదు; దాయకు నిన్ను నొప్పగింతునె? విను, మొకమాట దెలియ:

dappulēśamu lēdu; dāyaku ninnu noppagiṃtune? vinu, mokamāṭa deliya:

Report an error

విశ్వమోహనరూపవిఖ్యాతులైన యశ్వినీతనయులయట్ల యేపట్ల

viśvamōhanarūpavikhyātulaina yaśvinītanayulayaṭla yēpaṭla

Report an error

వరరూప రేఖలు వాలికి నీకు బెరసి సమంబైన భేదింపరాక

vararūpa rēkhalu vāliki nīku berasi samaṃbaina bhēdiṃparāka

Report an error

యే నేయ వెఱచితి; నిది యమోఘంబు గాన నీ విది కీడుగాఁజూడవలదు.

yē nēya veṟaciti; nidi yamōghaṃbu gāna nī vidi kīḍugām̐jūḍavaladu.

Report an error

కరమొప్పనింక నీ గజపుష్పమాల ధరియించి పోయి యుద్ధము సేయుచుండు.

karamoppaniṃka nī gajapuṣpamāla dhariyiṃci pōyi yuddhamu sēyucuṃḍu.

Report an error

బెదరకు వాలిఁజంపెద; నిశ్చయింపు; కదలుము కిష్కింధకడకు నీవనుచు

bedaraku vālim̐jaṃpeda; niścayiṃpu; kadalumu kiṣkiṃdhakaḍaku nīvanucu

Report an error

గాదిలితమ్ముచే గజపుష్పమాల యాదటఁదెప్పించి యతనికంఠమునఁ

gādilitammucē gajapuṣpamāla yādaṭam̐deppiṃci yatanikaṃṭhamunam̐

Report an error

జొక్కంబుగాఁ జేర్ప సుగ్రీవుఁడొప్పెఁ జుక్కలు పెనఁగొన్న శుభ్రాంశుఁడనగ

jokkaṃbugām̐ jērpa sugrīvum̐ḍoppem̐ jukkalu penam̐gonna śubhrāṃśum̐ḍanaga

Report an error

సరిబలాకలతోడి సంధ్యాభ్ర మనఁగ శరదంబుదముతోడి స్వర్ణాద్రి యనఁగ.

saribalākalatōḍi saṃdhyābhra manam̐ga śaradaṃbudamutōḍi svarṇādri yanam̐ga.

Report an error

నంతఁగాకుత్స్థుండు ననుజుండుఁదాను సంతసంబున యుద్ధసన్నద్ధులగుచు

naṃtam̐gākutsthuṃḍu nanujuṃḍum̐dānu saṃtasaṃbuna yuddhasannaddhulagucu

Report an error

నలనీల తారాంజనాతనూభవులు గెలఁకులఁగొల్వ సుగ్రీవుఁదోడ్కొనుచు

nalanīla tārāṃjanātanūbhavulu gelam̐kulam̐golva sugrīvum̐dōḍkonucu

Report an error

నదులు పూఁబొదలు పున్నాగనారంగ కదళికాసహకార కాంతారములును

nadulu pūm̐bodalu punnāganāraṃga kadaḷikāsahakāra kāṃtāramulunu

Report an error

భాసురకైరవ పద్మ కహ్లార వాసితబహుసరోవర విశేషములుఁ

bhāsurakairava padma kahlāra vāsitabahusarōvara viśēṣamulum̐

Report an error

గాసర కేసరికరివరాహములు నాసక్తిఁగనుఁగొంచు నటపోయిపోయి

gāsara kēsarikarivarāhamulu nāsaktim̐ganum̐goṃcu naṭapōyipōyi

Report an error

దీప్తవైశ్వానర తేజులై యొప్పు సప్తజనాహ్వయసంయమీశ్వరుల

dīptavaiśvānara tējulai yoppu saptajanāhvayasaṃyamīśvarula

Report an error

యాశ్రమంబీక్షించి యామహత్త్వంబు సుశ్రావ్యముగ వించు సుగ్రీవుచేత

yāśramaṃbīkṣiṃci yāmahattvaṃbu suśrāvyamuga viṃcu sugrīvucēta

Report an error

బలశాలియగు వాలి పాలింప సిరుల విలసిల్లు కిష్కింధ వీక్షించి విభుఁడు:

balaśāliyagu vāli pāliṃpa sirula vilasillu kiṣkiṃdha vīkṣiṃci vibhum̐ḍu:

Report an error

“తొల్లిటిచందాన దుర మొనరింప బల్లిదుండగువాలిఁబరిమార్తు.”ననుచుఁ

“tolliṭicaṃdāna dura monariṃpa balliduṃḍaguvālim̐barimārtu.”nanucum̐

Report an error

గృతమతి నంత సుగ్రీవు మన్నించి యతనిఁ “బొ”మ్మని పంచి యా సమీపమున

gr̥tamati naṃta sugrīvu manniṃci yatanim̐ “bo”mmani paṃci yā samīpamuna

Report an error

ననుజుఁడు సౌమిత్రి యట చేరియుండ మనుజేశుఁడొక మ్రానిమాటున నుండె.

nanujum̐ḍu saumitri yaṭa cēriyuṃḍa manujēśum̐ḍoka mrānimāṭuna nuṃḍe.

Report an error

నహిమాంశునందనుండంతఁగిష్కింధ గుహలెల్ల భేదిల్ల ఘోషించి యార్చి

nahimāṃśunaṃdanuṃḍaṃtam̐giṣkiṃdha guhalella bhēdilla ghōṣiṃci yārci

Report an error

తనతోడ యుద్ధంబు దగఁజేయ నింద్ర తనయుఁబిల్చుటయు నెంతయు బిట్టు గినిసి:

tanatōḍa yuddhaṃbu dagam̐jēya niṃdra tanayum̐bilcuṭayu neṃtayu biṭṭu ginisi:

Report an error

“మానక వీఁడొక్కమగవాఁడువోలెఁ బూనినభుజశక్తిఁబొంగుచున్నాఁడు.

“mānaka vīm̐ḍokkamagavām̐ḍuvōlem̐ būninabhujaśaktim̐boṃgucunnām̐ḍu.

Report an error

వీని సైరించుట వెరవుగా; దింక వీనిఁజంపెద.” నంచు వెస నిశ్చయించి

vīni sairiṃcuṭa veravugā; diṃka vīnim̐jaṃpeda.” naṃcu vesa niścayiṃci

Report an error

యతి సత్త్వభుజశాలియగు వాలి వెడలఁ బతిఁజూచి వెస నడ్డపడి తార వలికె:

yati sattvabhujaśāliyagu vāli veḍalam̐ batim̐jūci vesa naḍḍapaḍi tāra valike:

Report an error

Illustration: Verse & Place (Project-owned).